కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి అభినందించారా? మరి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

యెషయా 65:17-19లోని ‘క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని’ గూర్చిన ప్రవచన నెరవేర్పులో యూదులు చెరనుండి తిరిగి రావడం కంటే ఎక్కువే ఇమిడివుందని మనమెలా నిశ్చయత కలిగివుండవచ్చు?

ఎందుకంటే అపొస్తలులైన పేతురు యోహానులు మొదటి శతాబ్దంలో వ్రాస్తూ భవిష్యత్తు నెరవేర్పును గూర్చి అంటే ఇంకా రావల్సివున్న ఆశీర్వాదాలను గూర్చి తెలియజేశారు. (2 పేతురు 3:13; ప్రకటన 21:1-4)—4/15, 10-12 పేజీలు.

హింసకులైన దైవాంశ సంభూతుల గురించిన ప్రాచీన గ్రీకు కల్పితకథల వెనుక ఏమి ఉంది?

జలప్రళయానికి ముందు కొంతమంది దూతలు మానవ శరీరాలను ధరించి ఈ భూమిపై దుష్టత్వాన్ని, అనైతికతను జరిగించారన్న వాస్తవానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి ఉండవచ్చు. (ఆదికాండము 6:1, 2)—4/15, 27వ పేజీ.

పరిపక్వతగల క్రైస్తవులు వివాహాల్లో ఎటువంటి ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించాలి?

వివాహమహోత్సవంలో మద్యాన్ని మంచినీళ్ళలా ఖర్చుచేసి, హోరున సంగీతం పెట్టి వశంతప్పి నృత్యం చేసే లాంటి అల్లరితో కూడిన ఆటపాటలను విసర్జించాలి. వేడుకకు అందరూ రావచ్చని చెప్పనంతవరకు, ఆహ్వానం లేకుండా హాజరుకాకూడదు. వేడుకలు మరీ రాత్రవకముందే ముగిసేటట్లు చూసుకోవటానికి పెండ్లికుమారుడు బాధ్యతగల ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలి.—5/1, 19-22 పేజీలు.

కీర్తన 128:3లో ఒక వ్యక్తి భోజనపు బల్ల చుట్టూ పిల్లలు “ఒలీవ మొక్కలవలె” ఉంటారని చెప్పబడిన దాని అర్థమేమిటి?

తరచూ ఒలీవ చెట్టు మొదలు నుండి మళ్ళీ మొలకలు వస్తూ ఉంటాయి. ఒలీవ చెట్టు వయసు పెరగడంవల్ల అసలు కాండము మునుపటిలా ఫలించడం మానేసినప్పుడు, దాని చుట్టూ వచ్చే క్రొత్త మొలకలు బలమైన మొక్కల్లా తయారవుతాయి. అలాగే తమ పిల్లలు తమతో పాటు యెహోవాకు సేవ చేయడాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు.—5/15, 27వ పేజీ.

మంచి కుటుంబ వాతావరణాన్ని బట్టి పిల్లలు పొందగల కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

అది అధికారాన్ని గురించి ఆరోగ్యకరమైన దృక్పథం కల్గివుండడానికీ, సరైన విలువలపట్ల మెప్పు కల్గివుండడానికీ, ఇతరులతో మంచి సంబంధం కల్గివుండడానికీ పునాది వేస్తుంది. అలాంటి వాతావరణం, పిల్లలు దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా సహాయపడుతుంది.—6/1, 18వ పేజీ.

ఒక ప్రాచ్య దేశంలోని క్రైస్తవులందరూ సహోదర సహోదరీలు అనే తలంపును ప్రోత్సహించడానికి ఏమి చేయడం జరిగింది?

కొంతమందికి మాత్రమే గౌరవసూచకమైన పదాన్ని ఉపయోగించవద్దని అన్ని సంఘాలవారిని కోరడం జరిగింది. బదులుగా, అందరినీ సమానంగా సహోదరులు అని పిలవాలి.—6/15, 21, 22 పేజీలు.

రక్తంతో తయారయిన మందులను యెహోవాసాక్షులు అంగీకరిస్తారా?

‘రక్తాన్ని విసర్జించాలి’ అని బైబిలులో ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థం, మొత్తం రక్తాన్నైనా లేక ప్రాధమిక విభాగాలనైనా (ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లు) విసర్జించాలి అని మేము నమ్ముతాము. (అపొస్తలుల కార్యములు 15:28, 29) రక్తంలోని ప్రాధమిక విభాగాలలోని భాగాల విషయానికొస్తే ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా మనస్సాక్షిపూర్వకంగా తనకోసం తాను నిర్ణయించుకోవాలి.—6/15, 29-31 పేజీలు.

నేడు మనశ్శాంతిని కనుగొనడం సాధ్యమౌతుందా?

అవును. ప్రజలు స్వచ్ఛారాధనా మార్గంలో నడిచేలా, యెషయా 32:17, 18 వచనాల్లో వర్ణించబడిన శాంతిని పొందేలా యేసుక్రీస్తు వారిని బైబిలు ఆధారంగా నిర్దేశిస్తున్నాడు. అంతేగాక, అటువంటి శాంతిని అనుభవిస్తున్నవారికి కీర్తన 37:11, 29 వచనాల నెరవేర్పులో ఈ భూమిపై శాశ్వత శాంతిని అనుభవించే నిరీక్షణ ఉంది.—7/1, 7వ పేజీ.

ఆధునిక దైవపరిపాలనా చరిత్రలో జార్జ్‌ యంగ్‌ ఎటువంటి పాత్రను పోషించాడు?

1917వ సంవత్సరంలో ప్రారంభమై, ఆయన అనేక దేశాల్లో వెలుగు ప్రకాశకుడయ్యాడు. ఆయన తన పరిచర్యలో భాగంగా కెనడా, కరీబియన్‌ ద్వీపాలు, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌తోపాటు మరితర దేశాలు, మధ్య అమెరికా, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వంటి దేశాలంతటా తిరిగాడు.—7/1, 22-7 పేజీలు.

1 కొరింథీయులు 15:29, NW “మృతులై ఉండుటకు బాప్తిస్మము” పొందటం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని భావమేమిటి?

క్రైస్తవులు పరిశుద్ధాత్మచే అభిషేకించబడినప్పుడు, వారు తమ మరణానికి ఆ తర్వాత పునరుత్థానానికి దారితీసే జీవన విధానంలో నిమగ్నమై ఉండడం ద్వారా “మృతులై ఉండుటకు బాప్తిస్మము పొందు”తారు.—7/15, 17వ పేజీ.

ఆయన కార్యకలాపాల గురించి ఏమీ తెలియని సంవత్సరాలు అని పిలువబడిన సంవత్సరాల్లో పౌలు ఏమి చేస్తున్నాడు?

సిరియ, కిలికియల్లో సంఘాలను స్థాపించడమో వాటిని బలపర్చడమో చేసివుండవచ్చు. 2 కొరింథీయులు 11:23-27 వచనాల్లో పేర్కొనబడిన కష్టాల్లోని అనేక కష్టాలు బహుశ ఈ సమయంలోనే జరిగివుండవచ్చు, అలా ఆయన తన పరిచర్యలో క్రియాశీలంగానే ఉన్నాడని ఇది చూపిస్తుంది.—7/15, 26, 27 పేజీలు.

మనం ఎదురుచూసే వాటిలో సహేతుకంగా ఉండడానికి ఏమి సహాయం చేయగలదు?

యెహోవా అర్థం చేసుకుంటాడని గుర్తుంచుకోండి. ప్రార్థన మన ఆలోచనా విధానాన్ని సమతూకపర్చి మనల్ని బలపరుస్తుంది. అది మన వినయానికి నిదర్శనం కూడా. పరిణతి చెందిన స్నేహితునితో ఆంతరంగిక విషయాలు మాట్లాడడం కూడా మనం క్రొత్త దృక్కోణం నుండి చూసేందుకు సహాయపడుతుంది.—8/1, 29, 30 పేజీలు.