యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
“పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొను[డి].”—రోమీయులు 12:1.
1. మోషే ధర్మశాస్త్రం క్రింద అర్పించబడిన బలుల తులనాత్మకమైన విలువ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
“ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.” (హెబ్రీయులు 10:1) అపొస్తలుడైన పౌలు శక్తివంతమైన ఆ ఒక్క వ్యాఖ్యానంలోనే, మోషే ధర్మశాస్త్రం క్రింద అర్పించబడే బలులన్నీ మానవుని రక్షణకు సంబంధించినంత వరకూ శాశ్వతమైన విలువగలవి కావని ధృవీకరించాడు.—కొలొస్సయులు 2:16, 17.
2. ధర్మశాస్త్రం ప్రకారం అర్పించవలసిన బలులు, అర్పణల గురించి బైబిలులో ఉన్న వివరణాత్మకమైన సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎందుకు వ్యర్థం కాదు?
2 అయితే, అర్పణలు బలులకు సంబంధించి బైబిలులోని మొదటి ఐదు పుస్తకాల్లో ఉన్న సమాచారమంతా క్రైస్తవులకు నేడు ఏమాత్రం విలువలేనిదని దాని భావమా? వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో తమ పేర్లు నమోదు చేయించుకున్న వ్యక్తులందరూ బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలను ఇటీవల దాదాపు ఒక సంవత్సరంపాటు చదివారు. కొంతమంది వాటిని చదివి వాటిలోని వివరాలన్నిటినీ అర్థం చేసుకోవడానికి ఎంతో కృషి చేశారు. వాళ్ల ప్రయాసమంతా వ్యర్థమేనా? అలా ఎంతమాత్రం కాదు ఎందుకంటే “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:4) అయితే ప్రశ్నేమిటంటే, అర్పణలకు బలులకు సంబంధించి ధర్మశాస్త్రంలో ఉన్న సమాచారమంతటి నుండి మనం ఎటువంటి “బోధ”ను, ఎలాంటి “ఆదరణ”ను పొందవచ్చు?
మన బోధ నిమిత్తం, ఆదరణ నిమిత్తం
3. మనకు ఏ ప్రాథమిక అవసరత ఉంది?
3 ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిగా అక్షరార్థంగా బలులను అర్పించవలసిన అవసరం లేకపోయినప్పటికీ, ఇశ్రాయేలీయులకు బలులు కొంతమేరకు ఏ మేలునైతే చేకూర్చాయో ఆ మేలును పొందే అవసరత అంటే మన పాపాలకు క్షమాపణను పొంది, దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకోవలసిన అవసరత మనకు ఇప్పటికీ ఉంది. మరి అటువంటి అక్షరార్థమైన బలులను మనం ఇక అర్పించము గనుక, అలాంటి ప్రయోజనాలను మనం ఎలా పొందవచ్చు? జంతు బలులకున్న పరిమితుల గురించి చెప్పిన తర్వాత, పౌలు ఇలా ప్రకటిస్తున్నాడు: “కాబట్టి [యేసు] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు—బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థ బలులును నీకిష్టమైనవికావు. అప్పుడు నేను—గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడినప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.”—హెబ్రీయులు 10:5-7.
4. పౌలు కీర్తన 40:6-8 వచనాలను యేసుక్రీస్తుకు ఎలా అన్వయించాడు?
4 పౌలు కీర్తన 40:6-8 వచనాల నుండి ఎత్తి వ్రాస్తూ, యేసు “బలియు అర్పణయు,” “పూర్ణహోమములును పాపపరిహారార్థ బలులును”—పౌలు ఈ విషయాన్ని వ్రాసే సమయానికి వీటన్నిటికీ ఇక ఎంతమాత్రం దేవుని అంగీకారం లేదు—తిరిగి శాశ్వతంగా ఏర్పర్చడానికి రాలేదని నొక్కి చెప్తున్నాడు. దానికి బదులుగా, యేసు తన పరలోక తండ్రి సిద్ధం చేసిన శరీరంతో వచ్చాడు, ఆ శరీరం ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆయనకు సిద్ధం చేసిన దానితో అన్ని విధాలుగా తత్సమానంగా ఉంది. (ఆదికాండము 2:7; లూకా 1:35; 1 కొరింథీయులు 15:22, 45) దేవుని పరిపూర్ణ కుమారునిగా యేసు, ఆదికాండము 3:15 నందు ముందే చెప్పబడినట్లుగా స్త్రీ “సంతానము” పాత్రను నిర్వర్తించవలసి ఉంది. యేసు స్వయంగా ‘మడిమెపై కొట్టబడినప్పటికీ’ ఆయన ‘సాతాను తలపై కొట్టడానికి’ చర్యలు తీసుకుంటాడు. ఈ విధంగా, యెహోవా మానవజాతి రక్షణ కోసం చేసిన ఏర్పాటుకు ఆయన మాధ్యమం అయ్యాడు, దీనికోసం విశ్వాసంగల పురుషులు హేబెలు కాలంనాటి నుండి ఎదురు చూస్తున్నారు.
5, 6. క్రైస్తవులు దేవుడ్ని సమీపించటానికి మరింత ఉన్నతమైన ఏ మార్గం ఉంది?
5 యేసు నిర్వర్తించిన ఈ ప్రత్యేకమైన పాత్ర గురించి మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు: “మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను [దేవుడు] మన 2 కొరింథీయులు 5:21) “పాపముగా చేసెను” అనే పదబంధాన్ని ‘పాపపరిహారార్థ బలిగా చేయబడ్డాడు’ అని కూడా అనువదించవచ్చు. అపొస్తలుడైన యోహాను ఇలా చెప్తున్నాడు: “ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:2) కాబట్టి, ఇశ్రాయేలీయులు తాము అర్పించే బలుల ద్వారా దేవుని సమీపంచడానికి వారికి ఒక తాత్కాలిక మార్గం ఉండగా, దేవుడ్ని సమీపించడానికి క్రైస్తవులకు మరింత ఉన్నతమైన ఆధారం ఉంది, అది యేసుక్రీస్తు అర్పించిన బలి. (యోహాను 14:6; 1 పేతురు 3:18) దేవుడు ఏర్పాటు చేసిన విమోచన క్రయధన బలియందు మనం విశ్వాసముంచి ఆయనకు విధేయులమైతే, మన పాపాలు కూడా క్షమించబడతాయి, మనం కూడా దేవుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందగల్గుతాము. (యోహాను 3:17, 18) అది ఆయన ఆదరణకు మూలం కాదా? అయితే మనకు విమోచన క్రయధన బలియందు విశ్వాసముందని మనమెలా చూపించవచ్చు?
కోసము పాపముగా చేసెను.” (6 దేవుడ్ని సమీపించేందుకు క్రైస్తవులకు మరింత ఉన్నతమైన ఆధారం ఉందని వివరించిన తర్వాత, అపొస్తలుడైన పౌలు దేవుడు చేసిన ప్రేమపూర్వక ఏర్పాటుపట్ల మనం మన విశ్వాసాన్నీ, మెప్పునూ ప్రదర్శించగల మూడు మార్గాల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తున్నాడు, అవి హెబ్రీయులు 10:22-25 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. “పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు” అవకాశమున్న వారిని, అంటే పరలోక నిరీక్షణగల అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించే పౌలు ప్రాథమికంగా ఆ విషయాన్ని చెప్పినప్పటికీ, యేసు పరిహారార్థ బలి నుండి ప్రయోజనం పొందాలంటే మానవజాతి అంతా కూడా పౌలు వ్రాసిన ఈ ప్రేరేపిత మాటలకు అవధానమివ్వాలి.—హెబ్రీయులు 10:19,20.
పరిశుభ్రమైన, నిష్కల్మషమైన బలులను అర్పించండి
7. (ఎ) బలిలో ఏమి జరిగేదనేదాన్ని హెబ్రీయులు 10:22 ఎలా ప్రతిబింబిస్తుంది? (బి) బలి దేవునికి అంగీకారమైనదై ఉండేలా చూసేందుకు ఏమి చేయడం అవసరం?
7 మొదటి మార్గంగా, పౌలు క్రైస్తవులను ఇలా పురికొల్పుతున్నాడు: “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.” (హెబ్రీయులు 10:22) ఇక్కడ ఉపయోగించబడిన శైలి, ధర్మశాస్త్రం ప్రకారం బలి అర్పించబడేటప్పుడు ఏమి జరిగేదనేదాన్ని సుస్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఇది సముచితమే, ఎందుకంటే బలి అంగీకారయోగ్యమైనదిగా ఉండాలంటే దాన్ని సరైన దృక్పథంతో అర్పించాలి, అది పరిశుభ్రమైనదీ నిష్కల్మషమైనదీ అయ్యుండాలి. బలిగా అర్పించబడే జంతువు గోవులమందలో నుండిగానీ లేక గొఱ్ఱెల మేకల మందలలోనుండి గానీ తీసుకోబడినదై ఉండాలి, అంటే పవిత్రమైన జంతువులలో నుండి తీసుకోబడినదై ఉండాలి, అది ఏ కళంకము లేకుండా “నిర్దోషమైన”దై ఉండాలి. అది పక్షిజాతిలోనిదైతే తెల్లగువ్వలలో నుండిగానీ పావురపు పిల్లలలో నుండిగానీ తీసుకోబడినదై ఉండాలి. బలిగా అర్పించబడే జంతువును, పైన పేర్కొన్నవన్నీ అనుసరించి ఎన్నుకున్నప్పుడు, “అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.” (లేవీయకాండము 1:2-4, 10, 14; 22:19-25) నైవేద్యములో పులిసినదేదీ ఉండకూడదు, ఎందుకంటే పులిసినది క్షయతను సూచిస్తుంది; దానిలో తేనె—బహుశ దీని భావం పండ్ల రసం అయివుండవచ్చు—కూడా ఉండకూడదు, ఎందుకంటే పండ్ల రసానికి పులియబెట్టే గుణముంది. జంతుబలులుగానీ నైవేద్యంగానీ బలిపీఠం మీద అర్పించబడేటప్పుడు, చెడిపోకుండా కాపాడే గుణమున్న ఉప్పును వాటికి జతచేసేవారు.—లేవీయకాండము 2:11-13.
8. (ఎ) బలి అర్పించే వ్యక్తి నుండి ఏమి కోరబడుతుంది? (బి) మన ఆరాధన యెహోవాకు అంగీకారమైనదై ఉండేలా మనమెలా చూసుకోగలము?
8 బలిపీఠంపైన బలి అర్పించే వ్యక్తి విషయమేమిటి? యెహోవా ఎదుటకు వచ్చే ఏ వ్యక్తియైనా పరిశుభ్రంగా, నిష్కల్మషంగా ఉండాలని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఏ కారణాన్ని బట్టియైనా కలుషితమైన వ్యక్తి మొదట పాపపరిహారార్థ బలినిగానీ లేక అపరాధ పరిహారార్థ బలినిగానీ అర్పించి, యెహోవా ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలి, అలాగైతేనే అతని దహనబలి లేక సమాధానబలి దేవునికి అంగీకారమైనదై ఉంటుంది. (లేవీయకాండము 5:1-6, 15, 17) కాబట్టి, మనం ఎల్లప్పుడూ యెహోవా ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కల్గివుండడం యొక్క ప్రాముఖ్యతను గుణగ్రహిస్తామా? మన ఆరాధన దేవునికి అంగీకారమైనదై ఉండాలంటే, దేవుని కట్టడలను మీరినప్పుడు తక్షణమే సరిచేసుకోవాలి. సహాయం కోసం దేవుడు చేసిన ఏర్పాట్లైన, “సంఘపు పెద్దల” నుండి, “మన పాపములకు శాంతికరమై”యున్న యేసు క్రీస్తు నుండి ప్రయోజనం పొందటానికి సంసిద్ధంగా ఉండాలి.—యాకోబు 5:14; 1 యోహాను 2:1, 2.
9. యెహోవాకు అర్పించే బలులకూ అబద్ధ దేవుళ్ళకు అర్పించే బలులకూ మధ్యవున్న కీలకమైన తేడా ఏమిటి?
9 వాస్తవానికి, ఎటువంటి కల్మషం నుండి అయినా విముక్తి పొందటాన్ని గురించి నొక్కి చెప్పడమే యెహోవాకు అర్పించే బలులకూ, ఇశ్రాయేలు జనాంగానికి చుట్టుప్రక్కలనున్న అన్యులు తమ అబద్ధ దేవుళ్లకు అర్పించే బలులకూ హబక్కూకు 1:13) ఆయనకు చేసే ఆరాధనా, అర్పించబడే బలులూ శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రమైనవిగా నిష్కల్మషమైనవిగా ఉండాలి.—లేవీయకాండము 19:2; 1 పేతురు 1:14-16.
ఉన్న కీలకమైన తేడా. మోషే ధర్మశాస్త్రంలోని బలులకున్న ఈ విశేషమైన అంశంపై వ్యాఖ్యానిస్తూ ఒక గ్రంథం ఇలా పేర్కొంటుంది: “వాటికి, సోదె చెప్పడంతో లేక శకునం చెప్పడంతో ఏమాత్రం సంబంధం లేదని మనం గమనించవచ్చు; మతోన్మాదం, స్వయంగా దేహాంగాలను ఖండించుకోవడం, లేక దేవదాసీతనం, లైంగిక సంబంధమైన, అశ్లీలమైన పూజా సంబంధమైన ఆచారాలు పూర్తిగా నిషేధం; మానవ బలులు అర్పించబడేవి కాదు; మృతుల కోసం బలులు అర్పించబడేవి కాదు.” ఇదంతా ఒక విషయం వైపుకు అవధానాన్ని మళ్లిస్తుంది: యెహోవా పరిశుద్ధుడు, ఆయన ఏ విధమైన పాపాన్ని గానీ లేక క్షయతను గానీ ఆమోదించడు లేక అంగీకరించడు. (10. రోమీయులు 12:1, 2 వచనాల్లో వ్రాయబడివున్న పౌలు ఉపదేశానికి అనుగుణ్యంగా, మనం ఏ ఆత్మపరిశీలన చేసుకోవాలి?
10 దీని దృష్ట్యా, మనం యెహోవాకు చేసే సేవ ఆయనకు అంగీకారమైనదై ఉందో లేదో చూసుకునేందుకు మన జీవితాల్లోని అన్ని రంగాల్లోనూ మనల్ని మనం నిశితంగా పరిశీలించుకోవాలి. క్రైస్తవ కూటాల్లోనూ పరిచర్యలోనూ ఎంతో కొంత భాగం వహిస్తున్నంత వరకూ మనం మన వ్యక్తిగత జీవితాల్లో ఏమి చేసినప్పటికీ చెల్లుతుందని మనం ఎన్నడూ అనుకోకూడదు. క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాము గనుక, మనం మన జీవితంలోని ఇతర రంగాల్లో దేవుని కట్టడలకు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని కూడా మనం ఎంతమాత్రం భావించకూడదు. (రోమీయులు 2:21, 22) ఆయన దృష్టిలో అపరిశుభ్రమైనదీ లేక కల్మషమైనదీ ఏదైనా మన ఆలోచనా విధానాన్ని గానీ చర్యలను గానీ కలుషితం చేసేందుకు మనం అనుమతిస్తున్నట్లైతే, మనం దేవుని ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందుతామని ఆశించలేము. పౌలు వ్రాసిన ఈ మాటల్ని మనస్సులో ఉంచుకోండి: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమీయులు 12:1, 2.
స్తుతియాగాలను హృదయపూర్వకంగా అర్పించండి
11. హెబ్రీయులు 10:23 నందు చెప్పబడిన ‘ఒప్పుకోవడం’ అనే పదంలో ఏమి ఇమిడి ఉంది?
11 రెండవ మార్గంగా, హెబ్రీయులకు వ్రాస్తూ పౌలు సత్యారాధనలోని ఒక ప్రాముఖ్యమైన అంశం వైపుకు మన అవధానాన్ని మళ్లిస్తున్నాడు: “వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.” (హెబ్రీయులు 10:23) హెబ్రీలో, ‘ఒప్పుకొనినది’ అనే పదానికి అక్షరార్థంగా “ఒప్పుకోవడం” అనే భావం ఉంది, అంతేగాక పౌలు “స్తుతియాగము” గురించి కూడా మాట్లాడుతున్నాడు. (హెబ్రీయులు 13:15) హేబెలు, నోవహు, అబ్రాహాము వంటి వ్యక్తులు అర్పించినలాంటి బలులను ఇది మనకు గుర్తుచేస్తుంది.
12, 13. దహన బలిని అర్పించేటప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు ఏమని అంగీకరిస్తాడు, అదే స్ఫూర్తిని ప్రతిబింబించటానికి మనం ఏమి చేయవచ్చు?
12 ఒక ఇశ్రాయేలీయుడు దహన బలిని అర్పించేటప్పుడు, లేవీయకాండము 1:3, NW) అలాంటి బలి ద్వారా ఆ ఇశ్రాయేలీయుడు యెహోవా తన ప్రజలకు అనుగ్రహిస్తున్న అపారమైన ఆశీర్వాదాల గురించి, ఆయన కృప గురించి స్వచ్ఛందంగా బహిరంగ ప్రకటన చేసేవాడు లేక బహిరంగంగా అంగీకరించేవాడు. దహన బలులకున్న ఒక విశేషమైన అంశం ఏమిటంటే బలి ఇవ్వబడే మొత్తం జంతువంతా బలిపీఠం మీద దహించబడేదని గుర్తు తెచ్చుకోండి, అది సంపూర్ణ భక్తికీ, సమర్పణకూ చక్కని సూచనగా ఉంది. అదే విధంగా, యెహోవాకు ఇష్టపూర్వకంగానూ హృదయపూర్వకంగానూ “స్తుతియాగము . . . అనగా . . . జిహ్వాఫలము అర్పించు[ట]” ద్వారా మనం విమోచన క్రయధన బలియందు మనకున్న విశ్వాసాన్ని, ఆ ఏర్పాటు పట్ల మనకున్న కృతజ్ఞతను ప్రదర్శిస్తాము.
“యెహోవా ఎదుట ఆయన తన స్వేచ్ఛా చిత్తం ప్రకారం” దాన్ని అర్పించేవాడు. (13 క్రైస్తవులు అక్షరార్థమైన జంతు బలులను లేక నైవేద్యమును అర్పించరు గానీ రాజ్యసువార్తను ప్రకటించి యేసుక్రీస్తుకు శిష్యులను తయారుచేసే బాధ్యత వారికి ఉంది. (మత్తయి 24:14; 28:19, 20) విధేయులైన మానవుల కోసం దేవుడు భద్రపరిచి ఉంచిన అద్భుతమైన విషయాల గురించి ఇంకా ఎక్కువమంది ప్రజలు తెలుసుకోగలిగేలా దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా ప్రకటించడానికున్న అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారా? ఆసక్తిగల వారికి బోధించటానికీ, యేసుక్రీస్తు శిష్యులయ్యేందుకు వారికి సహాయం చేయటానికీ మీరు మీ సమయాన్ని శక్తిని ఇష్టపూర్వకంగా వెచ్చిస్తారా? మనం పరిచర్యలో ఆసక్తిగా పాల్గొనడం, దహనబలి నుండి వెలువడే ఇంపైన సువాసనగల ధూపంలా యెహోవాకు ఎంతో ప్రీతికరమైనది.—1 కొరింథీయులు 15:58.
యెహోవాతోనూ మానవులతోనూ సహవాసాన్ని ఆనందించండి
14. హెబ్రీయులు 10:24, 25 నందున్న పౌలు మాటలు సమాధాన బలి తలంపుకు ఎలా సమాంతరంగా ఉన్నాయి?
14 చివరిగా మూడవ మార్గంగా, మనం దేవుడ్ని ఆరాధిస్తూ తోటి క్రైస్తవులతో మనకుండే సంబంధం వైపుకు పౌలు అవధానాన్ని మళ్లిస్తున్నాడు. “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును పురికొల్పవలెను’ అనే మాటలు, “సమాజముగా కూడుట,” అలాగే “ఒకనినొకడు హెచ్చరించుచు” అనే మాటలు ఇశ్రాయేలులో సమాధానబలి దేవుని ప్రజలకు ఏమి చేసేదనేదాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి.
15. సమాధాన బలికి, క్రైస్తవ కూటాలకు మధ్య మనం ఏ సమాంతరాన్ని చూస్తాము?
15 “సమాధాన బలులు” అనే మాట కొన్నిసార్లు “శాంతి అర్పణలబలి” అని అనువదించబడింది. “శాంతి” కోసమైన హెబ్రీ పదం ఇక్కడ బహువచనంలో ఉంది, బహుశా అలాంటి బలులలో భాగం వహించడం దేవునితోనూ తోటి ఆరాధకులతోనూ సమాధానం కల్గివుండడాన్ని సూచిస్తుందని కావచ్చు. సమాధాన బలి గురించి ఒక పండితుడు ఇలా పేర్కొన్నాడు: “నిజానికిది నిబంధనల దేవునితో సంతోషకరమైన సహవాసాన్ని ఆనందించే కాలం, ఆ కాలంలో ఆయన తనకు బలిగా అర్పించబడిన భోజనంలో భాగం వహించేలా ఇశ్రాయేలీయులకు అతిథి అయ్యేందుకు తనను తాను తగ్గించుకున్నాడు, మత్తయి 18:20) మనం క్రైస్తవ కూటాలకు హాజరయ్యే ప్రతిసారి, ప్రతిఫలదాయకమైన సహవాసం నుండి, ప్రోత్సాహకరమైన ఉపదేశం నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడన్న తలంపు నుండి మనం ప్రయోజనం పొందుతాము. అది క్రైస్తవ కూటాన్ని నిజంగా ఆనందభరితమైన, విశ్వాసాన్ని బలపరిచే సందర్భంగా చేస్తుంది.
అయితే ఆయనే ఎప్పుడూ వారి ఆతిథేయి.” ఇది మనకు యేసు చేసిన ఈ వాగ్దానాన్ని గుర్తుచేస్తుంది: “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందు[ను].” (16. సమాధాన బలిని మనస్సులో ఉంచుకుని, క్రైస్తవ కూటాలను ప్రాముఖ్యంగా ఆనందభరితమైనవిగా చేసేది ఏమిటో చెప్పండి?
16 సమాధాన బలిలో, ఆంత్రముల లోపలి క్రొవ్వు, ఆంత్రముల మీది క్రొవ్వు, మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు, డొక్కల మీదున్న క్రొవ్వు, కాలేయము మీదా మూత్రగ్రంథుల మీదా ఉన్న వపను, క్రొవ్విన తోకను, ఇలా క్రొవ్వు అంతా బలిపీఠం మీద దహించబడడం ద్వారా అది యెహోవాకు ధూపముగా అర్పించబడేది. (లేవీయకాండము 3:3-16) క్రొవ్వు జంతువు యొక్క బలవర్థకమైన, ఎంతో మంచి భాగంగా పరిగణింపబడేది. దాన్ని బలిపీఠంపై అర్పించడం వాళ్ళకున్న వాటిలో శ్రేష్ఠమైనదాన్ని యెహోవాకు అర్పించడాన్ని సూచించేది. క్రైస్తవ కూటాలను ప్రాముఖ్యంగా ఆనందభరితమైనవిగా చేసేదేమిటంటే, మనం ఉపదేశాన్ని పొందడమే కాదు యెహోవాకు స్తుతిని కూడా చెల్లిస్తామన్నదే. దీన్ని మనం పాల్గొనడం ద్వారా చేస్తాము, వినయపూర్వకమైన అయితే సంపూర్ణమైన కృషి ద్వారా, అంటే హృదయపూర్వకంగా పాడడం ద్వారా, శ్రద్ధగా వినడం ద్వారా, సాధ్యమైనప్పుడు వ్యాఖ్యానించడం ద్వారా చేస్తాము. “యెహోవాను స్తుతించుడి! యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి,” అని కీర్తనల గ్రంథకర్త అంటున్నాడు.—కీర్తన 149:1.
యెహోవా నుండి అపారమైన ఆశీర్వాదాలు మనకోసం వేచివున్నాయి
17, 18. (ఎ) యెరూషలేము ఆలయ ప్రారంభోత్సవ సమయంలో సొలొమోను ఏ ఘనమైన బలిని అర్పించాడు? (బి) ఆలయ ప్రారంభోత్సవ సమయంలోని వేడుకల ఫలితంగా ప్రజలకు ఏ ఆశీర్వాదాలు లభించాయి?
17 యెరూషలేము ఆలయ ప్రారంభోత్సవ సమయంలో, సా.శ.పూ. 1026, ఏడవ నెలలో, రాజైన సొలొమోను “యెహోవా సముఖమందు బలులు” అర్పించాడు, వాటిలో ఆయన “దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును” అర్పించాడు. నైవేద్యమును అర్పించడమేగాక, ఆ సందర్భంలో మొత్తం 22,000 పశువులను, 1,20,000 గొఱ్ఱెలను బలి ఇచ్చాడు.—1 రాజులు 8:62-65.
18 అంత ఘనమైన వేడుకలో ఇమిడివున్న ఖర్చును, పనిని మీరు ఊహించగలరా? అయితే, ఇశ్రాయేలీయులు పొందిన ఆశీర్వాదాలు మాత్రం ఆ ఖర్చును ఎంతగానో మించిపోయాయి. వేడుకల ముగింపులో, సొలొమోను “జనులకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లిపోయిరి.” (1 రాజులు 8:66) నిజంగా, సొలొమోను చెప్పినట్లుగా, “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.”—సామెతలు 10:22.
19. యెహోవా నుండి ఇప్పుడూ, నిరంతమూ ఆశీర్వాదాలను పొందటానికి మనం ఏమి చేయవచ్చు?
19 “రాబోవుచున్న మేలుల ఛాయ” స్థానాన్ని “నిజస్వరూపము” ఆక్రమించిన కాలంలో మనం జీవిస్తున్నాము. (హెబ్రీయులు 10:1) ప్రవచనార్థక గొప్ప ప్రధాన యాజకుని పాత్రలో యేసుక్రీస్తు ఇప్పటికే పరలోకంలోకి ప్రవేశించి, తన బలియందు విశ్వాసముంచే వారందరికీ ప్రాయశ్చిత్తం చేసేందుకు తన స్వంత రక్తపు విలువను అందజేశాడు. (హెబ్రీయులు 9:10, 11, 24-26) ఆ మహాగొప్ప బలి ఆధారంగాను, పరిశుభ్రమైన నిష్కల్మషమైన స్తుతియాగాలను దేవునికి హృదయపూర్వకంగా అర్పించడం ద్వారాను మనం కూడా “సంతోషించుచు ఆనంద హృదయు”లమై ముందుకు కొనసాగుతూ, యెహోవా నుండి అపారమైన ఆశీర్వాదాల కోసం ఎదురుచూడవచ్చు.—మలాకీ 3:10.
మీరెలా సమాధానమిస్తారు?
• బలులు అర్పణల గురించి ధర్మశాస్త్రంలో ఉన్న సమాచారం నుండి మనం ఏ ఉపదేశాన్ని, ఆదరణను పొందవచ్చు?
• బలి అంగీకారమైనదై ఉండాలంటే మొదటి అవసరత ఏమిటి, అది మనకు ఏ భావాన్ని కల్గివుంది?
• స్వచ్ఛందమైన దహన బలితో పోల్చదగిన దేన్ని మనం అర్పించవచ్చు?
• క్రైస్తవ కూటాలను సమాధాన బలితో ఏయే విధాలుగా పోల్చవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[అధ్యయన ప్రశ్నలు]
[18వ పేజీలోని చిత్రం]
మానవజాతి రక్షణ కోసం యెహోవా యేసు విమోచన క్రయధన బలిని ఏర్పాటు చేశాడు
[20వ పేజీలోని చిత్రం]
మన సేవ యెహోవాకు అంగీకారమైనదై ఉండాలంటే, మనం అన్ని విధాలైన కల్మషం నుండి దూరంగా ఉండాలి
[21వ పేజీలోని చిత్రం]
మనం పరిచర్యలో పాల్గొన్నప్పుడు మనం యెహోవా మంచితనాన్ని బహిరంగంగా అంగీకరిస్తాము