కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చిలీలో సత్యవిత్తనాలకు నీళ్ళు చల్లడం

చిలీలో సత్యవిత్తనాలకు నీళ్ళు చల్లడం

రాజ్య ప్రచారకుల నివేదిక

చిలీలో సత్యవిత్తనాలకు నీళ్ళు చల్లడం

ఉత్తర చీలీలోని ఎడారి ప్రాంతంలో కొన్నిసార్లు సంవత్సరాల తరబడి వర్షాలు పడవు. ఒకప్పుడు, రాళ్ళు రప్పలతో ఉన్న బీడు నేల వర్షాలు పడినప్పుడు మాత్రం రకరకాల పూల మొక్కలతో కప్పబడిపోతుంది. అద్భుతమైన ఈ పూల ప్రదర్శనను చూడడానికి దేశం నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు.

అయితే ఇంకా ఎంతో ఆసక్తికరమైన ఒక విషయం చిలీలోని ప్రజల మధ్య జరుగుతోంది. బైబిలు సత్యపు నీరు ప్రతి మూలకు ప్రవహిస్తోంది, యథార్థవంతులైన ప్రజలు యేసుక్రీస్తు శిష్యులుగా “వికసిస్తున్నారు.” ఈ సత్య జలాన్ని వ్యాప్తి చేసే ఒక మార్గం టెలిఫోన్‌. ఈ క్రింది అనుభవాలు ఈ రకమైన సాక్ష్యం ద్వారా సాధించబడిన చక్కని ఫలితాలను గూర్చి వివరిస్తున్నాయి.

• కరీనా అనే పేరుగల ఒక పూర్తికాల సువార్తికురాలిని టెలిఫోన్‌ సాక్ష్యమివ్వడాన్ని గూర్చి ప్రాంతీయ సమావేశంలో ప్రదర్శించమని అడిగారు. కరీనా ఎప్పుడూ అలా సాక్ష్యాన్ని ఇవ్వలేదు. ఆ సమావేశంలో ఆమె భాగంవహించేలా ప్రోత్సహించేందుకు ఒక పెద్ద, ఆయన భార్య ఇద్దరూ వెళ్ళి, టెలిఫోన్‌ సాక్ష్యమివ్వడంలోని కొన్ని విషయాలను కరీనాతో మాట్లాడారు. ఈ విషయంలో యెహోవా నడిపింపు కోసం ప్రార్థించమని వాళ్ళు ఆమెకు చెప్పారు. ఆమె అలా చేసి చివరికి ఒక ఫోన్‌కాల్‌ చేయాలని కూడా నిర్ణయించుకుంది.

దగ్గరగా ఉన్న ఒక గ్రామంలోని ఒక ఫోన్‌ నెంబరును ఎంపిక చేసుకుంది. అవతల ఉన్న వ్యక్తి ఒక టెలిఫోన్‌ ఆపరేటర్‌, ఆమెకు తను ఫోన్‌ చేయడానికి గల కారణాన్ని వివరించింది. ఆ టెలిఫోన్‌ ఆపరేటర్‌ అందుకు అంగీకరించింది, తిరిగి మూడురోజుల్లో మాట్లాడేలా ఏర్పాటు చేసుకున్నారు. టెలిఫోన్‌ ద్వారా చేసిన పునర్దర్శనం దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు అనే బ్రోషూర్‌ను ఉపయోగించి బైబిలు పఠనం చేసేందుకు నడిపించబడింది. అప్పటినుండి వాళ్ళు ఆసక్తికరమైన, ఉత్సాహవంతమైన బైబిలు పఠనాలను జరుపుకుంటున్నారు, ఆ స్త్రీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం కరీనా పుస్తకాలను పంపించింది.

• పొరపాటున తన టెలిఫోన్‌ నెంబరుకు ఫోన్‌ చేసిన ఒక వ్యక్తికి సాక్ష్యమిచ్చేందుకు బెర్నార్డా చొరవ తీసుకుంది. అవతలి వ్యక్తి మీద విసుగు చెందుతున్నట్లు ప్రవర్తించే బదులు బెర్నార్డా తాను ఒక యెహోవాసాక్షిని అని పరిచయం చేసుకుంది, తానేమన్నా సహాయం చేయగలదా అని అడిగింది. సంభాషణ కొనసాగింది, త్వరలోనే దేవుని రాజ్యం ఈ అన్యాయాల్ని ఎలా తీసివేస్తుందో ఆమె వివరిస్తుంటే ఆయన విన్నాడు. ఆ వ్యక్తి తన ఫోన్‌ నెంబరును బెర్నార్డాకు ఇచ్చాడు, ఆమె టెలిఫోన్‌ ద్వారా పునర్దర్శనాలు చేసింది. వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణలలో ఒకసారి ఆమె నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని కొంత భాగాన్ని చదివి వినిపించింది. ఆ పుస్తక ప్రతిని తానెలా పొందగలడని అడిగాడు, దానికి బెర్నార్డా బైబిలుతోపాటు ఆ పుస్తకాన్ని పంపించింది. ఒక స్థానిక సహోదరుడు అతన్ని దర్శించేలా ఏర్పాట్లు జరిగాయి, ఆయన ఆ పెరుగుతున్న “మొక్క”కు “నీళ్ళు” పోస్తూ ఉన్నాడు.

అవును, ఆధ్యాత్మికంగా ఎండిన ఈ లోకమనే నేలలో అక్కడక్కడా పడి ఉన్న విత్తనాలు, నీళ్ళు చల్లినప్పుడు మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. దప్పికగొన్న వేలాదిమంది యెహోవా దేవునికి విశ్వసనీయులైన సేవకులుగా “ఎదిగి” “పుష్పించడంలో” కొనసాగుతున్నారు.​—⁠యెషయా 44:3, 4.