మన అమూల్యమైన స్వాస్థ్యం—మీరు దాన్ని ఎలా దృష్టిస్తారు?
మన అమూల్యమైన స్వాస్థ్యం—మీరు దాన్ని ఎలా దృష్టిస్తారు?
“నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.”—మత్తయి 25:34.
1. స్వాస్థ్యంగా ప్రజలు ఎలాంటి వాటిని పొందారు?
మానవులందరికీ తాము స్వాస్థ్యంగా పొందినవి ఎన్నో ఉంటాయి. కొందరు స్వాస్థ్యంగా పొందినది భోగభాగ్యాలతో కూడిన జీవితం కావచ్చు. మరితరులు పేదరికాన్ని స్వాస్థ్యంగా పొందివుండవచ్చు. కొన్ని సందర్భాల్లో, వెనుకటి తరాల వారు తాము అనుభవించిన లేదా విన్న దాని మూలంగా ఒక వర్గంవారి పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని దాన్నే తమ తర్వాతి తరాలవారికి స్వాస్థ్యంగా వదిలి వెళ్లివుండవచ్చు. అయితే, మనకందరికీ ఒక విషయం సర్వసాధారణమై ఉంది. అదేమిటంటే, మనమందరం మొదటి మానవుడైన ఆదామునుండి పాపాన్ని స్వాస్థ్యంగా పొందాము. ఆ స్వాస్థ్యం మనల్ని చివరికి మరణానికి తీసుకువెళ్తుంది.—ప్రసంగి 9:2, 10; రోమీయులు 5:12.
2, 3. ఆదాము హవ్వల సంతానానికి యెహోవా ప్రాథమికంగా ఏ స్వాస్థ్యాన్ని సాధ్యపరిచాడు, వాళ్లు దాన్ని ఎందుకు పొందలేకపోయారు?
2 ప్రేమగల పరలోకపు తండ్రిగా యెహోవా మానవజాతికి, ప్రారంభంలో పూర్తిగా భిన్నమైనదాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, అదే పరదైసులో పరిపూర్ణమైన నిత్యజీవం. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు మొదట్లో పరిపూర్ణమైనవారు, పాపరహితులు. యెహోవా దేవుడు భూగ్రహాన్ని మానవజాతికి ఒక బహుమానంగా ఇచ్చాడు. (కీర్తన 115:16) ఆ భూగ్రహం చివరికి ఎలా తయారవ్వాలనేదానికి ఏదెను తోటను ఒక నమూనాగా ఇచ్చి, మన మొదటి తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన, సవాలుదాయకమైన నియామకాన్ని ఇచ్చాడు. వాళ్లు పిల్లల్ని కని, భూమి గురించీ దానిలోని వివిధ రకాలైన చరాచర జీవకోటి గురించీ శ్రద్ధ తీసుకుంటూ పరదైసు సరిహద్దులను భూగోళవ్యాప్తంగా విస్తరింపజేయవలసి ఉండిరి. (ఆదికాండము 1:28; 2:8, 9, 15) వాళ్ల సంతానం కూడా ఈ పనిలో భాగం వహించవలసివుంది. వాళ్లు తమ సంతానానికి ఇవ్వటానికి అదెంత అద్భుతమైన స్వాస్థ్యం!
3 అయితే వాళ్లు ఇవన్నీ ఆనందించాలంటే, ఆదాము హవ్వలు, వాళ్ల సంతానము దేవునితో మంచి సంబంధాన్ని కల్గివుండాల్సిన అవసరం ఉంది. వాళ్లు యెహోవాకు తమ ప్రేమను, విధేయతను చూపించబద్ధులై ఉన్నారు, కానీ ఆదాము హవ్వలు దేవుడు తమకిచ్చిన దాన్ని గుణగ్రహించడంలో విఫలమై, ఆయనిచ్చిన ఆజ్ఞను మీరారు. వాళ్లు తమ పరదైసు గృహాన్ని, దేవుడు తమ ఎదుట ఉంచిన మహిమాన్విత ఉత్తరాపేక్షలను పోగొట్టుకున్నారు. అందుకే, వాళ్లు వాటిని తమ సంతానానికి స్వాస్థ్యంగా ఇవ్వలేకపోయారు.—ఆదికాండము 2:16, 17; 3:1-24.
4. ఆదాము పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని మనం ఎలా తిరిగి పొందవచ్చు?
4 కనికరంతో యెహోవా, ఆదాము కోల్పోయిన స్వాస్థ్యాన్ని ఆదాము హవ్వల సంతానం పొందగలిగేలా ఏర్పాటు చేశాడు. ఎలా? దేవుని నియమిత సమయంలో, ఆయన స్వంత కుమారుడైన యేసుక్రీస్తు, ఆదాము సంతానం కోసం తన పరిపూర్ణ మానవ జీవితాన్ని బలిగా అర్పించాడు. ఈ విధంగా క్రీస్తు వారినందరినీ తిరిగి కొన్నాడు. అయితే, ఆ స్వాస్థ్యం వారికి యాంత్రికంగా వచ్చేయదు. వారికి దేవుని ఎదుట అంగీకృతమైన స్థానం ఉండాలి, యేసు బలికున్న పాప పరిహారార్థ విలువ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, విధేయతతో ఆ విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారా వాళ్లు ఆ స్థానాన్ని పొందగల్గుతారు. (యోహాను 3:16, 36; 1 తిమోతి 2:5, 6; హెబ్రీయులు 2:9; 5:9) మీ జీవన విధానం ఆ ఏర్పాటు పట్ల మెప్పును కనబరుస్తుందా?
అబ్రాహాము ద్వారా లభింపజేసిన ఒక స్వాస్థ్యం
5. యెహోవాతో తనకున్న సంబంధం పట్ల అబ్రాహాము ఎలా మెప్పును చూపించాడు?
5 యెహోవా భూమిపట్ల తనకున్న సంకల్పాన్ని నెరవేర్చే ప్రక్రియలో, అబ్రాహాముతో చాలా ప్రత్యేకమైన విధంగా వ్యవహరించాడు. తన స్వంత దేశాన్ని విడిచిపెట్టి తాను చూపించే దేశానికి తరలి వెళ్లమని దేవుడు నమ్మకమైన ఈ వ్యక్తికి నిర్దేశించాడు. అబ్రాహాము ఇష్టపూర్వకంగా విధేయుడయ్యాడు. ఆదికాండము 12:1, 2, 7) అబ్రాహాము ఎలా ప్రతిస్పందించాడు? తన సంతానం తమ స్వాస్థ్యాన్ని పొందగలిగేలా యెహోవా దేవుడు తనను ఎక్కడ, ఎలా తన సేవ చేయమంటే అక్కడ అలా చేయటానికి ఆయన సుముఖంగా ఉన్నాడు. అబ్రాహాము తనదికాని దేశంలో 100 సంవత్సరాలపాటు అంటే తన మరణం వరకూ యెహోవా సేవ చేశాడు. (ఆదికాండము 12:4; 25:8-10) మీరైతే అలా చేసేవారా? అబ్రాహాము తన ‘స్నేహితుడని’ యెహోవా చెప్పాడు.—యెషయా 41:8.
ఆయన అక్కడికి వెళ్లినతర్వాత, ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందలేడు గానీ, ఆయన సంతానం దాన్ని పొందుతుందని యెహోవా తెలియజేశాడు. (6. (ఎ) తన కుమారుడ్ని బలి ఇచ్చేందుకు తాను సుముఖత కల్గివుండడం ద్వారా అబ్రాహాము ఏమి చూపించాడు? (బి) అబ్రాహాము తన సంతానానికి ఏ అమూల్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు?
6 అబ్రాహాము ఒక కుమారుని కోసం ఎన్నో సంవత్సరాలు వేచివున్నాడు, ఆ కుమారుడే ఇస్సాకు, అబ్రాహాము ఆయననెంతో ప్రేమించాడు. ఆ పిల్లవాడు బహుశా యుక్తవయస్కుడైన తర్వాత, అతడ్ని తీసుకువెళ్లి తనకు బలిగా అర్పించమని యెహోవా అబ్రాహాముకు ఉపదేశించాడు. దేవుడు, కుమారుడ్ని విమోచన క్రయధనంగా ఇవ్వడంలో ఆయనే స్వయంగా ఏమి చేయనైయున్నాడో, దాన్ని తాను ప్రదర్శించి చూపిస్తున్నాడని అబ్రాహాముకు తెలియదు; అయినప్పటికీ, యెహోవా దూత ఆయనను ఆపే సమయం వరకు ఆయన ఇస్సాకును బలిగా అర్పించేంతగా విధేయత చూపించాడు. (ఆదికాండము 22:9-14) అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానాలు ఇస్సాకు ద్వారా నెరవేరుతాయని యెహోవా అప్పటికే ఆయనకు చెప్పాడు. కాబట్టి, అలాంటి సంగతి మునుపెన్నడూ జరుగకపోయినా, ఒకవేళ అవసరమైతే దేవుడు ఇస్సాకును మృతులలో నుండి లేపగలడన్న నమ్మకం అబ్రాహాముకు ఉందన్నది స్పష్టమౌతుంది. (ఆదికాండము 17:15-18; హెబ్రీయులు 11:17-19) అబ్రాహాము తన కుమారుడ్ని బలివ్వటానికి సహితం వెనుకాడలేదు గనుక, యెహోవా ఇలా ప్రకటించాడు: “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:15-18) ఇది, ఆదికాండము 3:15 నందు ప్రస్తావించబడిన సంతానము, అంటే మెస్సీయా అయిన విమోచకుడు అబ్రాహాము వంశావళి నుండి వస్తాడని సూచించింది. ఇతరులకు అందించటానికి అదెంతటి అమూల్యమైన స్వాస్థ్యం!
7. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు తమకు స్వాస్థ్యంగా లభించినదాని పట్ల ఎలా మెప్పును కనబరిచారు?
7 యెహోవా అప్పుడు ఏమి చేస్తున్నాడనే దాని ప్రాముఖ్యత గురించి అబ్రాహాముకు తెలియదు; ఆయనకే కాదు, “ఆ వాగ్దానమునకు సమానవారసులైన” ఆయన కుమారుడైన ఇస్సాకుకు, ఆయన మనుమడైన యాకోబుకు కూడా తెలియదు. కానీ వాళ్లందరికీ యెహోవాయందు నమ్మకం ఉంది. వాళ్లు తమ దేశంలోని నగర రాజ్యాలతో ఏ అనుబంధాన్నీ ఏర్పరచుకోలేదు, ఎందుకంటే వాళ్లు మరింత శ్రేష్ఠమైనదాని కోసం, అంటే “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు” ఎదురు చూస్తున్నారు. (హెబ్రీయులు 11:8-10, 13-16) అయినా, అబ్రాహాము ద్వారా లభించనైయున్న స్వాస్థ్యపు విలువను అబ్రాహాము సంతానంలోని వారందరూ గుణగ్రహించలేదు.
స్వాస్థ్యాన్ని తృణీకరించిన కొందరు
8. ఏశావు తనకు స్వాస్థ్యంగా లభించినదాని విలువను తాను గుణగ్రహించలేదని ఎలా చూపించాడు?
8 ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావు మొదటి సంతానంగా తనకున్న జ్యేష్ఠత్వాన్ని విలువైనదిగా ఎంచడంలో విఫలమయ్యాడు. ఆదికాండము 25:29-34; హెబ్రీయులు 12:14-17) దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలు ఏ జనాంగం ద్వారా నెరవేరనైయున్నాయో ఆ జనాంగం యాకోబు వంశం నుండి వచ్చింది; యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలు అని మార్చాడు. ఆ ప్రత్యేకమైన స్వాస్థ్యం, వారికి ఏ అవకాశాలను ఇచ్చింది?
ఆయన పరిశుద్ధమైన వాటిని విలువైనవిగా ఎంచలేదు. అందుకే ఒకరోజు ఏశావు తన ఆకలిని తీర్చుకోవడం కోసం తన జ్యేష్ఠత్వాన్ని తన సహోదరుడైన యాకోబుకు అమ్మివేశాడు. దేనికి? ఒక్క పూట భోజనం కోసం, కేవలం రొట్టె చిక్కుడుకాయల కూర కోసం అమ్మివేశాడు. (9. తమకు లభించిన ఆధ్యాత్మిక స్వాస్థ్యం మూలంగా, యాకోబు లేదా ఇశ్రాయేలు సంతానం ఏ విమోచనను అనుభవించింది?
9 ఒకసారి కరవు ఏర్పడినప్పుడు, యాకోబు ఆయన కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళింది. అక్కడ వాళ్లు అభివృద్ధి చెంది ఒక పెద్ద జనాంగంగా తయారయ్యారు, కానీ చివరికి వాళ్లు బానిసలయ్యారు. అయితే, యెహోవా అబ్రాహాముతో చేసిన నిబంధనను మరచిపోలేదు. ఆయన తన నియమిత సమయంలో ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విమోచించి, వాళ్లను “పాలు తేనెలు ప్రవహించు దేశమునకు” అంటే తాను అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశానికి తీసుకువెళ్లబోతున్నానని వాళ్లకు చెప్పాడు.—నిర్గమకాండము 3:7, 8; ఆదికాండము 15:18-21.
10. సీనాయి పర్వతం వద్ద, ఇశ్రాయేలు కుమారుల స్వాస్థ్యానికి సంబంధించి ఏ విశేషమైన మార్పులు జరిగాయి?
10 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు, యెహోవా వారిని సీనాయి పర్వతం వద్ద సమకూర్చాడు. అక్కడ ఆయన వారికి, “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని” చెప్పాడు. (నిర్గమకాండము 19:5, 6) ప్రజలు స్వచ్ఛందంగా, ఏకగ్రీవంగా దీనికి అంగీకరించిన తర్వాత, యెహోవా వారికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అలా ఆయన మరే ప్రజలకూ ఇవ్వలేదు.—కీర్తన 147:19, 20.
11. ఇశ్రాయేలు కుమారుల ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగమైయున్న కొన్ని అమూల్యమైన విషయాలు ఏవి?
11 ఆ క్రొత్త జనాంగానికి ఎంతటి ఆధ్యాత్మిక స్వాస్థ్యం లభించింది! వాళ్లు ఏకైక సత్య దేవుడ్ని ఆరాధించారు. ఆయన వాళ్లను ఐగుప్తు నుండి విడుదల చేశాడు, సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వాళ్లు భీతి గొలిపే సంఘటనలను ప్రత్యక్షంగా చూశారు. వాళ్లు ప్రవక్తల ద్వారా అదనపు “దేవోక్తులు” అందుకున్నప్పుడు వారి స్వాస్థ్యం మరింత సుసంపన్నమయ్యింది. (రోమీయులు 3:1, 2) యెహోవా వారిని తనకు సాక్షులుగా నియమించాడు. (యెషయా 43:10-12) సంతానమైన మెస్సీయా వారి జనాంగం నుండి రావలసి ఉంది. ధర్మశాస్త్రం ముందుగానే ఆయనను సూచించి, ఆయనను గుర్తించటానికి సహాయం చేసి, తమకు మెస్సీయా అవసరమన్నది గుణగ్రహించేందుకు వారికి సహాయం చెయ్యవలసి ఉండింది. (గలతీయులు 3:19, 24) అంతేగాక, యాజక రూపమైన రాజ్యంగా, పరిశుద్ధ జనంగా ఉన్న వీరికి, సంతానమైన మెస్సీయాతో కలిసి సేవచేసే అవకాశం లభించివుండేది.—రోమీయులు 9:4, 5.
12. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పటికీ, వాళ్లు ఏమి అనుభవించలేకపోయారు? ఎందుకు?
12 యెహోవా తాను చేసిన వాగ్దానానికి అనుగుణంగానే ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించాడు. కానీ ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు వివరించినట్లుగా, వారి అవిశ్వాసం మూలంగా, ఆ దేశం వారికి నిజంగా ‘విశ్రాంతి స్థలం’ కాలేకపోయింది. వారు ఒక జనాంగంగా ‘దేవుని విశ్రాంతిలో’ ప్రవేశించలేదు ఎందుకంటే, అదాము హవ్వల సృష్టి తర్వాత ప్రారంభమైన దేవుని స్వంత విశ్రాంతి దిన సంకల్పాన్ని వాళ్లు గ్రహించలేదు, దానికి అనుగుణ్యంగా వాళ్లు పని చేయలేదు.—హెబ్రీయులు 4:3-10.
13. ఇశ్రాయేలు ఒక జనాంగంగా తమ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని గుణగ్రహించలేకపోయినందుకు ఆ జనాంగం దేన్ని కోల్పోయింది?
13 యాజక రూపమైన రాజ్యంగా, పరిశుద్ధ జనంగా మెస్సీయాతోపాటు ఆయన పరలోకరాజ్యంలో భాగం వహించే వ్యక్తుల పూర్తి సంఖ్యను సహజ ఇశ్రాయేలీయులు పూరించి ఉండగలిగేవారే. కానీ వారు తమకున్న అమూల్యమైన స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచలేదు. మెస్సీయా వచ్చినప్పుడు సహజ ఇశ్రాయేలీయుల్లోని కేవలం కొంతమంది మాత్రమే ఆయనను స్వీకరించారు. ఫలితంగా, కేవలం కొద్దిమంది మాత్రమే ప్రవచించబడిన యాజక రూపమైన రాజ్యంలో భాగమయ్యారు. సహజ ఇశ్రాయేలీయుల నుండి రాజ్యం తీసివేయబడి, “దాని ఫలమిచ్చు జనులకియ్య”బడింది. (మత్తయి 21:43) అది ఏ జనాంగం?
పరలోకంలో ఒక స్వాస్థ్యం
14, 15. (ఎ) యేసు మరణం తర్వాత, అబ్రాహాము “సంతానము” ద్వారా జనాంగాలు ఎలా ఆశీర్వదించబడనారంభించాయి? (బి) “దేవుని ఇశ్రాయేలు”లోని సభ్యులు దేన్ని స్వాస్థ్యంగా పొందుతారు?
14 ఆ రాజ్యం ఇవ్వబడిన జనాంగము “దేవుని ఇశ్రాయేలు,” అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు, అది యేసుక్రీస్తు ఆత్మాభిషిక్త అనుచరులైన 1,44,000 మందితో రూపొందించబడింది. (గలతీయులు 6:16; ప్రకటన 5:9, 10; 14:1-3) ఆ 1,44,000 మందిలో కొందరు సహజ యూదులు, కానీ అధిక సంఖ్యాకులు మాత్రం అన్యజనాంగాలకు చెందిన వారే. ఆ విధంగా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానం, అంటే తన “సంతానం” ద్వారా జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయన్న వాగ్దానం నెరవేరనారంభించింది. (అపొస్తలుల కార్యములు 3:25, 26; గలతీయులు 3:8, 9) ఆ తొలి నెరవేర్పులో, అన్యజనాంగాల వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు, యెహోవా దేవుడు వారిని తన ఆధ్యాత్మిక కుమారులనుగా, యేసుక్రీస్తు సహోదరులుగా ఉండేందుకు దత్తత తీసుకున్నాడు. అలా, వాళ్లు కూడా ‘సంతానములోని’ రెండవ భాగమయ్యారు.—గలతీయులు 3:28, 29.
15 యేసు తాను మరణించక ముందు, ఆ క్రొత్త జనాంగంలో సభ్యులయ్యే అవకాశం ఉన్న యూదులకు క్రొత్త నిబంధనను పరిచయం చేశాడు, ఆయన అప్పటికి కొద్దిసేపట్లో స్వంత రక్తంతో దాన్ని చెల్లుబాటులోకి తేనైయున్నాడు. ధృవీకరించబడిన ఆ బలియందలి విశ్వాసం ఆధారంగా, ఆ నిబంధనలోకి తీసుకొనబడిన వారు ‘సదాకాలమునకు సంపూర్ణులుగా’ చేయబడతారు. (హెబ్రీయులు 10:14-18) వాళ్లు “నీతిమంతులుగా తీర్చ”బడతారు, వాళ్ల పాపాలు క్షమించబడతాయి. (1 కొరింథీయులు 6:11) కాబట్టి, ఆ భావంలో వాళ్లు ఆదాము పాపం చేయక మునుపు ఎలా ఉన్నాడో అలా ఉంటారు. అయితే, వాళ్లు పరదైసు భూమిపై జీవించరు. వాళ్లకోసం తాను పరలోకంలో స్థలం సిద్ధపర్చ వెళ్తున్నానని యేసు చెప్పాడు. (యోహాను 14:2, 3) ‘తమ కోసం పరలోకమందు భద్రపర్చబడివున్న స్వాస్థ్యమును’ పొందటానికి వాళ్లు తమ భూసంబంధమైన ఉత్తరాపేక్షలను వదులుకుంటారు. (1 పేతురు 1:5) వాళ్లక్కడ ఏమి చేస్తారు? యేసు ఇలా వివరించాడు: ‘నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను.’—లూకా 22:29.
16. అభిషిక్త క్రైస్తవులకు ఏ అద్భుతమైన సేవా నియామకం ఇవ్వబడనైయుంది?
16 పరలోకం నుండి క్రీస్తుతోపాటు పరిపాలించేవారు, ఇతరత్రా అనేక పనులతో పాటు, యెహోవా సర్వోన్నతాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు చిహ్నాలేవీ భూమిమీద లేకుండా నిర్మూలిస్తారు. (ప్రకటన 2:26, 27) అబ్రాహాము యొక్క ఆధ్యాత్మిక సంతానంలోని రెండవ భాగంగా వారు అన్ని జనాంగాల వారికీ పరిపూర్ణ జీవితాన్ని తీసుకురావడంలో భాగం వహిస్తారు. (రోమీయులు 8:17-21) వారికెంత అమూల్యమైన స్వాస్థ్యం లభించిందో కదా!—ఎఫెసీయులు 1:16-19.
17. అభిషిక్త క్రైస్తవులు భూమిపై ఉండగా తాము స్వాస్థ్యంగా పొందిన దానిలోని ఏ అంశాలను ఆనందిస్తారు?
17 అయితే యేసు అభిషిక్త అనుచరుల స్వాస్థ్యమంతా భవిష్యత్తులో లభించేదే కాదు. వారు ఏకైక సత్యదేవుడైన యెహోవాను తెలుసుకునేందుకు, మరెవరూ సహాయం చేయలేని విధంగా యేసు సహాయం చేశాడు. (మత్తయి 11:27; యోహాను 17:3, 26) ‘యెహోవాను నమ్ముకోవడం’ అంటే ఏమిటో, యెహోవాకు విధేయులై ఉండడంలో ఏమి ఇమిడివుందో ఆయన వారికి మాట ద్వారా, మాదిరి ద్వారా బోధించాడు. (హెబ్రీయులు 2:13; 5:7-10) దేవుని సంకల్పానికి సంబంధించిన సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని యేసు వారికి అప్పగించి, దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ వారికి సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చాడు. (యోహాను 14:24-26) దేవుని రాజ్య ప్రాముఖ్యతను ఆయన వారి మనస్సులపై, హృదయాలపై ముద్రించాడు. (మత్తయి 6:9, 10, 33) యెరూషలేము, యూదయ, సమరయ దేశాల్లోనూ భూదిగంతముల వరకూ సాక్ష్యమిచ్చి, శిష్యులను చేసే బాధ్యతను కూడా యేసు వారికి అప్పగించాడు.—మత్తయి 24:14; 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8.
ఒక గొప్ప సమూహానికి ఒక అమూల్యమైన స్వాస్థ్యం
18. అబ్రాహాము “సంతానము” ద్వారా జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయని యెహోవా చేసిన వాగ్దానం నేడు ఎలా నెరవేరుతుంది?
18 బహుశ ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని పూర్తి సంఖ్య, అంటే రాజ్య వారసుల “చిన్నమంద”ను ఎన్నుకోవడం పూర్తైవుంటుంది. (లూకా 12:32) ఇప్పటికి గత కొన్ని దశాబ్దాలుగా యెహోవా అన్ని జనాంగాల నుండి గొప్ప సమూహాన్ని సమకూర్చే పనివైపుకి తన అవధానాన్ని మళ్లించాడు. అలా, అబ్రాహాము “సంతానము” ద్వారా అన్ని జనాంగాలు ఆశీర్వదించబడతాయని యెహోవా ఆయనకు చేసిన వాగ్దానం పెద్ద ఎత్తున నెరవేరుతోంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఆశీర్వదించబడిన వీళ్లు యెహోవాకు పరిశుద్ధ సేవ చేస్తూ, తమ రక్షణ దేవుని గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు నందలి విశ్వాసంపైనే ఆధారపడి ఉందని గుర్తిస్తారు. (ప్రకటన 7:9, 10) ఆ ఆనందభరితమైన గుంపులో భాగమై ఉండేందుకు యెహోవా ఇస్తున్న సాదరమైన ఆహ్వానాన్ని మీరు అంగీకరించారా?
19. ఇప్పుడు ఆశీర్వదించబడుతున్న జనాంగాలు ఏ స్వాస్థ్యం కోసం ఎదురు చూస్తాయి?
19 చిన్న మందలో భాగం కాని వారికి యెహోవా ఏ అమూల్యమైన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు? అది పరలోకంలో లభించే స్వాస్థ్యం కాదు. అది ఆదాము తన సంతానానికి సంక్రమింపజేయవలసిన స్వాస్థ్యం, అంటే క్రమక్రమంగా భూగోళవ్యాప్తంగా విస్తరించే పరదైసులో పరిపూర్ణమైన నిత్యజీవాన్ని పొందడమనే ఉత్తరాపేక్ష. అది, ‘మరణమైనను దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండని’ లోకమై ఉంటుంది. (ప్రకటన ) కాబట్టి మీకే దేవుని ప్రేరేపిత వాక్యం ఇలా చెప్తుంది: “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము. యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”— 21:4కీర్తన 37:3, 4, 10, 11, 29.
20. అభిషిక్త క్రైస్తవుల ఆధ్యాత్మిక స్వాస్థ్యంలోని అధిక భాగాన్ని “వేరే గొఱ్ఱెలు” ఎలా ఆనందిస్తారు?
20 యేసు “వేరే గొఱ్ఱెలు” పరలోక రాజ్యపు భూపరిధిలో స్వాస్థ్యాన్ని పొందుతారు. (యోహాను 10:16) వాళ్లు పరలోకంలో ఉండకపోయినప్పటికీ, అభిషిక్తులు అనుభవించే ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో అధికభాగం వారికి కూడా అనుగ్రహించబడుతుంది. వేరే గొఱ్ఱెలు దేవుని వాక్యంలోవున్న అమూల్యమైన వాగ్దానాలను అర్థం చేసుకునేందుకు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన’ అభిషిక్త ‘దాసుని’ సమూహమే సమష్టిగా మార్గాన్ని సుగమం చేసింది. (మత్తయి 24:45-47; 25:34) అభిషిక్తులకు, వేరే గొఱ్ఱెలకు అద్వితీయ సత్యదేవుడైన యెహోవా తెలుసు, వారు ఆయనను ఆరాధిస్తారు. (యోహాను 17:20, 21) ఇరువర్గాలూ కలిసి యేసు బలికున్న పాపపరిహారార్థ విలువను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాళ్లు యేసుక్రీస్తు అనే ఒకే గొఱ్ఱెల కాపరి క్రింద ఒక్క మందగా కలిసి సేవచేస్తారు. (యోహాను 10:16) వాళ్లంతా ఒకే ప్రేమపూర్వకమైన, భూగోళవ్యాప్త సహోదరత్వంలో భాగమైవున్నారు. యెహోవాకు, ఆయన రాజ్యానికి సాక్షులై ఉండే ఆధిక్యతను వాళ్లు కలిసి పంచుకుంటారు. అవును, మీరు బాప్తిస్మం పొందిన, యెహోవా సమర్పిత సేవకులైతే, ఇవన్నీ మీ ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో భాగాలే.
21, 22. మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని మనమందరం ఎలా చూపించగలము?
హెబ్రీయులు 10:24, 25) ఆ స్వాస్థ్యం, ఎన్ని కష్టాలున్నప్పటికీ మీరు దేవుని సేవలో కొనసాగేంత అమూల్యమైనదిగా ఉన్నదా? దానిపట్ల మీకున్న మెప్పు, దాన్ని కోల్పోవటానికి దారితీసే ఏ శోధననైనా మీరు ఎదిరించగలిగేంత బలమైనదా?
21 ఈ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని మీరు అమూల్యమైనదిగానే దృష్టిస్తారా? దేవుని చిత్తాన్ని చేయడం మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉండేంతగా మీరు దాన్ని విలువైనదిగా ఎంచుతారా? దానికి నిదర్శనంగా, క్రైస్తవ సంఘ కూటాలన్నిటికీ క్రమంగా హాజరు కమ్మని ఆయన వాక్యమూ, ఆయన సంస్థా ఇస్తున్న ఉపదేశాన్ని మీరు వింటున్నారా? (22 దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని మనం ఎంతో విలువైనదిగా ఎంచుదాము. రానున్న పరదైసుపై మనం మన దృష్టిని స్థిరంగా నిలిపి, యెహోవా మనకు ఇప్పుడు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ఆధిక్యతల్లో పూర్తిగా భాగం వహిద్దాము. మన జీవితాలను యెహోవాతో మనకుగల సంబంధం చుట్టూ నిర్మించుకోవడం ద్వారా, ఆయనిచ్చిన స్వాస్థ్యం మనకు నిజంగా ఎంతో అమూల్యమైనదని నిదర్శనాలతో సహా రుజువుచేస్తాము. “రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను” అని చెప్పేవారిలో మనమూ ఒకరమై ఉందాము.—కీర్తన 145:1.
మీరెలా వివరిస్తారు?
• ఆదాము దేవునిపట్ల యథార్థంగా ఉండివుంటే, ఆయన మనకు ఏ స్వాస్థ్యమును ఇచ్చివుండేవాడు?
• తమకు అందుబాటులో ఉన్న స్వాస్థ్యాన్ని అబ్రాహాము సంతానం ఎలా ఉపయోగించింది?
• క్రీస్తు అభిషిక్త అనుచరుల స్వాస్థ్యంలో ఏమి ఇమిడి ఉంది?
• గొప్ప సమూహానికున్న స్వాస్థ్యం ఏమిటి, తాము దాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నామని వాళ్లు ఎలా చూపించగలరు?
[అధ్యయన ప్రశ్నలు]
[20వ పేజీలోని చిత్రాలు]
అబ్రాహాము సంతానం అమూల్యమైన స్వాస్థ్యాన్ని గూర్చిన వాగ్దానాన్ని పొందింది
[23వ పేజీలోని చిత్రాలు]
మీరు మీకున్న ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతారా?