కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వారు మంచితనాన్ని గూర్చి ప్రేమను గూర్చి మాట్లాడతారు’

‘వారు మంచితనాన్ని గూర్చి ప్రేమను గూర్చి మాట్లాడతారు’

‘వారు మంచితనాన్ని గూర్చి ప్రేమను గూర్చి మాట్లాడతారు’

ఇటీవల ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షులకు పరువునష్టాన్ని కలుగజేస్తూ, వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేయబడిన ప్రచార తాకిడికి వారు గురయ్యారు. సత్యాలను పూర్తిగా తెలుపకుండా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తూ వారి వ్యతిరేకులు ప్రజల ముందు వారిని తప్పుగా చిత్రీకరించారు. అందుకని, 1999వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లోని ప్రజలందరికీ ఫ్రాన్సువాసులారా, మీరు తప్పుదోవ పట్టించబడుతున్నారు! అనే శీర్షికగల 1.2 కోట్ల కరపత్రాలను యెహోవాసాక్షులు పంచిపెట్టారు. వారికి వ్యతిరేకంగా వారి పేరుప్రతిష్టలను పాడుచేసిన వ్యాఖ్యానాలపట్ల వారి నిరసనను ఈ కరపత్రంలో వ్యక్తం చేశారు.

ఆ కరపత్రాల ప్రచారం ముగిసిన కొన్నిరోజులకు మాజీ పార్లమెంటు సభ్యుడూ వైద్యుడూ అయిన మిస్టర్‌. ఝాన్‌ బోన్‌హోమ్‌ ఒక స్థానిక వార్తాపత్రికకు ఒక బహిరంగ ఉత్తరాన్ని పంపించాడు. ఆయనిలా వ్రాశాడు: “అప్పుడప్పుడూ యెహోవాసాక్షులు మా ఇంటికి వస్తుంటారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి మంచితనాన్ని గూర్చి విశ్వవ్యాప్త ప్రేమను గూర్చి మాట్లాడుతుంటారు. . . . వాళ్ళు బలవంతంగా మన ఇళ్ళకు రారు. వాళ్ళు మృదువుగా చెప్తారు, నా అనుమానాలను ఓపికతో వినేవారు.”

యెహోవాసాక్షుల ఆధ్యాత్మిక దృక్ఫథాన్ని గూర్చి మాట్లాడుతూ మిస్టర్‌. బోన్‌హోమ్‌ ఇలా చెప్పాడు: “వారు, లోకరీతిగా గొప్ప జ్ఞానులు కాకపోవడం ఏమాత్రం హానికరమైన విషయం కాదు. బదులుగా ఎవరైనా రాజకీయనాయకులు లోకరీతిగా జ్ఞానులు కాకపోవడం మాత్రం, పౌరుల శాంతిసౌభాగ్యాలకీ సమాజ శ్రేయస్సుకే ప్రమాదం.”