కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉన్న సమయాన్నే చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం

ఉన్న సమయాన్నే చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం

ఉన్న సమయాన్నే చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం

“దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొను[డి].”​—⁠ఎఫెసీయులు 5:⁠15.

1. మనం మన సమయాన్ని ఆయా పనుల కోసం నిర్దిష్టంగా కేటాయించుకోవడం ఎందుకు జ్ఞానయుక్తమైనది, మనం మన సమయాన్ని ఉపయోగించుకునే విధానం మన గురించి ఏమి బయల్పర్చగలదు?

“సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయాన్ని పొదుపు చేసుకున్నట్లే” అని ఒక సామెత. చేయవలసిన పనులకు సమయాన్ని నిర్దిష్టంగా కేటాయించుకునే వ్యక్తి సాధారణంగా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” (ప్రసంగి 3:⁠1) మనకందరికీ సమయం ఒకే మొత్తంలో అందుబాటులో ఉంది; దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది. మనం వేటికి ప్రాధాన్యతనిస్తాము, వాటికి ఎంత సమయాన్ని కేటాయిస్తాము అనే విషయాలే మన హృదయానికి ఏది అత్యంత ప్రీతిపాత్రమైనదన్న విషయాన్ని ఎక్కువగా బయల్పరుస్తాయి.​—⁠మత్తయి 6:⁠21.

2. (ఎ) యేసు, కొండమీద తాను ఇచ్చిన ప్రసంగంలో, మన ఆధ్యాత్మిక అవసరాల గురించి ఏమి చెప్పాడు? (బి) ఏ విధమైన స్వయం-పరిశీలన అవసరం?

2 మనం తినడానికి, నిద్రపోవడానికి సమయాన్ని వెచ్చించబద్ధులమై ఉన్నాము, ఎందుకంటే అవి మన భౌతిక అవసరాలు. మరి మన ఆధ్యాత్మిక అవసరాల మాటేమిటి? వాటిని కూడా తీర్చుకోవలసిన అవసరం ఉందని మనకు తెలుసు. యేసు, కొండమీద తాను ఇచ్చిన ప్రసంగంలో ఇలా చెప్పాడు: “తమ ఆధ్యాత్మిక అవసరాల పట్ల శ్రద్ధగలవారు ధన్యులు.” (మత్తయి 5:3, NW) అందుకే ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సమయం వెచ్చించడంలోని ప్రాముఖ్యతను మనకు క్రమంగా గుర్తుచేస్తున్నాడు. (మత్తయి 24:​45) ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఇప్పటికే గుర్తిస్తుండవచ్చు, అయితే అధ్యయనం చేయడానికి గానీ బైబిలు చదవడానికి గానీ ఏమాత్రం సమయం ఉండడం లేదని మీరు అనుకుంటుండవచ్చు. అలాగైతే ఉన్న సమయాన్నే, దేవుని వాక్యాన్ని చదవడానికి, వ్యక్తిగతంగా అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి సద్వినియోగం చేసుకోగల మార్గాలను, విధానాలను మనం పరిశీలిద్దాం.

ఉన్న సమయాన్నే బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం

3, 4. (ఎ) మనం మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి అపొస్తలుడైన పౌలు ఏమి ఉపదేశించాడు, దానిలో ఏమి ఇమిడి ఉంది? (బి) ‘సమయమును పోనియ్యక సద్వినియోగం చేసుకోమని’ చెప్పినప్పుడు పౌలు ఉద్దేశించినదేమిటి?

3 మనం జీవిస్తున్న కాలాలను బట్టి, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ హెచ్చరికను మనమందరం వినవలసి ఉంది: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.” (ఎఫెసీయులు 5:​15-17) నిజమే ఈ ఉపదేశం సమర్పిత క్రైస్తవులముగా మన జీవితాల్లోని ప్రతి అంశానికి వర్తిస్తుంది. అంటే ప్రార్థించడం, అధ్యయనం చేయడం, కూటాలకు హాజరుకావడం, “రాజ్య సువార్త” ప్రకటనలో సాధ్యమైనంత సంపూర్ణంగా పాల్గొనడం వంటివాటి కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా ఆ ఉపదేశం వర్తిస్తుంది.​—⁠మత్తయి 24:14; 28:19, 20.

4 బైబిలు చదవడానికీ, లోతుగా అధ్యయనం చేయడానికీ తమ జీవితాల్లో సమయాన్ని కనుగొనడం చాలామంది యెహోవా సేవకులకు నేడు కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం మన దినానికి మరో గంటను చేర్చుకోవడం సాధ్యం కాదన్నది వాస్తవమే, కాబట్టి పౌలు ఇస్తున్న ఉపదేశం మరింకేదో సూచిస్తుండవచ్చు. ‘సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం’ అనే పదబంధానికి గ్రీకులో, ఏదైనా చెల్లించి ఒక వస్తువును కొనుక్కోవడమని అర్థం ఉంది. డబ్ల్యు. ఇ. వైన్‌ తన ఎక్స్‌పోజిటరీ డిక్షనరీలో దానికిలా అర్థాన్ని ఇస్తున్నాడు, “ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రతి అవకాశం నుండి ప్రయోజనం పొందడం, ఎందుకంటే పోగొట్టుకున్న ఏ అవకాశాన్నీ తిరిగి పొందడం సాధ్యంకాదు.” ఉన్న సమయాన్నే బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?

ప్రాధాన్యతలు నిర్ధారించుకోవాలి

5. మనం “శ్రేష్ఠమైన కార్యముల” గురించి ఎలా, ఎందుకు వివేచించాలి?

5 మనకు లౌకికపరమైన బాధ్యతలెన్నో ఉన్నాయి, ఆధ్యాత్మికపరంగా చూస్తే కూడా మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. యెహోవా సమర్పిత సేవకులముగా, మనకు “ప్రభువు కార్యాభివృద్ధియందు” చేయవలసినది ఎంతో ఉంది. (1 కొరింథీయులు 15:​58) పౌలు ఈ కారణాన్ని బట్టే, “శ్రేష్ఠమైన కార్యముల” గురించి వివేచించాలని ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఉపదేశించాడు. (ఫిలిప్పీయులు 1:​9-10) దాని భావమేమిటంటే, మనం వేటికి ప్రాధాన్యతనిస్తామనేది నిర్ధారించుకోవాలి. వస్తుసంబంధమైన వాటికంటే ఆధ్యాత్మిక విషయాలకే ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వాలి. (మత్తయి 6:​31-33) అయితే మనం మన ఆధ్యాత్మిక బాధ్యతలను నిర్వర్తించే విషయంలో సమతూకం కూడా కల్గివుండాలి. మనం మన క్రైస్తవ జీవితంలోని అనేక కార్యకలాపాలకు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నాము? ఒక క్రైస్తవుడు శ్రద్ధ తీసుకోవలసిన “శ్రేష్ఠమైన కార్యము”లలో వ్యక్తిగత అధ్యయనం, బైబిలు చదవడం నిర్లక్ష్యం చేయబడుతున్నట్లుగా కనిపిస్తుందని ప్రయాణ పైవిచారణకర్తలు నివేదిస్తున్నారు.

6. లౌకికపరమైన ఉద్యోగానికి గానీ లేదా ఇంటిపనికి గానీ సంబంధించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఏమి ఇమిడి ఉండవచ్చు?

6 మనం ఇప్పటికే చూసినట్లుగా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో “ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం,” “ప్రతి అవకాశం నుండి ప్రయోజనం పొందడం” వంటివి ఇమిడివున్నాయి. కాబట్టి బైబిలు చదవడం, అధ్యయనం చేయడం వంటివాటికి సంబంధించి మనకు సరైన అలవాట్లు లేకపోతే, మనం మన సమయాన్ని ఎలా గడుపుతున్నామన్నది వ్యక్తిగతంగా విశ్లేషించుకోవడం మంచిది. లౌకికపరమైన మన ఉద్యోగానికి మనం మన సమయాన్నీ, శక్తినీ ఎక్కువగా వెచ్చించవలసి వస్తుంటే, మనమా విషయాన్ని గురించి యెహోవాకు ప్రార్థించాలి. (కీర్తన 55:​22) బైబిలు చదవడం, అధ్యయనం చేయడం వంటివాటితో సహా యెహోవా ఆరాధనకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించగలిగేలా మనం సవరింపులు చేసుకునే అవకాశం ఉంటుండవచ్చు. ఒక స్త్రీ పని ఎప్పుడూ ముగియదు అన్న నానుడిలో నిజముంది. కాబట్టి క్రైస్తవ సహోదరీలు కూడా వేటికి ప్రాధాన్యతను ఇవ్వాలనేది నిశ్చయపర్చుకుని, బైబిలు చదవడానికీ గంభీరంగా అధ్యయనం చేయడానికీ సమయాన్ని కచ్చితంగా కేటాయించుకోవాలి.

7, 8. (ఎ) ఏ కార్యకలాపాల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా ఉండడం ద్వారా మనం ఉన్న సమయాన్నే చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవచ్చు? (బి) వినోదం చేయవలసిన పనేమిటి, ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోవడం మనం ప్రాధాన్యతలను నిర్ధారించుకునేందుకు మనకెలా సహాయం చేస్తుంది?

7 అంత అవసరం కాని కార్యకలాపాల కోసం సమయాన్ని ఎక్కువగా వెచ్చించకుండా ఉండడం ద్వారా మనలో చాలామందిమి ఉన్న సమయాన్నే అధ్యయనం చేయడానికి సద్వినియోగం చేసుకోవచ్చు. ‘లోకసంబంధమైన పత్రికలు లేక వార్తాపత్రికలు చదవడానికి, టీవీ కార్యక్రమాలు చూడడానికి, సంగీతం వినడానికి, లేదా వీడియో గేమ్‌లు ఆడడానికి నేనెంత సమయాన్ని వెచ్చిస్తున్నాను? నేను బైబిలు చదవడానికి వెచ్చించేదానికన్నా కంప్యూటర్‌ ముందు కూర్చోవడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. “ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి” అని పౌలు చెప్తున్నాడు. (ఎఫెసీయులు 5:​17) చాలామంది సాక్షులు వ్యక్తిగత అధ్యయనానికి, బైబిలు చదవడానికి తగినంత సమయాన్ని వెచ్చించలేక పోవడానికి ముఖ్య కారణం టీవీని అనుచితంగా ఉపయోగించడమే అనిపిస్తుంది.​—⁠కీర్తన 101:3; 119:37, 47, 48.

8 తాము ఎల్లవేళలా అధ్యయనం చేయలేమనీ తమకు కొంత వినోదం అవసరమనీ కొందరనవచ్చు. అది నిజమే అయినప్పటికీ, మనం విశ్రాంతి తీసుకోవడానికి వెచ్చించే సమయాన్ని పరిశీలించుకుని, దాన్ని వాస్తవంగా అధ్యయనం చేయడానికి లేదా బైబిలు చదవడానికి వెచ్చించే సమయంతో పోల్చిచూడడం మంచిది. అలా చేయడం ద్వారా వచ్చే ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. వినోదమూ విశ్రాంతీ అవసరమే అయినప్పటికీ, వాటిని తగిన స్థానంలోనే ఉంచాలి. అవి చేయవలసిందేమిటంటే, మనం ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం నూతన శక్తిని పొందగలిగేలా మనకు సేదదీర్పునివ్వడమే. చాలా టీవీ కార్యక్రమాలు, వీడియో గేమ్‌లు ఒక వ్యక్తి పూర్తిగా అలసిపోయేలా చేస్తాయి, అయితే దేవుని వాక్యాన్ని చదవడం, అధ్యయనం చేయడం ఉత్సాహాన్ని, నూతన శక్తిని ఇస్తాయి.​—⁠కీర్తన 19:7, 8.

కొంతమంది ఉన్న సమయాన్నే అధ్యయనం చేయడానికి ఎలా సద్వినియోగం చేసుకుంటారు

9. ప్రతిదినము లేఖనములను పరిశీలించుట​—⁠1999 అనే చిన్నపుస్తకంలో ఇవ్వబడిన ఉపదేశాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?

9ప్రతిదినము లేఖనములను పరిశీలించుట అనే పుస్తకపు 1999 సంచికలోని ముందుమాట ఈ క్రింది విధంగా పేర్కొంది: “ఈ బుక్‌లెట్‌లోని దినవచనాన్నీ, వ్యాఖ్యానాలనూ ప్రతి ఉదయం పరిశీలించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గొప్ప ఉపదేశకుడైన యెహోవా తన నిర్దేశాలతో మిమ్మల్ని నిద్రలేపుతున్నటువంటి అనుభూతి మీకు లభిస్తుంది. యెహోవా నిర్దేశాల నుండి ప్రతిరోజూ ప్రయోజనం పొందడాన్ని గురించి “ప్రతి ఉదయమూ ఆయన నన్ను మేలుకొలుపుతాడు. శిష్యుడు వినే విధంగా నేను వినాలని నా చెవిని మేలుకొలుపుతాడు” అని యేసుక్రీస్తు ప్రవచనాత్మకంగా చెప్పాడు. అలాంటి ఉపదేశాలు యేసుకు “నేర్పుగల నోరును” ఇచ్చాయి గనుక, “అలసిపోయినవాణ్ణి మాటలచేత ఆదరించడం” ఆయనకు “తెలుసు.” (యెషయా 30:20; 50:4 పవిత్ర గ్రంథం; మత్తయి 11:​28-30) ప్రతిరోజు దేవుని వాక్యం నుండి సమయోచిత ఉపదేశంతో మేల్కోవడం మీ సొంత సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడడమే కాక, “నేర్పుగల నోరు”తో ఇతరులకు సహాయపడేందుకు మిమ్మల్ని ఆయత్తం చేస్తుంది కూడా.” *

10. కొంతమంది ఉన్న సమయాన్నే బైబిలు చదవడానికి, అధ్యయనం చేయడానికి ఎలా సద్వినియోగం చేసుకుంటారు, దాని వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి?

10 చాలామంది క్రైస్తవులు దినవచనాన్ని, వ్యాఖ్యానాన్ని చదవడం ద్వారా, బైబిలు చదవడం ద్వారా లేదా ఉదయాన్నే అధ్యయనం చేయడం ద్వారా ఈ ఉపదేశాన్ని అనుసరిస్తారు. ఫ్రాన్స్‌లోవున్న ఒక నమ్మకమైన పయినీర్‌ ఉదయాన్నే త్వరగా నిద్రలేచి, 30 నిమిషాలపాటు బైబిలు చదువుతుంది. సంవత్సరాలుగా ఆమె ఇలా చేసేందుకు ఆమెకు సహాయపడినదేమిటి? “నేనెంతో పురికొల్పబడ్డాను, ఏమి జరిగినా నేను బైబిలు చదివే ప్రణాళికను అంటిపెట్టుకునే ఉంటాను!” అని ఆమె చెప్తుంది. దినంలోని ఏ సమయంలో చదవడానికి మనం ఎంపిక చేసుకున్నా, మనం మన ప్రణాళికను అంటిపెట్టుకునే ఉండడం ప్రాముఖ్యం. ఇప్పటికి నలభై ఏళ్లుగా, యూరప్‌లోనూ తర్వాత ఉత్తర ఆఫ్రికాలోనూ పయినీర్‌గా సేవచేస్తున్న రినీ మీకా ఇలా చెబుతున్నాడు: “1950 నుండి ప్రతి సంవత్సరం పూర్తి బైబిలును చదవడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను గనుక ఇప్పటికి 49 సార్లు చదివేశాను. నా సృష్టికర్తతో సన్నిహిత సంబంధాన్ని కల్గివుండడానికి ఇది ప్రాముఖ్యమని నేను భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించడం యెహోవా న్యాయాన్ని, ఆయనకున్న ఇతర లక్షణాలను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేస్తుంది, అది నాకు ఎంతో బలాన్నిస్తుంది.” *

‘తగిన కాలమున ఆహారము’

11, 12. (ఎ) ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ ఎలాంటి ఆధ్యాత్మిక “ఆహారము”ను సరఫరా చేస్తున్నాడు? (బి) సరైన సమయంలో “ఆహారము” ఎలా అందజేయబడుతుంది?

11 క్రమంగా తినే అలవాట్లు మంచి శారీరక ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయో అలాగే క్రమంగా బైబిలు చదవడం, అధ్యయనం చేయడం మంచి ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదపడతాయి. లూకా సువార్తలో, యేసు మాటల్ని మనమిలా చదువుతాము: “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?” (లూకా 12:​42) ఇప్పటికి 120 ఏళ్ల నుండి, కావలికోట ద్వారా, ఇతర బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా ‘తగిన కాలమున ఆధ్యాత్మిక ఆహారము’ అందజేయబడుతుంది.

12 “తగిన కాలము” అనే పదబంధాన్ని గమనించండి. తగిన సమయంలో, మన ‘మహాగొప్ప బోధకుడైన’ యెహోవా తన కుమారుని ద్వారా, దాసుని తరగతి ద్వారా సిద్ధాంతాలకు సంబంధించి, ప్రవర్తనకు సంబంధించి తన ప్రజలకు నడిపింపును ఇచ్చాడు. “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను​—⁠ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని మనమందరం కలిసికట్టుగా ఒకే స్వరాన్ని వింటున్నట్లుగా ఉంది. (యెషయా 30:​20, 21) అంతేగాక, చాలామంది బైబిలునూ, బైబిలు ప్రచురణలన్నిటినీ శ్రద్ధగా చదివినప్పుడు, వాటిలో వ్యక్తపర్చబడిన తలంపులు ప్రత్యేకంగా తమ కోసమే వ్రాయబడినట్లు తరచూ భావిస్తుంటారు. అవును, దైవిక ఉపదేశం, నిర్దేశం మనకు సరైన సమయంలో లభించి, శోధనను తట్టుకోవడానికి లేక సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తాయి.

మంచి ఆహారపుటలవాట్లు వృద్ధి చేసుకోండి

13. ఆధ్యాత్మికపరంగా ఎలాంటి ఆహారపుటలవాట్లు సరైనవి కావు?

13 తగిన కాలములో అందజేయబడుతున్న అలాంటి “ఆహారము” నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలంటే మనకు మంచి ఆహారపుటలవాట్లు ఉండాలి. బైబిలు చదవడానికి, వ్యక్తిగతంగా అధ్యయనం చేయడానికి క్రమమైన ప్రణాళిక ఉంచుకుని, దానికి కట్టుబడి ఉండడం ఎంతో ఆవశ్యకం. మీకు మంచి ఆధ్యాత్మిక ఆహారపుటలవాట్లున్నాయా, మీరు క్రమంగా, వ్యక్తిగతంగా లోతుగా అధ్యయనం చేస్తారా? లేక మరో విధంగా చెప్పాలంటే ఏదో పరుగెడుతూ తింటున్నట్లుగా, లేదా కొన్నిసార్లు మొత్తానికే తినడం మానేస్తున్నట్లుగా, మన కోసం జాగ్రత్తగా సిద్ధం చేయబడిన ఆహారాన్ని మీరు కేవలం పైపైన అలా అలా చదివేస్తారా లేక కొన్నిసార్లు మొత్తానికే భోజనం చేయడం మానేస్తారా? సరైన ఆధ్యాత్మిక ఆహారపుటలవాట్లు లేకపోవడం వల్ల చాలామంది తమ విశ్వాసంలో బలహీనమై, చివరికి పడిపోయారు.​—⁠1 తిమోతి 1:19; 4:15, 16.

14. తెలిసిందేననిపించే సమాచారాన్ని కూడా జాగ్రత్తగా చదవడం ఎందుకు ప్రయోజనకరం?

14 తమకు ప్రాథమిక సిద్ధాంతాలు ఇప్పటికే తెలుసనీ, ప్రతి శీర్షికా పూర్తిగా క్రొత్త విషయాలనేమీ అందజేయదనీ కొందరు భావించవచ్చు. కాబట్టి, పద్ధతిప్రకారం అధ్యయనం చేయడం, కూటాలకు హాజరు కావడం అనవసరమని వాళ్లు అనుకోవచ్చు. అయితే, మనకు ఇప్పటికే తెలిసిన విషయాలైనా మనకు గుర్తుచేయడం అవసరమని బైబిలు చూపిస్తుంది. (కీర్తన 119:95, 99; 2 పేతురు 3:​1, 2; యూదా 5) మంచి వంటవాడు అవే పదార్థాలతో వివిధ రకాలైన రుచికరమైన వంటకాలు చేసినట్లు, దాసుని తరగతి బలవర్థకమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని వైవిధ్యభరితమైన రీతిలో అందజేస్తుంది. మునుపు ఎన్నోసార్లు ప్రస్తావించబడిన అంశాలపైనే మళ్లీ వ్రాయబడిన శీర్షికల్లో కూడా మనం కోల్పోకూడని చక్కని విషయాలు ఉంటాయి. మనం చదివే సమాచారం నుండి మనం ఎంత లాభాన్ని పొందుతామనేది చాలామేరకు మనం దాన్ని అధ్యయనం చేసేందుకు ఎంత సమయాన్ని వెచ్చిస్తాము, ఎంతగా కృషి చేస్తాము అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.

చదవడం, అధ్యయనం చేయడం ద్వారా చేకూరే ఆధ్యాత్మిక ప్రయోజనాలు

15. బైబిలు చదవడం, అధ్యయనం చేయడం మరి చక్కని దేవుని వాక్య పరిచారకులుగా తయారవ్వటానికి ఎలా సహాయం చేస్తాయి?

15 బైబిలు చదవడం, అధ్యయనం చేయడం ద్వారా చేకూరే ప్రయోజనాలు అనేకానేకం. మన ప్రాథమికమైన క్రైస్తవ బాధ్యతల్లో ఒకదాన్ని నిర్వర్తించేందుకు అంటే, మనం వ్యక్తిగతంగా ‘సిగ్గుపడనక్కరలేని పనివారిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను’ తయారవ్వడానికి మనకు సహాయం అందజేయబడుతుంది. (2 తిమోతి 2:​15) బైబిలును మనం ఎంత ఎక్కువగా చదివి, అధ్యయనం చేస్తే, మన మనస్సులు దేవుని తలంపులతో అంత ఎక్కువగా నింపబడతాయి. అప్పుడు పౌలు వలే మనం యెహోవా సంకల్పాల అద్భుతమైన సత్యాన్ని ‘గురించి లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెబుతూ, తర్కించ’ గల్గుతాము. (అపొస్తలుల కార్యములు 17:​2, 3) మన బోధనా నైపుణ్యం మరింత మెరుగవుతుంది, మన సంభాషణలు, మాటలు, సలహాలు ఆధ్యాత్మికంగా మరింత ప్రోత్సాహాన్నిచ్చేవిగా ఉంటాయి.​—⁠సామెతలు 1:⁠5.

16. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనం వ్యక్తిగతంగా ఏ యే విధాలుగా ప్రయోజనం పొందుతాము?

16 అంతేగాక, దేవుని వాక్యాన్ని పరిశీలించడానికి వెచ్చించే సమయం మన జీవితాన్ని యెహోవా మార్గాలకు అనుగుణంగా మలుచుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. (కీర్తన 25:4; 119:9, 10; సామెతలు 6:​20-23) అది నమ్రత, యథార్థత, సంతోషం వంటి మన ఆధ్యాత్మిక లక్షణాలను బలపరుస్తుంది. (ద్వితీయోపదేశకాండము 17:19, 20; ప్రకటన 1:⁠3) బైబిలును చదవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకున్న విషయాలను మనం అన్వయించుకున్నప్పుడు, మన జీవితంలో దేవుని ఆత్మ సంపూర్ణంగా ప్రవహిస్తుంది, తత్ఫలితంగా మనం చేసేవాటన్నిటిలో మరింత సమృద్ధిగా ఆత్మఫలాలను ఫలించగల్గుతాము.​—⁠గలతీయులు 5:22, 23.

17. మనం వ్యక్తిగతంగా బైబిలు చదవడం, అధ్యయనం చేయడమన్నవి ఎంత మేరకు చేస్తున్నాము, ఎంత చక్కగా చేస్తున్నాము అనే విషయాలు యెహోవాతో మనకు గల సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

17 మరింత ప్రాముఖ్యంగా, వేరే కార్యకలాపాలను నివారిస్తూ, ఉన్న సమయాన్నే దేవుని వాక్యాన్ని చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకున్నప్పుడు అది దేవునితో మనం కల్గివుండే సంబంధం విషయంలో గొప్ప లాభాలను చేకూరుస్తుంది. తన తోటి క్రైస్తవులు “[దేవుని గూర్చిన] సంపూర్ణజ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, . . . అన్ని విషయములలో [యెహోవాను] సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని” పౌలు ప్రార్థించాడు. (కొలొస్సయులు 1:​9, 10) అలాగే, మనం “[యెహోవాకు] తగినట్టుగా నడుచుకొనవలె”నంటే మనం ‘దేవుని గూర్చిన సంపూర్ణజ్ఞానముతోను ఆత్మ సంబంధమైన వివేకముతోను’ నింపబడాలి. మనం యెహోవా ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని సంపాదించుకోవడం మనం వ్యక్తిగతంగా బైబిలు చదవడం, అధ్యయనం చేయడం అన్నవి ఎంత మేరకు చేస్తున్నాము, ఎంత చక్కగా చేస్తున్నాము అనే విషయాలపైనే ఆధారపడి ఉంటుంది.

18. యోహాను 17:3 లో వ్రాయబడివున్న యేసు మాటలను అనుసరిస్తే మనకు ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?

18 “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఇతరులు గ్రహించడానికి సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు ఎంతో విస్తృతంగా ఉపయోగించే లేఖనాల్లో ఇది ఒకటి. మనలో ప్రతి ఒక్కరమూ వ్యక్తిగతంగా అలాగే చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. నిరంతరం జీవించాలన్న మన నిరీక్షణ, యెహోవాను గూర్చిన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం విషయంలో మనం ఎదగడంపై ఆధారపడి ఉంటుంది. దాని భావమేమిటో ఒక్కసారి ఆలోచించండి. యెహోవా గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నటికీ అంతం ఉండదు​—⁠మనం ఆయన గురించి నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి!​—⁠ప్రసంగి 3:11; రోమీయులు 11:⁠33.

[అధస్సూచీలు]

^ పేరా 9 వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

^ పేరా 10 మే 1, 1995, కావలికోటలోని 20-1 పేజీల్లో ప్రచురించబడిన, “వారు దాన్ని ఎప్పుడు చదువుతారు, వారెలా ప్రయోజనం పొందుతారు” అనే శీర్షికను చూడండి.

పునఃసమీక్షా ప్రశ్నలు

• మనం మన సమయాన్ని ఉపయోగించే విధానం దేన్ని బయల్పరుస్తుంది?

• బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ మనం ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకోవడానికి ఏ కార్యకలాపాల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా ఉండవచ్చు?

• మనం మన ఆధ్యాత్మిక ఆహారపుటలవాట్లను ఎందుకు గమనించుకుంటూ ఉండాలి?

• లేఖనాలను చదవడం, అధ్యయనం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[20, 21వ పేజీలోని చిత్రాలు]

బైబిలును క్రమంగా చదవడం, అధ్యయనం చేయడం ‘సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి’ మనకు సహాయం చేస్తుంది

[23వ పేజీలోని చిత్రాలు]

తీరికలేని మన జీవితాల్లో, ఇతర కార్యకలాపాలను ఆధ్యాత్మిక ప్రయాసలతో సమతూకం చేసుకున్నప్పుడు గొప్ప లాభాలు కల్గుతాయి