కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిత్య సంతోషం పరలోకంలోనా లేక ఈ భూమిపైనా?

నిత్య సంతోషం పరలోకంలోనా లేక ఈ భూమిపైనా?

నిత్య సంతోషం పరలోకంలోనా లేక ఈ భూమిపైనా?

ప్రాథమికంగా మీ సంతోషం మీరెక్కడ నివసిస్తున్నారు అన్నదానిపైనే ఆధారపడివుంటుందా? సంతోషం అనేది మంచి ఆరోగ్యం, జీవితానికొక సంకల్పం, ఇతరులతో మంచి సంబంధాలు వంటి విషయాలపై ఆధారపడివుంటుందని చాలా మంది నిస్సంకోచంగా అంగీకరిస్తారు. దానిని గూర్చి ఒక బైబిలు సామెత ఇలా తెలియజేస్తుంది: “పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.”​—⁠సామెతలు 15:⁠17.

విచారకరంగా మన ఈ భూమికి ద్వేషం, దౌర్జన్యం, దుష్టత్వాలతో కూడిన చరిత్ర చాలా ఉంది. అయితే, చాలామంది తాము మరణించిన తర్వాత వెళ్తామని నిరీక్షించే ఆత్మ సామ్రాజ్యం అంటే, పరలోకం విషయమేమిటి? సర్వసాధారణంగా అందరూ అనుకుంటున్నట్లుగా అది ఎల్లప్పుడూ శాంతి సామరస్యాలు ఉన్న స్థలమేనా, ఏ రకమైన కలతలూ లేకుండా ఉన్న స్థలమేనా?

దేవుడు, దూతలు అని పిలువబడే లక్షలాదిమంది ఆత్మ ప్రాణులతో పరలోకంలో నివసిస్తున్నాడని బైబిలు బోధిస్తుంది. (మత్తయి 18:10; ప్రకటన 5:​11) వీళ్ళు “ఉదయనక్షత్రములు [“దేవుని కుమారులు,” అథఃస్సూచి]” అని వర్ణించబడ్డారు. (యోబు 38:​4, 7) మానవుల్లానే, దూతలకు కూడా నైతిక స్వేచ్ఛ ఇవ్వబడింది; వాళ్ళు మరమనుషులు కారు. అంటే దానర్థం వాళ్ళు కూడా మంచి చెయ్యాలా చెడు చెయ్యాలా అనేది తాముగా నిర్ణయించుకోగలరు. దూతలు చెడు చెయ్యడాన్ని ఎంపిక చేసుకుంటారా? వేలాది సంవత్సరాల క్రితం పెద్ద సంఖ్యలోని దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారని తెలుసుకోవడం అనేకమందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, అవును ఆయనపై వారు తిరుగుబాటు చేశారు!​—⁠యూదా 6.

పరలోకంలో తిరుగుబాటుదారులు

ఒక దూత తిరుగుబాటు చేయడం వల్ల పరలోక సామ్రాజ్యంలో పాపము మొదట కన్పించింది, ఆ దూత సాతాను (వ్యతిరేకించేవాడు) అని, అపవాది (కొండెములు చెప్పేవాడు) అని తర్వాత పిలువబడ్డాడు. ఒకప్పుడు విధేయుడిగా ఉన్న ఈ దూత తన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించుకుని చెడు చేయడానికి ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు ఇతర ఆత్మ ప్రాణులపై చెడు ప్రభావాన్ని చూపనారంభించాడు, అలా నోవహు జల ప్రళయానికి ముందటి కాలంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా అనేకమంది దూతలు సాతానుతో పాటు కలిశారు.​—⁠ఆదికాండము 6:⁠2; 2 పేతురు 2:⁠4.

ఈ అవిధేయులైన దూతలు వెంటనే పరలోకం నుండి వెళ్ళగొట్టబడలేదు. బదులుగా కొన్ని నిబంధనలతో వారు వేలాదిసంవత్సరాలు పరలోకంలోనే ఉన్నారు, వారి ఉనికి సహించబడింది. * అయితే, ఈ దుష్టుల విషయంలో దేవుని సహనం ముగింపుకు వచ్చినప్పుడు, వాళ్ళు పరలోకం నుండి ‘పడద్రోయబడ్డారు’ చివరికి నాశనం చేయబడడానికే. అప్పుడు పరలోకంలోని ఒక స్వరం ఇలా చెప్పింది: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి!” (ప్రకటన 12:​7-12) నమ్మకమైన ఈ దూతలు ఎంతగానో సంతోషించారన్నది స్పష్టం, ఎట్టకేలకు నీచులైన ఆ దోషులు పరలోకం నుండి పడద్రోయబడ్డారు!

సాధారణంగా అందరికీ తెలియని ఈ వివరాలు ఈ తెలివైన ప్రాణులు దేవుని న్యాయాలనూ నిర్దేశాలనూ ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా నిజమైన శాంతి ఎంతమాత్రమూ ఉండదని స్పష్టం చేస్తున్నాయి. (యెషయా 57:20, 21; యిర్మీయా 14:​19, 20) మరోప్రక్క అందరూ దేవుని నియమాలకు విధేయత చూపిస్తే శాంతి సామరస్యాలు ఉంటాయి. (కీర్తన 119:165; యెషయా 48:​17, 18) అయితే, ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే ఈ భూమి అంతా నిజమైన ఆహ్లాదంతోనూ, సంతోషకరమైన స్థలముగానూ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది అని బైబిలు సమాధానమిస్తుంది!

కానీ తమ స్వార్థం కోసం దుష్టమార్గాలను అవలంబించేవారి విషయమేమిటి? నిజంగా దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నవారి శాంతికి వీరు నిరంతరం భంగం కలుగజేస్తూనే ఉంటారా? లేదు, దేవుడు పరలోకంలోని దుష్ట దూతలతో వ్యవహరించినట్లుగానే భూమిపై ఉన్న దుష్టులైన మనుష్యులతో కూడా వ్యవహరిస్తాడు.

పరిశుభ్రపర్చబడిన పుడమి

“ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము” అని దేవుడు చెప్పాడు. (యెషయా 66:⁠1) అత్యంత పరిశుద్ధుడైనందున తన “పాద పీఠము” నిరంతరం దుష్టత్వంతో మలినమౌతూ ఉండేందుకు దేవుడు అనుమతించడు. (యెషయా 6:1-3; ప్రకటన 4:⁠8) పరలోకంలోని దుష్టాత్మలను తొలగించినట్లుగానే ఈ క్రింద ఇవ్వబడిన బైబిలులోని వచనాలు చూపిస్తున్నట్లుగా దుష్ట ప్రజలనందరినీ ఆయన తొలగిస్తాడు:

“కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.”​—⁠కీర్తన 37:⁠9.

“యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”​—⁠సామెతలు 2:21, 22.

“ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరియందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు.”​—⁠2 థెస్సలొనీకయులు 1:6-10.

“[దుష్ట మానవజాతితో కూడిన] లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:⁠17.

ఈ భూమి శాంతియుతంగా ఉంటుందా?

దుష్టుల విషయంలో దేవుని సహనానికి హద్దులున్నాయని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ, ఒకసారి తొలగించబడిన దుష్టత్వం మళ్ళీ తలెత్తదని మనమెలా నమ్మగలం? నోవహు దినాల తర్వాత అది మళ్ళీ ఎంతో విస్తృతంగా తలెత్తలేదా? అప్పుడు దేవుడు మానవజాతి దుష్ట పథకాల్ని చెడగొట్టడానికి వారి భాషనే తారుమారు చేయాల్సివచ్చింది కదా!​—⁠ఆదికాండము 11:​1-8.

దుష్టత్వం ఇకపై మళ్ళీ తలెత్తదు అని నమ్మేందుకు ఒక కారణం ఏమిటంటే, నోవహు జలప్రళయం అనంతరం జరిగినట్లుగా భూమి ఇకపై మానవులచే పరిపాలించబడక పోవడమే. బదులుగా, అది దేవుని రాజ్యంచే పరిపాలించబడుతుంది. పరలోకం నుండి పరిపాలించే ఈ రాజ్యము భూమిపై ఉండే ఒకే ఒక్క ప్రభుత్వమై ఉంటుంది. (దానియేలు 2:44; 7:​13, 14) దుష్టత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రయత్నించే ఎవరిపైనైనా అది అప్పటికప్పుడు చర్య తీసుకుంటుంది. (యెషయా 65:​20) అసలు దుష్టత్వానికే కారకుడైన అపవాదియైన సాతానును, అతనితో ఉన్న దయ్యాలైన దుష్టాత్మలను చివరికి అది నాశనం చేస్తుంది.​—⁠రోమీయులు 16:⁠20.

అంతేగాక ఆహారం, వస్త్రాలు, వసతి, ఉద్యోగం వంటివి లేవన్న చింతలు ఏమాత్రమూ ఉండవు, నేర జీవితానికి దారితీసేవి ఈ సమస్యలే కదా! అవును, ఈ భూమి అంతా సస్యశ్యామలమైన పరదైసుగా మారిపోతుంది, అందరికీ సమస్తమూ సమృద్ధిగా లభిస్తాయి.​—⁠యెషయా 65:21-23; లూకా 23:⁠43.

మరి ప్రాముఖ్యంగా, ఆ రాజ్యం తన ప్రజలకు శాంతియుతమైన జీవితాల్ని కొనసాగించడం ఎలాగో నేర్పిస్తుంది, అదే సమయంలో మానవ పరిపూర్ణత అత్యున్నత స్థాయికి చేరుకునేలా తోడ్పడుతుంది. (యోహాను 17:3; రోమీయులు 8:​20, 21) అటుతర్వాత మానవులు బలహీనతలతోనూ పాపపు ప్రవృత్తులతోనూ ఎంతమాత్రమూ పోరాడవలసిన అవసరం ఉండదు. పరిపూర్ణ మానవుడైన యేసు విషయంలో సాధ్యమైనట్లుగానే, దేవునిపట్ల పరిపూర్ణ విధేయతను ఇష్టపూర్వకంగా చూపించడం వారికి కూడా సాధ్యమౌతుంది. (యెషయా 11:⁠3, 4) వాస్తవానికి, యేసు గొప్ప శ్రమల్లోనూ హింసల్లోనూ కూడా దేవుని పక్షాన నమ్మకంగా నిలిచాడు, అటువంటి శ్రమలూ హింసలూ పరదైసులో ఎంతమాత్రమూ ఉండవు.​—⁠హెబ్రీయులు 7:26.

చాలామంది ఎందుకు పరలోకానికి వెళ్తారు

అయితే, చాలామంది బైబిలు పాఠకులకు యేసు పలికిన ఈ మాటలు తెలిసేవుండవచ్చు: “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. . . . మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.” (యోహాను 14:​2, 3) ఇది పరదైసు భూమిపై నిరంతర జీవితం అన్న తలంపుకి పూర్తి విరుద్ధంగా లేదా?

ఈ బోధలు పరస్పర విరుద్ధమైనవి కావు. వాస్తవానికి ఇవి ఒకదానికొకటి మద్దతునిస్తున్నాయి. మొదటిగా, ఒక పరిమిత సంఖ్యలో మాత్రమే, అంటే నమ్మకమైన క్రైస్తవులుగా ఉన్న 1,44,000 మంది మాత్రమే ఆత్మప్రాణులుగా పరలోకంలో జీవించేందుకు లేపబడతారు అని బైబిలు చెప్తుంది. ఎందుకు వాళ్ళకింత అద్భుతమైన ప్రతిఫలం ఇవ్వబడింది? ఎందుకంటే, యోహాను దర్శనంలో చూసినట్లు వారు “బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము” చేసేందుకు ఒక సమూహంగా ఏర్పడ్డారు. (ప్రకటన 14:1, 3; 20:​4-6) భూమిపై ఉన్న లక్షలాదిమందితో పోల్చి చూస్తే 1,44,000 మంది నిజంగానే ఒక ‘చిన్న మంద.’ (లూకా 12:​32) అంతేగాక, మానవజాతికి ఎంతో సర్వసాధారణమై ఉన్న సమస్యల్ని తాముగా అనుభవించడం వల్ల, మానవజాతినీ భూమినీ పునరుద్ధరిస్తుండగా యేసులా వారు కూడా “మన బలహీనతలయందు మనతో సహానుభవము”ను ప్రదర్శిస్తారు.​—⁠హెబ్రీయులు 4:⁠15.

మానవజాతి యొక్క శాశ్వత గృహం​—⁠భూమి

దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా ఏర్పాటు చేసిన తర్వాత, దేవుడు 1,44,000 మందిని సమకూర్చడం ప్రారంభించాడు, ఈ గుంపు ఇప్పుడు సంపూర్ణంగా ఉందన్న సూచనలు ఉన్నాయి. (అపొస్తలుల కార్యములు 2:1-4; గలతీయులు 4:​4-7) అయితే, యేసు బలి అర్పణ కేవలం ఆ 1,44,000 మంది పాపాల కోసం మాత్రమే కాదు గానీ, ఆయన “సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” (1 యోహాను 2:⁠2) అందుకే యేసుపై విశ్వాసముంచే వాళ్ళందరికి నిత్యజీవ నిరీక్షణ ఉంటుంది. (యోహాను 3:​16) సమాధిలో ఉండి దేవుని స్మృతిలో ఉన్నవారు పునరుత్థానం చేయబడతారు, అది పరలోకానికి కాదు గానీ, శుభ్రపర్చబడిన ఈ భూమిమీదకే. (ప్రసంగి 9:5; యోహాను 11:11-13, 25; అపొస్తలుల కార్యములు 24:​14,15) వాళ్ళకేమి వేచివుంది?

“ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, . . . ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను]” అని ప్రకటన 21:1-4 సమాధానమిస్తుంది. (ఇటాలిక్కులు మావి.) ఒక్కసారి ఊహించండి​—⁠మానవులు మరణాన్నుండి విడిపించబడతారు, వేదనకు, ఏడ్పుకు కారణమయ్యే ప్రతీది ఇక తీసివేయబడుతుంది! చివరికి ఈ భూమి పట్ల దేవుని అసలు సంకల్పం నెరవేరుతుంది. అలాగే మానవజాతి పట్ల కూడా దేవుని సంకల్పం మహిమాన్వితంగా నెరవేరుతుంది.​—⁠ఆదికాండము 1:27, 28.

జీవం లేదా మరణం​—⁠మనదే ఎంపిక

పరలోకానికి వెళ్ళాలనే ఎంపిక ఆదాము హవ్వల ముందు ఎన్నడూ ఉంచబడలేదు. దేవునికి విధేయత చూపించి ఈ పరదైసు భూమిపై నిరంతరం జీవించడమో లేక దేవునికి అవిధేయత చూపించి మరణించడమో అన్నదే వారి ముందుంచబడిన ఎంపిక. విచారకరంగా వాళ్ళు అవిధేయత చూపించారు అందుకనే తిరిగి “మన్నై” పోయారు. (ఆదికాండము 2:16, 17; 3:​2-5, 19) మానవజాతి అంతా మరణించాలనీ, సమాధి నుండి మానవులను తీసి పరలోకాన్ని నింపాలనీ దేవుడు ఎన్నడూ ఉద్దేశించలేదు. పరలోకంలో జీవించడానికి గాను దేవుడు వేలాదిమంది దూతలను సృష్టించాడు; ఈ ఆత్మప్రాణులు చనిపోయి పునరుత్థానం చేయబడిన మానవులు కారు.​—⁠కీర్తన 104:1, 4; దానియేలు 7:⁠10.

ఈ పరదైసు భూమిపై నిరంతరం జీవించాలనే ఆశీర్వాదాన్ని పొందాలంటే మనమేమి చేయాలి? మొట్టమొదటి చర్యగా దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని యేసు ప్రార్థనలో అన్నాడు.​—⁠యోహాను 17:⁠3.

ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం పరదైసులో నిరంతర ఆనందాన్ని పొందేందుకైన మరొక చర్య. (యాకోబు 1:​22-24) ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవించాలనుకుంటున్నారో వారికి యెషయా 11:9 నెరవేర్పును కళ్ళారా చూసే ఆధిక్యత ఉంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”

[అధస్సూచి]

^ పేరా 7 పరలోకంలోనూ భూమిపైనా దేవుడు కీడును ఎందుకు సహించాడు అనే విషయాన్ని గురించిన చర్చ కోసం వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ వారు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో 70-9 పేజీలు చూడండి.

[7వ పేజీలోని చిత్రాలు]

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”​—⁠కీర్తన 37:⁠29.