కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక అదృశ్య దేవునికి మీరు దగ్గరవగలరా?

ఒక అదృశ్య దేవునికి మీరు దగ్గరవగలరా?

ఒక అదృశ్య దేవునికి మీరు దగ్గరవగలరా?

‘కంటికి కనిపించని ఒక వ్యక్తితో మంచి అనుబంధాన్ని నేను ఎలా పెంచుకోగలను?’ అని మీరు అడగవచ్చు. అది యుక్తమైన ప్రశ్నగానే అనిపిస్తుండవచ్చు. కానీ దీనిని గమనించండి:

శాశ్వతమైన, ప్రేమపూర్వకమైన అనుబంధాలను పెంచుకోవడానికి కంటిచూపు ఎంత ప్రాముఖ్యమైనది? కంటికి కనపడని కారకాలు అనుబంధాలను పెంచలేవా, ఆ కారకాలు చూపుకంటే ఎక్కువ కాకపోయినా, దానికి సమానమైన ప్రాముఖ్యతను కలిగిలేవా? కలిగివున్నాయి! అందుకే కొందరు క్రమమైన ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా ఇతరులతో మంచి అనుబంధాన్ని పెంచుకోగలిగారు​—⁠నిజాయితీతో కూడిన వారి ఉత్తరాలు వారి ఇష్టాయిష్టాలను, జీవిత లక్ష్యాలను, మార్గదర్శక సూత్రాలను, హాస్యాన్ని, వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలను లేక అభిరుచులను చేరవేశాయి.

గ్రుడ్డివాళ్ళు కూడా, తాము మరొక వ్యక్తితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడానికి కంటిచూపు కీలకమైనదేమీ కాదని నిరూపించారు. ఉదాహరణకు, ఎడ్వర్డ్‌, గ్వెన్‌ అనే ఒక అంధ దంపతుల విషయాన్ని గమనించండి. * ఎడ్వర్డ్‌కు, తన ఈడుగల గ్వెన్‌ తోటి విద్యార్థినిగా ఒక అంధుల పాఠశాలలో పరిచయమైంది. ఆయన గ్వెన్‌ లక్షణాలకు, ప్రత్యేకంగా ఆమె మాటల్లోనూ, ప్రవర్తనలోనూ చూపించిన నిజాయితీకి, పనిపట్ల ఆమె చూపించే చక్కని వైఖరికి ముగ్ధుడయ్యాడు. గ్వెన్‌ కూడా ఎడ్వర్డ్‌ పట్ల ఆకర్షితురాలైంది. దానికి గల కారణాన్ని ఆమె తన మాటల్లో ఇలా చెబుతుంది: “నా పెంపకంలో ప్రాముఖ్యమైనవని నాకు నేర్పించిన లక్షణాలన్నింటినీ ఆయన ప్రదర్శించాడు.” అలా వారి పరిచయం ప్రణయానికి దారి తీసి, మూడు సంవత్సరాల తరువాత పెళ్ళిగా పరిణమించింది.

“ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు,” ఎడ్వర్డ్‌ చెబుతున్నాడు, “అవతలి వ్యక్తితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడానికి గ్రుడ్డితనం ఎంత మాత్రం అడ్డం కాదు. మీరు ఒకర్నొకరు చూడలేకపోవచ్చు, కానీ, భావోద్వేగాలు గ్రుడ్డివి కావు.” 57 సంవత్సరాల తరువాత, వారికి ఒకరిపై మరొకరికి ఉన్న ఆ ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. వారి అపురూపమైన అనుబంధానికి గల రహస్యంలో కనీసం నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయంటున్నారు: (1) ఎదుటి వ్యక్తి లక్షణాలను గమనించడం, (2) వాటి గురించి ఆలోచించి ఆ లక్షణాలకు దగ్గరవ్వడం, (3) పరస్పరం భావాలను వ్యక్తం చేసుకోవడంలో కొనసాగడం, (4) కలిసి పనులు చేసుకోవడం.

ఈ నాలుగు విషయాలు, ఎటువంటి అనుబంధానికైనా ప్రాముఖ్యమైనవే. స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, లేక మానవులకు దేవునికి మధ్య ఉండే ఎంతో ముఖ్యమైన అనుబంధానికి కూడా వర్తించవచ్చు. దీని తరువాతి భాగంలో, దేవుడ్ని చూడలేనప్పటికినీ ఆయనతో మంచి అనుబంధాన్ని పెంచుకోవడానికి, వీటిని పాటించడం ద్వారా మనం ఎలా సహాయం పొందగలమో చూద్దాం. *

[అధస్సూచీలు]

^ పేరా 4 పేర్లు మార్చబడ్డాయి.

^ పేరా 6 దేవునితో అనుబంధం, మానవుల మధ్య ఉండే అనుబంధంలా కాకుండా, దేవుడున్నాడు అనే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. (హెబ్రీయులు 11:⁠6) దేవుని మీద దృఢమైన విశ్వాసాన్ని పెంచుకోవడాన్ని గురించిన సమగ్రమైన చర్చ కోసం, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన ఈజ్‌ దేర్‌ ఎ క్రియేటర్‌ హు కేర్స్‌ ఎబౌట్‌ యు? చూడండి.