నైతిక పరిశుభ్రత విషయంలో దైవిక దృక్కోణం
నైతిక పరిశుభ్రత విషయంలో దైవిక దృక్కోణం
“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.
1, 2. (ఎ) ప్రజలు సాధారణంగా లైంగిక సంబంధాల విషయంలో నైతికతను ఎలా దృష్టిస్తారు? (బి) దాని గురించి క్రైస్తవులకు ఎలాంటి దృక్కోణం ఉంది?
నేడు భూమి మీది చాలా ప్రాంతాల్లో నైతిక ప్రవర్తన వ్యక్తిగత విషయంగా పరిగణించబడుతుంది. ప్రజలు, లైంగిక సంబంధాలను కేవలం వివాహానికే పరిమితమై ఉండవలసినవిగా పరిగణించే బదులు, తమకు ఇష్టమైనప్పుడల్లా తమ ప్రేమను వ్యక్తపర్చడానికి అలాంటి సంబంధాలను పెట్టుకోవడం సహజమేనన్నట్లు భావిస్తున్నారు. ఎవరికీ హాని జరగనంతవరకు, ఎలా ప్రవర్తించాలో ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని వాళ్లు అనుకుంటారు. నైతికత విషయంలో, ప్రాముఖ్యంగా లైంగిక సంబంధాల విషయంలో ఇతరులకు తీర్పు తీర్చడం సబబు కాదని వాళ్ల ఉద్దేశం.
2 అయితే యెహోవాను తెలుసుకున్నవాళ్ళ దృక్కోణం మాత్రం వేరుగా ఉంటుంది. వాళ్లు బైబిలు సూత్రాలను ఆనందంగా అనుసరిస్తారు, ఎందుకంటే వాళ్లు యెహోవాను ప్రేమిస్తున్నారు, ఆయనకు సంతోషం కల్గించే విధంగా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. అంతేగాక యెహోవా తమను ప్రేమిస్తున్నాడనీ, తమ శ్రేయస్సుకు దోహదపడే అంటే తమకు నిజంగా ప్రయోజనం చేకూర్చి తమ సంతోషానికి దోహదపడే నడిపింపును ఆయన ఇస్తాడనీ వాళ్లు గ్రహిస్తారు. (యెషయా 48:17) జీవానికి మూలం దేవుడు గనుక, వాళ్లు తమ శరీరాలను ఎలా ఉపయోగించుకుంటారనే విషయంలో, ప్రాముఖ్యంగా మరో ప్రాణికి జీవం పోయడంతో ముడిపడివున్న ఈ విషయంలో వాళ్లు ఆయన నడిపింపు కోసం చూడడం సహేతుకం.
ప్రేమగల సృష్టికర్త నుండి ఒక బహుమానం
3. లైంగిక సంబంధాల గురించి క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకులకు ఏమి బోధించబడింది, దానికీ బైబిలు బోధిస్తున్నదానికీ ఉన్న తేడా ఏమిటి?
3 నేటి లౌకిక ప్రపంచంలోనివారి దృక్కోణానికి భిన్నంగా క్రైస్తవమత సామ్రాజ్యంలోని కొందరు, లైంగిక సంబంధం సిగ్గుకరమైనదనీ, అదొక పాపమనీ, ఏదెను తోటలో జరిగిన “మొదటి పాపం” ఆదికాండము 2:25) “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం[చుడని]” చెప్తూ పిల్లలను కనమని దేవుడు వారికి చెప్పాడు. (ఆదికాండము 1:28) దేవుడు పిల్లలను కనమని ఆదాము హవ్వలకు చెప్పి, ఆ తర్వాత వాళ్లు ఇవ్వబడిన సూచనలను అనుసరించినందుకు వారిని శిక్షించడం ఎంతమాత్రం న్యాయమైనదిగా ఉండదు.—కీర్తన 19:8.
ఆదామును హవ్వ లోబరచుకోవడమేననీ బోధించింది. అయితే, అలాంటి దృక్కోణం ప్రేరేపిత లేఖనాలు చెప్తున్న దానికి పూర్తి విరుద్ధం. బైబిలు వృత్తాంతం మొదటి మానవ జంటను “ఆదామును అతని భార్యయు” అని పిలుస్తుంది. (4. దేవుడు మానవులకు లైంగిక శక్తులను ఎందుకిచ్చాడు?
4 మన మొదటి తల్లిదండ్రులకు ఇవ్వబడి, ఆ తర్వాత నోవహుకు ఆయన కుమారులకు పునరుక్తి చేయబడిన ఆ ఆజ్ఞలో, లైంగిక సంబంధాల ముఖ్యోద్దేశాన్ని మనం గమనించవచ్చు, అదే: సంతానోత్పత్తి. (ఆదికాండము 9:1) అయితే, వివాహితులైన ఆయన సేవకులు లైంగిక సంబంధాలను కేవలం పిల్లలను కనడానికే పరిమితం చేసుకోవలసిన అవసరం లేదని దేవుని వాక్యం చూపిస్తుంది. అలాంటి సంబంధాలు వివాహిత జంటల భావోద్వేగ, శారీరక అవసరాలను తీర్చి వారికి సుఖానుభూతిని ఇవ్వగలవు. వారు పరస్పరం ప్రగాఢమైన అనురాగాన్ని ప్రదర్శించుకోవడానికి అదొక మార్గం.—ఆదికాండము 26:8, 9; సామెతలు 5:18, 19; 1 కొరింథీయులు 7:3-5.
దైవిక నిర్బంధాలు
5. లైంగిక కార్యకలాపాల విషయంలో దేవుడు ఏ నిషేధాలను విధించాడు?
5 లైంగికత దేవుడనుగ్రహించిన బహుమానం గనుక, విచ్చలవిడిగా దానిలో పాల్గొనడం కూడా సబబు కాదు. ఈ సూత్రం వివాహ ఏర్పాటులో ఉన్నప్పుడు కూడా అన్వయించుకోవలసి ఉంటుంది. (ఎఫెసీయులు 5:28-30; 1 పేతురు 3:1, 7) భార్యాభర్తలు కాని వారి మధ్య లైంగిక సంబంధాలు నిషేధం. ఈ విషయంలో బైబిలు చాలా నిర్దిష్టంగా మాట్లాడుతుంది. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో, “వ్యభిచరింపకూడదు” అని చెప్పబడింది. (నిర్గమకాండము 20:14) అంతేగాక, హృదయంలో ఉద్భవించి, ఒక వ్యక్తిని కలుషితపర్చగల “దురాలోచనల”లో, “వ్యభిచారము” “జారత్వము” భాగమై ఉన్నాయని యేసు పేర్కొన్నాడు. (మార్కు 7:21, 22) అపొస్తలుడైన పౌలు, ‘వ్యభిచారమునకు దూరముగా పారిపోవుడి’ అని కొరింథులోని క్రైస్తవులను హెచ్చరించేందుకు ప్రేరేపించబడ్డాడు. (1 కొరింథీయులు 6:18) హెబ్రీయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు ఇలా వ్రాశాడు: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.”—హెబ్రీయులు 13:4.
6. బైబిలులో, “జారత్వం” అనే పదం క్రిందికి ఏమేమి వస్తాయి?
6 “జారత్వం” అనే పదానికి అర్థమేమిటి? అది పోర్నియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది, కొన్నిసార్లు అది అవివాహితుల మధ్య ఉండే లైంగిక సంబంధాల గురించి చెప్పటానికి ఉపయోగించబడుతుంది. (1 కొరింథీయులు 6:9) న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌లో మత్తయి 5:32 మరియు మత్తయి 19:9 వంటి చోట్లవున్న జారత్వమనే ఆ పదం విస్తృత అర్థాన్ని కల్గివుండి అదనంగా వ్యభిచారాన్ని, వావివరసలు తప్పి లైంగిక సంబంధాలు పెట్టుకోవడాన్ని, మృగసంయోగాన్ని సూచిస్తుంది. వివాహితులు కాని వ్యక్తుల మధ్య ఉండే మరితర రకాలైన లైంగిక సంబంధాలను కూడా పోర్నియా క్రిందికి చేర్చవచ్చు; ఆ రకాల్లో, నోటి ద్వారా లైంగిక క్రియను జరపడం, పాయువు ద్వారా సంభోగం చేయడం, లైంగిక కోరికలతో అవతలి వ్యక్తి మర్మాంగాలను ముట్టుకోవడం వంటివి ఉన్నాయి. అలాంటివన్నీ దేవుని వాక్యంలో పరోక్షంగాగానీ, ప్రత్యక్షంగాగానీ ఖండించబడ్డాయి.—లేవీయకాండము 20:10, 13, 15, 16; రోమీయులు 1:24, 26, 27, 32. *
దేవుని నైతికసూత్రాల నుండి ప్రయోజనం పొందడం
7. నైతికంగా పరిశుభ్రంగా ఉండడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాము?
7 లైంగిక ప్రవర్తన విషయంలో యెహోవా ఇచ్చిన నిర్దేశానికి విధేయులై ఉండడం అపరిపూర్ణ మానవులకు ఒక సవాలై ఉండగలదు. పన్నెండవ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాతి గాంచిన యూదామత తత్వవేత్త అయిన మైమోనిడస్ ఇలా వ్రాశాడు: “తోరాహ్ [మోషే ధర్మశాస్త్రం]లోని మరే కట్టడలను అనుసరించడం కన్నా, దానిలో నిషేధించబడిన లైంగిక మరియు అక్రమ సంబంధాలను గురించిన కట్టడలను అనుసరించడమే చాలా కష్టం.” అయినప్పటికీ మనం దేవుని నిర్దేశాన్ని అనుసరిస్తే, ఎంతగానో ప్రయోజనం పొందుతాము. (యెషయా 48:18) ఉదాహరణకు, ఈ విషయంలో విధేయత చూపించడం మనల్ని లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి కాపాడుతుంది. ఇలాంటి వ్యాధుల్లో కొన్నింటికి అసలు చికిత్సే లేదు, అంతేగాక అవి ప్రాణాంతకం కూడా కాగలవు. * పెళ్లి కాకుండానే గర్భం దాల్చడమనే విపత్తు నుండి కూడా మనం కాపాడబడతాము. దైవిక బుద్ధిని అన్వయించుకోవడం మంచి మనస్సాక్షి కల్గివుండడానికి కూడా దోహదపడుతుంది. అలా చేయడం ఆత్మ గౌరవాన్ని పెంచడమే గాక, మనపట్ల ఇతరులకున్న గౌరవాన్ని అధికం చేస్తుంది, ఇక్కడ ఇతరులంటే మన బంధువులు, భార్య లేక భర్త, మన పిల్లలు, మన క్రైస్తవ సహోదర సహోదరీలు కావచ్చు. అలాగే అది, వివాహబంధంలో ఆనందానికి దోహదపడే లైంగిక సంబంధాలపట్ల ఆరోగ్యదాయకమైన, అనుకూలమైన దృక్కోణాన్ని పెంపొందింపజేస్తుంది. ఒక క్రైస్తవ స్త్రీ ఇలా వ్రాసింది: “దేవుని వాక్య సత్యం మంచి కాపుదలనిస్తుంది. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు వివాహమైనప్పుడు, నేను పవిత్రంగా ఉన్నానని ఆ క్రైస్తవ పురుషునికి చెప్పడానికి నేనెంతో గర్విస్తాను.”
8. మన మంచి ప్రవర్తన స్వచ్ఛారాధనను ఏ యే విధాలుగా పెంపొందింపజేస్తుంది?
8 మనం మంచి ప్రవర్తన కల్గివుండడం ద్వారా, సత్యారాధన గురించి ఉన్న దురభిప్రాయాలను రూపుమాపి, మనం ఆరాధించే దేవుని వైపుకు ప్రజలను ఆకర్షించగల్గుతాము. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (1 పేతురు 2:12) యెహోవాను ఆరాధించని వారు మన మంచి ప్రవర్తనను గుర్తించకపోయినా లేక ఆమోదించకపోయినా, మన పరలోక తండ్రి ఇచ్చే నడిపింపును అనుసరించడానికి మనం చేస్తున్న కృషిని ఆయన గమనిస్తాడనీ, ఆమోదిస్తాడనీ, అంతేగాక ఎంతో ఆనందిస్తాడనీ కూడా మనం దృఢనిశ్చయత కల్గివుండవచ్చు.—సామెతలు 27:11; హెబ్రీయులు 4:13.
9. దేవుడు ఫలాని విధంగా నడిపింపునివ్వడానికి గల కారణాలను మనం పూర్తిగా గ్రహించలేకపోయినప్పటికీ వాటియందు మనమెందుకు నమ్మకం కల్గివుండాలి? ఉదాహరించండి.
9 మనల్ని ఫలానా మార్గంలో నడవమని ఆయన నిర్దేశించడానికి గల కారణాలను మనం పూర్తిగా గ్రహించలేకపోయినప్పటికీ, మనకేది మంచిదో దేవుడికి తెలుసన్న నమ్మకం కల్గివుండడం కూడా దేవునియందు విశ్వాసం ఉంచడంలో ఒక భాగమే. మోషే ధర్మశాస్త్రం నుండి ఒక ఉదాహరణను పరిశీలించండి. సైనిక శిబిరాలకు సంబంధించిన ఒక కట్టడ ప్రకారం, మలమును శిబిరం వెలుపల కప్పిపెట్టాలి. (ద్వితీయోపదేశకాండము 23:13, 14) అలాంటి నిర్దేశం ఎందుకివ్వబడిందా అని ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపోయి ఉండవచ్చు; అది అనవసరమని కొందరు తలంచివుండవచ్చు. అయితే, ఈ కట్టడ నీటి మూలాలు కలుషితమవ్వకుండా కాపాడి, క్రిముల ద్వారా సోకే అనేక జబ్బుల నుండి రక్షణనివ్వడానికి సహాయం చేసిందని వైద్య శాస్త్రం ఇప్పుడు గుర్తించింది. అలాగే, దేవుడు లైంగిక సంబంధాలను వివాహ పాన్పుకే పరిమితం చేయడానికి ఆధ్యాత్మిక, సామాజిక, భావోద్వేగ, శారీరక, మానసిక కారణాలు ఉన్నాయి. నైతిక పరిశుభ్రతను కాపాడుకున్న వారిని గూర్చిన కొన్ని బైబిలు ఉదాహరణలను మనమిప్పుడు పరిశీలిద్దాము.
యోసేపు—తన నైతిక ప్రవర్తనను బట్టి ఆశీర్వదించబడ్డాడు
10. యోసేపును ఎవరు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు, ఆయనెలా సమాధానమిచ్చాడు?
10 యాకోబు కుమారుడైన యోసేపును గురించిన బైబిలు ఉదాహరణ బహుశ మీకు తెలిసేవుండవచ్చు. ఆయన 17 ఏళ్ల వయస్సులో ఐగుప్తు ఫరో యొక్క రాజసంరక్షక సేనాధిపతియైన పోతీఫరు దగ్గర దాసునిగా ఉన్నాడు. యెహోవా యోసేపును ఆశీర్వదించాడు, దానితో కొంతకాలానికి ఆయన పోతీఫరు ఇంటి అంతటిపైన అధికారిగా నియమించబడ్డాడు. యోసేపు 20వ పడికి చేరుకునే సరికి, “రూపవంతుడును సుందరుడునై యుండెను.” పోతీఫరు భార్య కన్ను ఆయనమీద పడింది, ఆమె ఆయనను వశపరచుకోవడానికి ప్రయత్నించింది. తాను దానికి సమ్మతించడం తన యజమానికి నమ్మకద్రోహం చేయడమేగాక “దేవునికి విరోధముగా పాపము” చేసినట్లు అవుతుందని వివరిస్తూ ఆయన తన ఆదికాండము 39:1-9.
స్థానాన్ని స్పష్టం చేశాడు. యోసేపు ఎందుకలా తర్కించాడు?—11, 12. వ్యభిచారాన్ని, జారత్వాన్ని నిషేధిస్తూ దేవుడిచ్చిన లిఖిత ధర్మశాస్త్రం అప్పటికింకా లేకపోయినప్పటికీ యోసేపు ఎందుకలా తర్కించుకుని ఉండవచ్చు?
11 మనుష్యులకు దొరికిపోతానేమోననే భయంతో యోసేపు ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టమౌతుంది. యోసేపు కుటుంబం ఎక్కడో చాలా దూరంలో నివసిస్తుంది, ఆయన తండ్రియైతే యోసేపు మరణించాడనే అనుకుంటున్నాడు. కాబట్టి యోసేపు ఒకవేళ లైంగిక దుర్నీతికి పాల్పడినా, ఆ విషయం ఆయన కుటుంబానికి తెలిసే అవకాశమేలేదు. అంతేగాక అలాంటి పాపం పోతీఫరుకు, అతని సేవకులకు కూడా తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్లు కొన్నిసార్లు ఇంట్లో ఉండని సమయాలు కూడా ఉండేవి. (ఆదికాండము 39:11) అయినప్పటికీ, అలాంటి ప్రవర్తన దేవుని నుండి మరుగై ఉండదని యోసేపుకు తెలుసు.
12 యెహోవా గురించి తనకు తెలిసిన దాన్ని బట్టి యోసేపు తర్కించుకుని ఉంటాడు. యెహోవా ఏదెను తోటలో, “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని ప్రకటించాడన్నది ఆయనకు తెలుసనడంలో సందేహం లేదు. (ఆదికాండము 2:24) అంతేగాక, యోసేపు ముత్తవ్వ అయిన శారాను వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫిలిష్తీయుల రాజుతో యెహోవా ఏమన్నాడో యోసేపుకు తెలిసే ఉండవచ్చు. యెహోవా ఆ రాజుతో ఇలా అన్నాడు: “నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా . . . మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.” (ఇటాలిక్కులు మావి.) (ఆదికాండము 20:3, 6) కాబట్టి యెహోవా అప్పటికింకా లిఖిత ధర్మశాస్త్రాన్ని ఇవ్వకపోయినప్పటికీ, వివాహాన్ని గురించిన ఆయన భావాలు మాత్రం అప్పటికే స్పష్టం చేయబడ్డాయి. నైతిక విషయాలపట్ల యోసేపుకున్న జ్ఞానమూ, యెహోవాను ప్రీతిపర్చాలన్న ఆయన కోరికా, ఆయన లైంగిక దుర్నీతికి పాల్పడడాన్ని నిరాకరించేలా చేశాయి.
13. యోసేపు పోతీఫరు భార్యను ఎందుకు బహుశ తప్పించుకుని తిరగలేకపోయాడు?
13 అయితే పోతీఫరు భార్య పట్టు విడువక, తనతో శయనించమని “దినదినము” ఆయనను వేడుకుంటూ ఉంది. యోసేపు ఆమెను ఎందుకు తప్పించుకుని తిరగలేక పోయాడు? ఒక దాసుడిగా చేయవలసిన పనులు ఆయనకుంటాయి గనుక ఆయన తన పరిస్థితిని మార్చుకోలేకపోయాడు. గిడ్డంగులలోకి వెళ్లాలంటే ఇంటిలోని ప్రధాన భాగం గుండా వెళ్లవలసి ఉండేదని, ఐగుప్తులోని ఇళ్ల నిర్మాణమే అలా ఉండేదని పురావస్తు శాస్త్ర సాక్ష్యాధారాలు సూచిస్తున్నాయి. అందుకే పోతీఫరు భార్యను తప్పించుకుని తిరగడం యోసేపుకు బహుశ అసాధ్యమై ఉండవచ్చు.—ఆదికాండము 39:10.
14. (ఎ) పోతీఫరు భార్య దగ్గరనుండి పారిపోయిన తర్వాత యోసేపుకు ఏమి సంభవించింది? (బి) యోసేపు నమ్మకత్వాన్ని బట్టి యెహోవా ఆయననెలా ఆశీర్వదించాడు?
14 వాళ్లు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం రానేవచ్చింది. అప్పుడు పోతీఫరు భార్య యోసేపు దగ్గరికి వచ్చి, “తనతో శయనింపుమని” అడిగింది. అప్పుడు ఆయన పారిపోయాడు. ఆయన నిరాకరించడంతో ఆమె అహం దెబ్బతిని, ఆయనే తనపై అత్యాచారం చేయబోయాడని నిందారోపణ చేసింది. దాని పర్యవసానాలేమిటి? యోసేపు తన యథార్థతను కాపాడుకున్నందుకు యెహోవా వెంటనే ఆయనకు ప్రతిఫలం ఇచ్చాడా? లేదు. యోసేపును బంధించి చెరసాలలో వేశారు. (ఆదికాండము 39:12-20; కీర్తన 105:18) యెహోవా జరిగిన అన్యాయాన్ని చూసి, చివరికి యోసేపును చెరసాల నుండి రాజభవనానికి మార్చాడు. ఆ తర్వాత ఆయన ఐగుప్తులో అత్యంత శక్తివంతుడైన రెండవ అధికారియై, భార్యాపిల్లలతో ఆశీర్వదించబడ్డాడు. (ఆదికాండము 41:14, 15, 39-45, 50-52) అంతేగాక, యోసేపు యథార్థతా వృత్తాంతం, నేటి వరకు దేవుని సేవకులు పరిశీలించేందుకు గానూ 3,500 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. దేవుని నీతియుక్తమైన కట్టడలను అంటిపెట్టుకుని ఉన్నందుకు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు! అలాగే, నేడు మనం నైతిక యథార్థతను కాపాడుకోవడం వల్ల వచ్చే ఫలితాలను వెంటనే పొందలేకపోవచ్చు, కానీ యెహోవా తప్పక చూస్తాడనీ, తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడనీ మనం నిశ్చయత కల్గివుండవచ్చు.—2 దినవృత్తాంతములు 16:9.
యోబు ‘తన కన్నులతో చేసుకున్న నిబంధన’
15. యోబు ‘తన కళ్లతో ఏ నిబంధన’ చేసుకున్నాడు?
15 యథార్థతను కాపాడుకున్న మరో వ్యక్తి యోబు. అపవాది ఆయనపైకి తీసుకువచ్చిన శ్రమల సమయంలో, యోబు తన జీవితాన్ని పరిశీలించుకుని, లైంగిక నైతికతకు సంబంధించి యెహోవా ఇచ్చిన సూత్రాలతో సహా తాను వేటినైనా అధిగమించి ఉంటే తాను తీవ్రంగా శిక్షించబడటానికి సుముఖంగా ఉన్నానని ఆయన వెల్లడించాడు. యోబు ఇలా అన్నాడు: “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?” (యోబు 31:1) దీని ద్వారా యోబు చెప్తున్నదేమిటంటే, దేవునిపట్ల తన యథార్థతను కాపాడుకోవాలనే తన నిశ్చయతలో భాగంగా చివరికి ఒక స్త్రీని కోరికతో చూడడాన్ని కూడా నివారించాలని ఆయన దృఢనిశ్చయం చేసుకున్నాడన్నదే. ఆయన తన అనుదిన జీవితంలో స్త్రీలను చూస్తుండవచ్చు, వారికి అవసరమైన సహాయాన్ని కూడా అందజేస్తుండవచ్చు. కానీ వారితో సంబంధం పెట్టుకునే ఉద్దేశంతో వారి వైపు చూడడాన్ని మాత్రం ఆయన సంపూర్ణంగా నివారిస్తాడు. ఆయనకు శ్రమలు ప్రారంభం కాకముందు, ఆయన ఎంతో సంపన్నుడు, “తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.” (యోబు 1:3) అయితే, ఆయన చాలామంది స్త్రీలను ఆకర్షించడానికి తన సంపదలను ఉపయోగించుకోలేదు. యౌవనురాండ్రతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ఆయన ఎంతమాత్రం ప్రయత్నించలేదని స్పష్టమౌతుంది.
16. (ఎ) యోబు వివాహిత క్రైస్తవులకు ఎందుకు ఒక చక్కని మాదిరిగా ఉన్నాడు? (బి) మలాకీ కాలంనాటి పురుషుల ప్రవర్తన యోబు ప్రవర్తన నుండి ఎలా భిన్నంగా ఉంది అయితే నేటి పరిస్థితి ఎలా ఉంది?
16 కాబట్టి యోబు అనుకూల సమయాల్లోనూ, అననుకూల సమయాల్లోనూ తన నైతిక యథార్థతను కాపాడుకున్నాడు. యెహోవా దీన్ని గమనించి ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. (యోబు 1:10; 42:12) వివాహితులైన స్త్రీ పురుషులకు యోబు ఎంత చక్కని మాదిరిగా ఉన్నాడు! అందుకే యెహోవా ఆయనను అంతగా ప్రేమించాడంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు! దానికి భిన్నంగా, నేడున్న అనేకుల ప్రవర్తన మలాకీ కాలంలోని ప్రజల ప్రవర్తనను పోలి ఉంది. యౌవనురాండ్రను వివాహం చేసుకోవడానికి అనేకమంది భర్తలు తరచూ తమ భార్యలను విడనాడడాన్ని గురించి ఆ ప్రవక్త విలపించాడు. అలా వదిలివేయబడిన భార్యల కన్నీళ్లతో యెహోవా బలిపీఠం తడిసిపోయింది, కాబట్టి తమ భార్యలను “అన్యాయముగా విసర్జించిన” వారిని యెహోవా ఖండించాడు.—మలాకీ 2:13-16.
నిష్కళంకురాలైన ఒక యువతి
17. షూలమ్మీతీ “మూయబడిన ఉద్యానము” వలె ఎలా ఉంది?
17 యథార్థతను కాపాడుకున్న మూడవ వ్యక్తి షూలమ్మీతీ. యౌవనస్థురాలూ సౌందర్యవతీ అయిన ఈమె ఒక గొఱ్ఱెలకాపరి అభిమానాన్నే గాక సంపన్నుడైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అభిమానాన్ని కూడా చూరగొన్నది. పరమగీతములో చెప్పబడిన రమణీయమైన కథ అంతటిలోనూ, షూలమ్మీతీ నిష్కళంకంగా ఉండి, తన చుట్టూ ఉన్న వారి గౌరవాన్ని సంపాదించుకుంది. ఆమె సొలొమోనును నిరాకరించినప్పటికీ, ఆమె కథను వ్రాయడానికి ఆయన ప్రేరేపించబడ్డాడు. ఆమె ప్రేమించిన గొఱ్ఱెలకాపరి కూడా ఆమె మంచి ప్రవర్తనను గౌరవించాడు. ఆయన ఒక సందర్భంలో, షూలమ్మీతీ “మూయబడిన ఉద్యానము” లాంటిదని మురిసిపోయాడు. (పరమగీతము 4:12) ప్రాచీన ఇశ్రాయేలులో, అందమైన తోటల్లో రకరకాల కూరగాయలు, పరిమళభరితమైన పువ్వులు, ఠీవిగా నిలిచివుండే చెట్లు ఉండేవి. అలాంటి తోటలకు సాధారణంగా చుట్టూ కంచె లేదా గోడ ఉండేది అంతేగాక, తాళం వేయబడి ఉండే ద్వారం కూడా ఉండేది, ఆ తాళాన్ని తీసినప్పుడు మాత్రమే దానిలోకి ప్రవేశించే అవకాశం ఉండేది. (యెషయా 5:5) ఆ గొఱ్ఱెలకాపరికి షూలమ్మీతీ యొక్క నైతిక స్వచ్ఛత, ఆమె అందచందాలు అలాంటి అరుదైన అందాలుగల తోటలా అనిపించాయి. ఆమె సంపూర్ణంగా నిష్కళంకంగా ఉంది. ఆమె ప్రేమాభిమానాలు ఆమె భవిష్యద్ భర్తకు మాత్రమే లభిస్తాయి.
18. యోసేపు, యోబు, షూలమ్మీతీల వృత్తాంతాలు మనకు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి?
18 నైతిక యథార్థత విషయంలో, షూలమ్మీతీ నేటి క్రైస్తవ స్త్రీలకు అద్భుతమైన మాదిరిని ఉంచింది. యెహోవా షూలమ్మీతీ యొక్క సుగుణాన్ని చూసి మెచ్చుకుని, ఆయన యోసేపు, యోబులను ఆశీర్వదించినట్లుగానే ఆమెను కూడా ఆశీర్వదించాడు. మన నడిపింపు కోసం, వారి యథార్థతా వృత్తాంతం దేవుని వాక్యంలో లిఖించబడి ఉంది. నేడు యథార్థతను కాపాడుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు బైబిలులో లిఖించబడి లేకపోయినప్పటికీ, తన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నవారి కోసం యెహోవా యొద్ద ‘జ్ఞాపకార్థంగా వ్రాయబడే ఒక పుస్తకం’ ఉంది. యెహోవా ‘చెవియొగ్గి ఆలకిస్తున్నాడనీ,’ నైతిక పరిశుభ్రతను కాపాడుకోవడానికి మనం యథార్థంగా చేస్తున్న కృషిని బట్టి ఆయన ఆనందిస్తాడనీ మనం ఎన్నడూ మరిచిపోకుందాము.—19. (ఎ) మనం నైతిక పరిశుభ్రతను ఎలా దృష్టించాలి? (బి) తర్వాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?
19 విశ్వాసం లేని వారు అపహాస్యం చేసినప్పటికీ, మన ప్రేమగల సృష్టికర్తకు విధేయత చూపించడాన్ని బట్టి మనం ఎంతో ఆనందాన్ని పొందుతాము. మనకు ఉన్నతమైన నైతికత ఉంది, అదే దైవిక నైతికత. అది ఎంతో విలువైనదీ, గర్వించదగినదీ. పరిశుభ్రమైన నైతిక స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా, మనం దేవుని ఆశీర్వాదాలను ఆనందించి, అంతం లేని భవిష్యద్ ఆశీర్వాదాల తేజోవంతమైన నిరీక్షణను కాపాడుకోగల్గుతాము. అయితే, మనం నైతికంగా పరిశుభ్రంగా ఉండడానికి ఆచరణాత్మకమైన విధంగా మనం ఏమి చేయవచ్చు? తర్వాతి శీర్షిక ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నను పరిశీలిస్తుంది.
[అధస్సూచీలు]
^ పేరా 6 కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1983, పేజీలు 29-31 చూడండి.
^ పేరా 7 దుఃఖకరంగా, నిర్దోషులైన క్రైస్తవులు, దేవుని నడిపింపును అనుసరించని అవిశ్వాసియైన తమ వివాహజత మూలంగా లైంగికంగా సంక్రమించే వ్యాధులకు బలైన సందర్భాలు ఉన్నాయి.
మీరు వివరించగలరా?
• లైంగిక సంబంధాల గురించి బైబిలు ఏమి బోధిస్తుంది?
• బైబిలులో “జారత్వం” అనే పదం దేన్ని సూచిస్తుంది?
• నైతికంగా పరిశుభ్రంగా ఉండడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాము?
• యోసేపు, యోబు, షూలమ్మీతీ నేటి క్రైస్తవులకు ఎందుకు చక్కని మాదిరులుగా ఉన్నారు?
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
యోసేపు అనైతికత నుండి పారిపోయాడు
[10వ పేజీలోని చిత్రం]
షూలమ్మీతీ “మూయబడిన ఉద్యానము” వంటిది
[11వ పేజీలోని చిత్రం]
యోబు ‘తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు’