కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ శాంతి ఎలా వస్తుంది?

ప్రపంచ శాంతి ఎలా వస్తుంది?

ప్రపంచ శాంతి ఎలా వస్తుంది?

ప్రపంచ శాంతి కనుచూపు మేరలో కనిపిస్తుందా? చాలామందికి ఒకప్పుడు కనిపించింది, కానీ వారిప్పుడు సందేహిస్తున్నారు. దక్షిణ ఆఫ్రికాలో ప్రచురించబడే డెయిలీ మెయిల్‌ & గార్డియన్‌ అనే పత్రికలో, భవిష్యత్తులోని సవాళ్ళను గూర్చి చర్చించిన ఒక నివేదిక ప్రకారం, “ఒక క్రొత్త అంతర్జాతీయ విధానం వస్తుందని కేవలం 10 సంవత్సరాల క్రితమే చేసిన భవిష్యవాణులు ఇప్పుడు కేవలం ఆశలుగానే మిగిలిపోయాయి.”

ఆ నివేదికను వ్రాసినవారు కేవలం పది సంవత్సరాల క్రితమే ఉండిన ఒక ఆశావాదంతో కూడిన స్ఫూర్తిని గురించి పునరాలోచించుకున్నారు. ఆ సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం అప్పుడే ముగిసింది, అగ్రదేశాల పోరు సమసిపోయింది. ఒక క్రొత్త యుగం ఆవిర్భవిస్తోందని అన్పించిన ఆ సమయంలో చాలామంది, బీదరికం, రోగాలు, పర్యావరణలకు సంబంధించిన సమస్యల్ని మానవజాతి విజయవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆశించారు. “ఆ భవిష్యవాణులు కేవలం ఊహాకల్పితాలేనని ఇప్పుడనిపిస్తుంది” అని ఆ నివేదిక చెబుతుంది. “మనకేమాత్రం తెలియని ప్రాంతాల్లో క్రొత్త సంఘర్షణలు తలెత్తాయి; ప్రపంచవ్యాప్తంగా బీదరికం పెరుగుతూనే ఉంది. రెండు దేశాలు క్రొత్తగా అణుశక్తిని సంపాదించుకున్నాయి. మానవతా సహాయానికి సంబంధించిన సంక్షోభాలకు ఐక్యరాజ్య సమితి ప్రతిస్పందించిన తీరు మూలంగా దాని ప్రతిష్ఠ ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆశావాదంతో చేసే ఊహాకల్పనలకు బదులుగా నిరాశావాదంతో చేసే భవిష్యవాణులే విన్పిస్తున్నాయి.”

మానవ ప్రయత్నాలు ఎంత మేలు తలపెట్టి చేసేవైనప్పటికీ ఎన్నడూ పూర్తిగా విజయవంతం కాలేవని బైబిలును అధ్యయనం చేసేవారు గ్రహిస్తారు. ఎందుకని? ఎందుకంటే బైబిలు చెబుతున్నట్లుగా, “లోకమంతయు దుష్టుని యందున్న[ది].” (1 యోహాను 5:​19) లోకం సాతాను ఆధీనంలో ఉండగా, దేవుడు భూమిని ఎందుకోసమైతే సృష్టించాడో ఆ పరదైసు పరిస్థితులు ఈ లోకంలో ఏమాత్రం ఏర్పడవు.

అదే సమయంలో, ఆశావాదంతో ఉండడానికి ఆధారం ఉంది. ప్రపంచ శాంతిని తెస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే, ఇప్పటి ఈ లోక విధానానికి అతుకులు వేసి కాదు గానీ, ‘నీతి నివసించే’ ఒక “క్రొత్త భూమి”ని తీసుకురావడం ద్వారా ఆయనలా చేస్తాడు. (2 పేతురు 3:​13) అవును, దేవుని రాజ్యం ద్వారా మన ఈ ధరిత్రి ఒక శాంతియుతమైన, సంతోషకరమైన గృహంగా మార్చబడుతుంది. అప్పుడక్కడ విధేయులైన ప్రతి ఒక్కరికీ జీవం ఎంతో ఆనందదాయకంగా పని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ‘మీ కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనా ఏడ్పైనా వేదనయైనా ఇకవుండవని’ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాలు మాటిమాటికీ మారుతూ ఉండే మానవుల భవిష్యవాణులపై ఆధారపడినవి కావు. బదులుగా అవి, ఏమాత్రం తప్పుల్లేని సృష్టికర్తయొక్క వాక్యంపై ఆధారపడివున్నాయి, ఆయనెన్నడూ అబద్ధమాడలేడు.​—⁠ప్రకటన 21:⁠4; తీతుకు 1:⁠1, 2.