మీరు నైతిక పరిశుభ్రతను కాపాడుకోవచ్చు
మీరు నైతిక పరిశుభ్రతను కాపాడుకోవచ్చు
“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.”—1 యోహాను 5:3.
1. నేటి ప్రజల ప్రవర్తనలో ఎలాంటి తేడాలను చూడవచ్చు?
దేవుణ్ని సేవించే ప్రజల ప్రవర్తనకూ, దేవుణ్ని సేవించని ప్రజల ప్రవర్తనకూ మధ్య స్పష్టమైన తేడా ఉండే కాలం గురించి ప్రవచించేలా శతాబ్దాల క్రితం ప్రవక్తయైన మలాకీ ప్రేరేపించబడ్డాడు. ఆ ప్రవక్త ఇలా వ్రాశాడు: “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.” (మలాకీ 3:18) ఆ ప్రవచనం నేడు నెరవేరుతోంది. నైతిక పరిశుభ్రతకు సంబంధించిన వాటితో సహా దేవుని ఆజ్ఞలను అనుసరించడం జ్ఞానయుక్తమైన, సరైన జీవన విధానం. అయినప్పటికీ, అది ప్రతిసారీ అంత సులభమేమీ కాదు. మంచి కారణాన్ని బట్టే, రక్షణ పొందటానికి క్రైస్తవులు తీవ్రంగా కృషి చేయాలని యేసు చెప్పాడు.—లూకా 13:23, 24.
2. కొందరు తమ నైతిక పవిత్రతను కాపాడుకోవడాన్ని ఏ బాహ్య ఒత్తిళ్ళు కష్టతరం చేస్తాయి?
2 నైతిక పవిత్రతను కాపాడుకోవడం ఎందుకంత కష్టం? ఒక కారణం ఏమిటంటే బాహ్య ఒత్తిళ్ళు అనేకం ఉన్నాయి. అక్రమ లైంగిక సంబంధాన్ని ఆకర్షణీయమైనదిగానూ, ఆహ్లాదకరమైనదిగానూ, పరిణతికి ప్రతీకగానూ వినోదపరిశ్రమ చిత్రీకరిస్తూ, దానివల్ల వచ్చే ప్రతికూల పర్యవసానాలను మాత్రం పూర్తిగా అలక్ష్యంచేస్తుంది. (ఎఫెసీయులు 4:17-19) వాళ్లు చూపించే సన్నిహిత సంబంధాలు ఎక్కువగా వివాహ దంపతులు కాని వారి మధ్యనే ఉంటాయి. సినిమాలు, టీవీ కార్యక్రమాలు తరచుగా లైంగిక సంబంధాలు సర్వసాధారణమైనవన్నట్లుగా, ఒకరికొకరు కట్టుబడి ఉండవలసిన అవసరమేమీ లేదన్నట్లుగా చూపిస్తాయి. అలాంటి సంబంధాల్లో సాధారణంగా అనురాగమూ పరస్పర గౌరవమూ కొరవడతాయి. చాలామంది అలాంటి సందేశాలను బాల్యం నుండే వింటుంటారు. అంతేగాక, ఏ అడ్డూ అదుపూ లేని నేటి నైతిక వాతావరణానికి అనుగుణ్యంగా ఉండాలనే తోటివారి ఒత్తిడి బలంగా ఉంటుంది, ఆ ఒత్తిడికి లొంగిపోని వారు వెక్కిరించబడతారు, చివరికి దూషించబడతారు.—1 పేతురు 4:4.
3. ఈ ప్రపంచంలోని చాలామంది అనైతికతకు పాల్పడడానికి గల కారణాలు కొన్ని ఏవి?
3 అంతర్గత ఒత్తిడి కూడా నైతిక పవిత్రతను కాపాడుకోవడాన్ని యాకోబు 1:14, 15) ఉదాహరణకు, అసలు అదెలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతోనే అత్యధికులు మొట్టమొదటిసారి లైంగిక సంబంధం పెట్టుకున్నారని ఇటీవల బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక సర్వే తెలియజేస్తుంది. మరితరులు, తమ సమవయస్కులు అనేకమంది లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు గనుక, తాము కూడా అలాగే లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని కోరుకున్నారు. మరి కొందరు తాము తమ భావాల్ని అదుపు చేసుకోలేకపోయామనీ లేదా “ఆ సమయంలో కొద్దిగా త్రాగి ఉన్నామనీ” చెప్పారు. మనం దేవుడికి సంతోషం కల్గించే విధంగా ఉండాలంటే, మనం భిన్నంగా ఆలోచించాలి. నైతిక పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఏ విధమైన ఆలోచనా విధానం మనకు సహాయం చేస్తుంది?
కష్టతరం చేస్తుంది. యెహోవా మానవులను లైంగిక కోరికలతో సృష్టించాడు, ఆ కోరికలు చాలా బలంగా ఉండగలవు. మన కోరికలకు, మనం ఏమి ఆలోచిస్తాము అనేదానితో చాలా సంబంధం ఉంటుంది, అంతేగాక లైంగిక దుర్నీతికీ, యెహోవా తలంపులతో పొందికలేని ఆలోచనలకూ సంబంధం ఉంది. (దృఢవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి
4. నైతిక పవిత్రతను కాపాడుకోవడానికి, మనం ఏమి చేయాలి?
4నైతిక పవిత్రతతో కూడిన జీవన విధానాన్ని అవలంబించడం ఎంతో క్షేమకరమని గుర్తించడమే, ఆ నైతిక పవిత్రతను కాపాడుకోవడానికి కీలకం. “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొను[డి]” అని అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు వ్రాసినదానితో ఇది పొందిక కల్గివుంది. (రోమీయులు 12:2) నైతిక పవిత్రత అవసరమని గుర్తించడంలో, దేవుని వాక్యం లైంగిక దుర్నీతిని ఖండిస్తుందని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. లైంగిక దుర్నీతి ఎందుకు ఖండించబడిందనే దానికి గల కారణాలను, దాన్ని విసర్జించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు అనేవాటిని తెలుసుకోవడం ఇమిడి ఉంది. మునుపటి శీర్షికలో ఈ కారణాల్లో కొన్ని పరిశీలించబడ్డాయి.
5. ప్రాథమికంగా, క్రైస్తవులు ఎందుకు నైతిక పవిత్రతను కాపాడుకోవాలని కోరుకుంటారు?
5 అయితే, క్రైస్తవులమైన మనం లైంగిక దుర్నీతిని నివారించడానికిగల అత్యంత శక్తివంతమైన కారణాలు దేవునితో మనకున్న సంబంధంపై ఆధారపడి ఇవ్వబడ్డాయి. మనకు ఏది అతి శ్రేష్ఠమో ఆయనకు తెలుసని మనం నేర్చుకున్నాము. గనుక ఆయనపట్ల మనకున్న ప్రేమ మనం చెడును ద్వేషించడానికి సహాయం చేస్తుంది. (కీర్తన 97:10) దేవుడు “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” అనుగ్రహిస్తాడు. (యాకోబు 1:17) ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు మనం విధేయులమై ఉండడం ద్వారా, మనం ఆయనను ప్రేమిస్తున్నామనీ ఆయన మన కోసం చేసిన వాటి పట్ల మనకు మెప్పుదల ఉన్నదనీ చూపిస్తాము. (1 యోహాను 5:3) యెహోవా నీతియుక్తమైన కట్టడలను ఉల్లంఘించడం ద్వారా ఆయనకు నిరాశను కల్గించాలనీ, ఆయనను నొప్పించాలనీ మనం ఎన్నడూ కోరుకోము. (కీర్తన 78:41) పరిశుద్ధమైన, నీతియుక్తమైన ఆయన ఆరాధనను ఇతరులు దూషించేలా ప్రవర్తించాలని మనం కోరుకోము. (తీతు 2:3-5; 2 పేతురు 2:2) నైతిక పవిత్రతను కాపాడుకోవడం ద్వారా మనం సర్వోన్నతుడిని ఆనందపరుస్తాము.—సామెతలు 27:11.
6. మన నైతిక ప్రమాణాలను ఇతరులకు వెల్లడిచేయడం మనకెలా సహాయం చేస్తుంది?
6మనం నైతిక పవిత్రతను కాపాడుకోవాలని ఒకసారి నిశ్చయించుకున్న తర్వాత, ఆ నిశ్చయతను ఇతరులకు తెలియజేయడం మనకు మరింత భద్రతను చేకూరుస్తుంది. మీరు యెహోవా దేవుని సేవకులనీ, మీరు ఆయన ఉన్నతమైన ప్రమాణాలకు కీర్తన 64:10) మీ నైతిక నిశ్చయతల గురించి ఇతరులతో చర్చించడానికి ఎన్నడూ సిగ్గుపడకండి. మీ ఉద్దేశాన్ని బయటికి వెల్లడిచేయడం మిమ్మల్ని బలపరిచి, కాపాడి, మీ మాదిరిని ఇతరులు అనుసరించడానికి వారిని ప్రోత్సహించగలదు.—1 తిమోతి 4:12.
కట్టుబడి ఉండాలని నిశ్చయించుకున్నారనీ ప్రజలకు తెలియనివ్వండి. ఇది మీ జీవితం, మీ శరీరం, మీ ఎంపిక. ఏదైనా జరిగితే ప్రమాదంలో ఉండేదేమిటి? పరలోక తండ్రితో మీకున్న అపురూపమైన సంబంధం. కాబట్టి మీ నైతిక యథార్థత రాజీ చేసుకోదగినది కాదని స్పష్టం చేయండి. దేవుని కట్టడలను ఉన్నతపర్చడం ద్వారా దేవునికి ప్రాతినిధ్యం వహించేందుకు మీకున్న అవకాశాన్ని బట్టి గర్వించండి. (7. నైతిక పవిత్రతను కాపాడుకోవాలన్న మన నిశ్చయాన్ని మనమెలా దృఢపర్చుకోగలం?
7ఉన్నతమైన నైతిక ప్రమాణాల్ని కల్గివుండడానికి నిశ్చయించుకుని మీ స్థానాన్ని ఇతరులకు తెలిసేలా చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని బైబిలు తెలియజేస్తుంది. మీకున్నటువంటి నైతిక విలువలను కల్గివున్నవారితోనే సహవాసం చేయండి; వాళ్లు మిమ్మల్ని బలపరుస్తారు. అదే లేఖనం ఇంకా ఇలా చెప్తుంది: “మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) సాధ్యమైనంత వరకు, మీ నిశ్చయాన్ని బలహీనపర్చే వారిని దూరంగా ఉంచండి.—1 కొరింథీయులు 15:33.
8. (ఎ) మన మనస్సులను మంచి విషయాలతో ఎందుకు నింపుకోవాలి? (బి) మనం దేన్ని నివారించాలి?
8 అంతేగాక, మనం మన మనస్సులను సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగలవైన వాటితో నింపుకోవాలి. (ఫిలిప్పీయులు 4:8) మనం చూసేవాటిని, చదివేవాటిని, వినేవాటిని ఎంపిక చేసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహించడం ద్వారా మనమలా చేయవచ్చు. చెడ్డ సాహిత్యం మనపై కలుషితపర్చే ప్రభావాన్ని చూపించదని అనుకోవడం, మంచి సాహిత్యం మనపై అనుకూలమైన ప్రభావాన్ని చూపించదని అనుకోవడంతో సమానం. అపరిపూర్ణ మానవులు సులభంగా లైంగిక అనైతికతలో పడిపోగలరని గుర్తుంచుకోండి. కాబట్టి లైంగిక భావాలను రేకెత్తించే పుస్తకాలు, పత్రికలు, చిత్రాలు, సంగీతం వంటివి తప్పుడు కోరికలకు నడిపిస్తాయి, అవే చివరికి పాపానికి నడిపించగలవు. నైతిక పరిశుభ్రతను కాపాడుకునేందుకు, మనం మన మనస్సులను దైవిక జ్ఞానంతో నింపుకోవాలి.—యాకోబు 3:17.
లైంగిక దుర్నీతికి నడిపే చర్యలు
9-11. సొలొమోను వివరించినట్లుగా, ఏ చర్యలు ఒక పడుచువాడిని నెమ్మదిగా అనైతికతకు నడిపించాయి?
9 లైంగిక దుర్నీతికి నడిపే, గుర్తించదగిన చర్యలు కొన్ని ఉన్నాయి. ఆ వైపుగా మనం వేసే ప్రతి అడుగూ వెనక్కి తిరిగి రావడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. సామెతలు 7:6-23 వచనాల్లో ఇది ఎలా వర్ణించబడిందో గమనించండి. ‘బుద్ధిలేని పడుచువాడి’ గురించి లేక, మంచి ఉద్దేశం కొరవడినవాడి గురించి సొలొమోను చెప్తున్నాడు. ఆ పడుచువాడు “సందెవేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళ వాడు జార స్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.” అది అతని మొదటి పొరపాటు. ఆ సాయం సమయంలో, అతని హృదయం అతడిని మరే వీధికి కాదుగానీ, వేశ్య ఎక్కడ దొరుకుతుందో ఆ వీధికి నడిపించింది.
10 తర్వాత మనమిలా చదువుతాము: “అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.” అతడు వెనక్కి తిరిగి తన ఇంటికి వెళ్లిపోవచ్చు, కానీ అతడు నైతికంగా బలహీనమైపోయాడు గనుక అదిప్పుడు మునుపటి కన్నా మరింత కష్టం. ఆమె అతడిని పట్టుకుని ముద్దుపెట్టుకుంటుంది. ముద్దును స్వీకరించి ఇప్పుడతడు, “సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను” అని ఆమె చెప్తున్న లాలన మాటలు వింటాడు. సమాధాన బలులలో మాంసము, పిండి, నూనె, ద్రాక్షారసం వంటివి ఉన్నాయి. (లేవీయకాండము 19:5, 6; 22:21; సంఖ్యాకాండము 15:8-11) వాటి గురించి ప్రస్తావించడం ద్వారా ఆమె ఆధ్యాత్మికంగా తానేమీ వెనుకబడిలేనని సూచిస్తుండవచ్చు, అదే సమయంలో, తన ఇంటి దగ్గర తినడానికి త్రాగడానికి రుచికరమైన పదార్థాలు పుష్కలంగా ఉన్నాయని అతడికి తెలియజేస్తుండవచ్చు. “ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము” అంటూ అతడినామె వేడుకుంటుంది.
11 పర్యవసానాన్ని ఊహించడం కష్టమేమీ కాదు. ఆమె తన “యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.” “పశువు వధకు పోవునట్లును,” “ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును” అతడు ఆమె ఇంటికి వెళ్తాడు. అది “తనకు ప్రాణహానికరమైనదని” అతడు గుర్తించలేకపోయాడనే ఆలోచనాపూర్వకమైన మాటలతో సొలొమోను ముగిస్తున్నాడు. “వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” గనుక అతడి ప్రాణం లేక జీవం ప్రమాదంలో ఉంది. (హెబ్రీయులు 13:4) స్త్రీ పురుషులిద్దరికీ ఎంత శక్తివంతమైన పాఠం! దేవుని అనుగ్రహాన్ని కోల్పోవడానికి నడిపించే మార్గంవైపు తొలి అడుగులు కూడా వేయకూడదు.
12. (ఎ) “బుద్ధిలేని” అనేదాని కోసమైన మూల హెబ్రీ పదభావం ఏమిటి? (బి) మనం నైతిక బలాన్ని ఎలా వృద్ధిచేసుకోవచ్చు?
2 తిమోతి 3:1) మనకు సహాయం చేయడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. మనల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రోత్సహించడానికీ, మనకున్నలాంటి లక్ష్యాలనే కల్గివున్న ఇతరులతో మనం సహవాసం కల్గివుండడానికీ ఆయన క్రైస్తవ సంఘ కూటాలను ఏర్పాటు చేశాడు. (హెబ్రీయులు 10:24, 25) మన గురించి శ్రద్ధ వహిస్తూ మనకు నీతియుక్తమైన మార్గాల గురించి బోధించే సంఘ పెద్దలు ఉన్నారు. (ఎఫెసీయులు 4:11, 12) మనకు నిర్దేశాలివ్వడానికీ, మనల్ని నడిపించడానికీ దేవుని వాక్యమైన బైబిలు ఉంది. (2 తిమోతి 3:16) అంతేగాక, అన్నిసమయాల్లోనూ మనకు సహాయం చేసేందుకు దేవుని ఆత్మ కోసం ప్రార్థించే అవకాశం కూడా మనకుంది.—మత్తయి 26:41.
12 ఆ వృత్తాంతంలోని పడుచువాడు “బుద్ధిలేని” వాడని గమనించండి. అతని తలంపులు, కోరికలు, ఆశలు, భావోద్వేగాలు, జీవిత లక్ష్యాలు దేవుడు ఆమోదించే వాటితో పొందిక కల్గిలేవని మూల హెబ్రీ పదం మనకు తెలియజేస్తుంది. అతని నైతిక బలహీనత దుఃఖకరమైన పర్యవసానాలకు నడిపింది. క్లిష్టమైన ఈ “అంత్య దినములలో” నైతిక బలాన్ని వృద్ధిచేసుకోవడానికి ఎంతో కృషి అవసరం. (దావీదు చేసిన పాపాల నుండి మనమొక పాఠం నేర్చుకోవడం
13, 14. రాజైన దావీదు గంభీరమైన పాపంలో ఎలా పడిపోయాడు?
13 అయితే దుఃఖకరంగా, పేరుగాంచిన దేవుని సేవకులు కూడా లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు. అలాంటి వారిలో, దశాబ్దాలపాటు నమ్మకంగా యెహోవా సేవ చేసిన రాజైన దావీదు కూడా ఉన్నాడు. ఆయన దేవుడిని గాఢంగా ప్రేమించాడనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, ఆయన పాపంలో పడిపోయాడు. సొలొమోను వర్ణించిన పడుచువాడిలాగే, దావీదు పాపం చేయడానికీ ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికీ నడిపిన చర్యలు కొన్ని ఉన్నాయి.
14 అప్పుడు దావీదు మధ్యవయస్కుడు, బహుశా ఆయన తన 50వ పడిలో ఉండి ఉండవచ్చు. అందమైన బత్షెబ స్నానం చేయడం ఆయన తన మేడమీది నుండి చూశాడు. ఆమె గురించి వాకబు చేసి, ఆమె ఎవరనేది ఆయన తెలుసుకున్నాడు. ఆమె భర్తయైన ఊరియా అమ్మోనీయుల నగరమైన రబ్బాను ముట్టడివేయడానికి వెళ్లాడని ఆయన తెలుసుకున్నాడు. దావీదు ఆమెను తన రాజభవనానికి రప్పించి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత, పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయి, దావీదు వల్ల తాను గర్భవతినయ్యానని ఆమె తెలుసుకుంది. ఊరియా తన భార్యతో రాత్రి గడుపుతాడని ఆశిస్తూ దావీదు అతడిని యుద్ధం నుండి వెనక్కి పిలిపిస్తాడు. అలాగైతే, బత్షెబకు పుట్టబోయే కుమారుడికి ఊరియా తండ్రి అన్నట్లు కనిపించేది. కానీ ఊరియా తన ఇంటికి వెళ్లలేదు. తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో దావీదు ఊరియాకు ఒక పత్రిక ఇచ్చి రబ్బాకు తిరిగి పంపించాడు, ఆ పత్రికలో ఊరియాను హతమయ్యే స్థానంలో ఉంచమని సైనికాధికారికి ఆదేశించబడింది. అలా ఊరియా మరణించాడు, విధవరాలైన అతడి భార్య గర్భవతి అని అందరికీ తెలియక ముందే దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు.—2 సమూయేలు 11:1-27.
15. (ఎ) దావీదు చేసిన పాపం ఎలా బహిర్గతమైంది? (బి) నాతాను నైపుణ్యవంతంగా ఇచ్చిన గద్దింపుకు దావీదు ఎలా ప్రతిస్పందించాడు?
15 తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని దావీదు వేసిన పథకం విజయవంతమైనట్లే కనిపిస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. వాళ్లకొక కొడుకు పుట్టాడు. దావీదు 32వ కీర్తనను కూర్చినప్పుడు ఆయన మనస్సులో గనుక ఈ ఉదంతం ఉండివుంటే, ఆయన మనస్సాక్షి అప్పుడాయనను ఎంతో చిత్రహింసలు పెట్టిందని అర్థమౌతుంది. (కీర్తన 32:3-5) అయితే, ఆ పాపం దేవుని దృష్టికి మరుగై ఉండలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.” (2 సమూయేలు 11:27) అందుకని యెహోవా ప్రవక్తయైన నాతానును పంపించాడు, ఆయన ఎంతో నైపుణ్యవంతంగా దావీదు చేసినదేమిటో ఆయన గ్రహించేలా చేశాడు. దావీదు వెంటనే తన తప్పును ఒప్పుకొని యెహోవాను క్షమాపణ కోరాడు. ఆయన చూపించిన నిజమైన పశ్చాత్తాపం దేవునితో ఆయనకు తిరిగి సమాధానాన్ని ఏర్పరచింది. (2 సమూయేలు 12:1-13) దావీదు గద్దింపును తిరస్కరించలేదు. బదులుగా, “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము; నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక” అని కీర్తన 141:5 నందు వర్ణించబడిన దృక్పథాన్ని ఆయన చూపించాడు.
16. తప్పిదములకు సంబంధించి సొలొమోను ఏ హెచ్చరికను, ఉపదేశాన్ని ఇచ్చాడు?
16 దావీదు బత్షెబల రెండవ కుమారుడైన సొలొమోను, తన తండ్రి జీవితంలోని ఈ చీకటి కోణం గురించి బాగా ఆలోచించి ఉంటాడు. తర్వాత ఆయనిలా వ్రాశాడు: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” (సామెతలు 28:13) మనం గనుక గంభీరమైన పాపంలో పడిపోతే, మనమీ ప్రేరేపిత సలహాను స్వీకరించాలి, అది ఒక హెచ్చరికే కాదు ఉపదేశం కూడా. మనం యెహోవా ఎదుట మన తప్పును ఒప్పుకొని, సంఘ పెద్దల సహాయాన్ని తీసుకోవాలి. తప్పిదంలో పడిపోయిన వారిని సరిదిద్దటానికి సహాయం చేయడం పెద్దలకున్న ఒక ప్రాముఖ్యమైన బాధ్యత.—యాకోబు 5:14, 15.
పాప పర్యవసానాలను సహించడం
17. యెహోవా మన పాపాలను క్షమించినప్పటికీ, ఆయన దేని నుండి మనల్ని రక్షించడు?
17 యెహోవా దావీదును క్షమించాడు. ఎందుకు? ఎందుకంటే దావీదు యథార్థవంతుడు, ఆయన ఇతరుల పట్ల కనికరం చూపించాడు, ఆయన నిజంగా పశ్చాత్తాపపడ్డాడు. అయినప్పటికీ, నాశనకరమైన పర్యవసానాలను మాత్రం దావీదు తప్పించుకోలేకపోయాడు. (2 సమూయేలు 12:9-14) నేడు కూడా అదే నిజం. పశ్చాత్తాపపడే వారి మీదికి దేవుడు కీడును రప్పించకపోయినప్పటికీ, వారి తప్పుడు చర్యల మూలంగా వచ్చే సహజమైన పర్యవసానాల నుండి ఆయన వారిని రక్షించడు. (గలతీయులు 6:7) లైంగిక దుర్నీతి వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటంటే, విడాకులు, అవాంఛిత గర్భధారణ, సుఖవ్యాధులు, నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోవడమే.
18. (ఎ) గంభీరమైన లైంగిక దుష్ప్రవర్తన గల వ్యక్తితో ఎలా వ్యవహరించమని పౌలు కొరింథు సంఘానికి చెప్పాడు? (బి) యెహోవా పాపుల పట్ల ప్రేమా కనికరాలను ఎలా చూపిస్తాడు?
18 మనం వ్యక్తిగతంగా ఏదైనా గంభీరమైన పాపం చేసివుంటే, దాని వల్ల వచ్చే పర్యవసానాలను అనుభవించేటప్పుడు క్షోభచెందడం సహజమే. అయినప్పటికీ, మనం పశ్చాత్తాపపడి దేవునితో మళ్లీ సమాధానాన్ని ఏర్పరచుకోవడాన్ని ఆపేందుకు మాత్రం దేన్నీ అనుమతించవద్దు. మొదటి శతాబ్దంలో, వావివరుసలు తప్పి జారత్వానికి పాల్పడుతున్న వ్యక్తిని సంఘంలో నుండి తొలగించమని పౌలు కొరింథీయులకు వ్రాశాడు. (1 కొరింథీయులు 5:1, 13) ఆ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు, అతడిని ‘క్షమించి ఆదరించి, అతని యెడల మీ ప్రేమను స్థిరపరచండి’ అని పౌలు ఆ సంఘానికి ఉపదేశించాడు. (2 కొరింథీయులు 2:5-8) ఈ ప్రేరేపిత ఉపదేశంలో, పశ్చాత్తాపపడే తప్పిదస్థుల పట్ల యెహోవాకున్న ప్రేమా కనికరాలను మనం చూడవచ్చు. ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలోని దూతలు ఆనందిస్తారు.—లూకా 15:10.
19. తప్పుడు చర్యను బట్టి సరైన విధంగా దుఃఖించడం ఏ ప్రయోజనాలను చేకూర్చగలదు?
19 ఒక తప్పుడు చర్యను బట్టి మనం దుఃఖపడుతున్నప్పటికీ, మన విచారం మళ్లీ ‘చెడుతనము చేయకుండా ఉండేందుకు’ మనకు సహాయం చేస్తుంది. (యోబు 36:21) నిజానికి, పాపం యొక్క చేదైన పర్యవసానాలు ఆ తప్పును మళ్లీ చేయకుండా మనల్ని ఆటంకపర్చాలి. అంతేగాక, దావీదు తాను తన పాపభరితమైన ప్రవర్తన నుండి పొందిన దుఃఖకరమైన అనుభవాన్ని ఇతరులకు ఉపదేశం ఇచ్చేందుకు ఉపయోగించుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులును నీ తట్టు తిరుగుదురు.”—కీర్తన 51:13.
యెహోవా సేవచేయడం ద్వారా ఆనందం లభిస్తుంది
20. దేవుడు కోరే నీతియుక్తమైన కట్టడలకు విధేయత చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి?
20 “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని” యేసు చెప్పాడు. (లూకా 11:28) దేవుడు కోరే నీతియుక్తమైన వాటికి విధేయత చూపించడం ఇప్పుడూ నిరంతర భవిష్యత్తులోనూ ఆనందాన్ని తెస్తుంది. మనం గనుక ఇప్పటి వరకు నైతిక పరిశుభ్రతను కాపాడుకుని ఉంటే, ఇకపై కూడా మనకు సహాయం చేయడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా మనం ఆ మార్గంలోనే కొనసాగుదాము. మనం లైంగిక దుర్నీతిలో ఇప్పటికే ఒకసారి పడివున్నట్లైతే, నిజంగా పశ్చాత్తాపపడే వారిని యెహోవా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా ధైర్యం తెచ్చుకుని, ఆ పాపాన్ని మళ్లీ పునరావృతం చేయకుండా ఉండేందుకు నిశ్చయించుకుందాము.—యెషయా 55:7.
21. అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఏ ఉపదేశాన్ని అన్వయించుకోవడం మనం నైతిక పరిశుభ్రతను కాపాడుకోవడానికి మనకు సహాయం చేయగలదు?
21 త్వరలోనే ఈ అనైతిక లోకం దాని అనైతిక దృక్పథాలు అలవాట్లన్నిటితో సహా గతించిపోతుంది. నైతిక పవిత్రతను కాపాడుకోవడం ద్వారా మనం ఇప్పుడూ, ఎల్లప్పుడూ ప్రయోజనం పొందుతాము. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. . . . మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.”—మీరు వివరించగలరా?
• నైతిక పరిశుభ్రతను కాపాడుకోవడం ఎందుకు కష్టం కావచ్చు?
• ఉన్నతమైన నైతిక ప్రమాణాలను అనుసరించాలన్న మన నిశ్చయతను సమర్థించుకోవడానికి కొన్ని మార్గాలు ఏవి?
• సొలొమోను చెప్పిన పడుచువాడి పాపాల నుండి మనం ఏ పాఠాలను నేర్చుకోవచ్చు?
• దావీదు ఉదాహరణ పశ్చాత్తాపం గురించి మనకు ఏమి బోధిస్తుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రం]
నైతికత విషయంలో మీ స్థానం ఏమిటనేది ఇతరులకు తెలియజేయడం ఒక కాపుదలలా పనిచేస్తుంది
[16, 17వ పేజీలోని చిత్రాలు]
దావీదు యథార్థంగా పశ్చాత్తాపపడ్డాడు గనుక, యెహోవా ఆయనను క్షమించాడు