కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మత ఐక్యత దగ్గర్లో ఉందా?

మత ఐక్యత దగ్గర్లో ఉందా?

మత ఐక్యత దగ్గర్లో ఉందా?

“మన చర్చీ చరిత్రలోనే ప్రాముఖ్యమైన దినం ఇది,” లూధరన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడైన క్రిస్టియన్‌ క్రౌస్‌ అన్నాడు. అలాగే, “క్రైస్తవుల మధ్య పూర్తి ఐక్యతను పునర్నిర్మించే గతుకుల రోడ్డులోని ఒక మైలురాయి” గురించి పోప్‌ జాన్‌ పాల్‌ II మాట్లాడాడు.

ఈ ఔత్సాహిక వ్యాఖ్యానాలు, ఒక అధికారిక సమష్టి ప్రకటనపై 1999, అక్టోబరు 31న సంతకాలు జరగడంతో వెలువడ్డాయి. ఈ సంతకాలు జర్మనీలోని ఆగ్స్‌బర్గ్‌లో బైబిలులోని సమాధాన సిద్ధాంతాన్ని సమష్టిగా స్వీకరించినప్పుడు జరిగాయి. ఈ సంఘటనకు సమయమూ, స్థలమూ చక్కగా ఎంపిక చేయబడ్డాయి. మార్టిన్‌ లూధర్‌ 1517, అక్టోబరు 31న విట్టెన్‌బర్గ్‌లోని కోటలోని చర్చి తలుపుకు తన 95 సిద్ధాంతాల పత్రాన్ని మేకుతో దిగగొట్టాడని చెబుతారు. ఆ చర్యతో ఆయన ప్రొటెస్టెంట్‌ సంస్కరణోద్యమాన్ని ప్రారంభించాడు. అయితే, ఆగ్స్‌బర్గ్‌ స్థలం విషయానికొస్తే, 1530 లో లూధరన్‌లు ఆగ్స్‌బర్గ్‌ కన్ఫెషన్‌ అనే పేరుతో తమ ప్రాధమిక సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టింది అక్కడే. వీటిని క్యాథలిక్‌ చర్చి తిరస్కరించడంతో ప్రొటెస్టెంటులకు క్యాథలిక్కులకు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది.

ఈ రెండు చర్చీల్లోని వేర్పాటు సమసిపోయేలా చేసేందుకు ఈ సమష్టి ప్రకటన నిర్ణయాత్మక పాత్రను వహిస్తుందా? అన్ని పక్షాలవారిలోను అంతటి ఆశాభావాలేమీ లేవు. క్యాథ లిక్‌ చర్చి తమపై ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉందంటూ, దీనికి వ్యతిరేకమైన ఒక పిటీషన్‌పై 250 ప్రొటెస్టెంట్‌ దైవశాస్త్ర పండితులు సంతకాలు చేశారు. అంతేగాక, క్యాథలిక్‌ చర్చి 2000వ సంవత్సరాన్ని ప్రత్యేక పాపపరిహార సంవత్సరంగా ప్రకటించడం కూడా ప్రొటెస్టెంటుల ఉగ్రతకు కారణమైంది, 500 సంవత్సరాల క్రితం ఈ రెండు మతాల మధ్య అగాధం ఏర్పడడానికి కారణమైనది కూడా సరిగ్గా ఈ ఆచారమే. అటు ఆగ్స్‌బర్గ్‌ కన్ఫెషన్‌, ఇటు దానికి క్యాథలిక్కుల జవాబైన కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రెంట్‌ ఈ రెండూ ఇప్పటికీ అమల్లో ఉన్నాయి గనుక, ఐక్యత సాధించినట్లే.

క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉన్న అగాధాలు, విబేధాలు ఎటువంటి సమష్టి ప్రకటనలూ పూడ్చలేనటువంటివి. అంతేకాదు, విశ్వాసాల్లో ఐక్యత అనేది దేవుని వాక్యమైన బైబిలులో స్థిరంగా పాదుకుని ఉంటుంది. (ఎఫెసీయులు 4:​3-6) అది ఎటువంటి రాజీల ద్వారా సాధించబడేది కాదు గానీ, నిజమైన ఐక్యత దేవుడు మననుండి కోరేవి తెలుసుకుని, వాటి ప్రకారం చేయడం నుండి వస్తుంది. “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము” అని విశ్వసనీయుడైన ప్రవక్తయైన మీకా ప్రకటించాడు.​—⁠మీకా 4:⁠5.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Ralph Orlowski/REUTERS/Archive Photos