మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి అభినందించారా? మరి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• ఒకరితో మనకున్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఏమి అవసరం?
మొదటిగా మనమందరమూ తప్పుడు తలంపులకూ తప్పుడు వైఖరులకూ లోనయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత నిజానికి మన సమస్యకు మూలం అవతలి వ్యక్తికి బదులు మనమేనేమో అన్న విషయాన్ని గంభీరంగా పరిశీలించాలి.—8/15 23వ పేజీ.
• అపొస్తలుల కార్యములు 3:21 లో ప్రస్తావించబడిన “కుదురుబాటు కాలములు” ఎప్పుడు వస్తాయి?
కుదురుబాటు రెండు దశల్లో వస్తుంది. మొదటిది, ఉపశమనాన్నిచ్చే ఆధ్యాత్మిక కుదురుబాటు 1919 నుంచీ జరుగుతోంది. రెండవది, ఈ భూమిపై అక్షరార్థ పరదైసును స్థాపించినప్పుడు మరింత కుదురుబాటు వస్తుంది.—9/1, 17, 18 పేజీలు.
• సామెతలు 6:6-8 వచనాల్లో చెప్పబడినట్లుగా చీమకు పైవిచారణకర్త లేకపోయినా అవి మనకొక మంచి ఉదాహరణను ఎలా అందిస్తున్నాయి?
చీమల గుంపులో రాణి చీమ ఉంటుంది కానీ గ్రుడ్లు పెట్టడం, ఆ చీమల గుంపుకు తల్లిగా ఉండడం అనే భావంలో మాత్రమే అది రాణి. చీమలు శ్రమిస్తాయి, అలాగే మనల్ని గమనించేవారు ఉన్నా లేకున్నా కష్టపడి పనిచేయాలి, మన పనిలో మరింత మెరుగుచెందడానికి గట్టిగా ప్రయత్నించాలి.—9/15, 26వ పేజీ.
• యుద్ధంలో యోషీయా గాయపర్చబడి చనిపోయాడు కాబట్టి ఆయన “నెమ్మది”తో మరణిస్తాడని హుల్దా చెప్పిన ప్రవచనం, రెండవ రాజులు 22:20 లో నివేదించబడినట్లుగా నిజమని చెప్పగలమా?
యోషీయా సా.శ.పూ. 609-607 కాలంలో బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి నాశనం చేసినప్పుడు జరిగిన కీడుకు ముందే చనిపోయాడు. అవును ఆ భావంలో చూస్తే, ఆయన నెమ్మదితో చనిపోయాడు.—9/15, 30వ పేజీ.
• ఒక భార్యను “అతి ప్రియమైన లేడి, ముగ్ధమైన కొండ మేక” అని సొలొమోను వర్ణించడం ఏ విధంగా మెచ్చుకోలు అయివుంది? (సామెతలు 5:18, 19, NW)
ఆడ ఇబెక్స్ అంటే కొండమేక, స్వభావరీత్యా సౌమ్యమైనది, సొగసైన ఆకృతి కలది. అయినా అది, ఆహారకొరతగల పర్వత ప్రాంతాల్లోనూ, ఎవరూ ప్రవేశించని స్థలాల్లోనూ మనుగడ సాగించగలదు, పిల్లలను కనగలదు.—10/1, 30, 31 పేజీలు.
• హెన్రీ గ్రూ జార్జ్ స్టార్స్‌లు ఎవరు?
వీళ్ళిద్దరూ 1800లలో జీవించిన వ్యక్తులు, శ్రద్ధగల బైబిలు విద్యార్థులు. త్రిత్వము లేఖనాధారితం కాదని దానితో పాటు ఆత్మ అమర్త్యం, నరకాగ్ని బోధలు, వంటివి కూడా నిర్లేఖితమైనవని గ్రూ తెలుసుకున్నాడు. కొంతమంది ఈ భూమిపై నిరంతరం జీవితం పొందుతారని స్టార్స్ గ్రహించాడు. వీళ్ళిద్దరూ, 1879 లో ఈ పత్రికను (ఆంగ్లం) ప్రచురించడం ప్రారంభించిన చార్ల్స్ తేజ్ రస్సెల్‌కు పూర్వగాములు.—10/15, 26-30 పేజీలు.
• ఒకరి స్వంత రక్తాన్ని వానికే తిరిగి ఉపయోగించే వైద్య పద్ధతులను యెహోవాసాక్షులు ఎలా దృష్టిస్తారు?
బైబిలుపై ఆధారపడిన వారి నమ్మకాల ఆధారంగా, వారు తమ స్వంత రక్తాన్ని నిలవ ఉంచుకొని తర్వాత దాన్ని మార్పిడి చేసుకోరు. ప్రతి క్రైస్తవుడు శస్త్రచికిత్స, వైద్య పరీక్ష, లేదా ప్రస్తుత చికిత్స సమయాల్లో తన రక్తాన్ని ఎలా ఉపయోగిస్తారన్నది వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. రక్తాన్ని గురించి బైబిలు ఏమి చెప్తుందో పరిశీలించి, తాను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నానన్న విషయాన్ని గుర్తించుకోవాలి.—10/15, 30, 31 పేజీలు.
• భూ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల మధ్య ఏ గుర్తించదగిన అవసరం ఉందని 2000వ సంవత్సరం తొలి భాగంలో నిర్వహించబడిన ఒక సర్వే తెలియజేసింది?
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 11,000 కన్నా ఎక్కువ రాజ్యమందిరాలు అవసరమని తేలింది. అనేక దేశాల్లోని క్రైస్తవులు ఇచ్చే చందాలు, తగినన్ని రాజ్యమందిరాలను నిర్మించడంలో సహాయపడేందుకు ఉపయోగించబడుతున్నాయి.—11/1, 30వ పేజీ.
• బైబిలులో ఆరాధనతో సంబంధమున్న కొన్ని మూల భాషా పదాలు ఉపయోగించబడ్డాయి, అవి ఏవి?
“ప్రజాసేవ” అని అనువదించబడిన లైటోర్‌జీయ, అనే పదం ఒకటి. “పరిశుద్ధ సేవ” అని అనువదించబడిన లాట్రీయా అనేది మరొకటి. (హెబ్రీయులు 10:11; లూకా 2:36, 37)—11/15, 11, 12 పేజీలు.
• ఆదాము హవ్వల బైబిలు వృత్తాంతం నుండి మనం ఎలాంటి ప్రధానమైన పాఠాన్ని నేర్చుకోగలం?
ఎవరైనా యెహోవా దేవుని నుంచి స్వాతంత్ర్యం కావాలని నిశ్చయించుకుంటే అది పూర్తిగా అవివేకమైనదే.—11/15, 24-7 పేజీలు.
• దేవుడు తన సేవకులను బలపరుస్తాడనటానికి ఏ లేఖనాధార నిదర్శనం ఉంది?
దావీదు, హబక్కూకు, అపొస్తలుడైన పౌలులు యెహోవా దేవుడు తమను శక్తిమంతులను చేశాడని అంటే బలపర్చాడని స్వయంగా ఒప్పుకున్నారు. (కీర్తన 60:12; హబక్కూకు 3:19; ఫిలిప్పీయులు 4:13) అందుకని, దేవుడు మనలను శక్తిమంతులను చేయడానికి ఇష్టపడుతున్నాడనీ, శక్తిమంతులను చేయగలడనీ మనం కూడా నమ్మకాన్ని కలిగివుండగలం.—12/1, 10,11 పేజీలు.