కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సేవచేయడానికి పురికొల్పబడ్డారు

సేవచేయడానికి పురికొల్పబడ్డారు

సేవచేయడానికి పురికొల్పబడ్డారు

తమ జీవితపు అత్యుచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు 24 జంటలు తమ కుటుంబాల్నీ, మిత్రుల్నీ, సుపరిచిత పరిసరాల్నీ విడిచి విదేశాల్లో మిషనరీ పనిని చేపట్టడానికి వారిని ఏది కదిలించింది? పాపువా న్యూ గినీ, తైవాన్‌ లాంటి దేశాలకు వెళ్ళడానికి, అలాగే ఆఫ్రికాలోని లాటిన్‌ అమెరికాలోని దేశాలకు వెళ్ళడానికి వారెందుకు అత్యుత్సాహం కనబరుస్తున్నారు? ఏదో సాహసం చేయాలన్న ఉద్దేశంతోనేనా? ఎంతమాత్రం కాదు. బదులుగా, వారు దేవుని పట్లా తమ పొరుగువారి పట్లా తమకు గల ప్రేమచే పురికొల్పబడ్డారు.​—⁠మత్తయి 22:37-39.

ఎవరీ వ్యక్తులు? వీరు వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 109వ తరగతి నుండి పట్టభద్రులైనవారు. న్యూయార్క్‌లోని పాటర్‌సన్‌వద్ద ఉన్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లోను, అలాగే మరితర స్థలాల్లోను 2000వ సంవత్సరం, సెప్టెంబరు 9, శనివారం నాడు 5, 198 మంది సమకూడారు. గిలియడ్‌ స్కూలు పట్టభద్రులు విజయవంతమైన మిషనరీలయ్యేందుకు వారికి సహాయపడగల ప్రేమపూర్వక సలహాలను వినడానికి వీరంతా సమావేశమయ్యారు.

యెహోవాసాక్షుల పరిపాలక సభ యొక్క టీచింగ్‌ కమిటీలో ఒక సభ్యుడైన స్టీవెన్‌ లెట్‌ ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా ఉన్నాడు. ఆయన తన వ్యాఖ్యానాల్ని “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు” అని చెబుతున్న మత్తయి 5:⁠13వ వచనం ఆధారంగా ప్రారంభించాడు. యేసు పలికిన ఆ మాటలు పట్టభద్రులౌతున్న విద్యార్థులకు తప్పకుండా వర్తిస్తాయని సహోదరుడు లెట్‌ వివరించాడు. ఉదాహరణకు, భోజనానికి రుచిని తెచ్చే గుణాలు ఉప్పులో ఉన్నాయి. అలాగే, మిషనరీలు కూడా తమ నైపుణ్యవంతమైన ప్రకటనా పని ద్వారా అలంకారార్థంలో ఉప్పులా ఉన్నారు.

వీడ్కోలు ప్రోత్సాహం

అటుతర్వాత ఎంతో కాలంగా యెహోవాను సేవిస్తున్నవారిని సహోదరుడు లెట్‌ పరిచయం చేశాడు, వారు క్లుప్తమైనవే అయినా ఎంతో శక్తిమంతమైన లేఖనాధార ప్రసంగాల్ని ఇచ్చారు. మొదటిగా, రైటింగ్‌ డిపార్ట్‌మెంట్లో సేవ చేస్తున్న జాన్‌ విస్చక్‌ ప్రసంగించాడు. ఆయన 117వ కీర్తన ఆధారంగా, “అతి చిన్న కీర్తన మిషనరీ స్ఫూర్తిని పెంపొందింపజేస్తుంది” అనే ప్రసంగాన్ని అందజేశాడు. నేడు, యెహోవాను గూర్చీ ఆయన రాజ్యాన్ని గూర్చీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘అన్యజనులకు’ నిజానికి ‘సర్వజనులకూ’ సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. “యెహోవాను స్తుతించుడి” అని ఇతరులకు ఉద్బోధించడం ద్వారా కీర్తన 117ను నెరవేర్చాలని విద్యార్థులు ప్రోత్సహించబడ్డారు.

అటుతర్వాత పరిపాలక సభ సభ్యుడైన గయ్‌ పీయర్స్‌ను చైర్మన్‌ ఆహ్వానించాడు. ఆయన “పరిస్థితులకు అనుగుణంగా మారండి, అయినప్పటికీ స్థిరంగా ఉండండి” అనే అంశంపై మాట్లాడాడు. దేవుని వాక్యం స్థిరమైనది. ద్వితీయోపదేశకాండము 32:4 లో యెహోవా దేవుడు దుర్గము అని పిలవబడ్డాడు, అయినా మనం పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ఆయన వాక్యం అనుమతినిస్తుంది, ఎందుకంటే ఆ వాక్యం అన్ని భాషలవారి కోసం అన్ని సంస్కృతులవారి కోసం​—⁠అవును, మానవజాతి అంతటి కోసం వ్రాయబడింది. దేవుని వాక్యాన్ని ప్రకటించమనీ, దాని సందేశం ప్రజల హృదయాల్నీ వారి మనస్సాక్షుల్నీ స్పృశించేలా చేయమనీ విద్యార్థులను ఆయన ఆదేశించాడు. (2 కొరింథీయులు 4:⁠2) “సరైన సూత్రాలకు స్థిరంగా అంటిపెట్టుకుని ఉండండి, అదే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా మారండి. మీ సేవా నియామక ప్రాంతంవారి సంస్కృతి వేరుగా ఉన్నప్పుడు వారిని చిన్నచూపు చూడకండి” అని సహోదరుడు పీయర్స్‌ ఉద్బోధించాడు.

ప్రపంచ ముఖ్య కార్యాలయాల్లో దాదాపు 53 సంవత్సరాలుగా సేవ చేస్తున్న, గిలియడ్‌ ఉపదేశకుల్లో ఒకరైన కార్ల్‌ ఆడమ్స్‌, “మీరిక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు?” అనే ఆలోచనను రేకెత్తించే అంశంపై మాట్లాడాడు. 24 జంటలు ప్రపంచంలోని 20 దేశాల్లో సేవ చేసేందుకు నియమించబడ్డారన్నది నిజమే. కానీ వారిని అడుగుతున్న ప్రశ్నేమిటంటే, మీరక్కడికి చేరుకున్న తర్వాత ఆ దేశాన్ని చూసిన తర్వాత, మీరేం చేస్తారు? మనం అవిశ్రాంతంగా ఉన్న లోకంలో జీవిస్తున్నాం. ప్రజలు తమను తాము తృప్తిపర్చుకునే ప్రయత్నంలో క్రొత్త క్రొత్త ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు, క్రొత్త క్రొత్త పనులు చేయాలనుకుంటారు. అయితే, తన “గొఱ్ఱెల” పట్ల గిలియడ్‌ విద్యార్థులు నిస్వార్థంగా శ్రద్ధవహించాలన్న కోరికతో యెహోవా వారికి తాను కోరుకున్న ప్రాంతాల్లో నియామకాన్ని ఇచ్చాడు. వారు ప్రాచీన ఇశ్రాయేలులోనివారిలా ఉండకూడదు. తమ స్వార్థం మూలంగా, పూర్తి మానవజాతిని ఆశీర్వదించేందుకు యెహోవాచే ఉపయోగించబడే అవకాశాన్ని వారు కోల్పోయారు. గిలియడ్‌ విద్యార్థులు వారిలా కాకుండా, యేసుక్రీస్తును అనుకరించాలి. ఆయన ఎల్లప్పుడు నిస్వార్థంగా తన తండ్రి చిత్తాన్ని చేశాడు, తాను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోను విధేయతను కనబరిచాడు.​—⁠యోహాను 8:29; 10:⁠16.

గిలియడ్‌ స్కూలు రిజిస్ట్రార్‌ అయిన వాలెస్‌ లివరెన్స్‌ “దేవుని లోతైన విషయాల్ని అమూల్యమైనవిగా ఎంచండి” అనే అంశంపై మాట్లాడాడు. లేఖనాలు దేవుని వాక్యాన్ని పదే పదే సిరిసంపదలతోను, విలువగల రత్నాలతోను, అమూల్యమైన లోహాలతోను, ఇంకా ఎంతో ఖరీదైన వస్తువులతోను పోల్చాయి. సామెతలు 2:​1-5 వచనాలు, “దేవుని గూర్చిన విజ్ఞానము”ను కనుగొనాలంటే మనం దాని కోసం “దాచబడిన ధనమును వెదకినట్లు” వెదకాలని చెబుతున్నాయి. విద్యార్థులు తమ క్రొత్త నియామకాల్లో సేవ చేస్తుండగా, దేవుని లోతైన విషయాలను త్రవ్వుతూ ఉండాలని ప్రసంగీకుడు వారిని ప్రోత్సహించాడు. సహోదరుడు లివరెన్‌ ఇలా తర్కించాడు: “అలా చేయడం ఆచరణాత్మకమే, ఎందుకంటే అది యెహోవాపై మీకున్న విశ్వాసాన్నీ నమ్మకాన్నీ దృఢపరుస్తుంది, మీరు మీ నియామకాన్ని అంటిపెట్టుకొని ఉండాలన్న మీ దృఢ తీర్మానాన్ని మరింత బలపరుస్తుంది. మీరు దేవుని సంకల్పాల్ని ఇతరులకు వివరిస్తుండగా మీరు మరింత స్థిర నిశ్చయతతో మాట్లాడేలా, మరింత ప్రభావవంతమైన బోధకులుగా ఉండేలా కూడా సహాయం చేస్తుంది.”

విద్యార్థులు తరగతి గదిలో కూర్చుని చర్చిస్తున్నట్లుగా నటింపజేస్తూ మరో గిలియడ్‌ స్కూలు ఉపదేశకుడు, గత ఐదు నెలలుగా విద్యార్థుల క్షేత్ర సేవా కార్యకలాపాల్ని యెహోవా ఎలా ఆశీర్వదించాడో సమీక్షించాడు. ఎఫెసులోని తన బహిరంగ పరిచర్యను గురించి అపొస్తలుల కార్యములు 20:​20, 21 వచనాల్లో అపొస్తలుడైన పౌలు పలికిన మాటల్ని లారెన్స్‌ బౌవెన్‌ పేర్కొన్నాడు. పౌలు సాక్ష్యమిచ్చేందుకు తనకు తటస్థపడిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నాడు. దేవుని పట్లా పొరుగువారి పట్లా ప్రేమను కలిగివున్న వ్యక్తులు సత్యాన్ని గూర్చి మాట్లాడకుండా, దేవునివాక్య శక్తి ఇతరుల్లో పనిచేసేందుకు అనుమతించకుండా ఎన్నడూ తమను తాము ఆపుకోలేరని, అపొస్తలుడైన పౌలులానే విద్యార్థులకు ఎదురైన అనుభవాలు రుజువుచేశాయి. అలా జరిగినప్పుడు యెహోవా నుండి మెండైన ఆశీస్సులు వస్తాయి.

అనుభవజ్ఞుల మాటలు

గిలియడ్‌ స్కూలులో గడిపిన కాలంలో విద్యార్థులు, 23 దేశాల నుండి వచ్చిన బ్రాంచి కమిటీ సభ్యుల సాహచర్యంలో ఎంతో ప్రయోజనం పొందారు. వీరు పాటర్‌సన్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌కు ప్రత్యేక శిక్షణ నిమిత్తం వచ్చివున్నారు. సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన లియోన్‌ వీవర్‌, మెర్టన్‌ కాంప్‌బెల్‌లు బ్రాంచి కమిటీ సభ్యుల్లోని కొందరితో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ బ్రాంచి కమిటీ సభ్యుల్లో కొందరు మునుపు గిలియడ్‌ స్కూలు పట్టభద్రులే. అనుభవజ్ఞులైన ఈ మిషనరీలు మాట్లాడుతుండగా విని విద్యార్థుల మనస్సులూ వారి కుటుంబ సభ్యుల స్నేహితుల మనస్సులూ ఎంతగానో కుదుటపడ్డాయి.

పట్టభద్రులౌతున్నవారు విదేశీ నియామకాల్లో స్థిరపడడానికి సహాయపడే సలహాల్లో ఈ వ్యాఖ్యానాలున్నాయి: “అనుకూల దృక్పథం కలిగివుండండి. మీకు చాలా క్రొత్తగా అన్పించిన పరిస్థితులు, అర్థంకాని పరిస్థితులు ఎదురైతే నియామకాల్ని వదిలేసి వచ్చేయకండి. యెహోవాపై ఆధారపడండి”; “మీకు అందుబాటులో ఉన్నవాటితోనే సంతృప్తిపడడం నేర్చుకోండి, జీవితావసరాలను యెహోవా తీరుస్తాడని నమ్మకం ఉంచండి.” విద్యార్థులు తమ నియామకాల్లో ఆనందాన్ని కలిగివుండడానికి సహాయం చేసేందుకు మరితర వ్యాఖ్యానాలపై దృష్టిని సారించడం జరిగింది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి: “మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారో, దానితో మీరు వెళ్తున్న ప్రాంతాన్ని పోల్చకండి”; “స్థానిక భాషను నేర్చుకోండి, దాన్ని సరిగా ఉపయోగించండి, అలాగైతేనే మీరు ప్రజలతో సంభాషించగల్గుతారు”; “అక్కడి ప్రజల ఆచారాలను గురించీ, సంస్కృతుల గురించీ తెలుసుకోండి, ఎందుకంటే మీరు మీ నియామకంలో కొనసాగడానికి ఇవి తప్పక ఉపయోగపడతాయి.” ఇటువంటి అనేక వ్యాఖ్యానాలు క్రొత్త మిషనరీలకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చాయి.

ఇంటర్వ్యూల తర్వాత, గిలియడ్‌ యొక్క 42వ తరగతి నుండి పట్టభద్రుడై మునుపు మిషనరీగా ఉండి, ఇప్పుడు యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడిగా సేవ చేస్తున్న డేవిడ్‌ స్‌ప్లేన్‌ కీలక ప్రసంగాన్ని ఇచ్చాడు. “విద్యార్థులా లేక పట్టభద్రులా​—⁠ఎవరు మీరు?” అనే అవధానాన్ని ఆకర్షించే అంశంపై ఆయన ప్రసంగించాడు. ఆయన విద్యార్థుల్ని ఇలా ప్రశ్నించాడు: “మీ మిషనరీ నియామకానికి వెళ్తుండగా మిమ్మల్ని మీరు ఎలా దృష్టించుకోబోతున్నారు? మిషనరీ పని గురించి సమస్తం తెలిసిన పట్టభద్రుల్లానా లేదా ఇంకా ఎంతో నేర్చుకోవల్సివున్న విద్యార్థుల్లానా?” సహోదరుడు స్‌ప్లేన్‌, జ్ఞానియైన పట్టభద్రుడు తనను తాను ఎల్లప్పుడూ విద్యార్థిగానే దృష్టించుకుంటాడని చెప్పాడు. తమ మిషనరీ నియామకంలో తాము కలిసే ప్రతి ఒక్కరు తమకు ఎంతో కొంత నేర్పించే అవకాశం ఉందన్న దృక్కోణాన్ని మిషనరీలు అలవర్చుకోవాలి. (ఫిలిప్పీయులు 2:⁠3) తమ తోటి మిషనరీలతో, బ్రాంచి కార్యాలయంతో, స్థానిక సంఘంతో సన్నిహితంగా పనిచేస్తూ సహకరించాలని విద్యార్థులు ప్రోత్సహించబడ్డారు. “మీ చివరి పరీక్షల్లో పాసయ్యారు, కానీ మీరు విద్యార్థులుగా ఉండడం ఇంకా ముగియలేదు. మీరు అక్కడికి వెళ్ళింది నేర్చుకోవడానికేనని అందరికి స్పష్టం చేయండి” అని సహోదరుడు స్‌ప్లేన్‌ ఉద్బోధించాడు.

తన ప్రసంగం తర్వాత విద్యార్థులు తమ డిప్లొమాలను అందుకున్నారు, వారి నియామకాలు ప్రేక్షకులకు ప్రకటించబడ్డాయి. తరగతి ప్రతినిధి తమ తీర్మానాన్ని చదువుతున్నప్పుడు పట్టభద్రులైన విద్యార్థులు ఎంతగానో కదిలిపోయారు. పవిత్ర సేవా కార్యకలాపాలను మరింత ఎక్కువగా చేసేందుకు తమకు పురికొల్పునిచ్చేలా దేవుని వాక్యం నుండి తాము నేర్చుకున్న విషయాలను ఉపయోగిస్తామన్న తమ స్థిర నిశ్చయం ఆ తీర్మానంలో ఉంది.

దేవుని పట్లా తమ పొరుగువారి పట్లా ప్రేమను ప్రదర్శించాలనే పట్టభద్రుల తీర్మానాన్ని, అక్కడ వారు పొందిన సలహాలు మరింత దృఢపర్చాయన్న విషయంతో అక్కడ హాజరైనవారందరూ ఏకీభవిస్తారు. అంతేగాక, తమ మిషనరీ నియామకాల్లో ప్రజలకు ఆధ్యాత్మికంగా సహాయపడాలన్న వారి కృత నిశ్చయాన్ని మరింత బలపర్చాయి కూడాను.

[25వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 10

పంపించబడిన దేశాల సంఖ్య: 20

విద్యార్థుల సంఖ్య: 48

సగటు వయస్సు: 33.7

సత్యంలో సగటు సంవత్సరాలు: 16.2

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12.5

[26వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 109వ తరగతి

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఉన్నాయి.

(1) కాలిన్స్‌, ఇ.; మైల్స్‌, ఎల్‌.; అల్వరాడో, ఎ.; లేక్‌, జె. (2) వాన్‌ డూసన్‌, ఎల్‌.; బీహారీ, ఎ.; హెయ్‌కీనన్‌, హెచ్‌.; కోస్‌, ఎస్‌.; స్మిత్‌, హెచ్‌. (3) యాష్‌ఫర్డ్‌, జె.; యాష్‌ఫర్డ్‌, సి.; బోర్‌, సి.; రిచర్డ్‌, ఎల్‌.; విల్బీర్న్‌, డి.; లేక్‌, జె. (4) చీచీయీ, కె.; చీచీయీ, హెచ్‌.; రమీరెజ్‌, ఎమ్‌.; బౌమాన్‌, డి.; బెకర్‌, జి.; బీహారీ, ఎస్‌.; రమీరెజ్‌, ఎ. (5) వాన్‌ డూసన్‌, డబ్ల్యు.; లమాట్ర, హెచ్‌.; పిస్కో, జె.; కట్స్‌, ఎల్‌.; రస్సెల్‌, హెచ్‌.; జాన్సన్‌, ఆర్‌. (6) బెకర్‌, ఎఫ్‌.; బౌమన్‌, డి.; జాన్సన్‌, కె.; పైఫర్‌, ఎ.; మేసన్‌, సి.; లమాట్ర, జె.; హెయ్‌కీనన్‌, పి. (7) స్మిత్‌, ఆర్‌.; రస్సెల్‌, జె.; కాలిన్స్‌, ఎ.; పిస్కో, డి.; విల్బీర్న్‌, ఆర్‌.; కోస్‌, జి. (8) కట్స్‌, బి.; బోర్‌, జె.; మేసన్‌, ఎన్‌.; పైఫర్‌, ఎస్‌.; రిచర్డ్‌, ఇ.; మైల్స్‌, బి.; అల్వరాడో, ఆర్‌.