పైవిచారణకర్తలు, పరిచర్య సేవకులు దైవపరిపాలనా విధానంలో నియమించబడతారు
పైవిచారణకర్తలు, పరిచర్య సేవకులు దైవపరిపాలనా విధానంలో నియమించబడతారు
“పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా [“పైవిచారణకర్తలనుగా,” NW] ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.”—అపొస్తలుల కార్యములు 20:28.
1, 2. యెషయా 60:22 ఎలా నెరవేరుతోంది?
అంత్యదినాల్లో గమనార్హమైనదొకటి సంభవిస్తుందని యెహోవా ఎంతో కాలం పూర్వమే ప్రవచించాడు. అదేమిటో ప్రవక్తయైన యెషయా ద్వారా తెల్పబడింది: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.”—యెషయా 60:22.
2 ఈ ప్రవచనం నేడు నెరవేరుతోందనడానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఉన్నాయి! అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న అలిగేనీలో యెహోవా ప్రజల ఒక చిన్న సంఘం 1870లలో ఏర్పడింది. అలా చిన్నగా ప్రారంభమై దినదిన ప్రవర్థమానం చెందుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలాది సంఘాలుగా ఏర్పడి, ఆ సంఘాలు ఇంకా వృద్ధవుతూనే ఉన్నాయి. భూవ్యాప్తంగా 235 దేశాల్లో లక్షలాదిమంది రాజ్య ప్రచారకులు ఒక గొప్ప జనాంగంలా తయారై ఇప్పుడు 91,000కుపైగా సంఘాలతో సహవసిస్తున్నారు. ఎంతో సమీపంలో ఉన్న “మహా శ్రమ” రావడానికి ముందే సత్యారాధకుల్ని సమకూర్చే పనిని యెహోవా త్వరితం చేస్తున్నాడని మరో ప్రశ్నకు తావివ్వకుండా నిరూపిస్తుంది.—మత్తయి 24:20, 21; ప్రకటన 7:9-14.
3. ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున’ బాప్తిస్మం పొందడం అంటే అర్థమేమిటి?
3 యెహోవాకు వ్యక్తిగత సమర్పణ చేసుకున్న తర్వాత, యేసు ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ఈ లక్షలాదిమంది ప్రజలు “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మం పొందారు. (మత్తయి 28:19) ‘తండ్రి నామమున’ బాప్తిస్మం పొందడం అంటే ఈ సమర్పిత వ్యక్తులు యెహోవాను తమ పరలోక తండ్రిగా, తమ జీవదాతగా గుర్తించి ఆయన సర్వాధిపత్యానికి లోబడతారని అర్థం. ‘కుమారుని నామమున’ బాప్తిస్మం అనేది వారు యేసుక్రీస్తు తమ విమోచకుడనీ, నాయకుడనీ, రాజనీ ఒప్పుకోవడాన్ని సూచిస్తుంది. తమ జీవితాల్ని నడిపించడంలో దేవుని పరిశుద్ధాత్మ, అంటే దేవుని చురుకైన శక్తి వహించే పాత్రను కూడా వారు గుర్తిస్తారు. వారు ‘పరిశుద్ధాత్మ నామంలో’ బాప్తిస్మం పొందారని అది సూచిస్తుంది.
4. క్రైస్తవ పరిచారకులు ఎలా నియుక్తులౌతారు?
4 క్రొత్త శిష్యులు తాము బాప్తిస్మం పొందినప్పుడే యెహోవా దేవుని పరిచారకులుగా నియుక్తులౌతారు. వారినిలా నియమించేది ఎవరు? విస్తృతార్థంలో చూస్తే, 2 కొరింథీయులు 3:5 లో నమోదు చేయబడింది వారికి వర్తిస్తుంది: “[పరిచారకులుగా] మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది.” సాక్షాత్తు యెహోవా దేవుని చేతనే నియమించబడడం కన్నా మించిన మరే గొప్ప ఘనతను వారు ఆశించగలరు! తమ బాప్తిస్మం తర్వాత వారు దేవుని ఆత్మ నడిపింపును స్వీకరిస్తూ ఆయన వాక్యాన్ని తమ జీవితాల్లో నిరంతరం అన్వయించుకుంటూ ఉండేంత వరకు “సువార్త” పరిచారకులుగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు.—మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 9:31.
దైవపరిపాలనా నియామకం—ప్రజాస్వామ్యం కాదు
5. క్రైస్తవ పైవిచారణకర్తలు, పరిచర్య సేవకులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక అవుతారా? వివరించండి.
5 చురుకైన పరిచారకుల సంఖ్య పెరుగుతుండగా వారి ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ వహించడానికి అర్హులైన పైవిచారణకర్తల పరిణతితో కూడిన పర్యవేక్షణా, పరిచర్య సేవకుల సామర్థ్యంగల సహాయమూ కావల్సివస్తుంది. (ఫిలిప్పీయులు 1:1) అలాంటి ఆధ్యాత్మిక పురుషులు ఎలా నియమించబడతారు? క్రైస్తవమత సామ్రాజ్యం ఉపయోగించే పద్ధతుల్లో మాత్రం కాదు. ఉదాహరణకు, క్రైస్తవ పైవిచారణకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కారు, అంటే, ఒక సంఘంతో సహవసించే ప్రజల నుండి మెజారిటీ ఓట్లు పొందడం ద్వారా ఎన్నిక కారు. బదులుగా ఆ నియామకాలు దైవపరిపాలనా విధానంలో జరుగుతాయి. అంటే ఏమిటి?
6. (ఎ) నిజమైన దైవపరిపాలన అంటే ఏమిటి? (బి) పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల నియామకాలు దైవపరిపాలనా విధానానికి అనుగుణ్యమైనవని ఎందుకు చెప్పగలం?
6 క్లుప్తంగా చెప్పాలంటే, నిజమైన దైవపరిపాలనకు అర్థం దేవునిచేత పరిపాలించబడడం అనే. యెహోవాసాక్షులు ఆయన పరిపాలనకు స్వచ్ఛందంగా లోబడి, దైవిక చిత్తాన్ని చేయడానికిగాను ఒకరికొకరు సహకరిస్తారు. (కీర్తన 143:10; మత్తయి 6:9, 10) క్రైస్తవ పైవిచారణకర్తల అంటే క్రైస్తవ పెద్దల, అలాగే పరిచర్య సేవకుల నియామకాలు దైవపరిపాలన విధానంలోనే జరుగుతాయి. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో వివరించబడిన దేవుని ఏర్పాటుకు అనుగుణ్యంగానే బాధ్యతగల ఆ పురుషుల్ని సిఫారసు చేసి నియమించడం జరుగుతుంది. తన దృశ్య సంస్థ ఎలా పనిచేయాలన్నది నిర్ధారించే హక్కు “అందరి మీదను . . . అధిపతిగా” ఉన్న యెహోవాదే.—1 దినవృత్తాంతములు 29:11; కీర్తన 97:9.
7. యెహోవాసాక్షులు ఎలా పరిపాలించబడతారు?
7 క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేక చర్చీల గుంపుల్లో ఉన్నట్లుగా కాక, యెహోవాసాక్షులు తాము ఎటువంటి ఆధ్యాత్మిక ప్రభుత్వం క్రింద పనిచేస్తామన్నది తామే నిర్ణయించుకోరు. నిష్కపటులైన ఆ క్రైస్తవులు యెహోవా ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడానికి కృషి చేస్తారు. వారిలో పైవిచారణకర్తలైనవారు సంఘ సంబంధమైన, మతాచార్యుల సంబంధమైన, లేక ప్రెస్బిటేరియన్ సంబంధమైన చర్చి ప్రభుత్వంచేత నియమించబడరు. ఆ నియామకాల్లో ఈ లోకంలోని శక్తులు జోక్యంచేసుకోవడానికి ప్రయత్నించినట్లైతే, యెహోవా ప్రజలు రాజీ పడరు. అచంచలమైన రీతిలో, మొదటి శతాబ్దంలోని అపొస్తలులు ఎంతో చక్కగా వ్యక్తం చేసిన స్థానాన్నే తాము కాపాడుకోవాలనుకుంటారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.” (అపొస్తలుల కార్యములు 5:29) అందుకే, సాక్షులు అన్ని విషయాల్లో తమను తాము దేవునికి లోబరచుకుంటారు. (హెబ్రీయులు 12:9; యాకోబు 4:7) దైవపరిపాలనా విధానాల్ని అనుసరించడం దైవిక అంగీకారాన్ని తీసుకువస్తుంది.
8. ప్రజాస్వామ్య, దైవపరిపాలనా పద్ధతులు ఎలా వేర్వేరుగా ఉన్నాయి?
8 మహోన్నత పరిపాలకుడైన యెహోవాకు సేవకులుగా మనం ప్రజాస్వామ్య పద్ధతులకూ దైవపరిపాలనా పద్ధతులకూ మధ్యగల తేడాల్ని గుర్తుంచుకోవడం మంచిది. ప్రజాస్వామ్య పద్ధతులకు సమాన ప్రాతినిధ్యం అవసరమౌతుంది; అవి తరచుగా, అధికారం కోసం ప్రచారం చేయడం, మెజారిటీ ఓట్లను సాధించడం ద్వారా ఎంపికవ్వడం వంటి వాటి చేత గుర్తించబడతాయి. అటువంటి పద్ధతులు దైవపరిపాలనా నియామకాల్లో ఉండవు. ఆ నియామకాలు మనుష్యుల నుండి వచ్చేవి కావు; అవి ఏదో చట్టబద్ధమైన సొసైటీ నుండి కూడా రావు. “అన్యజనులకు అపొస్తలు”నిగా తాను యేసు యెహోవాలచేత నియమించబడ్డానన్న విషయాన్ని పరోక్షంగా సూచిస్తూ, పౌలు, తాను “మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను” నియమించబడ్డానని గలతీయులకు చెప్పాడు.—రోమీయులు 11:13, 14; గలతీయులు 1:1.
పరిశుద్ధాత్మచే నియామకం
9. క్రైస్తవ పైవిచారణకర్తల నియామకం గురించి అపొస్తలుల కార్యములు 20:28 ఏమి చెబుతుంది?
9 ఎఫెసులో నివసిస్తున్న పైవిచారణకర్తలు పరిశుద్ధాత్మ ద్వారా దేవునిచే నియమించబడ్డారని పౌలు వారికి గుర్తుచేశాడు. ఆయనిలా అన్నాడు: “దేవుడు తన [కుమారుని] స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (ఇటాలిక్కులు మావి.) (అపొస్తలుల కార్యములు 20:28) దేవుని మందకు కాపరులుగా వారు తమ విధులను నిర్వర్తిస్తుండగా ఆ క్రైస్తవ పైవిచారణకర్తలు పరిశుద్ధాత్మచేత నడిపించబడడంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. నియమిత అధికార స్థానంలో ఉన్న ఒక పురుషుడు అటు తరువాత దైవిక ప్రమాణాలకు సరితూగకపోతే ఆయన్ను ఆ స్థానం నుండి తీసేసేలా సకాలంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది.
10. దైవపరిపాలనా నియామకాల్లో పరిశుద్ధాత్మ కీలకమైన పాత్రను పోషించడం ఎలా సాధ్యం?
10 పరిశుద్ధాత్మ ఒక కీలకమైన పాత్రను పోషించడం ఎలా సాధ్యం? మొట్టమొదటిగా చెప్పాలంటే, ఆధ్యాత్మిక పైవిచారణా పనిని నిర్వర్తించడానికి కావల్సిన అర్హతల్ని గురించి చెప్పే నివేదిక పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడింది. తిమోతి, తీతులకు వ్రాసిన పత్రికల్లో పౌలు పైవిచారణకర్తలు, పరిచర్య సేవకులు చేరుకోవల్సిన అర్హతల్ని 1 తిమోతి 3:1-10, 12, 13; తీతు 1:5-9.
గురించి చెప్పాడు. మొత్తంగా ఆయన 16 వేర్వేరు అర్హతల్ని పేర్కొన్నాడు. ఉదాహరణకు, పైవిచారణకర్తలు నిందారహితులుగా, మితానుభవులుగా, స్వస్థబుద్ధిగలవారిగా, మర్యాదస్థులుగా, అతిథిప్రియులుగా, బోధింపతగినవారిగా, కుటుంబశిరస్సు పాత్రల్లో మాదిరికరమైనవారిగా ఉండాలి. వారు మద్యపానీయాల విషయంలో సమతౌల్యాన్ని కాపాడుకోవాలి, ధనాపేక్షలేనివారై ఉండాలి, ఆశానిగ్రహము గలవారై ఉండాలి. అదే విధంగా పరిచర్య సేవకులుగా నియమించబడేందుకు తగిన అర్హతలను చేరుకునే పురుషుల కోసం కూడా ఉన్నతమైన ప్రమాణాలే ఏర్పర్చబడ్డాయి.—11. సంఘ బాధ్యతల్ని చేపట్టే లక్ష్యం వైపుగా పురోభివృద్ధి చెందే పురుషులు చేరుకోవాల్సిన కొన్ని అర్హతలు ఏమిటి?
11 ఆ అర్హతలను పునఃసమీక్షించడం, యెహోవా ఆరాధనలో నడిపింపునిచ్చే వ్యక్తులు క్రైస్తవ ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలన్న విషయాన్ని బయల్పరుస్తుంది. సంఘ బాధ్యతల్ని చేపట్టే లక్ష్యాన్ని చేరుకునే పురుషులు తమపై పరిశుద్ధాత్మ పనిచేస్తుందన్న నిదర్శనాన్ని ఇవ్వాలి. (2 తిమోతి 1:14) దేవుని ఆత్మ ఈ పురుషుల్లో “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి ఫలాల్ని ఉత్పత్తి చేస్తుందని స్పష్టంగా కనబడాలి. (గలతీయులు 5:22, 23) వారు తమ తోటి విశ్వాసులతోను మరితరులతోను వ్యవహరించేటప్పుడు అలాంటి ఫలాలు ప్రదర్శితమౌతాయి. నిజమే, కొందరు ఆత్మ యొక్క కొన్ని ఫలాల్ని ప్రదర్శించడంలో చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుండవచ్చు, మరి కొందరు పైవిచారణకర్తలకు ఉండాల్సిన వేరే అర్హతల్ని అత్యుచ్ఛ స్థాయిలో కలిగివుంటుండవచ్చు. అయితే, పైవిచారణకర్తలుగానైనా పరిచర్య సేవకులుగానైనా నియమించబడాలని నిరీక్షించే వారందరూ తాము ఆధ్యాత్మిక పురుషులమనీ, దేవుని వాక్యంలోని అర్హతలకు అనుగుణ్యంగా ఉంటున్నామనీ తమ పూర్తి జీవిత విధానంలో ప్రదర్శిస్తుండాలి.
12. పరిశుద్ధాత్మచేత నియమించబడ్డారని ఎవరి గురించి చెప్పవచ్చు?
12 పౌలు తనను పోలి నడుచుకోమని ఇతరులను ఉద్బోధ చేసినప్పుడు ఆయనలా ఎంతో స్వేచ్ఛగా నిస్సంకోచంగా చెప్పగలిగాడు, ఎందుకంటే ‘మనం తన అడుగుజాడల్లో నడుచుకునేటట్లు మనకు మాదిరి ఉంచిన’ యేసుక్రీస్తును ఆయన తానుగా పోలి నడుచుకుంటున్నాడు. (1 పేతురు 2:21; 1 కొరింథీయులు 11:1) పైవిచారణకర్తలుగా లేదా పరిచర్య సేవకులుగా తాము నియమించబడే సమయంలో లేఖనాధార అర్హతల్ని చేరుకునేవారు పరిశుద్ధాత్మచేత నియమించబడ్డారని చెప్పవచ్చు.
13. సంఘంలో సేవచేసే పురుషుల్ని సిఫారసు చేసేవారికి పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుంది?
13 పైవిచారణకర్తల సిఫారసు, నియామకాల సంబంధంగా పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందో సూచించే మరొక అంశం ఉంది. ‘తన్ను అడిగేవారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తాడని’ యేసు అన్నాడు. (లూకా 11:13) అందుకని స్థానిక సంఘంలోని పెద్దలు సంఘ బాధ్యతల్ని నిర్వర్తించే పురుషుల్ని సిఫారసు చేసేందుకు సమకూడిన సమయంలో, వారు తమను నడిపించమని దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తారు. దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలులో పేర్కొనబడిన దాని ఆధారంగా వారు సిఫారసుల్ని చేస్తారు, నియమించబడేందుకు పరిగణలోనికి తీసుకోబడుతున్న ఒక వ్యక్తి లేఖనాధార అర్హతల్ని చేరుకున్నాడా లేదాయని గ్రహించేందుకు ఆ సమయంలో పరిశుద్ధాత్మ వారికి సహాయం చేస్తుంది. సిఫారసులు చేసేవారు కేవలం పైపై రూపాలు, విద్యాపరమైన అర్హతలు, లేదా సహజ సామర్థ్యాలు వంటి వాటిచేతనే ముఖ్యంగా ప్రభావితమవ్వరు. వారు ప్రాథమికంగా చూసేదేమంటే, పలాని వ్యక్తి ఆధ్యాత్మిక పురుషుడా కాదా, సంఘంలోని సభ్యులు ఆధ్యాత్మిక సలహాల కోసం ఆ వ్యక్తి దగ్గరికి నిస్సంకోచంగా సమీపించదగ్గ వ్యక్తా కాదా అన్నవే.
14. అపొస్తలుల కార్యములు 6:1-3 నుండి మనం ఏమి తెలుసుకుంటాము?
14 పెద్దలుగా, పరిచర్య సేవకులుగా సేవచేయబోయే సహోదరుల్ని సిఫారసు చేయడంలో పెద్దల సభ ప్రయాణ పైవిచారణకర్తలతో పాలుపంచుకున్నా, అసలు నియామకాలు మొదటి శతాబ్దంలో ఏర్పర్చబడిన పద్ధతిలోనే చేయబడతాయి. ఒక సందర్భంలో ప్రాముఖ్యమైన ఒక నియామకాన్ని నెరవేర్చడానికి ఆధ్యాత్మికంగా అర్హులైన వ్యక్తుల అవసరం ఏర్పడింది. పరిపాలక సభ ఈ నిర్దేశాన్నిచ్చింది: “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము.” (అపొస్తలుల కార్యములు 6:1-3) సిఫారసులను ఆ పరిస్థితితో ప్రత్యక్షంగా వ్యవహరించే పురుషులే చేసినప్పటికీ, నియామకాలు మాత్రం యెరూషలేములోని బాధ్యతగల పురుషులు చేశారు. నేడు కూడా అలాంటి పద్ధతినే అనుసరించడం జరుగుతోంది.
15. పురుషుల్ని నియమించే పనిలో పరిపాలక సభ ఎలా ఇమిడివుంది?
లూకా 12:48) బ్రాంచి కమిటీ సభ్యుల్ని నియమించడానికి తోడు పరిపాలక సభ బేతేలు పెద్దల్ని, ప్రయాణ పైవిచారణకర్తల్ని నియమిస్తుంది. అయితే, మరితర నియామకాల్ని చేసేందుకు మాత్రం తమ పక్షాన పనిచేసేందుకు పరిపాలక సభ బాధ్యతగల సహోదరుల్ని నియమిస్తుంది. ఇందుకు లేఖనాధారం కూడా ఉంది.
15 బ్రాంచి కమిటీ సభ్యులందర్నీ యెహోవాసాక్షుల పరిపాలక సభయే సూటిగా నియమిస్తుంది. అలాంటి గురుతరమైన బాధ్యతల్ని ఎవరు చేపట్టాలో నిర్ణయించేటప్పుడు పరిపాలక సభ మనస్సులో యేసు పల్కిన ఈ మాటలు ఉంటాయి: “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వానియొద్ద ఎక్కువగా అడుగుదురు.” (‘నేను నీకాజ్ఞాపించిన ప్రకారం, పెద్దల్ని నియమించు’
16. పౌలు తీతును క్రేతులో ఎందుకు విడిచివచ్చాడు, నేటి దైవపరిపాలనా నియామకాల గురించి ఇది ఏమి సూచిస్తుంది?
16 పౌలు తన తోటి పనివాడైన తీతుకు ఇలా చెప్పాడు: “నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.” (తీతు 1:5) అటుతరువాత, అలాంటి నియామకాలకు యోగ్యులయ్యే పురుషులకు ఉండాల్సిన ఏ అర్హతల్ని గమనించాలో పౌలు తీతుకు వివరించాడు. అందుకని, నేడు పరిపాలక సభ పెద్దలను, పరిచర్య సేవకులను నియమించడానికి తమకు ప్రాతినిధ్యం వహించేందుకుగాను బ్రాంచీల్లో అర్హులైన సహోదరులను నియమిస్తుంది. పరిపాలక సభకు ప్రాతినిధ్యం వహించేవారు అలా నియమించడంలోని లేఖనాధార సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకుని వాటిని పాటించేవారేనని పూర్తి జాగ్రత్త తీసుకోబడుతుంది. ఆ విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో సేవచేసేందుకు అర్హతగల పురుషుల నియామకం పరిపాలక సభ నిర్దేశంలోనే జరుగుతుంది.
17. పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల నియామకాల కోసం చేసే సిఫారసులతో బ్రాంచి కార్యాలయం ఎలా వ్యవహరిస్తుంది?
17 పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల నియామకం కొరకైన సిఫారసులు వాచ్ టవర్ సొసైటీ యొక్క బ్రాంచిల్లో ఒక బ్రాంచి కార్యాలయానికి సమర్పించబడినప్పుడు, ఆయా నియామకాల్ని చేయడంలో నడిపింపు కోసం అనుభవజ్ఞులైన పురుషులు దేవుని ఆత్మపై ఆధారపడతారు. ఆ పురుషులు, తాము ఏ పురుషుడిపైనా త్వరపడి హస్తనిక్షేపణము చేయకూడదని అలాచేస్తే తాము కూడా అతని పాపములో పాలివారమని గ్రహిస్తూ, ఒక విధమైన బాధ్యతా భావాన్ని కలిగివుంటారు.—1 తిమోతి 5:22.
18, 19. (ఎ) కొన్ని నియామకాలను గూర్చిన సమాచారం ఎలా చేరవేయబడుతుంది? (బి) సిఫారసు, నియామకాలకు సంబంధించిన యావత్ ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుంది?
18 ఒక చట్టబద్ధమైన సొసైటీ అధికారిక ముద్ర ఉన్న ఉత్తరం ద్వారా కొన్ని నియామకాలను చేయవచ్చు. సంఘంలోని ఒకరు లేక అంతకన్నా ఎక్కువమంది సహోదరుల్ని నియమించడానికి అలాంటి ఉత్తరాన్ని ఉపయోగించవచ్చు.
19 దైవపరిపాలనా నియామకాలు యెహోవా దగ్గర నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, భూమిపై ఆయన దృశ్య మాధ్యమమైన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా అలాగే ఆ దాసుని పరిపాలక సభ ద్వారా వస్తాయి. (మత్తయి 24:45-47) అలాంటి సిఫారసు, నియామకాలకు సంబంధించిన యావత్ ప్రక్రియ పరిశుద్ధాత్మచే నిర్దేశించబడుతుంది, అంటే నడిపించబడుతుంది. అలా చెప్పడానికిగల కారణం, కావల్సిన అర్హతలన్నీ పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన దేవుని వాక్యంలోనే ఉండడం; నియమించబడిన వ్యక్తి ఆ ఆత్మ యొక్క ఫలాల్ని ఉత్పత్తి చేస్తున్నాడన్న నిదర్శనాన్ని ఇస్తుండడం. అందుకని, నియామకాలు పరిశుద్ధాత్మచేతనే జరుగుతున్నట్లు దృష్టించాలి. మొదటి శతాబ్దంలో పైవిచారణకర్తలు, పరిచర్య సేవకులు దైవపరిపాలనా విధానంలో నియమించబడినట్లే, నేడూ నియమించబడుతున్నారు.
యెహోవా నడిపింపు కోసం కృతజ్ఞతలు
20. కీర్తన 133:1 లోని దావీదు భావాలతో మనం ఎందుకు ఏకీభవిస్తాము?
20 ఆధ్యాత్మిక సమృద్ధి ఉన్న ఈ కాలంలో, రాజ్యప్రకటనా పనిలో దైవపరిపాలనా అభివృద్ధిని అనుభవిస్తున్న ఈ సమయంలో పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల నియామకాలకు ప్రాథమికంగా యెహోవాయే బాధ్యుడై ఉన్నందుకు మనం కృతజ్ఞతగా భావించాలి. లేఖనాధారమైన ఈ ఏర్పాటు మనం యెహోవాసాక్షులముగా నీతి విషయంలో దేవుని ఉన్నతమైన ప్రమాణాలకు అంటిపెట్టుకుని కొనసాగేలా సహాయం చేస్తుంది. అంతేగాక, ఈ పురుషుల క్రైస్తవ ఆత్మా, హృదయపూర్వకమైన ప్రయత్నాలూ యెహోవా సేవకులుగా మన మధ్య అద్భుతమైన శాంతినీ ఐక్యతనూ పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయి. కీర్తనకర్తయైన దావీదులా మనం ఇలా ఉద్ఘోషించేందుకు కదిలించబడతాము: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”—కీర్తన 133:1.
21. నేడు యెషయా 60:17 ఎలా నెరవేరుతోంది?
21 యెహోవా తన వాక్యం ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా అందజేస్తున్న నిర్దేశం విషయమై మనమెంత కృతజ్ఞులమై ఉన్నాము! యెషయా 60:17 లోని మాటలు కూడా ఎంతో అర్థవంతంగా ఉన్నాయి: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” యెహోవాసాక్షుల మధ్య దైవపరిపాలనా విధానాలు మరింత పురోభివృద్ధికరంగా అమలుపర్చబడిన సమయాల్లో, మనం భూమ్మీది దేవుని సంస్థయందంతటా ఈ గొప్ప ఆశీర్వాదాల్ని అనుభవించాము.
22. మనం ఎందుకు కృతజ్ఞత కలిగివుండాలి, ఏమి చేయాలని కృతనిశ్చయం చేసుకుని ఉండాలి?
22 మన మధ్య ఉన్న దైవపరిపాలనా ఏర్పాట్ల నిమిత్తం మనం ఎంతగానో కృతజ్ఞత కలిగివున్నాము. దైవపరిపాలనా విధానంలో నియుక్తులైన పైవిచారణకర్తలూ పరిచర్య సేవకులూ చేసే కష్టతరమైన, అదే సమయంలో సంతృప్తికరమైన పనిని మనం ఎంతగానో గుణగ్రహించాం. మనకు ఆధ్యాత్మిక సమృద్ధినిచ్చి, ఇంత ఘనంగా ఆశీర్వదించిన మన ప్రేమగల పరలోకపు తండ్రిని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. (సామెతలు 10:22) మనం యెహోవా సంస్థతోపాటు సమంగా ముందుకు కొనసాగాలని కృతనిశ్చయం చేసుకుందాము. అన్నింటికన్నా మిన్నగా మనం మహోన్నతమైనదీ పరిశుద్ధమైనదీ అయిన యెహోవా నామానికి స్తుతులనూ, మహిమా ఘనతలనూ తీసుకొచ్చేలా సమైక్యంగా సేవచేయడంలో కొనసాగుదాం.
మీరెలా జవాబిస్తారు?
• పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల నియామకం దైవపరిపాలనాపరమైనదనీ ప్రజాస్వామ్యం కాదనీ మనం ఎలా చెప్పగలం?
• బాధ్యతగల క్రైస్తవ పురుషులు పరిశుద్ధాత్మచే ఎలా నియమించబడతారు?
• పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల నియామకంలో పరిపాలక సభ ఎలా ఇమిడివుంది?
• దైవపరిపాలనా నియామకాల సంబంధంగా మనం యెహోవాకు ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రాలు]
దైవపరిపాలనా నియామకం ద్వారా పెద్దలకు, పరిచర్య సేవకులకు సేవచేసే ఆధిక్యత ఉంది