కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సంస్థతో సమంగా ముందుకు కొనసాగండి

యెహోవా సంస్థతో సమంగా ముందుకు కొనసాగండి

యెహోవా సంస్థతో సమంగా ముందుకు కొనసాగండి

“సమాధానకర్తయగు దేవుడు, . . . ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక.”​—⁠హెబ్రీయులు 13:20, 21.

1. ప్రపంచ జనాభా ఎంత, ఎంతెంత మంది వివిధ మతాలకు చెందినవారిగా లెక్కించబడుతున్నారు?

ప్రపంచ జనాభా 1999వ సంవత్సరంలో 600 కోట్లకు చేరుకుంది! ఈ సంఖ్యలో 116 కోట్ల 50 లక్షల మంది ముస్లిమ్‌లు; 103 కోట్ల మంది రోమన్‌ క్యాథలిక్కులు; 76 కోట్ల 20 లక్షల మంది హిందువులు; 35 కోట్ల 40 లక్షల మంది బౌద్ధులు; 31 కోట్ల 60 లక్షల మంది ప్రొటస్టెంట్లు; 21 కోట్ల 40 లక్షల మంది ఆర్థడాక్సులు ఉన్నారని ద వరల్డ్‌ ఆల్మనాక్‌ పుస్తకం చెబుతుంది.

2. నేడున్న మతాల పరిస్థితి గురించి ఏమి చెప్పవచ్చు?

2 మతాల మధ్య నేడు విభేదాలూ గలిబిలీ ఉన్న దృష్ట్యా ఈ మతాలకు చెందిన కోట్లమంది ప్రజలు దేవుని చిత్తానికి అనుగుణ్యంగా పనిచేస్తున్నారనవచ్చా? లేదు, ఎందుకంటే “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.” (1 కొరింథీయులు 14:​33) మరోవైపు యెహోవా సేవకుల అంతర్జాతీయ సహోదరత్వం సంగతేమిటి? (1 పేతురు 2:​17) ‘సమాధానకర్తయగు దేవుడు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయడానికి వారిని సిద్ధపరుస్తాడని’ క్షుణ్ణమైన పరిశోధన రుజువు చేస్తోంది.​—హెబ్రీయులు 13:20, 21.

3. సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో ఏమి జరిగింది, ఎందుకు?

3 నిజమే, యెహోవాసాక్షులపై దైవిక అనుగ్రహం ఉన్నదా లేదాయన్నది నిర్ధారించేది వారితో సహవసించేవారి సంఖ్య కాదు; గణాంకాలు దేవుణ్ణి ప్రీతిపర్చవు. ఇశ్రాయేలు జనాంగము “సర్వజనముల కంటె విస్తారజనమని” ఆయన దాన్ని ఎన్నుకోలేదు. వాస్తవానికి వాళ్లు జనాంగాలతో పోలిస్తే “లెక్కకు తక్కు[వ]”గానే ఉన్నారు. (ద్వితీయోపదేశకాండము 7:⁠7) అయితే ఇశ్రాయేలు జనాంగం దేవునిపట్ల నమ్మకంగా ఉండనందున, సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసుక్రీస్తు అనుచరులతో క్రొత్తగా ఏర్పడిన సంఘం వైపుకు యెహోవా తన అనుగ్రహాన్ని మళ్ళించాడు. వారు యెహోవా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారై దేవుని గూర్చిన, క్రీస్తును గూర్చిన సత్యాన్ని ఇతరులకు ప్రకటించేందుకు ఆసక్తితో బయలువెళ్లారు.​—⁠అపొస్తలుల కార్యములు 2:41, 42.

స్థిరంగా ముందుకు కొనసాగడం

4. తొలి క్రైస్తవ సంఘం స్థిరంగా ముందుకు కొనసాగిందని మీరెందుకు చెబుతారు?

4 మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం క్రొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ, శిష్యులను తయారుచేస్తూ దేవుని సంకల్పాలను గురించి మరింత అవగాహనను పొందుతూ స్థిరంగా ముందుకు కొనసాగింది. తొలి క్రైస్తవులు, దైవ ప్రేరేపిత పత్రికల ద్వారా అందించబడిన ఆధ్యాత్మిక వెలుగుతో సమంగా ముందుకు కొనసాగారు. అపొస్తలులూ, మరితరులూ చేసిన సందర్శనాల ద్వారా ప్రోత్సహించబడి, తమ పరిచర్యను నెరవేర్చారు. ఇదంతా మన కోసం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో లిఖితమైవుంది.​—⁠అపొస్తలుల కార్యములు 10:​21, 22; 13:​46, 47; 2 తిమోతి 1:​13; 4:⁠5; హెబ్రీయులు 6:​1-3; 2 పేతురు 3:17, 18.

5. దేవుని సంస్థ నేడు ఎందుకు ముందుకు కొనసాగుతుంది, మనం దానితో సమంగా ఎందుకు కొనసాగాలి?

5 తొలి క్రైస్తవుల వలెనే, యెహోవా ఆధునిక-దిన సాక్షులు కూడా క్రమక్రమంగా అభివృద్ధి సాధించారు. (జెకర్యా 4:8-10) 19వ శతాబ్దపు చివరి భాగం నుండి యెహోవా తన సంస్థ మీద తన ఆత్మను ఉంచాడనడానికి స్పష్టమైన రుజువులున్నాయి. మనం మానవ శక్తిపై కాక పరిశుద్ధాత్మ నడిపింపుపై ఆధారపడినందున లేఖనాలను అర్థం చేసుకోవడంలో, దేవుని చిత్తాన్ని చేయడంలో నిలకడగా ముందుకు కొనసాగుతున్నాము. (జెకర్యా 4:⁠6) ఇప్పుడు “అంత్యదినములలో” ఉన్నాము గనుక ముందుకు కొనసాగుతున్న దేవుని సంస్థతో సమంగా మనం ముందుకు కొనసాగడం చాలా ప్రాముఖ్యం. (2 తిమోతి 3:​1-5) అలా చేయడం, మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవడానికీ, ఈ ప్రస్తుత విధానం మీదికి అంతం విరుచుకుపడక ముందే దేవుని స్థాపిత రాజ్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంలో భాగంవహించడానికీ మనల్ని శక్తిమంతుల్ని చేస్తుంది.​—⁠మత్తయి 24:​3-14.

6, 7. యెహోవా సంస్థ ముందుకు కొనసాగిన ఏ మూడు రంగాల్ని మనం పరిశీలిస్తాము?

6 మనలో 1920ల నుంచీ, 30ల నుంచీ, 40ల నుంచీ యెహోవా సంస్థతో సహవసిస్తున్నవారున్నారు. ఆ తొలి సంవత్సరాలలో, ఈ కాలంలో జరిగే అమోఘమైన పెరుగుదలను గూర్చి, సంస్థ యొక్క ప్రగతిశీల అభివృద్ధిని గూర్చి వారిలో ఎవరు ఊహించివుంటారు? మన ఆధునికదిన చరిత్రలో మనం చేరుకున్న మైలురాళ్ళను గురించి ఆలోచించండి! దైవ పరిపాలనా విధానంలో సంస్థీకరించబడిన తన ప్రజల ద్వారా యెహోవా నెరవేర్చిన దాన్ని గురించి ధ్యానించడం ఆధ్యాత్మికంగా నిజంగా ప్రయోజనకరం.

7 యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను గురించి ఆలోచించినప్పుడు ప్రాచీనకాలానికి చెందిన దావీదు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. “వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి యున్నవి” అన్నాడాయన. (కీర్తన 40:⁠5) మనకు కూడా అదే అనుభవమౌతుంది, యెహోవా మన కాలంలో చేసిన అత్యద్భుతమైన, శ్లాఘనీయమైన విషయాల్ని మనం వరుసగా పేర్కొనలేము. అయినప్పటికీ, యెహోవా సంస్థ ముందుకు కొనసాగిన మూడు రంగాలను మనం పరిశీలిద్దాము: (1) క్రమక్రమంగా పెరిగిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, (2) మెరుగుపర్చబడి, విస్తరించబడిన పరిచర్య, (3) సంస్థాగతమైన పద్ధతుల్లో సమయానుకూలమైన మార్పులు.

ఆధ్యాత్మిక జ్ఞానోదయం నిమిత్తం కృతజ్ఞతలు

8. సామెతలు 4:18కి అనుగుణ్యంగా రాజ్యాన్ని గూర్చి ఏమి గ్రహించడానికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం మనకు సహాయం చేసింది?

8 క్రమక్రమంగా పెరిగిన ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి సంబంధించి, సామెతలు 4:18 నిశ్చయంగా సత్యమని నిరూపించబడింది. అదిలా చెబుతోంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” మనం అనుభవించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం నిమిత్తం అంటే క్రమక్రమంగా పెరిగిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం నిమిత్తం మనమెంత కృతజ్ఞులమై ఉన్నాము! 1919 లో ఒహాయోలోని, సీడార్‌ పాయింట్‌ దగ్గర జరిగిన సమావేశంలో దేవుని రాజ్యం ఉన్నతపర్చబడింది. తన నామాన్ని మహిమపర్చుకోవడానికీ, తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకోవడానికీ యెహోవా ఆ రాజ్యాన్నే సాధనంగా ఉపయోగిస్తాడు. నిజానికి, ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకుగల పుస్తకాల్లో, తన కుమారుడు పరిపాలించే రాజ్యం ద్వారా తన నామాన్ని మహిమపర్చుకోవడమే యెహోవా సంకల్పమని బైబిలు సాక్ష్యమిస్తుంది. నీతిని ప్రేమించే వారందరికీ లభించే మహిమగల నిరీక్షణ దానిలోనే ఉంది.​—⁠మత్తయి 12:18, 21.

9, 10. రాజ్యాన్ని గూర్చీ పరస్పరం విరుద్ధంగా ఉన్న రెండు సంస్థలను గూర్చీ 1920లలో ఏమి నేర్చుకోవడం జరిగింది, అదెలా సహాయకరంగా ఉంది?

9 సీడార్‌ పాయింట్‌ సమావేశంవద్ద 1922 లో ప్రధాన ప్రసంగీకుడైన సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, “రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అని దేవుని ప్రజలకు ఉద్బోధించారు. 1925, మార్చి 1, కావలికోటలో (ఆంగ్లం) ప్రచురించబడిన “జనాంగం జన్మించింది” అనే ఆర్టికల్‌లో, 1914 లో దేవుని రాజ్యం స్థాపించబడిందని సూచించే ప్రవచనాల ఆధ్యాత్మిక అంతర్దృష్టి వైపుకు సహోదరుల దృష్టి మళ్లించబడింది. యెహోవాకు చెందిన సంస్థ ఒకటి, సాతానుకు చెందిన సంస్థ ఒకటి, ఇలా పరస్పర వ్యతిరేకమైన రెండు సంస్థలున్నాయని 1920లలో గ్రహించడం జరిగింది. ఆ రెంటికీ మధ్య పోరాటం కొనసాగుతోంది, కేవలం యెహోవా సంస్థతో సమంగా ముందుకు కొనసాగితేనే మనం విజయంవైపున ఉంటాము.

10 అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానోదయం మనకెలా సహాయపడింది? దేవుని రాజ్యానికీ, రాజైన యేసుక్రీస్తుకూ ఈ లోకంతో సంబంధం లేదు గనుక మనం కూడా ఈ లోక సంబంధులమై ఉండకూడదు. లోకం నుండి వేరుగా ఉండడం ద్వారా మనం సత్యం పక్షాన ఉన్నామని చూపిస్తాం. (యోహాను 17:​16; 18:​37) అంతకంతకూ అధికమౌతున్న చిక్కు సమస్యలు ఈ దుష్ట విధానాన్ని పట్టిపీడిస్తుండడాన్ని మనం గమనిస్తున్నాం కనుక, సాతాను సంస్థలో భాగస్థులం కానందుకు ఎంత కృతజ్ఞత కలిగివుండాలో కదా! యెహోవా సంస్థలో ఆధ్యాత్మిక భద్రతను పొందగల్గుతున్నందుకు మనమెంత ధన్యులం!

11. దేవుని ప్రజలు 1931 లో ఏ లేఖనాధార నామాన్ని స్వీకరించారు?

11 ఒహాయోలోని కొలంబస్‌లో 1931 లో జరిగిన సమావేశంలో యెషయా 43:​10-12 వచనాలకు సరైన అన్వయింపు ఇవ్వబడింది. బైబిలు విద్యార్థులు, యెహోవాసాక్షులు అనే విశిష్ఠమైన నామాన్ని స్వీకరించారు. రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ యెహోవా నామమున ప్రార్థించేలా ఆయన నామాన్ని అందరికీ ప్రకటించడమన్నది మనకందరికీ ఉన్న ఎంత గొప్ప ఆధిక్యతో కదా!​—⁠కీర్తన 83:18; రోమీయులు 10:⁠13.

12. గొప్ప సమూహం గురించి 1935 లో ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానోదయం లభించింది?

12 యెహోవా ప్రజలతో 1930లకు ముందు సహవసించిన అనేకమంది తమ భావి జీవిత నిరీక్షణ గురించి కొంతమేరకు సందిగ్ధావస్థలో ఉన్నారు. కొందరు పరలోక జీవితాన్ని గురించిన ఆలోచనలను కల్గివున్నప్పటికీ, పరదైసును గూర్చిన బైబిలు బోధలవైపుకు కూడా ఆకర్షితులయ్యారు. 1935 లో కొలంబియాలోని వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో ప్రకటన 7వ అధ్యాయంలో పేర్కొనబడిన పెద్ద జనాంగం అంటే గొప్ప సమూహం భూనిరీక్షణగల ప్రజల తరగతియే అన్న విషయాన్ని తెలుసుకోవడం పులకరింతను కలుగజేసింది. అప్పటి నుండి, గొప్ప సమూహాన్ని సమకూర్చే పని క్రితమెన్నడూ లేనంత వేగంతో ముందుకు కొనసాగుతోంది. గొప్ప సమూహము ఎవరన్నది స్పష్టం చేయబడినందుకు మనం కృతజ్ఞత కల్గిలేమా? ప్రతి జనములో నుండి, వంశములో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలోనుండి గొప్ప సంఖ్యలో ప్రజలు సమకూర్చబడుతున్నారనే వాస్తవం, యెహోవా సంస్థతో సమంగా ముందుకు కొనసాగాలనే మన తీర్మానాన్ని దృఢపర్చుకోవడానికీ, దాన్ని ఆచరణలో పెట్టడానికీ మనల్ని పురికొల్పుతుంది.

13. సెయింట్‌ లూయిస్‌ సమావేశంలో 1941 లో ఉన్నతపర్చబడిన పెద్ద వివాదాంశం ఏమిటి?

13 మానవ సమాజం పట్టించుకోవాల్సిన అతిపెద్ద వివాదాంశాన్ని గురించి మిస్సూరీలోని సెయింట్‌ లూయీస్‌లో 1941 లో జరిగిన సమావేశంలో నొక్కి చెప్పబడింది. అది విశ్వాధికారం లేదా విశ్వసర్వాధిపత్యం. త్వరలో పరిష్కరించబడవలసిన వివాదాంశం అదే, దానిని పరిష్కరించే భయంకరమైన మహాదినం శీఘ్రంగా వస్తుంది! అంతేగాక, మన యథార్థతను గూర్చిన వివాదాంశం కూడా 1941 లో వెలుగులోకి వచ్చింది. దేవుని సర్వాధిపత్యం విషయమై వ్యక్తిగతంగా మన స్థానం ఏమిటన్నది మనం చూపించటాన్ని అది అనుమతిస్తుంది.

14. యెషయా 32:​1, 2 లో పేర్కొనబడిన అధికారుల గురించి 1950 లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఏమి గ్రహించడం జరిగింది?

14 న్యూయార్క్‌ నగరంలో, 1950 లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, యెషయా 32:⁠1, 2 వచనాల్లోని అధికారులెవరన్నది ఖచ్చితంగా గుర్తించడం జరిగింది. ఈ విషయంపై మాట్లాడుతూ సహోదరుడు ఫ్రెడ్‌రిక్‌ ఫ్రాంజ్‌, క్రొత్త భూమిపై పరిపాలించే ఉత్తరాపేక్షగల అధికారులు మన మధ్యనే ఉన్నారని వివరించినప్పుడు సంభ్రమాశ్చర్యాలు వెల్లి విరిశాయి. ఆ సమావేశంలోనూ అటుతర్వాత జరిగిన మరితర సమావేశాల్లోనూ అనేక ఆధ్యాత్మిక మెరుపుల వెలుగులు విరజిమ్మాయి. (కీర్తన 97:​11) మన మార్గం “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు” ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!

మన పరిచర్యలో ముందుకు కొనసాగడం

15, 16. (ఎ) మనం మన పరిచర్యలో 1920లలోను 1930లలోను ఎలా ముందుకు కొనసాగాము? (బి) ఇటీవలి దశకాల్లో ఏ ప్రచురణలు క్రైస్తవ పరిచర్యకు పురికొల్పును ఇచ్చాయి?

15 యెహోవా సంస్థ ముందుకు కొనసాగిన రెండవ రంగం, మన ముఖ్య పనియైన రాజ్యసువార్తను ప్రకటించడానికీ, శిష్యులను తయారుచేయడానికీ సంబంధించినది. (మత్తయి 28:​19, 20; మార్కు 13:​10) ఈ పనిని సాధించేందుకు, మన పరిచర్యను విస్తృతపర్చుకోవడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి సంస్థ మనకు తెలియజేసింది. 1922వ సంవత్సరంలో, ప్రకటించడంలో క్రైస్తవులందరూ భాగం వహించాలని ఉద్బోధించడం జరిగింది. తమ వెలుగును ప్రకాశింపజేస్తూ, సత్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంలో భాగం కలిగివుండడం మనలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత. (మత్తయి 5:​14-16) ఆదివారాన్ని క్షేత్ర సేవకే కేటాయించటానికి 1927 లో చర్యలు తీసుకోవడం జరిగింది. 1940 ఫిబ్రవరిలో ప్రారంభమై, అటు తర్వాత సాక్షులు వ్యాపార స్థలాల్లోనూ, వీధుల్లోనూ కావలికోట, కన్సొలేషన్‌ (ఇప్పుడు తేజరిల్లు!) పత్రికలను అందించడం సర్వసాధారణమైపోయింది.

16నమూనా అధ్యయనం (ఆంగ్లం) అనే చిన్న పుస్తకం 1937 లో వెలువడింది, ఇతరులకు బైబిలు సత్యాన్ని బోధించే నిమిత్తం పునర్దర్శనాలు చేయాల్సిన అవసరం ఉందని అది నొక్కిచెప్పింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో బైబిలు పఠన కార్యక్రమం ఎంతగానో నొక్కిచెప్పబడింది. “లెట్‌ గాడ్‌ బి ట్రూ” అనే పుస్తకం 1946 లోనూ, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం 1968 లోనూ ప్రచురించబడడంతో పరిచర్యలోని ఈ అంశానికి పురికొల్పు ఇవ్వబడింది. ప్రస్తుతం మనం నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నాం. వీటిలోని విషయాలను విద్యార్థులతో పఠించడం శిష్యులను తయారుచేయడంలో మంచి పునాదిని వేస్తుంది.

సంస్థాగతమైన శుద్ధీకరణలతో ముందుకు కొనసాగడం

17. యెషయా 60:17కు అనుగుణ్యంగా యెహోవా సంస్థ ఎలా ముందుకు కొనసాగింది?

17 యెహోవా సంస్థ ముందుకు కొనసాగిన మూడవ రంగం సంస్థాగతమైన శుద్ధీకరణలకు సంబంధించినది. యెషయా 60:⁠17 ప్రకారం యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.” ఈ ప్రవచనానికి అనుగుణ్యంగా, రాజ్య ప్రకటనా పనిని మరింత శ్రేష్ఠమైన విధంగా పర్యవేక్షించేందుకూ, మందను యుక్తమైన రీతిలో కాసేందుకూ చర్యల్ని తీసుకోవడం జరిగింది.

18, 19. సంవత్సరాలుగా ఎటువంటి సంస్థాగతమైన శుద్ధీకరణలు జరిగాయి?

18 క్షేత్ర సేవను వ్యవస్థీకరించేందుకు 1919 లో ప్రతి సంఘంలోనూ సేవా నిర్దేశకుణ్ణి నియమించడం జరిగింది. ఈ క్రొత్త ఏర్పాటు క్షేత్ర సేవా కార్యక్రమానికి ప్రోత్సాహాన్నిచ్చింది. సంఘంలో పెద్దలను, డీకన్లను ఎన్నుకోవడం 1932 లో నిలిపివేయబడింది. దానితో సంఘ వ్యవహారాలను ప్రజాస్వామ్య విధానాల్లో నిర్వహించడం కూడా ఆగిపోయింది. సంఘంలోని సేవకులను అందరిని, తొలి క్రైస్తవ సంఘంలోని దైవపరిపాలనా నియామకాల ఏర్పాటుకు అతి దగ్గరగా పోలివున్న ఏర్పాటుతో నియమించడం 1938 లో ప్రారంభంకావడంతో మరో ప్రాముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు అయ్యింది. (అపొస్తలుల కార్యములు 14:​23, 1 తిమోతి 4:​14) తొలి క్రైస్తవులలో ఉన్నట్లుగానే పైవిచారణకర్తలను, పరిచర్య సేవకులను నియమించే విధానం 1972 లో ప్రారంభించబడింది. కేవలం ఒక వ్యక్తే సంఘ పైవిచారణకర్తగా సేవ చేసే బదులు, పైవిచారణకర్తలకు ఉండవలసిన లేఖనార్హతలు ఉన్న వారందరూ పెద్దల సభగా ఏర్పడతారని ఫిలిప్పీయులు 1:​1వ వచనము, మరితర లేఖనాలు సూచించాయి.​—⁠అపొస్తలుల కార్యములు 20:​28; ఎఫెసీయులు 4:11, 12.

19 దేవుని సంస్థ యొక్క ప్రపంచవ్యాప్త కార్యకలాపాల్ని పర్యవేక్షించేందుకు 1975 లో యెహోవాసాక్షుల పరిపాలకసభ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతేగాక, తమ తమ ప్రాంతాల్లోని పనిని పర్యవేక్షించేందుకు బ్రాంచి కమిటీలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అప్పటి నుండి ‘మరి శ్రేష్ఠమైన కార్యములను వివేచించడానికి’ ప్రధాన కార్యాలయంలోనూ, బ్రాంచి కార్యాలయాల్లోనూ పనిని సరళీకృతం చేయడానికి అవధానం ఇవ్వబడింది. (ఫిలిప్పీయులు 1:​9-11) క్రీస్తు క్రిందనున్న ఉపకాపరుల భుజస్కంధాలపై ఉంచబడిన బాధ్యతల్లో సువార్త ప్రకటనాపనిలో నడిపింపును ఇవ్వడమే కాకుండా సంఘంలో ప్రభావవంతంగా బోధించడం, దేవుని మందను సరిగా కాయడం కూడా ఇమిడి ఉన్నాయి.​—⁠1 తిమోతి 4:​16; హెబ్రీయులు 13:7,​17; 1 పేతురు 5:⁠2, 3.

యేసు చురుకైన నాయకత్వం

20. యెహోవా సంస్థతో సమంగా కొనసాగడానికి మనం యేసు స్థానం విషయంలో ఏమి గుర్తించాల్సిన అవసరం ఉంది?

20 యెహోవా పురోభివృద్ధికరమైన సంస్థతో సమంగా మనం ముందుకు కొనసాగాలంటే, “సంఘమునకు శిరస్సై” ఉండేలా దేవుడు నియమించిన యేసుక్రీస్తు పాత్రను గుర్తించడం ఎంతో అవసరం. (ఎఫెసీయులు 5:​22, 23) యెషయా 55:4 కూడా గమనార్హమైన వచనం, అక్కడ మనకిలా చెప్పబడింది: “ఇదిగో జనములకు సాక్షిగా [యెహోవానైన నేను] అతని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని.” ఎలా నడిపించాలో యేసుకు బాగా తెలుసు. ఆయనకు తన గొర్రెలు, వారి క్రియలు తెలుసు. నిజానికి, ఆసియా మైనరులోని ఏడు సంఘాలను యేసు తనిఖీ చేసినప్పుడు ఆయన, ‘నీ క్రియలను నేనెరుగుదును’ అనే మాట ఐదుసార్లు అన్నాడు. (ప్రకటన 2:​2, 19; 3:​1, 8, 15) తన తండ్రియైన యెహోవా వలెనే యేసుకు మన అవసరాల గురించి కూడా తెలుసు. మాదిరి ప్రార్థన నేర్పించడానికి ముందు యేసు ఇలా చెప్పాడు: ‘మీరు అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.’​—⁠మత్తయి 6:⁠8-13.

21. క్రైస్తవ సంఘంలో యేసు నాయకత్వం ఎలా ప్రదర్శించబడుతోంది?

21 యేసు ఇస్తున్న నడిపింపు ఇప్పుడెలా స్పష్టమౌతుంది? ఒక మార్గమేంటంటే, ‘మనుష్యుల్లోని ఈవులైన’ క్రైస్తవ పైవిచారణకర్తల ద్వారా ఇచ్చే నడిపింపే. (ఎఫెసీయులు 4:⁠8) అభిషిక్త పైవిచారణకర్తలు కుడిచేతిలో, అంటే ఆయన ఆధీనంలో ఉన్నారని ప్రకటన 1:16 వర్ణిస్తోంది. నేడు, యేసు పెద్దల కోసమైన ఏర్పాటును నిర్దేశిస్తున్నాడు, అలాంటివారికి పరలోక నిరీక్షణ ఉన్నా లేక భూనిరీక్షణ ఉన్నా సరే. ముందటి ఆర్టికల్‌లో వివరించినట్లుగా, లేఖనాధార అర్హతలకు అనుగుణ్యంగా వారు పరిశుద్ధాత్మచే నియమించబడతారు. (1 తిమోతి 3:​1-7; తీతు 1:​5-9) మొదటి శతాబ్దంలో సంఘాలపైనా, రాజ్య ప్రకటనపైనా పర్యవేక్షణ కలిగివుండేందుకు కొందరు పెద్దల సమూహం పరిపాలక సభగా ఏర్పడింది. అదే లేఖన మాదిరిని నేడు యెహోవా సంస్థలో పాటించడం జరుగుతోంది.

సమంగా ముందుకు కొనసాగండి!

22. పరిపాలక సభ ఎటువంటి సహాయాన్ని అందిస్తుంది?

22 భూమిపై ఉన్న రాజ్యాసక్తులు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ అప్పగించబడ్డాయి, యెహోవాసాక్షుల పరిపాలక సభ ఆ దాసునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. (మత్తయి 24:45-47) పరిపాలక సభ ప్రాథమికంగా క్రైస్తవ సంఘానికి ఆధ్యాత్మిక ఉపదేశాన్నీ నడిపింపునూ అందించడంలో ఆసక్తి కలిగివుంది. (అపొస్తలుల కార్యములు 6:​1-6) అయితే, తోటి సహోదరులు ప్రకృతి వైపరీత్యాల బారిన పడినప్పుడు పునరావాసాన్ని ఏర్పాటు చేయమనీ, పాడైన గృహాలను రాజ్యమందిరాలను బాగుచేయమనీ పరిపాలక సభ చట్టబద్ధమైన ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సొసైటీలను అడుగుతుంది. ఎవరైనా క్రైస్తవుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరిగితే లేదా వారిని హింసించడం జరిగితే వారిని ఆధ్యాత్మికంగా బలపర్చడానికి చర్యలు తీసుకుంటారు. “సమస్యల కాలంలో” ప్రకటనా పని ముందుకు కొనసాగేలా ప్రతి ప్రయత్నం జరుగుతుంది.​—⁠2 తిమోతి 4:1, 2.

23, 24. తన ప్రజలపైకి ఎటువంటి పరిస్థితి వచ్చినా, యెహోవా ఎల్లప్పుడూ ఏమి అందిస్తాడు, మనం ఏమని కృత నిశ్చయం చేసుకోవాలి?

23 తన ప్రజల మీదికి ఎలాంటి పరిస్థితి వచ్చినా, యెహోవా ఆధ్యాత్మిక ఆహారాన్నీ కావల్సిన నిర్దేశాల్నీ ఎల్లప్పుడూ అందిస్తాడు. అంతేకాక, దైవపరిపాలనా సంస్థలో మరిన్ని సవరింపుల కోసం, శుద్ధీకరణల కోసం సిద్ధంగా ఉండేలా బాధ్యతగల సహోదరులకు దేవుడు వివేచనను, అంతర్దృష్టిని కూడా దయచేస్తాడు. (ద్వితీయోపదేశకాండము 34:⁠9; ఎఫెసీయులు 1:​16, 17) మనం శిష్యుల్ని తయారుచేసే మన నియామకాన్ని పూర్తి చేసేందుకూ, ప్రపంచవ్యాప్తంగా మన పరిచర్యను నెరవేర్చేందుకూ మనకు అవసరమైనవన్నీ యెహోవా తప్పకుండా అందిస్తాడు.​—⁠2 తిమోతి 4:5.

24 యెహోవా విశ్వసనీయులైన తన ప్రజల్ని ఎన్నడూ విడనాడడని మనకు పూర్తి నమ్మకం ఉంది; ఆయన వారిని రాబోయే “మహా శ్రమల” నుండి తప్పిస్తాడు. (ప్రకటన 7:​9-14; కీర్తన 94:​14; 2 పేతురు 2:⁠9) మనకు మొదట్లో ఉన్న నమ్మకాన్ని చివరికంటా కొనసాగించేందుకు మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. (హెబ్రీయులు 3:​13, 14) కాబట్టి యెహోవా సంస్థతో సమంగా కొనసాగుదామని కృత నిశ్చయం చేసుకుందాము.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా సంస్థ ముందుకు కొనసాగుతూనే ఉంటుందని మనం ఎందుకు చెప్పగలము?

• దేవుని ప్రజలు క్రమంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని అనుభవిస్తున్నారని చెప్పడానికి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి?

• క్రైస్తవ పరిచర్యలో ఎలాంటి మెరుగులు చేయబడ్డాయి?

• యెహోవా సేవకుల్లో సంస్థాగతమైన పద్ధతుల్లో సకాలంలో ఎలాంటి సర్దుబాట్లు చేయబడ్డాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రం]

దావీదులా మనం యెహోవా ఆశ్చర్యకార్యాలను పూర్తిగా లెక్కించలేము

[18వ పేజీలోని చిత్రం]

సంస్థాగతమైన పద్ధతుల్లో సకాలంలో చేయబడిన సర్దుబాట్ల నుండి దేవుని మంద ప్రయోజనం పొందింది