కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారెలా తాళుకుంటారు?

వారెలా తాళుకుంటారు?

తోటివారి ఒత్తిడిని

వారెలా తాళుకుంటారు?

అనేకమందిలో తమను ఇతరులు స్వీకరించాలన్న కోరిక, తమ తోటివారి ఆలోచనా విధానాలకూ వారి చర్యలకూ అనుగుణంగా మారిపోయేలా చేస్తుంది. అలా లొంగిపోకుండా మాదకద్రవ్యాల దుర్వినియోగం, లైంగిక అనైతికత వంటి హానికరమైన అభ్యాసాలను తిరస్కరించేందుకు నైతిక బలం ప్రత్యేకంగా యౌవనస్థులకు అవసరమౌతుంది. వారు తోటివారి ఒత్తిడిని ఎలా తాళుకోగలరు?

పోలాండ్‌లోని ఇద్దరు టీనేజ్‌ అమ్మాయిలు ఇలా వ్రాశారు: “మా తోటివారిలో లోకాత్మ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు పరీక్షల్లో కాపీలు కొడతారు, దుర్భాషలాడతారు, విపరీతమైన వస్త్రధారణచేస్తారు, చెవులు దద్దరిల్లే అనైతికమైన సంగీతాన్ని ఇష్టపడతారు. యౌవనస్థులకే వ్రాయబడిన ఆర్టికల్‌లు మాదగ్గరున్నందుకు, అసంతృప్తితో నిండిపోయి తిరుగుబాటుదారులుగా మారిన టీనేజర్ల ప్రభావం నుండి మమ్మల్ని కాపాడుతున్న ఆర్టికల్‌లు మాదగ్గరున్నందుకు మేమెంత కృతజ్ఞులం!

“యౌవనస్థులముగా మేము కావల్సినవారమనీ మేమంటే ఇతరులకు మెప్పుదల ఉందనీ మా మనస్సులపై చక్కని అభిప్రాయాన్ని కల్గించిన కావలికోటలోని ఆర్టికల్‌ల నిమిత్తం మాలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని మాటలు వ్యక్తీకరించలేవు. మేము పొందిన బైబిలు సలహాలు మా అడుగులను జాగ్రత్తగా ముందుకు వేసేందుకూ అలా యెహోవా దేవునికి ప్రీతికరమైన విధానంలో కొనసాగేందుకూ సహాయం చేశాయి. యెహోవాకు విశ్వసనీయంగా సేవ చేయడమే అతి శ్రేష్ఠమైన జీవన విధానమని మేము పూర్తిగా ఒప్పించబడ్డాము.”

అవును, యౌవనస్థులు తమ తోటివారి ఒత్తిడికి తాళుకుని నిలబడగలరు. క్రైస్తవ యువత తమ “గ్రహణ శక్తుల”కు శిక్షణనివ్వడం ద్వారా వారు ఈ “లౌకికాత్మను” కాక, “దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను” ప్రతిఫలించే జ్ఞానయుక్తమైన నిర్ణయాల్ని తీసుకోవడం ఎలాగో తెలుసుకుంటారు.​—⁠హెబ్రీయులు 5:​14; 1 కొరింథీయులు 2:⁠12.