ప్రమాదాల మధ్య జీవించడం
ప్రమాదాల మధ్య జీవించడం
“నిద్రపోవడంతో సహా అనుదిన జీవితంలో మీరు చేసే ఏ పనైనా సరే అదే మీ చివరి పని అయ్యుండి మీ ప్రాణానికి ముప్పు వాటిల్లకుండా చేయగల పనంటూ ఏదీ లేదు.”—డిస్కవర్ పత్రిక.
జీవితాన్ని మందుపాతరలు పెట్టబడిన ప్రాంతంలో నడిచివెళ్లడంతో పోల్చవచ్చు, ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, గాయాలైనా కావచ్చు లేక మరణమైనా సంభవించవచ్చు, అదీ ఏ హెచ్చరికా లేకుండానే. ప్రమాద కారకాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రయాణ దుర్ఘటనలు, అంతఃకలహం, కరువు, ఎయిడ్స్, క్యాన్సర్, హృద్రోగాలు, ఇంకా అనేకానేకం వాటిలో ఒక భాగమే. ఉదాహరణకు, ఆఫ్రికా దక్షిణ భాగంలో ఎయిడ్స్ ప్రధాన హంతకిగా మారింది, ఇటీవలి ఒక సంవత్సరంలో, “22 లక్షలమంది ప్రాణాలను బలిగొన్నది, [ఆ సంఖ్య] ఆఫ్రికా అంతటిలో జరిగిన అంతఃకలహాల్లో మరణించిన వారికన్నా పదిరెట్లు ఎక్కువ” అని యు. ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ చెప్తుంది.
ఈ మధ్య కాలంలో, జీవితాయుష్షును పెంచడానికీ, అనారోగ్యానికీ అస్వస్థతలకూ గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికీ ప్రపంచం వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఆహార పానీయాల విషయంలో జ్ఞానయుక్తమైన అలవాట్లూ, శారీరక వ్యాయామమూ వంటి పెంపొందించబడిన అనేక తలంపులు, కొన్ని ప్రయోజనకరమైన ఫలితాలను తీసుకురాగలవు. అయినప్పటికీ, మీరు సురక్షితమైన, మరింత భద్రతగల జీవితాన్ని ఆనందించేలా మీకు సహాయం చేయగల సమాచారం దొరికే మూలం అంటే మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రతి కోణంపైనా నమ్మదగిన సమాచారం దొరికే మూలం ఒకటి ఉంది. అదే బైబిలు. మన ఆరోగ్య సంక్షేమాలను ప్రభా
వితం చేసే అనేక సమస్యలతో వ్యవహరించేందుకు కావలసిన మార్గనిర్దేశకాలు అందులో ఇవ్వబడ్డాయి. నిజమే, బైబిలు ప్రతి సమస్యతోనూ వివరణాత్మకంగా వ్యవహరించడంలేదు. అయినప్పటికీ, ఆహారపుటలవాట్లు, శరీర దారుఢ్యం, మానసిక దృక్పథం, లైంగిక విషయాలు, పొగాకు మరియు రిక్రియేషనల్ మాదకద్రవ్యాల ఉపయోగం, అలాంటి ఇంకా అనేక విషయాలలో మనకు నడిపింపును ఇవ్వగల అతి చక్కని సూత్రాలను అది అందజేస్తుంది.
చాలామందికి జీవితం ఆర్థికపరమైన అనిశ్చయతలతో కూడా భారమైపోతోంది. ఇక్కడ కూడా, బైబిలు మనకు సహాయం చేస్తుంది. డబ్బు గురించి, డబ్బు వ్యవహారాల గురించి జ్ఞానయుక్తమైన దృక్కోణాన్ని కల్గి ఉండమని ప్రోత్సహించడమే గాక మంచి ఉద్యోగిగా లేక మంచి యజమానిగా ఎలా ఉండవచ్చో కూడా అది చూపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక భద్రత, శారరీక ఆరోగ్యం వంటివాటి విషయాల్లోనే కాక జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ బైబిలు ఒక చక్కని నిర్దేశక పుస్తకం. బైబిలు నేడు ఎంత ఆచరణాత్మకమైనదో మీరు చూడాలనుకుంటున్నారా? అలాగైతే, తర్వాతి ఆర్టికల్‌ని చదవండి.