సత్యాన్ని మీ సొంతం చేసుకున్నారా?
సత్యాన్ని మీ సొంతం చేసుకున్నారా?
“ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమీయులు 12:2.
1, 2. నేడు నిజ క్రైస్తవులుగా ఉండడం ఎందుకు సులభం కాదు?
“అపాయకరమైన కాలము”లైన ఈ అంత్యదినాల్లో నిజ క్రైస్తవులుగా ఉండడం అంత సులభమేమీ కాదు. (2 తిమోతి 3:1) వాస్తవమేమిటంటే, ఎవరైనా క్రీస్తు మాదిరిని అనుకరించాలంటే ఈ లోకాన్ని జయించాలి. (1 యోహాను 5:4) క్రైస్తవ మార్గం గురించి యేసు ఇలా చెప్పాడని గుర్తుంచుకోండి: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.”—మత్తయి 7:13, 14; లూకా 9:23.
2 జీవానికి నడిపే ఇరుకు మార్గాన్ని కనుగొన్న తర్వాత ఒక క్రైస్తవునికి ఎదురయ్యే తదుపరి సవాలు, ఆ మార్గంలోనే నిలిచి ఉండడం. అది ఎందుకు ఒక సవాలు? ఎందుకంటే మన సమర్పణ, బాప్తిస్మము మనల్ని సాతాను మోసపూరిత తంత్రములకు ఎర అయ్యేలా చేస్తుంది. (ఎఫెసీయులు 6:11) అతడు మన బలహీనతలను గమనించి, వాటిని ఉపయోగించి మన ఆధ్యాత్మికతను బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తాడు. అతడు యేసునే పడగొట్టడానికి ప్రయత్నించాడు, మనల్నెందుకు విడిచిపెడతాడు?—మత్తయి 4:1-11.
సాతాను కుతంత్రాలు
3. సాతాను హవ్వ మనస్సులో సందేహాలను ఎలా నాటాడు?
3 సాతాను ఉపయోగించే ఒక పన్నాగం మన మనస్సులో సందేహాలను నాటడం. అతడు మన ఆధ్యాత్మిక కవచంలో బలహీనతల కోసం చూస్తాడు. మానవజాతి ప్రారంభంలోనే అతడు ఆ కిటుకును హవ్వపై ఉపయోగిస్తూ ఆమెనిలా అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” (ఆదికాండము 3:1) వేరే మాటల్లో చెప్పాలంటే, సాతాను ఇలా అంటున్నాడు: ‘దేవుడు మీ పై అలాంటి ఆంక్ష విధించడం నిజంగా సాధ్యమేనా? మీకు మేలైనదాన్ని ఆయన మీకు అందకుండా చేస్తాడా? అంతెందుకు, మీరు ఆ చెట్టు ఫలమును తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయనీ, మీరు మంచి చెడులను తెలుసుకుని దేవునిలా అయిపోతారనీ ఆయనకు తెలుసు!’ సాతాను అనుమానపు బీజాన్ని నాటి అది మొలకెత్తడం కోసం వేచివున్నాడు.—ఆదికాండము 3:5.
4. కొందరిలో నేడు ఏ సందేహాలు తలెత్తవచ్చు?
4 సాతాను ఈ కిటుకును నేడు ఎలా ఉపయోగిస్తున్నాడు? మనం మన బైబిలు పఠనాన్ని, వ్యక్తిగత అధ్యయనాన్ని, ప్రార్థనలను, క్రైస్తవ పరిచర్యను, కూటాలను నిర్లక్ష్యం చేస్తే, ఇతరులు రేకెత్తించే సందేహాలకు మనం బలయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, “ఇదే యేసు బోధించిన సత్యమని మనకెలా తెలుసు?” “ఇవి నిజంగా అంత్యదినాలేనా? మనం ఇప్పటికే 21వ శతాబ్దంలో ఉన్నాం.” “మనం అర్మగిద్దోను అంచున ఉన్నామా లేక అదింకా చాలా దూరంలో ఉందా?” ఒకవేళ అలాంటి సందేహాలు తలెత్తితే, వాటిని తొలగించుకోవడానికి మనమేమి చేయవచ్చు?
5, 6. మన మనస్సులో సందేహాలు తలెత్తితే మనమేమి చేయాలి?
5 “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు” అని వ్రాసినప్పుడు యాకోబు ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని ఇచ్చాడు.—యాకోబు 1:5-8.
6 మరి మనమేమి చేయాలి? విశ్వాస అవగాహనల కోసం ప్రార్థనలో ‘దేవుని అడుగుతూనే ఉండాలి,’ మనకు తలెత్తే యాకోబు 4:7, 8.
ఏ ప్రశ్నలనైనా, సందేహాలనైనా నివృత్తి చేసుకునేందుకు వ్యక్తిగత అధ్యయన సమయంలో తీవ్రంగా కృషి చేయాలి. మనకు అవసరమైన మద్దతును యెహోవా ఇస్తాడనే విషయాన్ని ఎన్నడూ సందేహించకుండా, విశ్వాసమందు దృఢంగా ఉన్నవారి సహాయాన్ని కూడా మనం అడగవచ్చు. యాకోబు కూడా ఇలా చెప్పాడు: “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” అవును, అధ్యయనం ద్వారా ప్రార్థన ద్వారా మనం దేవునికి సన్నిహితమైనప్పుడు మన సందేహాలు పటాపంచలైపోతాయి.—7, 8. యేసు బోధించిన ఆరాధనా విధానం ఏదనేది నిర్ణయించడానికి కొన్ని అధారాలు ఏవి, ఎవరు వాటిని అనుసరిస్తున్నారు?
7 ఉదాహరణకు ఈ ప్రశ్నను తీసుకోండి: యేసు బోధించిన ఆరాధనా విధానాన్నే మనం అవలంబిస్తున్నామని మనకెలా తెలుసు? దీనికి జవాబును పొందేందుకు, దేన్ని పరిశీలించాలి? ప్రామాణిక క్రైస్తవులు తమ మధ్య నిజమైన ప్రేమను కల్గివుండాలని బైబిలు సూచిస్తుంది. (యోహాను 13:34, 35) వారు యెహోవా అనే దేవుని నామాన్ని పరిశుద్ధపర్చాలి. (యెషయా 12:4, 5; మత్తయి 6:9, 10) వారు ఆ నామమును ఇతరులకు తెలియజేయాలి.—నిర్గమకాండము 3:15; యోహాను 17:26.
8 సత్యారాధన యొక్క మరో గుర్తింపు చిహ్నం దేవుని వాక్యమైన బైబిలు పట్ల గౌరవం కల్గి ఉండడమే. అది దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయన సంకల్పాలను బయల్పరిచే విశిష్టమైన పుస్తకం. (యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17) అంతేగాక, మానవజాతి పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందడానికి ఏకైక నిరీక్షణ దేవుని రాజ్యమేనని నిజ క్రైస్తవులు ప్రకటిస్తారు. (మార్కు 13:10; ప్రకటన 21:1-4) వారు ఈ లోకంలోని కలుషితభరితమైన రాజకీయాల నుండి, మలినపరిచే జీవిత విధానం నుండి దూరంగా ఉంటారు. (యోహాను 15:19; యాకోబు 1:27; 4:4) నేడు ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? దానికి ఒకటే సమాధానం ఉందని వాస్తవాలు దృవీకరిస్తున్నాయి—వారే యెహోవాసాక్షులు.
సందేహాలు మదిలో మెదులుతుంటే అప్పుడేం చేయాలి?
9, 10. మదిలో మెదిలే సందేహాలను అధిగమించడానికి మనమేమి చేయవచ్చు?
9 సందేహాలు మనల్ని చుట్టుముట్టేస్తే అప్పుడెలా? అప్పుడేమి చేయాలి? జ్ఞానియైన సొలొమోను ఇలా సమాధానమిస్తున్నాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు, దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:1-5.
10 అది ఆశ్చర్యకరమైన తలంపు కాదా? మనం దైవికజ్ఞానానికి
హృదయపూర్వకమైన అవధానాన్ని ఇవ్వాలని కోరుకుంటుంటే, మనకు ‘దేవుని గూర్చిన విజ్ఞానము లభిస్తుంది.’ అవును మనం ఆయన మాటలను స్వీకరించి, వాటిని విలువైనవిగా ఎంచడానికి ఇష్టపడుతున్నట్లయితే, విశ్వసర్వోన్నత ప్రభువును గూర్చిన విజ్ఞానము మనకు అందుబాటులోనే ఉంది. ప్రార్థనలో యెహోవాను సమీపించడం, వ్యక్తిగత అధ్యయనం చేయడమని దానర్థం. ఆయన వాక్యంలో దాచబడిన సంపదలు ఏ సందేహాలనైనా పారద్రోలి, సత్యపు వెలుగును చూడటానికి మనకు సహాయం చేస్తాయి.11. ఎలీషా పనివాడిని అనుమానం ఎలా బాధించింది?
11 భయస్థుడు, సందేహి అయిన ఒక దేవుని సేవకునికి ప్రార్థన ఎలా సహాయం చేసిందనే స్పష్టమైన ఉదాహరణను 2 రాజులు 6:11-18 వచనాల్లో చూడవచ్చు. ఎలీషా పనివానికి ఆధ్యాత్మిక అవగాహన కొరవడింది. సిరియా సైన్యం ముట్టడి క్రిందనున్న దేవుని ప్రవక్తకు మద్దతునిచ్చేందుకు పరలోక సైన్యాలు ఉన్నాయని అతడు గ్రహించలేకపోయాడు. భయంతో ఆ పనివాడు, “అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని” అన్నాడు. ఎలీషా ఎలా ప్రతిస్పందించాడు? “భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నా[రు].” కానీ ఆ పనివాడు ఎలా ఒప్పించబడ్డాడు? అతడు పరలోక సైన్యాలను చూడలేకపోతున్నాడు.
12. (ఎ) పనివాడి సందేహాలు ఎలా నివృత్తి అయ్యాయి? (బి) మనకుండే ఏ సందేహాలనైనా మనం ఎలా నివృత్తి చేసుకోవచ్చు?
12 “యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.” ఆ సందర్భంలో, ఎలీషాను కాపాడుతున్న పరలోక సైన్యాలను పనివాడు చూడగలిగేలా యెహోవా చేశాడు. అయితే, నేడు మనం అదే విధమైన దైవిక సహాయం కావాలని ఆశించకూడదు. ఆ ప్రవక్త యొక్క పనివాడు తన విశ్వాసం బలపడేలా అధ్యయనం చేయడానికి అతని వద్ద పూర్తి బైబిలు లేదని గుర్తుంచుకోండి. మన దగ్గరైతే పూర్తి బైబిలు కూడా ఉంది. దాన్ని మనం సరిగా ఉపయోగించుకుంటే, మన విశ్వాసం అలాగే బలపర్చబడగలదు. ఉదాహరణకు, యెహోవా తన పరలోక సభలో ఉన్నట్లు వర్ణించే వివిద వృత్తాంతాలను మనం ధ్యానించవచ్చు. అవి, నేడు ప్రపంచవ్యాప్త విద్యాపనిలో తన సేవకులకు మద్దతునిస్తున్న ఒక పరలోక సంస్థ యెహోవాకు ఉందన్న విషయంలో ఏ సందేహానికీ తావులేకుండా చేస్తాయి.—యెషయా 6:1-4; యెహెజ్కేలు 1:4-28; దానియేలు 7:9, 10; ప్రకటన 4:1-11; 14:6, 7.
సాతాను కుతంత్రాల గురించి జాగ్రత్త!
13. సత్యంపై మనకున్న పట్టును బలహీనపర్చడానికి సాతాను వేటి ద్వారా ప్రయత్నిస్తాడు?
13 మన ఆధ్యాత్మికతను, సత్యంపై మనకున్న పట్టును బలహీనపర్చేందుకు సాతాను ఉపయోగించే ఇతర కిటుకులు కొన్ని ఏవి? వాటిలో ఒకటి వివిధ కోణాలున్న అనైతికత. నేటి 1 థెస్సలొనీకయులు 4:3-5; యాకోబు 1:13-15.
కామోన్మత్త లోకంలో, ఎలాగైనా సరే సుఖం అనుభవించాలని కోరుకునే సుఖవాదిత తరానికి ఒక ప్రేమకథగానీ (నమ్మకద్రోహానికి మృదువైనపదం) ఒక రాత్రి అనుభవంగానీ (పట్టింపులేని వ్యభిచారం) రోజువారీ దినచర్య అయిపోయాయి. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వీడియోలు ఈ విధమైన జీవిత విధానాన్ని పెంపొందింపజేస్తాయి. అశ్లీల చిత్రాలు, అశ్లీల సాహిత్యం సమాచార మాధ్యమాలలో, ప్రాముఖ్యంగా ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా లభిస్తున్నాయి. వాటిని కుతూహలంకొద్దీ చూసేవారు ఉరిలో చిక్కుకుపోయే అవకాశం ఉంది.—14. కొంతమంది క్రైస్తవులు సాతాను కుతంత్రాలకు ఎందుకు లొంగిపోయారు?
14 కొంతమంది క్రైస్తవులు తమ కుతూహలం, అర్థనగ్నంగా ఉన్న అశ్లీల చిత్రాల ద్వారా లేక పూర్తిగా అశ్లీత ఉట్టిపడే చిత్రాల ద్వారా తమ మనస్సులను హృదయాలను కలుషితం చేసేందుకు అనుమతించారు. వాళ్లు సాతాను యొక్క మరులుగొల్పే ఉరిలో పడిపోయేందుకు తమను తాము అనుమతించుకున్నారు. అలా చేయడం తరచూ వారి ఆధ్యాత్మిక ఓడ బ్రద్ధలైపోవడానికి నడిపింది. అలాంటి ప్రజలు “దుష్టత్వము విషయమై శిశువులుగా” ఉండడంలో విఫలమయ్యారు. వారు “బుద్ధి విషయమై పెద్దవా[రు]” కాలేదు. (1 కొరింథీయులు 14:20) ప్రతి సంవత్సరం, దేవుని వాక్య ప్రమాణాలకు, సూత్రాలకు హత్తుకుని ఉండనందున వేలాదిమంది మూల్యం చెల్లించుకుంటున్నారు. వారు “దేవుడిచ్చు సర్వాంగ కవచమును” ధరించుకోవడాన్నీ, దాన్ని కాపాడుకోవడాన్నీ నిర్లక్ష్యం చేశారు.—ఎఫెసీయులు 6:10-13; కొలొస్సయులు 3:5-10; 1 తిమోతి 1:18, 19.
మనకున్నదాన్ని విలువైనదిగా ఎంచండి
15. కొందరికి తమ ఆధ్యాత్మిక వారసత్వ విలువను గుణగ్రహించడం ఎందుకు కష్టంగా ఉంటుంది?
15 మీరు “సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని” యేసు చెప్పాడు. (యోహాను 8:31, 32) చాలామంది సాక్షులు తమ పాత జీవిత విధానాన్ని, మతసంబంధమైన సహవాసాలను మార్చుకోవలసి వచ్చింది. కాబట్టి, వారు సత్యం తీసుకువచ్చే స్వాతంత్రాన్ని మరింత ఇష్టపూర్వకంగా గుణగ్రహించి ఉండవచ్చు. మరో వైపున, సత్యంలో ఉన్న తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన కొంతమంది యౌవనస్థులకు, తమకు లభించిన ఆధ్యాత్మిక వారసత్వ విలువను గుణగ్రహించడం కష్టంగా ఉండవచ్చు. వారు, అబద్ధ మతంలో లేక ఆనందాన్వేషణకు, మాదకద్రవ్యాలకు, అనైతికతకు ప్రాధాన్యతనిచ్చే ఈ లోకంలో ఎన్నడూ ఒక భాగమై ఉండలేదు. ఫలితంగా, కొంతమంది మన ఆధ్యాత్మిక పరదైసుకు, సాతాను కలుషిత లోకానికి మధ్యనున్న బలమైన వ్యత్యాసాన్ని చూడడంలో విఫలం కావచ్చు. తాము కోల్పోతున్నది ఏమిటో తెలుసుకోవాలని కొందరు ఈ లోక విషాన్ని రుచి చూడాలనే శోధనకు కూడా లొంగిపోవచ్చు.—1 యోహాను 2:15-17; ప్రకటన 18:1-5.
16. (ఎ) మనల్ని మనం ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు? (బి) దేనిని చేయడం గురించి మనకు బోధించబడుతుంది, మనం ఏమి చేయాలని ప్రోత్సహించబడుతున్నాము?
16 బాధ, వేదన అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనం మన వేళ్లు కాల్చుకోవలసిన అవసరం ఉందా? ఇతరుల ప్రతికూల అనుభవాల నుండి మనం నేర్చుకోలేమా? మనం ఏదైనా కోల్పోతున్నామేమో తెలుసుకోవడానికి ఈ లోకపు “బురద”లోకి వెళ్లవలసిన అవసరం ఉందా? (2 పేతురు 2:20-22) మునుపు సాతాను లోకంలో ఒక భాగమైవుండిన మొదటి శతాబ్దపు క్రైస్తవులకు పేతురు ఇలా గుర్తుచేశాడు: “మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును.” ఖచ్చితంగా, జీవితం ఎంత నీచంగా ఉండగలదో చూడడానికి మనం ఈ లోకపు “అపరిమితమైన ఆ దుర్వ్యాపారము”ను అనుభవించవలసిన అవసరం లేదు. (1 పేతురు 4:3, 4) దానికి భిన్నంగా, బైబిలు విద్యకు కేంద్రాలైన మన రాజ్య మందిరాల్లో మనకు యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలు బోధించబడతాయి. మన దగ్గర సత్యం ఉందని మనల్ని మనం ఒప్పించుకునేందుకూ, దాన్ని మన స్వంతం చేసుకునేందుకూ మనం మన తర్కశక్తిని ఉపయోగించాలని ప్రోత్సహించబడుతున్నాము.—యెహోషువ 1:8; రోమీయులు 12:1, 2; 2 తిమోతి 3:14-17.
మన పేరు కేవలం ఒక బిరుదు కాదు
17. మనం యెహోవా యొక్క ప్రతిభావంతులైన సాక్షులుగా ఎలా ఉండగలం?
17 సత్యాన్ని మనం మన స్వంతం చేసుకుంటే, మనం దాన్ని ప్రతి అనుకూలమైన సందర్భంలో కూడా ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాము. అంటే దాని భావం ఏమాత్రం ఆసక్తి చూపనివారిని కూడా మనం బలవంత పెట్టడానికి ప్రయత్నిస్తామని మాత్రం కాదు. (మత్తయి 7:6) బదులుగా, మనల్ని మనం యెహోవాసాక్షులుగా తెలుపుకోవడానికి మనం భయపడము. యథార్థమైన ప్రశ్న వేయడం ద్వారా లేక బైబిలు సాహిత్యాన్ని తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఏ కాస్త ఆసక్తి కనబర్చినా, మన నిరీక్షణను వారితో పంచుకోవడానికి మనం సుముఖంగా, సిద్ధంగా ఉంటాము. మనం ఇంట్లో, పనిస్థలంలో, బడిలో, దుకాణంలో, వినోద స్థలాల్లో, ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక సాహిత్యాన్ని మన దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవాలని ఇది సిఫారసు చేస్తుంది.—1 పేతురు 3: 15.
18. మనల్ని మనం క్రైస్తవులుగా స్పష్టంగా గుర్తించుకోవడం, మన జీవితంలో ఒక అనుకూలమైన శక్తిగా ఎలా పనిచేస్తుంది?
18 మనల్ని మనం క్రైస్తవులుగా స్పష్టంగా గుర్తించుకున్నప్పుడు, సాతాను యొక్క మోసకరమైన దాడుల నుండి మనకున్న కాపుదలను బలపర్చుకుంటాము. జన్మదిన వేడుకలు లేదా క్రిస్మస్ పార్టీ లేదా ఆఫీసులో లాటరీ తీయడం వంటివి ఉన్నప్పుడు తరచూ తోటి ఉద్యోగులు “ఆమెను విసిగించవద్దు, ఆమె ఒక యెహోవాసాక్షి” అంటారు. అదే కారణాన్ని బట్టి ప్రజలు మన సమక్షంలో అశ్లీలమైన హాస్యోక్తులు మాట్లాడడానికి వెనుకాడవచ్చు. కాబట్టి మన క్రైస్తవ స్థానాన్ని మనం ఇతరులకు స్పష్టంగా తెలియజేయడం, మన జీవితంలో అనుకూలమైన శక్తిగా పని చేస్తుంది. అపొస్తలుడైన పేతురు కూడా ఆ విషయాన్ని గురించి ఇలా చెప్పాడు: “మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు? మీరొకవేళ నీతినిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే.”—1 పేతురు 3:13, 14.
19. మనం అంత్యదినాల చివరి భాగంలో ఉన్నామని మనకెలా తెలుసు?
19 సత్యాన్ని మన స్వంతం చేసుకోవడం వల్ల వచ్చే మరో ప్రయోజనమేమిటంటే, ఇవి నిజంగా ఈ విధానపు చివరి దినాలని మనం ఒప్పించబడతాము. బైబిలు ప్రవచనాల్లో అనేకం మన కాలంలో ముగింపుకు చేరుకుంటున్నాయని మనం తెలుసుకుంటాము. * “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని” పౌలు చేసిన హెచ్చరిక, గత శతాబ్దపు భయంకరమైన సంఘటనలచే తగినంతగా ధృవీకరించబడింది. (2 తిమోతి 3:1-5; మార్కు 13:3-37) ఇటీవలి ఒక వార్తాపత్రిక 20వ శతాబ్దాన్ని గురించి, “అది అనాగరిక యుగంగా గుర్తుండిపోతుంది” అనే పేరుతో ఒక ఆర్టికల్‌ను ప్రచురించింది. ఆ ఆర్టికల్ ఇలా పేర్కొన్నది: “అత్యంత మరణకరమైన శతాబ్దపు రెండవ అర్థభాగంలో 1999 అత్యంత మరణకరమైన సంవత్సరంగా నిరూపించబడింది.”
20. ఇది ఏ చర్యను తీసుకోవలసిన సమయం?
20 ఇది ఇటు అటు ఊగిసలాడవలసిన సమయం కాదు. అన్ని దేశాలకు సాక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అతి గొప్ప బైబిలు విద్యా పనిపై యెహోవా ఆశీర్వాదం ఉందని స్పష్టమౌతుంది. (మత్తయి 24:14) సత్యాన్ని మీ స్వంతం చేసుకుని దాన్ని ఇతరులతో పంచుకోండి. మీరు ఇప్పుడేమి చేస్తారనేదానిపైనే మీ నిత్య భవిష్యత్తు ఆధారపడి ఉంది. వెనుకబడిపోవడం యెహోవా ఆశీర్వాదాన్ని తీసుకురాదు. (లూకా 9:62) బదులుగా, ఇది ‘మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులము, కదలనివారము, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులమై యుండవలసిన’ సమయం.—1 కొరింథీయులు 15:58.
[అధస్సూచి]
^ పేరా 19 కావలికోట జనవరి 15, 2000, 12-14 పేజీలు చూడండి. అందులోని 13-18 పేరాల్లో 1914 నుండి మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని చూపించే ఆరు శక్తివంతమైన నిదర్శనాలు సమీక్షించబడ్డాయి.
మీరు గుర్తు తెచ్చుకోగలరా?
• మనం సందేహాలను ఎలా పటాపంచలు చేసుకోవచ్చు?
• ఎలీషా పనివాడి ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
• మనం నిరంతరం ఏ నైతిక శోధనల గురించి అప్రమత్తంగా ఉండాలి?
• మనల్ని మనం యెహోవాసాక్షులముగా స్పష్టంగా ఎందుకు తెలుపుకోవాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[10వ పేజీలోని చిత్రాలు]
క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం, ప్రార్థన చేయడం మన సందేహాలను పటాపంచలు చేస్తాయి
[11వ పేజీలోని చిత్రం]
ఒక దర్శనం ద్వారా ఎలీషా పనివాడి సందేహాలు నివృత్తి అయ్యాయి
[12వ పేజీలోని చిత్రం]
బెనిన్‌లోని ఈ చిన్న రాజ్యమందిరం వంటి రాజ్యమందిరాల్లో యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలు బోధించబడతాయి