కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బీదరికంపై పోరాటం పరాజయమేనా?

బీదరికంపై పోరాటం పరాజయమేనా?

బీదరికంపై పోరాటం పరాజయమేనా?

న్యూయార్క్‌ సిటీలో ఉన్న ఐక్యరాజ్య సమితిని సందర్శించే సందర్శకులకు అక్కడి ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ ఛాంబర్‌లోని పబ్లిక్‌ గ్యాలరీ ఉన్న అంతస్తు పైకప్పులో పైపులూ ట్యూబులూ బయటికి పొడుచుకునివుండడం కనిపిస్తుంది. దాని విషయమై అక్కడి టూర్‌ గైడ్‌ ఇలా వ్యాఖ్యానిస్తాడు: “ఈ ‘అసంపూర్ణ’ పైకప్పు, ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఆర్థికపరమైన సాంఘికపరమైన కార్యకలాపాలు ఎన్నడూ పూర్తికావని గుర్తుచేయడానికి ఒక సంకేతంగా ఉంది; ప్రపంచ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి చేయాల్సిన పని ఎప్పుడూ ఇంకా చాలా ఉంటూనే ఉంటుంది.”

అవును, ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన జీవన ప్రమాణాలు ఉండాలని ప్రోత్సహించాలన్న ఉదాత్తమైన సంకల్పానికే ఈ కౌన్సిల్‌ అంకితమైనప్పటికీ ఈ గొప్ప కార్యానికి ముగింపే లేనట్లు కన్పిస్తుంది. సా.శ. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు భూమిపై పరిచర్య చేస్తున్న కాలంలో ఆయనిలా అనడం ఆసక్తికరం: “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.” (లూకా 4:⁠18) ఆయన ప్రకటించిన “సువార్త” ఏమిటి? అది, “బీదలకు శరణ్యముగా” ఉన్న యెహోవా దేవుడు, యేసుక్రీస్తు రాజుగా స్థాపించే రాజ్యాన్ని గూర్చిన సందేశమే. ఆ రాజ్యం దేనిని నెరవేరుస్తుంది? యెషయా ఇలా ప్రవచించాడు: “సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును, మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును, మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును, మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”​—⁠యెషయా 25:4-6, 8.

బీదరికం ఇక లేకుండా ఉండేంతగా దేవుని రాజ్యం ఎలా “ప్రపంచ ప్రజల జీవన పరిస్థితులను మెరుగు” పరుస్తుందో, మరింత ఎక్కువగా తెలుసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? అర్హతగల ఒక బోధకుడు మిమ్మల్ని సందర్శించి, ఇలాంటి విషయాల్ని గురించి బైబిలు ఏమి చెబుతుందో మరింతగా తెలియజేయాలంటే మీరేం చేయాల్సివుంటుందో ఈ క్రింద చూడండి.