కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్తరహిత శస్త్రచికిత్స “ఒక గొప్ప వైద్య ప్రవృత్తి”

రక్తరహిత శస్త్రచికిత్స “ఒక గొప్ప వైద్య ప్రవృత్తి”

రక్తరహిత శస్త్రచికిత్స “ఒక గొప్ప వైద్య ప్రవృత్తి”

మాక్‌లేన్స్‌ పత్రిక “‘రక్తరహిత’ శస్త్రచికిత్స” అన్న హెడ్డింగ్‌ క్రింద, కెనడా అంతటా ఉన్న డాక్టర్లు “గత అయిదు సంవత్సరాలకు పైగా రక్తరహిత శస్త్రచికిత్స అని పిలవబడే శస్త్రచికిత్సను ఒక గొప్ప వైద్య ప్రవృత్తిగా చేసిన క్రొత్త విధానాలను వృద్ధిపరుస్తున్నారు” అని నివేదించింది. విన్నిపెగ్స్‌ హెల్త్‌ సైన్సెస్‌ సెంటర్లోని అనస్థీషియాలజిస్ట్‌ అయిన బ్రయన్‌ మ్యూర్‌హెడ్‌ వాళ్ళలో ఒకరు. రక్తం ఉపయోగించకుండా చేసే చికిత్సకు ప్రత్యామ్నాయం కోసం అన్వేషించడానికి ఆయనను ఏది పురికొల్పింది?

1986 లో డాక్టర్‌ మ్యూర్‌హెడ్‌, 70 సంవత్సరాల వృద్ధునికున్న రక్తం స్రవిస్తున్న ఒక పుండును ఆపరేషన్‌ చేసే క్లిష్టమైన పనిని చేపట్టాడు, ఆ వృద్ధుడు ఒక యెహోవాసాక్షి కాబట్టి బైబిలు ఆధారిత నమ్మకాల కారణంగా రక్తమార్పిడి అవసరంలేని చికిత్స కావాలని అడిగాడు. (అపొస్తలుల కార్యములు 15:​28, 29) డాక్టర్‌ మ్యూర్‌హెడ్‌ “రోగి రక్తపోటు తగ్గిపోకుండా ఉండడానికి రోగి రక్తవాహికలోకి సెలైన్‌ ద్రవాన్ని ఎక్కించడమనే, అరుదుగా ఉపయోగించే ఒక పద్ధతిని ప్రయోగించాడు” అని మాక్‌లేన్స్‌ నివేదిస్తోంది. “ఆ పద్ధతి విజయవంతమయ్యింది, అది మ్యూర్‌హెడ్‌లో పెరుగుతున్న ‘మనం అనేకమైన రక్తమార్పిడులు చేస్తున్నాం. వాటికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన సమయమిదేనని’ అనుకుంటున్న ఆయన ఆలోచనను ఆ పద్ధతి దృఢపర్చింది.”

రక్తరహిత వైద్య చికిత్స కోసమైన పరిశోధనల్ని “భవిష్యత్తులో దానం చేయబడే రక్తపు సరఫరా, రక్తమార్పిడిలో వైరస్‌లు అంటువ్యాధులను సంక్రమింపజేస్తాయనే అనేకమంది రోగుల భయమూ ఈ రెండు చింతలూ ప్రేరేపించాయి.” ఆధునిక డాక్టర్ల పరిశోధనల మూలంగా యెహోవాసాక్షులు మాత్రమే కాదుగానీ అనేకమంది ఇతరులు కూడా ప్రయోజనం పొందారు. “రక్తరహిత శస్త్రచికిత్స అనేక కేసుల్లో రక్తమార్పిడుల అవసరం లేకుండా చేస్తోంది. అంతేగాక, కలుషిత రక్తం వల్ల సంక్రమించే ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తుంది” అని మాక్‌లేన్స్‌ చెబుతోంది. “కలుషితం కాని” రక్తమైనా కూడా అది తాత్కాలికంగా రోగిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను అణచివేయడం ద్వారా అంటువ్యాధులు సంక్రమించే ప్రమాదానికి గురిచేస్తుంది.

ప్రత్యామ్నాయ రక్తరహిత వైద్య చికిత్స గురించిన యెహోవాసాక్షుల దృఢ నమ్మకం వెనుక ఏముంది? రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రోషూరును చదవడానికి మీకు ఆసక్తి అనిపించవచ్చు. దాన్ని మీతో పంచుకోవడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు.