ఆత్మను అనుసరించి జీవించండి!
ఆత్మను అనుసరించి జీవించండి!
“ఆత్మానుసారమైన మనస్సు జీవము.”—రోమీయులు 8:6.
1, 2. “శరీరము”నకూ “ఆత్మ”కూ మధ్య ఉన్న తేడాను బైబిలు ఎలా చూపిస్తుంది?
శరీర కోరికలను తృప్తిపరచడాన్ని కీర్తించే దిగజారిన సమాజంలో జీవిస్తూ దేవుని ఎదుట నైతికంగా పరిశుభ్రంగా కొనసాగడం అంత సులభమైన విషయమేమీ కాదు. లేఖనాలు “శరీరము”ను “ఆత్మ”ను భిన్నంగా చూపుతున్నాయి. పాపభరితమైన శరీరం తమను శాసించేందుకు అనుమతించడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలనూ, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావానికి లోబడడం వల్ల కలిగే ఆశీర్వాదకరమైన ఫలితాలనూ స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
2 ఉదాహరణకు, “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి” అని యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 6:63) “శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి” అని గలతీయలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (గలతీయులు 5:17) “తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును” అని కూడా పౌలు అన్నాడు.—గలతీయులు 6:8.
3. చెడు కోరికల నుండీ, వాటికి మొగ్గు చూపే వైఖరుల నుండీ బయటపడేందుకు ఏమి అవసరం?
3 యెహోవా యొక్క చురుకైన శక్తి అయిన పరిశుద్ధాత్మ అపవిత్రమైన ‘శరీరాశలనూ,’ పాపభరితమైన మన శరీరం చెలాయించే వినాశకరమైన ఆధిపత్యాన్నీ కూకటివేళ్ళతో సహా విజయవంతంగా పెకిలించగలదు. (1 పేతురు 2:11) చెడు కోరికలకు మొగ్గు చూపే బంధకాన్నుండి బయట పడేందుకు, మనకు దేవుని ఆత్మ సహాయం అత్యవసరం. అందుకనే, “శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 8:5, 6) ఆత్మను అనుసరించడం అంటే ఏమిటి?
‘ఆత్మను అనుసరించడం’
4. ‘ఆత్మను అనుసరించడం’ అంటే ఏమిటి?
4 ‘ఆత్మను అనుసరించడాన్ని’ గురించి పౌలు వ్రాసినప్పుడు, “ఆలోచనా సరళిని, మానసిక స్థితిని . . . లక్ష్యాన్ని, అభిలాషను, శ్రమను” సూచించే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన ఒక క్రియా పదానికి “ఆలోచించడం, నిర్దిష్టమైన విధంగా మనస్సును నిలపడం” అని అర్థం. కాబట్టి, ఆత్మను అనుసరించడం అంటే యెహోవా యొక్క చురుకైన శక్తి చేత నియంత్రించబడడం, శాసించబడడం, ప్రేరేపించబడడం అని అర్థం. అంటే దేవుని పరిశుద్ధాత్మ మన ఆలోచనాసరళిపై, ఇష్టాయిష్టాలపై, అభిలాషలపై పూర్తి ప్రభావాన్ని చూపేందుకు మనం ఇష్టపూర్వకంగా అనుమతించడం అని అర్థం.
5. పరిశుద్ధాత్మ ప్రభావానికి మనమెంత మేరకు లోబడి ఉండాలి?
5 “ఆత్మకు దాసులమై ఉన్నాము” అని పౌలు చెప్పినప్పుడు, మనం పరిశుద్ధాత్మ ప్రభావానికి ఎంత మేరకు లోబడి ఉండాలన్న విషయాన్ని నొక్కి చెప్పాడు. (రోమీయులు 7:6, NW) యేసు విమోచన క్రయధనములో తాము ఉంచిన విశ్వాసం ఆధారంగా, క్రైస్తవులు పాపపు అధికారం నుండి విముక్తి చేయబడి, పాపానికి దాసులుగా ఉన్న తమ మునుపటి పరిస్థితి విషయమై ‘మృతులై’ ఉన్నారు. (రోమీయులు 6:2, 11) అలా అలంకారికంగా మృతులైనవారు శారీరకంగా సజీవంగానే ఉండి, “నీతికి దాసులై” క్రీస్తును అనుసరించేందుకు ఇప్పుడు స్వతంత్రులై ఉన్నారు.—రోమీయులు 6:18-20.
గమనార్హమైన మార్పు
6. “నీతికి దాసులు” అవుతున్నవారిలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది?
6 “పాపమునకు దాసులై” ఉన్న స్థితిలో నుండి ‘నీతికి దాసులుగా’ దేవునికి సేవ చేసే స్థితికి మారడం నిజంగా గమనార్హమైన విషయమే. అలాంటి మార్పు సంభవించిన కొందరి గురించి, “ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి” అని పౌలు వ్రాశాడు.—రోమీయులు 6:17, 18; 1 కొరింథీయులు 6:11.
7. విషయాలను యెహోవా ఎలా దృష్టిస్తున్నాడో తెలుసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?
7 అంత గమనార్హమైన మార్పును పొందాలంటే, విషయాలను యెహోవా ఎలా దృష్టిస్తున్నాడో మొదట తెలుసుకోవలసిన అవసరం ఉంది. “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము . . . నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు కీర్తన 25:4, 5) దావీదు మొఱను యెహోవా ఆలకించాడు. ఆ విధంగా ప్రార్థించే తన ఆధునిక దాసులకు కూడా ఆయన జవాబివ్వగలడు. దేవుని మార్గాలు, ఆయన సత్యము నిర్మలమైనవీ పవిత్రమైనవీ కనుక వాటిని గురించి ధ్యానించడం, అపవిత్రమైన శరీర కోరికలను తృప్తిపర్చుకోవాలన్న శోధనకు గురైనప్పుడు సహాయకరంగా ఉంటుంది.
ఉపదేశము చేయుము” అని శతాబ్దాల క్రితం కీర్తనకర్తయైన దావీదు పట్టుదలతో విజ్ఞాపన చేశాడు. (దేవుని వాక్యానికున్న కీలకమైన పాత్ర
8. మనం బైబిలును అధ్యయనం చేయడం ఎందుకంత అత్యవసరం?
8 దేవుని వాక్యమైన బైబిలు పరిశుద్ధాత్మ యొక్క ఒక ఉత్పత్తి. అందుకని, ఆ ఆత్మ మనపై పని చేయడానికి అనుమతించే ఒక కీలకమైన మార్గం ఏమిటంటే, సాధ్యమైతే ప్రతిరోజు బైబిలును చదివి అధ్యయనం చేయడమే. (1 కొరింథీయులు 2:10, 11; ఎఫెసీయులు 5:18) మన మనస్సునూ హృదయాన్నీ బైబిలు సత్యాలతో సూత్రాలతో నింపుకోవడం, మన ఆధ్యాత్మికతపైకి వచ్చే దాడులను తట్టుకొని నిలబడేందుకు మనకు సహాయపడుతుంది. అవును, అనైతిక శోధనలకు గురైనప్పుడు, దేవుని చిత్తానికి అనుగుణ్యంగా ప్రవర్తించాలన్న మన తీర్మానాన్ని బలపరచగల ఆధ్యాత్మిక జ్ఞాపికలనూ, మార్గదర్శక సూత్రాలనూ దేవుని ఆత్మ మనకు గుర్తు చేస్తుంది. (కీర్తన 119:1, 2, 99; యోహాను 14:26) అలా, మనం తప్పుడు దోవను అనుసరించేలా మోసగించబడము.—2 కొరింథీయులు 11:3.
9. యెహోవాతో మనకున్న సంబంధాన్ని కాపాడుకోవాలన్న మన తీర్మానాన్ని బైబిలు అధ్యయనం ఎలా బలపరుస్తుంది?
9 బైబిలుపై ఆధారపడిన ప్రచురణల సహాయంతో, మనం లేఖనాలను హృదయపూర్వకంగా శ్రద్ధగా అధ్యయనం చేయడంలో కొనసాగుతుండగా, దేవుని పరిశుద్ధాత్మ మన మనస్సునూ హృదయాన్నీ ప్రభావితం చేస్తూ, యెహోవా ప్రమాణాల మీద మనకున్న గౌరవాన్ని మరింత అధికం చేస్తుంది. అప్పుడు దేవునితో మనకున్న సంబంధం మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయమవుతుంది. శోధనకు గురైనప్పుడు, తప్పిదాల్లో పాల్గొనడం ఎంత ఆహ్లాదకరంగా ఉండవచ్చన్న తలంపులు మనస్సులో నిలవవు. బదులుగా వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, యెహోవా ఎదుట మన యథార్థతను కాపాడుకోవాలన్నదే. ఆయనతో మనకున్న సంబంధాన్ని గురించి మనకున్న గొప్ప మెప్పుదల, దాన్ని పాడు చేయగల లేక నాశనం చేయగల దేనివైపైనా సరే మొగ్గు చూపకుండా పోరాడేలా మనలను పురికొల్పుతుంది.
“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది”
10. ఆత్మను అనుసరించాలంటే యెహోవా ధర్మశాస్త్రానికి విధేయత చూపించడం ఎందుకు అవసరం?
10 మనం ఆత్మను అనుసరించాలంటే, దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానం ఉంటే మాత్రం సరిపోదు. రాజైన సొలొమోనుకు యెహోవా ప్రమాణాలను గురించిన మంచి జ్ఞానం ఉన్నా, తన జీవితపు చివరి దశలో వాటి ప్రకారం నడవడంలో ఆయన విఫలుడయ్యాడు. (1 రాజులు 4:29, 30; 11:1-6) మనం ఆధ్యాత్మిక చింతనగల గలవారమైతే, బైబిలు చెబుతున్న వాటిని తెలుసుకోవడమే కాక దేవుని ధర్మశాస్త్రానికి హృదయపూర్వకంగా విధేయత చూపించవలసిన అవసరం ఉందని కూడా గ్రహిస్తాం. అంటే, యెహోవా ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించి, వాటిని అనుసరించడానికి శ్రద్ధగా కృషిచేయాలి. కీర్తనకర్తకు ఇటువంటి దృక్పథమే ఉండేది. “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” అని ఆయన పాడాడు. (కీర్తన 119:97) మనం దేవుని ధర్మశాస్త్రాన్ని నిజంగా ధ్యానించినప్పుడు, దైవిక లక్షణాలను కనబరచడానికి పురికొల్పబడతాం. (ఎఫెసీయులు 5:1, 2) తప్పిదం చేయడానికి నిస్సహాయంగా ఆకర్షితులమయ్యే బదులు, మనం ఆత్మ ఫలాల్ని కనబరుస్తాం; యెహోవాను ప్రీతిపరచాలన్న కోరిక, మనలను ‘శరీర కార్యములైన’ చెడ్డ పనులకు దూరంగా ఉంచుతుంది.—గలతీయులు 5:16, 19-23; కీర్తన 15:1, 2.
11. జారత్వాన్ని నిషేధించే యెహోవా శాసనము మనకు ఒక రక్షణ కవచంగా ఉందన్న విషయాన్ని మీరెలా వివరిస్తారు?
11 యెహోవా ధర్మశాస్త్రం మీద ప్రగాఢమైన గౌరవాన్నీ ప్రేమనూ ఎలా పెంపొందించుకోగలం? ఒక మార్గం ఏమిటంటే, దాని విలువను గురించి జాగ్రత్తగా ఆలోచించడమే. లైంగిక సంబంధాలను వివాహ జీవితానికి మాత్రమే పరిమితం హెబ్రీయులు 13:4) ఈ శాసనానికి విధేయత చూపడం వల్ల మనం మంచిని దేన్నైనా కోల్పోతున్నామా? ప్రేమగల పరలోక తండ్రి మనకు ప్రయోజనకరమైన దానిని దక్కనివ్వని ఒక శాసనాన్ని పెడతాడా? అలా ఎన్నడూ పెట్టడు! యెహోవా పెట్టిన నైతిక ప్రమాణాలకు అనుగుణ్యంగా నడుచుకోని అనేకుల జీవితాల్లో ఏమి జరుగుతుందో గమనించండి. అవాంఛిత గర్భధారణలు తరచుగా గర్భవిచ్ఛిత్తి చేయించుకోవడానికీ లేదా బహుశా ఈడు రాకుండానే పెళ్ళిళ్ళు చేసుకోవడానికీ, అసంతోషకరమైన పెళ్ళిళ్ళకూ దారితీస్తుంది. అనేకులు భర్త/భార్య లేకుండా ఒక బిడ్డను పెంచవలసి వస్తుంది. అంతేగాక, జారత్వానికి పాల్పడేవారు లైంగికంగా సంక్రమించే వ్యాధులకు గురవుతున్నారు. (1 కొరింథీయులు 6:18) యెహోవా సేవకుడు ఒకరు జారత్వానికి పాల్పడితే, తర్వాత కలిగే భావోద్వేగాలూ వినాశకరంగా ఉండగలవు. అపరాధ భావంతో ఉన్న మనస్సాక్షి చేసే ఆక్రందన బయటికి తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించడం, నిద్రలేని రాత్రులకూ మానసిక వ్యధకూ కారణమవ్వవచ్చు. (కీర్తన 32:3, 4; 51:3) కాబట్టి, జారత్వాన్ని నిషేధించే యెహోవా శాసనము మనలను కాపాడేందుకే రూపొందించబడిందని స్పష్టమవ్వడం లేదంటారా? అవును, నైతిక పరిశుభ్రతను కాపాడుకోవడం వల్ల నిజంగా గొప్ప ప్రయోజనమే ఉంటుంది!
చేసి, జారత్వాన్నీ వ్యభిచారాన్నీ నిషేధించే దేవుని శాసనాన్నే తీసుకోండి. (యెహోవా సహాయం కోసం ప్రార్థించండి
12, 13. పాపభరిత కోరికలు మనలను చుట్టుముట్టినప్పుడు ప్రార్థించడం ఎందుకు సముచితమై ఉంటుంది?
12 ఆత్మను అనుసరించేందుకు హృదయపూర్వకంగా ప్రార్థించడం నిశ్చయంగా అవసరం. “మీరు . . . మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు”నని యేసు చెప్పాడు కనుక, సహాయం కోసం దేవుని ఆత్మనివ్వమని కోరడం సముచితమే. (లూకా 11:12, 13) మన బలహీనతల విషయమై సహాయం కోసం పరిశుద్ధాత్మపై ఆధారపడుతున్నామన్న విషయాన్ని ప్రార్థనలో మనం వ్యక్తీకరించగలం. (రోమీయులు 8:26, 27) పాపభరితమైన కోరికలుగానీ, దృక్పథాలుగానీ మనలను బాధిస్తున్నట్లు మనం గుర్తించినట్లయితే, లేదా ప్రేమగల తోటి విశ్వాసి ఒకరు మన దృష్టికి తీసుకొస్తే, ఆ సమస్యను గురించి ప్రార్థనలో ప్రత్యేకంగా పేర్కొని, ఆ ధోరణులను అధిగమించడానికి దేవుని సహాయం కావాలని కోరడం వివేకవంతమైన పని.
13 నీతియుక్తమైన, పవిత్రమైన, నైతికమైన, ప్రశంసనీయమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించేందుకు యెహోవా మనకు సహాయం చేయగలడు. “దేవుని సమాధానము” మన హృదయాలను మానసిక సామర్థ్యాలను కాపాడాలని హృదయపూర్వకంగా ఆయనకు విజ్ఞాపనలు చేయడం ఎంత సముచితం! (ఫిలిప్పీయులు 4:6-8) కాబట్టి, ‘నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును వెంటాడుటకు’ యెహోవా సహాయం కోసం ప్రార్థిద్దాం. (1 తిమోతి 6:11-14, NW) మన పరలోక తండ్రి సహాయముంటే చింతలూ, శోధనలూ నియంత్రించలేనంతటి స్థాయికి ఎదగవు. బదులుగా దేవుడిచ్చే ప్రశాంతత మన జీవితానికి ప్రతీకగా ఉంటుంది.
ఆత్మను దుఃఖపరచకండి
14. పరిశుభ్రంగా ఉండేందుకు దేవుని ఆత్మ ఒక ప్రేరణాత్మక శక్తిగా ఎలా పనిచేస్తుంది?
14 పరిపక్వతగల యెహోవా సేవకులు, “ఆత్మను ఆర్పకుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని వ్యక్తిగతంగా ఆచరణలో పెడతారు. (1 థెస్సలొనీకయులు 5:19) దేవుని ఆత్మ “పరిశుద్ధమైన ఆత్మ” కనుక, అది నిర్మలమైనది, స్వచ్ఛమైనది, పవిత్రమైనది. (రోమీయులు 1:1-7) ఆ ఆత్మ మనపై పనిచేసేటప్పుడు, మనం పరిశుద్ధంగా లేదా పరిశుభ్రంగా ఉండేందుకు ఒక ప్రేరణాత్మక శక్తిగా ఉంటుంది. దేవునికి విధేయత చూపడమే గుర్తుగా ఉన్న పరిశుభ్రమైన జీవన మార్గంలో మనం కొనసాగేందుకు అది సహాయం చేస్తుంది. (1 పేతురు 1:1, 2) అపవిత్రమైన అలవాటేదైనా సరే, అది ఆ ఆత్మను అగౌరవపరుస్తుంది. అది వినాశకరమైన పర్యవసానాలను తీసుకురాగలదు. అదెలా?
15, 16. (ఎ) మనం దేవుని ఆత్మను ఎలా దుఃఖపరచవచ్చు? (బి) మనం యెహోవా ఆత్మను దుఃఖపరచడాన్ని ఎలా నివారించవచ్చు?
15 “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఎఫెసీయులు 4:30) యెహోవా ఆత్మ, నమ్మకస్థులైన అభిషిక్త క్రైస్తవులు పొందనున్న దానికి ముద్రగా లేక “సంచకరువు”గా ఉన్నట్లు లేఖనాలు తెలియజేస్తున్నాయి. వాళ్ళు పొందనున్నది అమర్త్య పరలోక జీవితం. (2 కొరింథీయులు 1:22; 1 కొరింథీయులు 15:50-57; ప్రకటన 2:10) దేవుని ఆత్మ అభిషిక్త క్రైస్తవులనూ, వారి సహచరులైన భూ నిరీక్షణగలవారినీ విశ్వాసంతో కూడిన జీవ మార్గంలోనికి నడుపుతూ, పాపభరితమైన పనులను నివారించుకునేందుకు వారికి సహాయపడగలదు.
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు” అని పౌలు వ్రాశాడు. (16 అబద్ధం, దొంగతనం, అవమానకరమైన ప్రవర్తన మొదలైనవాటి వైపుకు మొగ్గు చూపే ధోరణులకు వ్యతిరేకంగా అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. అలాంటి వాటివైపుకు ఆకర్షించబడేందుకు మనలను మనం అనుమతిస్తే, ఆత్మ ప్రేరేపిత దేవుని వాక్య ఉపదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించినవారమౌతాం. (ఎఫెసీయులు 4:17-29; 5:1-5) కనీసం కొంత మేరకైనా మనం దేవుని ఆత్మను దుఃఖపరచినవారమౌతాం. అలా దుఃఖపర్చకూడదని మనం నిశ్చయంగా కోరుకుంటాం. ఈ విషయంలో, మనలో ఎవరైనా యెహోవా వాక్య ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయనారంభిస్తే, మనఃపూర్వకంగా పాపం చేయడానికీ, దేవుని ప్రీతిని పూర్తిగా కోల్పోవడానికీ కారణం కాగల దృక్పథాలనుగానీ, లక్షణాలనుగానీ పెంపొందించుకోవడం ప్రారంభించవచ్చు. (హెబ్రీయులు 6:4-6) మనం ఇప్పుడు పాపం చేయకపోయినప్పటికీ, మనమా దిశగా ప్రయాణించవచ్చు. ఆత్మ నడిపింపుకు విరుద్ధంగా ముందుకు కొనసాగడం ద్వారా మనం ఆ ఆత్మను దుఃఖపరచవచ్చు. మనం పరిశుద్ధాత్మకు మూలమైన యెహోవాను కూడా ఎదిరిస్తున్నవారమవుతాం, దుఃఖపరుస్తున్నవారమౌతాం. దేవుణ్ణి ప్రేమించే మనము అలా చేయాలని ఎన్నడూ కోరుకోము. దానికి బదులు, దేవుని ఆత్మను దుఃఖపరచక, దానిని అనుసరిస్తూ మనం ఆయన పరిశుద్ధ నామానికి మహిమను తేగల్గేలా మనకు సహాయం చేయమని ఆయనను ప్రార్థిద్దాం.
ఆత్మను అనుసరిస్తూ ఉండండి
17. మనం పెట్టుకోగల లేఖనాధారమైన కొన్ని లక్ష్యాలు ఏవి, వాటిని చేరుకోవడానికి ప్రయత్నించడం ఎందుకు వివేకవంతమైన పని?
17 ఆత్మను అనుసరిస్తూ ఉండేందుకు ప్రాముఖ్యమైన ఒక మార్గమేమిటంటే, ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకునేందుకు కృషి చేయడమే. మన లక్ష్యాలలో మన అధ్యయన అలవాట్లను మెరుగుపరచుకోవడం, ప్రకటన పనిలో మనం మరెక్కువగా భాగం వహించడం, లేదా పూర్తికాల పయినీరింగ్ పరిచర్య, బేతేలు సేవ, లేదా మిషనరీ పని వంటి నిర్దిష్టమైన ఒక సేవాధిక్యతకు చేరుకోవడం వంటివాటిని మన అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి చేర్చుకోవచ్చు. అలా చేయడం, మన మత్తయి 6:19-21.
మనస్సును ఆధ్యాత్మిక ఆసక్తులతో నింపుకుని మానవ బలహీనతలకు లోనుకాకుండా లేదా వస్తుసంపదల కోసమైన లక్ష్యాలు గానీ ఈ లోకవిధానానికి సర్వసాధారణమై పోయిన లేఖనవిరుద్ధమైన కోరికలుగానీ మనలను నియంత్రించకుండా మనం వాటిని ఎదిరించేందుకు మనకు సహాయం చేస్తుంది. ఇది నిశ్చయంగా వివేకవంతమైన పని. అందుకే యేసు, “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును” అని బోధించాడు.—18. ఈ అంత్యదినాల్లో ఆత్మను అనుసరిస్తూ ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం?
18 ఆత్మను అనుసరించి, లోకాశలను అణచివేయడం, ఈ “అంత్య దినములలో” వివేకవంతమైన పని. (2 తిమోతి 3:1-5) “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:15-17) ఉదాహరణకు, ఒక క్రైస్తవ అబ్బాయిగానీ, అమ్మాయిగానీ పూర్తికాల సేవా లక్ష్యాన్ని వెంబడిస్తే, ఆ సేవా లక్ష్యం, సవాళ్ళు ఎదురయ్యే కౌమార ప్రాయంలోగానీ లేదా యౌవనంలో అడుగు పెట్టే కాలంలోగానీ ఒక మార్గదర్శినిగా పనిచేయవచ్చు. రాజీపడేలా ఒత్తిడి చేయబడినప్పుడు, అలాంటి వ్యక్తి మనస్సులో, ఆమె అయినా ఆయనైనా, తాను యెహోవా సేవలో ఏమి సాధించాలనుకుంటున్నది స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తి, వస్తు సంపదలను వెంటాడడం కోసం లేదా పాపం అందించే ఆనందాల కోసం ఆధ్యాత్మిక లక్ష్యసాధనను వదిలిపెట్టడం అవివేకమనీ, మూర్ఖత్వమనీ తలస్తారు. ఆధ్యాత్మిక విషయాలవైపు మొగ్గు చూపిన మోషే, “అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచిం”చాడు. (హెబ్రీయులు 11:24-26) మనమూ యౌవనులమైనా, వృద్ధులమైనా పాపంలో పడిపోయిన శరీరాన్ని అనుసరించే బదులు ఆత్మను అనుసరిస్తూ ఉన్నప్పుడు అదే విధమైన ఎంపికను చేసుకుంటాం.
19. మనం ఆత్మను అనుసరిస్తూ ఉన్నట్లయితే మనం ఏ ప్రయోజనాలను అనుభవించగల్గుతాం?
19 “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది.” (రోమీయులు 8:6, 7) మనం ఆత్మను అనుసరిస్తూ ఉన్నట్లయితే, ఎంతో విలువైన శాంతిని అనుభవిస్తాం. మన హృదయాలూ, మానసిక సామర్థ్యాలూ మన పాపభరిత స్థితి చూపించే ప్రభావం నుండి పూర్తిగా కాపాడబడతాయి. తప్పిదం చేసేలా మనలో కలిగే శోధనలను మనం మరింత మెరుగ్గా ఎదిరించగల్గుతాం. శరీరానికీ ఆత్మకూ మధ్య నిరంతరం జరిగే సంఘర్షణను తట్టుకొని నిలబడేందుకు మనకు దైవిక సహాయం ఉంటుంది.
20. శరీరానికీ ఆత్మకూ మధ్య జరిగే పోరాటంలో విజయం సాధించడం సాధ్యమేనన్న నిశ్చయతను మనమెలా కలిగివుండగలం?
20 ఆత్మను అనుసరిస్తూ ఉండడం ద్వారా, జీవానికీ పరిశుద్ధాత్మకూ మూలమైన యెహోవాతో మనకున్న సంబంధాన్ని కాపాడుకుంటాం. (కీర్తన 36:9; 51:11) అపవాదియైన సాతానూ అతని ఏజెంట్లూ, మనకు యెహోవా దేవునితో ఉన్న సంబంధాన్ని తెగతెంపులయి పోయేలా చేయడానికి తాము చేయగల్గినదంతా చేస్తున్నారు. అలా జరగడానికి మనం అనుమతిస్తే, మనం దేవునికి శత్రువులుగా మారతామనీ, చివరికి మరణం సంభవిస్తుందనీ వాళ్ళకు బాగా తెలుసు కనుక, మన మనస్సులను వాళ్ళు తమ అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, శరీరానికీ ఆత్మకూ మధ్య జరిగే పోరాటంలో మనం విజేతలం కాగలం. పౌలు విజయుడయ్యాడు. ఆయన తన సొంత పోరాటాన్ని గురించి వ్రాస్తూ, “ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” అని మొదట ప్రశ్నించాడు. ఆ తర్వాత, రక్షణ సాధ్యమేనని చూపిస్తూ, “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని ప్రకటించాడు! (రోమీయులు 7:21-25) నిత్యజీవమనే అద్భుత నిరీక్షణతో మానవ బలహీనతను తట్టుకుంటూ, ఆత్మను అనుసరిస్తూ ఉండే మార్గాన్ని దేవుడు చూపిస్తున్నందుకు క్రీస్తు ద్వారా మనం కూడా ఆయనకు కృతజ్ఞతలను తెలుపుకోగలం.—రోమీయులు 6:23.
మీకు జ్ఞాపకమున్నాయా?
• ఆత్మను అనుసరించడం అంటే ఏమిటి?
• యెహోవా ఆత్మ మనపై పనిచేసేలా మనమెలా అనుమతించగలం?
• పాపానికి విరుద్ధమైన మన పోరాటంలో బైబిలు అధ్యయనమూ, యెహోవా శాసనానికి విధేయత చూపించడమూ, ఆయనకు ప్రార్థించడమూ ఎందుకంత ప్రాముఖ్యమో వివరించండి.
• ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకోవడం జీవ మార్గంలో మనం కొనసాగేందుకు ఎలా సహాయపడగలదు?
[అధ్యయన ప్రశ్నలు]
[16వ పేజీలోని చిత్రం]
మన ఆధ్యాత్మికతపై వచ్చే దాడులను తట్టుకొని నిలబడేందుకు బైబిలు అధ్యయనం మనకు సహాయపడుతుంది
[17వ పేజీలోని చిత్రం]
పాపభరితమైన కోరికలను అధిగమించేలా యెహోవా సహాయం కోసం ప్రార్థించడం సముచితం
[18వ పేజీలోని చిత్రాలు]
ఆత్మను అనుసరిస్తూ ఉండేందుకు ఆధ్యాత్మిక లక్ష్యాలు మనకు సహాయపడగలవు