ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్ కాగలదా?
ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్ కాగలదా?
మీరు బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు/రాలు అయితే, మీకు దేవుని మీద ఉన్న ప్రేమ ఆయన చిత్తం చేయడానికి మిమ్మల్ని కదిలిస్తుందన్న విషయంలో సందేహం లేదు. అంతేకాక, మిమ్మల్ని మీరు పరిచర్యకు అంకితం చేసుకుని ఉండవచ్చు. అంతెందుకు, తన అనుచరులందరూ శిష్యులను తయారుచేసేవారిగా ఉండాలని యేసుక్రీస్తు ఆదేశించాడు. (మత్తయి 28:19, 20) మిమల్ని మీరు పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగం చేస్తుంటుండవచ్చు. కానీ, మీరు యేసు అనుచరుడుగా/రాలుగా, యెహోవాసాక్షుల్లో ఒకరిగా, ప్రథమంగా, రాజ్య ప్రకటనా పనికి జీవితంలో మొదటి స్థానమిచ్చే ఒక క్రైస్తవ పరిచారకుడు/రాలు.—మత్తయి 24:14.
బహుశా మీరు కౌమార దశ చివరిలోనో, 20ల తొలి భాగంలోనో ఉండి ఉంటారు. జీవితంలో మీరు ఎటువంటి కెరీర్‌ని ఎన్నుకోవాలన్న విషయాన్ని గురించి చాలా ఆలోచించి ఉంటారు. మీ ముందున్న అవకాశాలను మీరు తూచి చూసుకుంటున్నప్పుడు, వ్యక్తిగత సంతృప్తినిచ్చేదేదన్నదే కావచ్చు మీరు ముఖ్యంగా చూసేది.
డెన్మార్క్‌కి చెందిన యోర్న్ తాను ఎంచుకున్న కెరీర్ గురించి చెబుతున్న దాన్ని ఆలోచించండి. తాను ఎంపికచేసుకున్న కెరీర్‌ని “ఆదర్శవంతమైన జీవన విధానం”గా అభివర్ణిస్తూ, దాంట్లో “అత్యంత ప్రాముఖ్యమైన పనిపై మీరు కేంద్రీకరించగలుగుతారు” అని ఆయన చెబుతున్నాడు. గ్రీసుకు చెందిన ఈవ అనే 31 ఏండ్ల స్త్రీ, “నా తోటి వయస్కుల జీవితంతో నా జీవితాన్ని పోల్చిచూసినప్పుడు, నా జీవితమే మరింత అర్థవంతమైనదిగా, సంతృప్తికరమైనదిగా, మరింత ఉత్తేజవంతమైనదిగా ఉన్నదన్న నిర్ధారణకే నేనెల్లప్పుడూ వస్తుంటాను” అని అంటోంది. అలాంటి సంతృప్తిని ఏ కెరీర్ ఇవ్వగలదు? అలాంటి కెరీర్‌ని మీరెలా సొంతం చేసుకోగలరు?
దేవుడు మార్గదర్శనమిస్తాడా?
ఒక కెరీర్‌ని ఎంపికచేసుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. నిజానికి తాము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని ఆయన ఖచ్చితంగా సూచిస్తాడని కొందరు ఆశించవచ్చు.
ఐగుప్తుకు తిరిగివెళ్ళి ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడిపించాలని మోషే మిద్యానులో ఉన్నప్పుడు యెహోవా ఆయనకు నిర్దేశమిచ్చాడు. (నిర్గమకాండము 3:1-10) ఇశ్రాయేలును అణచివేత నుండి రక్షించేందుకు నియమించబడిన గిద్యోనుకు దేవుని దూత కనిపించాడు. (న్యాయాధిపతులు 6:11-14) ఇశ్రాయేలు భావి రాజుగా దావీదును అభిషేకించమని సమూయేలుకు దేవుడు చెప్పినప్పుడు దావీదు గొర్రెలను కాస్తున్నాడు. (1 సమూయేలు 16:1-13) నేడు మనమా విధంగా నడిపించబడడం లేదు. బదులుగా మనమే విషయాలను తూచి చూసి, దేవుడు మనకిచ్చిన సామర్థ్యాలను ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరముంది.
“క్రియాశీలతకు నడిపే పెద్ద ద్వారము”ను యెహోవా నేటి యువ క్రైస్తవుల కోసం తెరిచి ఉంచాడు. (1 కొరింథీయులు 16:9, NW) అదెలా? గత దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త రాజ్య ప్రచారకుల సంఖ్య 21,25,000 పెరిగి, మొత్తం సంఖ్య 60,00,000లను దాటింది. ఆధ్యాత్మిక పోషణకూ, ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటనా పనికీ అవసరమైన లక్షల కొలది బైబిళ్ళూ పుస్తకాలూ బ్రోషూర్లూ పత్రికలూ కరపత్రాలూ అందుబాటులో ఉండేలా ఎవరు సహాయపడుతున్నారు? సంతోషకరమైన ఈ ఆధిక్యతను ప్రపంచవ్యాప్త బేతేలు కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారు.
ప్రతిఫలదాయకమైన జీవితం
బేతేలు అంటే “దేవుని మందిరము” అని అర్థం. బేతేలు గృహాలు, వాచ్‌టవర్ సొసైటీ ప్రధాన కార్యాలయాల్లోను, బ్రాంచ్ ఆఫీసుల్లోను సేవచేస్తున్న క్రైస్తవ స్వచ్ఛంద సేవకుల నివాస స్థలాలు. (ఆదికాండము 28:19, అధస్సూచి) ప్రస్తుత బేతేలు కుటుంబాలను, ‘జ్ఞానమువలన కట్టబడి’ చక్కగా సంస్థీకరించబడి, యెహోవా మీది ప్రేమే పునాదిగాగల ‘ఇండ్లతో’ పోల్చవచ్చు.—సామెతలు 24:3.
బేతేలులో ఉన్న కుటుంబ వాతావరణంలాంటి వాతావరణాన్ని గురించి ఏమని చెప్పవచ్చు? “నిత్యం యెహోవా స్నేహితుల మధ్యన ఉన్నానన్న అనుభూతిని పొందుతాను. ఇప్పటికీ బేతేలులో అత్యంత విలువైన విషయమదే” అని ఎస్టోనియాలోని 25 ఏండ్ల బేతేలు సభ్యురాలు చెబుతున్నారు.—కీర్తన 15:1, 2.
కీర్తన 110:3) అమెరికాలోని, బేతేలులో సేవచేస్తున్న వారిలో 46 శాతం మంది 19 నుండి 29 ఏండ్లలోపు వారే. యెషయాలాగే, వాళ్ళూ “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు” అని చెప్పారు. (యెషయా 6:8) అప్పటికే యెహోవాకు తనను తాను సమర్పించుకున్న యెషయా, అదనపు సేవాధిక్యత కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. అలా ముందుకు రావడమంటే తన వ్యక్తిగత ప్రయోజనాలలో కొన్నింటిని త్యాగం చేయడమని అర్థం. అదే విధంగా బేతేలు సేవలో ఉన్నవారు, తమ ఇండ్లనూ, సుపరిచితమైన పరిసరాలనూ, అలాగే తల్లిదండ్రులనూ, అన్నదమ్ములనూ, అక్కచెల్లెళ్ళనూ, స్నేహితులనూ వదిలివచ్చారు. “సువార్త నిమిత్తము” వాళ్ళు ఈ త్యాగాలను ఇష్టపూర్వకముగా చేశారు.—మార్కు 10:29, 30.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19,500 మంది బేతేలు సేవలో ఆనందిస్తున్నారు. (అలా త్యాగం చేసి బేతేలుకి వచ్చినప్పుడు అక్కడ ఎన్ని అధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయో! “స్వయం త్యాగం చేయడం ద్వారా, మనం క్రొత్త లోకంలో జీవించేందుకు మనకు సహాయపడే అనేక విషయాలను నేర్చుకోగలము. నా విషయానికి వస్తే నేను చేసిన త్యాగాల కన్నా, నేను అనుభవించే యెహోవా ఆశీర్వాదాలే చాలా ఎక్కువ” అని రష్యాలోని బేతేలు కుటుంబానికి చెందిన ఒక యువ సభ్యురాలు చెబుతున్నారు.—మలాకీ 3:10.
బేతేలు జీవితం
బేతేలులో జీవితం ఎలా ఉంటుంది? అది ఎంతో క్షేమాభివృద్ధికరమైనదనీ, సంతృప్తికరమైనదనీ, అలాగే ఉత్తేజకరమైనదనీ బేతేలు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు. 43 ఏండ్ల యెన్స్, బేతేలు సేవలో ఆనందిస్తున్నారు. ఎందుకని? “చాలా ప్రాముఖ్యమైన పనిని నిర్వర్తించే ఒక బృహత్ ప్రయత్నంలో మేమొక భాగమన్న భావనే దానికి కారణం. యెహోవా పని ఎంత విస్తారమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో నేను గ్రహించగల్గాను” అని ఆయన అంటున్నారు.
బేతేలులో సోమవారం మొదలుకొని శనివారం వరకుండే రోజులన్నీ ఉదయకాల ఆరాధనతో ఆరంభమౌతాయి. ఉదయకాల ఆరాధన అంటే అది ఒక బైబిలు చర్చ. దానికి అనుభవజ్ఞుడైన పెద్ద అధ్యక్షత వహిస్తాడు. కావలికోట సహాయంతో జరిగే కుటుంబ బైబిలు అధ్యయనానికి ప్రతి సోమవారం సాయంకాలం ఒక గంట వెచ్చించబడుతుంది. అప్పుడప్పుడు ఆ అధ్యయనం తర్వాత, ప్రత్యేకంగా బేతేలు కుటుంబానికి అవసరమైన లేఖనాధార అంశంపై ప్రసంగం ఇవ్వబడుతుంది.
ఒక వ్యక్తి బేతేలుకు మొదటిసారిగా వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? క్రొత్త సభ్యులకు బేతేలు జీవితాన్ని పరిచయం చేసేందుకు బేతేలు సేవకు సంబంధించిన వివిధ పార్శ్వాలను గురించి చర్చించే ప్రసంగాలను కుటుంబంలోని పరిపక్వత గల సహోదరులు ఇస్తారు. బేతేలులో క్రొత్తగా చేరిన సభ్యుడు/రాలు మొదటి సంవత్సరంలో, లేఖనాలను గురించిన తన అవగాహనను పెంచుకునేందుకు రూపొందించబడిన వారానికొకసారి చొప్పున కొన్ని వారాలపాటు జరిగే చక్కని స్కూల్‌కి హాజరౌతారు. క్రొత్తగా బేతేలు సేవలో ప్రవేశించినవారు, బైబిలును చదివే ఒక ప్రత్యేక షెడ్యూల్‌ని అనుసరించడంలో కూడా ఆనందిస్తారు. క్రొత్త సభ్యులు, ఈ షెడ్యూల్ ప్రకారం, బేతేలు సేవలోని మొదటి సంవత్సరంలో మొత్తం బైబిలును చదవడం పూర్తి చేస్తారు.
ఈ తర్ఫీదంతటి వల్ల కలిగే ప్రయోజనమేమిటి? “యెహోవా మీద నాకున్న మెప్పుదలను బేతేలు మరింతగా పెంచింది. తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని యెహోవా సేవలో గడిపిన అనుభవజ్ఞులైన అనేకమంది సహోదరులతో నేను సహవసించగల్గుతున్నాను. ఉదయకాల ఆరాధన, కుటుంబ కావలికోట అధ్యయనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నేను బాగా ఆనందిస్తున్నాను. అంతేకాక, క్రమబద్ధమైన సరళమైన జీవిత విధానాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. అది నన్ను అనవసర చింతల నుండి విముక్తుడ్ని చేస్తుంది. క్రైస్తవ పద్ధతి ప్రకారం ఎలా వ్యవహరించాలో కూడా నేను నేర్చుకున్నాను. అది ప్రయోజనకరమైనదని అన్నివేళలా రుజువైంది” అని హాంగ్‌కాంగ్ బేతేలు కుటుంబానికి చెందిన 33 ఏండ్ల జాష్వా అనే సహోదరుడు జవాబిస్తున్నారు.
బేతేలు కుటుంబ సభ్యులు తాము ఏమి చేయడానికి స్వచ్ఛందంగా వచ్చారో దానిని చేయడానికే తమ సమయాన్నీ, శక్తినీ ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే, తమ శారీరక, మానసిక సామర్థ్యాలను బేతేలులో తమకివ్వబడిన నియామకాన్ని నిర్వర్తించేందుకే ముఖ్యంగా ఉపయోగిస్తారు. అక్కడ ఎన్నో రకాల పనులు జరగవలసి ఉంటుంది. కొందరు ప్రింటింగ్ ప్రెస్సులను ఆపరేట్ చేస్తారు, లేదా బైండింగ్ డిపార్ట్‌మెంట్‌లో పుస్తకాలను తయారు చేస్తారు. వాటినే తర్వాత అనేక సంఘాలకు పంపించడం జరుగుతుంది. ఇతరులు, వంటగదిలో, డైనింగ్ రూమ్‌లో లేదా లాండ్రీలో పని చేస్తారు. బేతేలు నియామకాల్లో శుభ్రం చేయడం, పొలంపని, కట్టడ నిర్మాణాలు మొదలైన ఇతర పనులు కూడా ఉన్నాయి. కొందరికి ఈ డిపార్ట్‌మెంట్లలోని ఉపకరణాలను చూసుకునే బాధ్యత ఉంది. ఇతరులు ఆరోగ్య సంరక్షణా పనిని చేస్తారు, మరికొందరు ఆఫీసు పని చేస్తారు. బేతేలు పనులన్నింటిలోను ఆనందదాయకమైన సవాళ్ళూ అలాగే, అద్భుతమైన ఫలితాలూ ఇమిడి ఉన్నాయి. బేతేలులో జరిగే పని రాజ్యాసక్తులను పెంపొందింపజేస్తుంది గనుక, దేవుని మీద ఉన్న ప్రేమను బట్టే జరుగుతుంది గనుక చాలా సంతృప్తికరంగా ఉంటుంది.
బేతేలు కుటుంబ సభ్యులు ఆయా సంఘాలకు నియమించబడతారు. తమ పని వల్ల కలిగే ప్రయోజనాలను వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా పొందుతారు. తాము నియమించబడిన సంఘ కూటాలకు హాజరు కావడంలోను, ప్రకటనా పనిలో పాల్గొనడంలోను వాళ్ళు ఆనందిస్తారు. అలా, బేతేలు కుటుంబ సభ్యులు స్థానిక సంఘాల్లోని తమ సహోదర సహోదరీలతో దృఢమైన సంబంధాలను పెంచుకున్నారు.—“మా సంఘానికి నేనెంతో కృతజ్ఞురాలిని! నేను కూటాల్లో ఉన్నప్పుడూ పరిచర్యలో ఉన్నప్పుడూ నా ప్రియ సహోదర సహోదరీలనూ పిల్లలనూ వృద్ధులనూ చూసినప్పుడు నా విశ్వాసం మరింత బలపడుతుంది. ఏమి జరిగినా సరే, వాళ్ళు కూటాలకూ పరిచర్యకూ తప్పక వస్తారు. నేను బేతేలు సేవలో మరింత ఉత్సాహంగా ఉండేందుకు అది నాకు సహాయం చేస్తుంది” అని బ్రిటన్‌లోని బేతేలు కుటుంబ సభ్యురాలైన రీటా అంటున్నారు.
బేతేలులో జీవితమంటే పని, కూటాలు, క్షేత్ర సేవ, అధ్యయనం అని మాత్రమే కాదు. కుటుంబ సభ్యులకు వినోదభరిత సమయాలు కూడా ఉంటాయి. వినోదకరమైన, ఆధ్యాత్మికంగా ప్రతిఫలదాయకమైన “ఫ్యామిలీ నైట్” కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతాయి. బేతేలులో సేవ చేస్తున్న అనేకులకున్న సహజ సామర్థ్యాలను చూసి ఆనందించేందుకు, బేతేలులో సేవ చేస్తున్న ఇతరుల జీవితాలను గురించిన ప్రోత్సాహకరమైన విషయాలను తెలుసుకునేందుకు ఆ కార్యక్రమాలు అవకాశాలనిస్తాయి. తోటి బేతేలు సభ్యుల క్షేమాభివృద్ధికరమైన ప్రోత్సాహకరమైన సందర్శనాలు కూడా ఆనందాన్ని తీసుకొస్తాయి. బేతేలులో కొన్ని వినోద సౌకర్యాలు కూడా ఉండవచ్చు, అలాగే వ్యక్తిగతంగా చదువుకునేందుకు, వ్యక్తిగత పరిశోధన కోసం గ్రంథాలయాలుంటాయి. భోజన సమయాల్లో భోజనపు బల్లల దగ్గర జరిగే ప్రశాంతమైన సంభాషణలను కూడా మరవలేము.
“బేతేలుకు కొంచెం దూరాన సముద్రం ఉంది, అందమైన అడవి కూడా సమీపాన ఉంది. నేనూ నా భార్యా అప్పుడప్పుడు సరదాగా నడిచి అక్కడికి వెళ్తుంటాము. నేను అప్పుడప్పుడు సంఘంలోనూ, అలాగే బేతేలులోనూ ఉన్న స్నేహితులతో కలిసి గోల్ఫ్, హాకీ, టెన్నిస్ ఆడుతుంటాను. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మేము మా బైకుల మీద అలా బయటికి వెళ్తుంటాము” అని ఎస్టోనియాలోని బేతేలు సభ్యుడైన టామ్ అంటున్నారు.
మీరు యోగ్యులయ్యేందుకు ఏమి చేయగలరు?
నిజమే, బేతేలు ప్రాథమికంగా, పరిపక్వతగల క్రైస్తవులు యెహోవాకు పవిత్ర సేవ చేసే స్థలం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న
తోటి విశ్వాసుల కోసం పని చేసే స్థలం. బేతేలు కుటుంబ సభ్యులయ్యేవాళ్ళకు కొన్ని యోగ్యతలు తప్పనిసరిగా ఉండాలి. మీరు బేతేలు సేవకు యోగ్యులయ్యేందుకు ఏమి చేయగలరు?అపొస్తలుడైన పౌలుతోపాటు సేవ చేసిన తిమోతిలా, బేతేలు సేవను అంగీకరించేవాళ్ళకు సంఘంలో మంచి పేరుండాలి. (1 తిమోతి 1:1, 2) తిమోతి “లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.” (అపొస్తలుల కార్యములు 16:2) ఆయన యౌవనస్థుడైనప్పటికీ, ఆయనకు లేఖనాలు బాగా తెలుసు, సత్యములో ఆయన లోతుగా వేళ్ళూనుకొని ఉన్నాడు. (2 తిమోతి 3:14, 15) అలాగే, బేతేలు సేవకు అంగీకరించేవారికి బైబిలు జ్ఞానం ఉండాలని నిరీక్షించబడుతుంది.
బేతేలు కుటుంబ సభ్యులకు స్వయం త్యాగపూరిత స్ఫూర్తి ఉండడం అవసరం. తన సొంత విషయాల కన్నా రాజ్యాసక్తులను ముందుంచేందుకు కావలసిన స్వయంత్యాగ స్ఫూర్తీ, సుముఖతా తిమోతిలో ఎంతో స్పష్టంగా కనిపించేవి కనుకనే, ఫిలిప్పీయులు 2:20-22.
పౌలు తిమోతి గురించి మాట్లాడుతూ, “మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను” అని చెప్పగలిగాడు.—బేతేలు సేవకు ఆధ్యాత్మిక స్త్రీపురుషులు అవసరం. బైబిలు అధ్యయనం ద్వారా, క్రైస్తవ కూటాలకూ పరిచర్యకూ క్రమంగా వెళ్ళడం ద్వారా, పరిపక్వతగల క్రైస్తవులతో సహవసించడం ద్వారా బేతేలు కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా ఎదగడాన్ని సాధ్యం చేసే ఏర్పాట్లు చేయబడ్డాయి. “[కీస్తుయేసునందు] వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించేందుకు బేతేలులోనివారికి ఆ ఏర్పాట్ల ద్వారా సహాయం లభిస్తుంది.—కొలొస్సయులు 2:6, 7.
బేతేలులోని పని యొక్క స్వభావం రీత్యా, ఈ సేవాధిక్యతను అంగీకరించేవారు శారీరకంగా బలమైనవారూ, మంచి ఆరోగ్యంగలవారూ అయ్యుండాలి. మేము పేర్కొన్న యోగ్యతలను మీరు చేరుకున్నట్లయితే, మీకు 19 ఏండ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, బాప్తిస్మం తీసుకుని కనీసం ఒక సంవత్సరమన్నా అయితే, బేతేలు సేవ చేయడాన్ని గురించి ఆలోచించమని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాం.
మనకందరికీ భాగముంది
క్రైస్తవులముగా, మనమందరమూ జీవితంలో రాజ్యాసక్తులకు మొదటి స్థానమివ్వాలనీ, యెహోవాకు మనం చేసే సేవను మనస్ఫూర్తిగా చేయాలనీ నిశ్చయంగా కోరుకుంటాం. (మత్తయి 6:33; కొలొస్సయులు 3:23, 24) బేతేలులో సేవచేస్తున్నవారు, పవిత్ర సేవను అక్కడే కొనసాగించాలని కూడా మనం ప్రోత్సహించగలం. ఈ ఆశీర్వాదకరమైన సేవాధిక్యతకు చేరుకోమని బేతేలు సేవకు యోగ్యతగల యువ సహోదరులను ప్రత్యేకంగా పురికొల్పాలి.
బేతేలు సేవ, ఆధ్యాత్మికంగా సంతృప్తికరమైన ఒక జీవన శైలి—అది నిజంగా మీకు శ్రేష్ఠమైన కెరీర్ కాగలదు. 20 ఏండ్ల వయస్సులో బేతేలు సేవ ప్రారంభించిన నిక్ అనే సహోదరుడి విషయంలో అదే చెప్పవచ్చు. ఆయన బేతేలులో పది సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, “నాకు అర్హత లేకపోయినా యెహోవా నాకు చూపించిన దయకు నేను తరచూ ప్రార్థనలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతుంటాను. నాకు ఇంతకన్నా ఇంక ఎక్కువగా మరేది కావాలని అడగగలను? యెహోవాకు తమ శాయశక్తులా సేవ చేస్తున్న నమ్మకస్థులైన క్రైస్తవులు ఇక్కడ మా చుట్టూ ఉన్నారు” అని అన్నారు.
[22వ పేజీలోని బాక్సు/చిత్రం]
పెద్దలూ తల్లిదండ్రులూ ఏమి చేయగలరు?
బేతేలు సేవకు దరఖాస్తు చేయమని ముఖ్యంగా యువకులను సంఘ పెద్దలూ, ప్రయాణ పైవిచారణకర్తలూ ప్రోత్సహించాలి. బేతేలు కుటుంబంలోని యువ సభ్యుల మధ్య ఇటీవల ఒక అనియత సర్వే జరిపినప్పుడు, వారిలో 34 శాతం మంది బేతేలు సేవను తమ లక్ష్యంగా చేసుకునేలా వారిని ప్రోత్సహించింది ముఖ్యంగా క్రైస్తవ పైవిచారణకర్తలేనని తెలిసింది. అవును, వాళ్ళ స్థానిక సంఘాలు వాళ్ళు లేనందువల్ల ఏదో లోటుగా భావిస్తుండవచ్చు. అయితే, నిస్సందేహంగా లుస్త్రలోని, ఈకొనియలోని ఇతర యౌవనస్థులపై తిమోతి క్షేమాభివృద్ధికరమైన ప్రభావాన్ని చూపించినప్పటికీ, అక్కడి సంఘాల్లోని పెద్దలు తిమోతిని పౌలుతో కలిసి సేవ చేయకుండా ఆపలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. తిమోతి ఆ అపొస్తలునితో వెళ్ళిపోతే తమ సంఘానికి చాలా గొప్ప నష్టం వాటిల్లగలదన్న నిర్ధారణకు ఆ సంఘాలు రాలేదు.—1 తిమోతి 4:14.
ఈ విషయంలో ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు, తమ పిల్లలపై మంచి ప్రభావం చూపేందుకు ప్రయత్నించాలి. ముందు పేర్కొన్న సర్వేలో ప్రశ్నించబడినవారిలో 40 శాతం మంది, తాము బేతేలు సేవలో ప్రవేశించడానికి తమకు ముఖ్యంగా ప్రోత్సాహమిచ్చింది తమ తల్లిదండ్రులేనని చెప్పారు. “యెహోవా సేవలో గడుపుతున్న నా తల్లిదండ్రుల జీవితం నేను బేతేలు సేవలో ప్రవేశించేందుకు శక్తివంతమైన ప్రేరణనిచ్చింది. పూర్తికాల పరిచర్యలో వారి మాదిరిని చూశాను గనుక, నేను ఎన్నుకోవలసిన అన్నింటికన్నా శ్రేష్ఠమైన, అత్యంత సంతృప్తికరమైన కెరీర్ ఇదేనని నాకు తెలుసు” అని బేతేలులో కొన్ని సంవత్సరాలుగా సేవచేస్తున్న ఒక సహోదరి చెప్పారు.
[24వ పేజీలోని బాక్సు]
బేతేలు సేవ మీద వారికి మెప్పుదల ఉంది
“బేతేలులో నేను చేసే సేవను చాలా విలువైందిగా ఎంచుతాను. నేను రోజంతా యెహోవాకు సేవ చేశాననీ, రేపూ, ఎల్లుండీ, ఆ తర్వాతి రోజులూ అలాగే చేస్తాననీ తెలుసుకోవడం నాకు ఎంతో తృప్తినిస్తుంది. అది నాకు మంచి మనస్సాక్షిని ఇస్తుంది, నా మనస్సును అనుకూల తలంపులతో నింపుతుంది.”
“ఎటువంటి ఆటంకమూ లేకుండా యెహోవా సేవ కోసం మీ సమయాన్నీ శక్తినీ పూర్తిగా అంకితం చేసుకోగల స్థలం బేతేలు. అది మీకు అంతర్గత ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాక, మీరు యెహోవా సంస్థను మరో కోణం నుండి కూడా చూడగల్గుతారు. ఆయన సంస్థలో జరిగే కార్యకలాపాల కేంద్రానికి మరింత సన్నిహితంగా ఉన్నానన్న అనుభూతి కలుగుతుంది, అది మీకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.”
“నా జీవితంలో నాకు జరిగిన వాటిలోకెల్లా అత్యంత గొప్ప సంఘటన నేను బేతేలుకు రావడమే. ఇక్కడ విద్యాభ్యాసం అనేది ఎన్నడూ ఆగదు. ఇక్కడి విద్యాభ్యాసం నా సొంత ప్రయోజనం కోసం కాదు, యెహోవా కోసమే. ఇక్కడ నేను చేసే పని ఎన్నటికీ వ్యర్థం కాదు.”
“బేతేలులో నేను నా సామర్థ్యాలను ఉపయోగించడం, నాకెంతో తృప్తినీ నెమ్మదినీ ఇస్తాయి, ఎందుకంటే అవి యెహోవా కోసం, సహోదరుల కోసం ఉపయోగపడుతున్నాయి.”
“మునుపటి నా కెరీర్‌లో నిజమైన సంతృప్తినీ సంతోషాన్నీ పొందలేకపోయాను. నా సహోదర సహోదరీలతో పని చేయాలనీ, వారి కోసం పనిచేయాలని నేను అనేక సంవత్సరాలు కలలు కన్నాను. అందుకే బేతేలుకు వచ్చాను. నేను చేసే ప్రయత్నాలన్నీ ఇతరులకు ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూర్చుతాయనీ, యెహోవాను మహిమపరుస్తాయనీ ఎరిగి నిజమైన సంతృప్తిని పొందుతున్నాను.”