కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతం ప్రపంచ శాంతిని తెస్తుందా?

మతం ప్రపంచ శాంతిని తెస్తుందా?

మతం ప్రపంచ శాంతిని తెస్తుందా?

ఆగస్టు 28, 2000 నుంచి ఆగస్టు 31, 2000 వరకు 73 దేశాలనుంచి వచ్చిన 500 కన్నా ఎక్కువమంది ప్రతినిధులు న్యూయార్క్‌ నగరంలో సమావేశమయ్యారు. “మతాధినేతల, ఆధ్యాత్మిక అధినేతల సహస్రాబ్ది ప్రపంచ శాంతి సమావేశం” కోసం ఐక్యరాజ్యసమితిలో సమకూడారు వాళ్లు. ఆ మతాధినేతలు రకరకాల మత విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో అనేకమంది తలపాగాలు, కాషాయిరంగు వస్త్రాలు, ఈకలతో చేసిన తలపాగాలు, లేదా పొడవైన నల్లటి అంగీలు వంటి వాటిని ధరించారు. వారిలో ఇస్లామ్‌, జైన్‌, జొరాష్ట్రియన్‌ మతాలకూ, తావోయిజమ్‌ బహాయ్‌ బౌద్ధమతాలకూ, యూదా సిక్కు మతాలకూ, షింటో హిందూమతాలకూ, అలాగే క్రైస్తవమత సామ్రాజ్య శాఖలకూ చెందిన వారు ఉన్నారు.

ఆ ప్రతినిధులు, నాలుగు రోజుల కాన్ఫరెన్సులో మొదటి రెండు రోజులపాటు ఐక్యరాజ్య సమితిలో సమకూడారు. అయినా, ఆ కాన్ఫరెన్సును ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయలేదు, దానికి అవసరమైన నిధులను ఇవ్వలేదు కానీ వివిధ సంస్థలు ఆ ఏర్పాట్లను చేశాయి. అయినప్పటికీ, బీదరికాన్నీ జాతివివక్షతనూ తొలగించడంలో, పర్యావరణ సమస్యలనూ, యుద్ధాలనూ, పెద్ద ఎత్తున నాశనాన్ని కల్గించే ఆయుధాలనూ అంతమొందించడంలో ఐక్యరాజ్య సమితీ, మతాధినేతలూ సమష్టిగా పనిచేయాల్సిన ప్రాముఖ్యతను గురించి ఇరువర్గాలవారు మాట్లాడారు.

“భౌగోళిక శాంతికి ఒప్పందం” అనే పేరుగల ఒక డాక్యుమెంటుపై ప్రతినిధులు సంతకం చేశారు. హింసాయుత యుద్ధాలు “కొన్నిసార్లు మతం పేరిట జరుగుతున్నాయి” అని అంగీకరిస్తున్నప్పటికీ, సంతకం చేసిన వారు “శాంతి సాధనలో . . . ఐక్యరాజ్య సమితితో సహకరిస్తా”రని ఆ డాక్యుమెంటు తెలియజేస్తోంది. అయినా, దాన్నెలా చేయవచ్చనే విషయాన్ని సూచించే నిర్దిష్టమైన తీర్మానాలేవీ లేవు.

రెండవ రోజున, ఆ సమావేశపు సెక్రటరీ జనరల్‌ అయిన బావజెయిన్‌ కొన్ని సంవత్సరాల క్రితం తాను ఐక్యరాజ్య సమితిలో ఒకానొక చిత్రాన్ని గమనించానని వివరిస్తూ తన ప్రారంభ ప్రసంగాన్ని ముగించాడు. ఆ చిత్రంలో ఐక్యరాజ్య సమితి సెక్రటెరియేట్‌ భవనం కన్నా ఎత్తుగా ఉన్న మనిషి చిత్రీకరించబడ్డాడు. అందులో అతడు తలుపును తడుతున్నట్టుగా ఆ భవనాన్ని తడుతున్నాడు. ఆ చిత్రానికి క్రింద “సమాధానకర్తయగు అధిపతి” అని వ్రాసివుంది. జెయిన్‌ ఇలా అంటున్నారు: “[ఆ చిత్రాన్ని] చూసిన క్షణాన్నే అది నాపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించింది. [దాని] అర్థమేంటని అనేకమందిని అడిగాను. ఈ రోజు నాకు జవాబు దొరికిందని అనుకుంటున్నాను. ప్రపంచ ఆధ్యాత్మిక, మతాధినేతలైన మీయందరి సమావేశం, ఐక్యరాజ్య సమితి తలుపును తడుతున్న సమాధానకర్తయగు అధిపతి [ఇదేనని] నాకు చూపిస్తోంది.”

దానికి బైబిలు విభిన్నమైన దృక్కోణాన్ని అందిస్తోంది. అది, సమాధానకర్తయగు అధిపతి యేసుక్రీస్తని చూపిస్తోంది. ఆయన, ఈ లోక రాజకీయ అధినేతల లేక మతాధినేతల ప్రయత్నాల ద్వారా కాదుగానీ దేవుని రాజ్యం ద్వారా భౌగోళిక శాంతిని తీసుకొస్తాడు. దేవుని పరలోక ప్రభుత్వమైన ఆ రాజ్యమే విధేయులైన మానవుల్ని విజయవంతంగా ఐక్యపరిచి, దేవుని చిత్తం భూమిపై నెరవేరేలా చేస్తుంది.​—⁠యెషయా 9:6; మత్తయి 6:​9, 10.