విచారణలో ఉన్న యేసు పునరుత్థానం
విచారణలో ఉన్న యేసు పునరుత్థానం
“యేసు జీవించాడని మేం పూర్తి నిశ్చయతతో చెప్పగల్గినప్పటికీ . . . మృతులలో నుంచి దేవుడు ఆయనను లేపాడని మేం అంతే నిశ్చయతతో చెప్పలేకపోతున్నామని నేను నిర్మొహమాటంగా మీకు చెప్పగలను” అని చర్చి ఆఫ్ ఇంగ్లాండుకు చెందిన ఉన్నత శ్రేణి క్యాంటిర్‌బరీ ఆర్చిబిషప్ చెప్పారు.
పునరుత్థానం విషయంలో క్రైస్తవ అపొస్తలుడైన పౌలుకు అలాంటి సందేహాలేవీ లేవు. ప్రాచీన కొరింథులో ఉన్న తోటి క్రైస్తవులకు ఆయన రాసిన తన మొదటి ప్రేరేపిత పత్రికలో 15వ అధ్యాయమందు పౌలు ఇలా రాశాడు: “నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.”—1 కొరింథీయులు 15:3, 4.
యేసుక్రీస్తు పునరుత్థానమందలి విశ్వాసమే, గ్రీకో-రోమన్ ప్రపంచమంతటికి అంటే “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్తను ప్రకటించేలా క్రీస్తు శిష్యుల్ని ప్రేరేపించింది. (కొలొస్సయులు 1:23) నిజానికి క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది, యేసు పునరుత్థానమే.
అయినా, మొట్ట మొదటి నుంచీ యేసు పునరుత్థానం సందేహాలనూ, అపనమ్మకాలనూ ఎదుర్కొంది. కొరత వేయబడిన యేసే మెస్సీయా అని ఆయన శిష్యులు చెప్పడం, యూదుల దృష్టిలో నిందించదగ్గ విషయం. అమర్త్య ఆత్మ సిద్ధాంతమందు నమ్మకాన్ని కల్గివున్న విద్యావేత్తలైన గ్రీకులకైతే, పునరుత్థానమనే ఆలోచనే రుచించదు.—అపొస్తలుల కార్యములు 17:32-34.
ఆధునిక సంశయవాదులు
ఇటీవలి సంవత్సరాల్లో, క్రైస్తవులమని చెప్పుకుంటున్న కొంతమంది విద్వాంసులు యేసు పునరుత్థానాన్ని ఒక కట్టుకథగా కొట్టిపారేసే పుస్తకాల్నీ, ఆర్టికల్స్‌నీ ప్రచురించారు; ఆ విషయాంశంపై తీవ్రాతి తీవ్ర వాదోపవాదనలను చేయడానికి చొరవ తీసుకున్నారు. “చారిత్రాత్మక యేసు” కోసమైన తమ అన్వేషణలో వేర్వేరు విద్వాంసులు, ఖాళీ సమాధిని గూర్చిన, పునరుత్థానంతరం యేసు కన్పించడాన్ని గూర్చిన సువార్త వృత్తాంతాలు పూర్తిగా కల్పితమనీ, అవి ఆయనకు పరలోక శక్తి ఉందన్న వాదనలను సమర్థించేందుకు ఆయన మరణానంతరం చాలా కాలం గడిచిన తర్వాత రూపొందించబడ్డాయనీ వాదిస్తారు.
ఉదాహరణకు క్రొత్త నిబంధన ప్రొఫెసరూ, యేసుకు నిజంగా ఏం సంభవించింది—పునరుత్థానాన్ని చారిత్రాత్మకంగా పరిశీలించడం (ఆంగ్లం) అనే పుస్తక గ్రంథకర్తా అయిన జర్మన్ విద్వాంసుడు జెర్ట్ లూడ్‌మన్ అభిప్రాయాలనే తీసుకోండి. యేసు పునరుత్థానమనేది “ఒక శుష్క ఫార్ములా” అనీ, “ప్రపంచాన్ని గూర్చిన శాస్త్రీయ దృక్కోణం”గల వ్యక్తి ఎవరైనా సరే దాన్ని తప్పక తిరస్కరించాలనీ ఆయన వాదిస్తున్నారు.
1 కొరింథీయులు 15:5, 6) క్లుప్తంగా చెప్పాలంటే అనేకమంది విద్వాంసులు, యేసు పునరుత్థానాన్ని గూర్చిన బైబిలు వృత్తాంతాల పరిధిని, శిష్యుల్లో ఆధ్యాత్మిక నమ్మకాన్నీ మిషనరీ ఉత్సాహాన్నీ పునరుజ్జీవింపచేసే భావనను ఉత్పన్నంచేసిన తత్సంబంధిత అనుభవాల పరంపరలకు పరిమితం చేశారు.
అపొస్తలుడైన పేతురుకు పునరుత్థానుడైన క్రీస్తు కన్పించడమన్నది, తాను యేసును ఎరగనని ఆయన్ని తిరస్కరించడం మూలంగా పేతురుకు కల్గిన అధిక దుఃఖాన్నుంచీ, అపరాధ భావన నుంచీ పుట్టుకొచ్చిన భ్రాంతేనని ప్రొఫెసర్ లూడ్‌మన్ అంటున్నారు. లూడ్‌మన్ ఉద్దేశం ప్రకారం, ఒక సందర్భంలో 500కన్నా ఎక్కువ మంది విశ్వాసులకు యేసు కన్పించడమనే విషయం, ఒక “సామూహిక సమ్మోహనావస్థే.” (నిజమే, అనేకులు మేధాసంబంధిత వాదోపవాదాల్లో అంత ఆసక్తి చూపించరు. అయినప్పటికీ, యేసు పునరుత్థానాన్ని గూర్చిన చర్చ మనందరి శ్రద్ధను చూరగొనాలి. ఎందుకు? ఎందుకంటే, ఆయన పునరుత్థానమై ఉండకపోతే, క్రైస్తవత్వం అబద్ధంపై ఆధారపడినదౌతుంది. మరోవైపున, యేసు పునరుత్థానం నిజంగా ఒక వాస్తవిక చరిత్రే అయితే, క్రైస్తవత్వమనేది సత్యంపై ఆధారపడినదౌతుంది. అదే నిజమైతే, క్రీస్తు చెప్పినవి మాత్రమే కాదుగానీ ఆయన చేసిన వాగ్దానాలు కూడా వాస్తవమని రుజువౌతాయి. అంతేగాక పునరుత్థానమంటూ జరిగితే, మృత్యువు గొప్ప విజేతకాదుగానీ చిత్తుచిత్తుగా ఓడగొట్టబడే ఒక శత్రువే అవుతుంది.—1 కొరింథీయులు 15:55.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
కింగ్ జేమ్స్ మరియు రివైజ్డ్ వెర్షన్‌లు ఉన్న Self-Pronouncing Edition of the Holy Bible లోనిది