మీరు తప్పనిసరిగా హాజరుకావలసిన ఒక సందర్భం
మీరు తప్పనిసరిగా హాజరుకావలసిన ఒక సందర్భం
‘శ్రేష్ఠమైన ప్రతి యీవి, సంపూర్ణమైన ప్రతి వరము’ మన పరలోకపు తండ్రియైన దేవుని నుండి వస్తుంది. —యాకోబు 1:17.
పాపభరితమైన మానవజాతికి దేవుడు ఒక అత్యంత గొప్ప బహుమానాన్నిచ్చాడు. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవజాతిని విమోచించేందుకు ఆయన చేసిన ఏర్పాటే ఆ బహుమానం. మనల్ని విమోచించగల క్రయధనాన్ని ఇచ్చినవానిగా యేసు మరణించడం, మనకు పరదైసు భూమిపై నిరంతర జీవితాన్ని సాధ్యపరుస్తుంది. ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకోవాలని మనం లూకా 22:19వ వచనంలో ఆజ్ఞాపించబడ్డాము.
యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞను, యెహోవాసాక్షులు తమతో పాటు కలిసి పాటించమని మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ వార్షిక ఆచరణ చాంద్రమాన బైబిలు క్యాలండర్‌ను అనుసరించి, నీసాను 14న, అంటే, ఆదివారం, ఏప్రిల్ 8, 2001, సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ఈ తేదీని మరిచిపోకుండా ఉండేందుకు మీరు ఎక్కడైనా రాసిపెట్టుకోండి. మీరు హాజరుకావలసిన నిర్దిష్టమైన స్థలాన్ని, సమయాన్ని మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు చెబుతారు.