రాజ్యాశీర్వాదాలను మీరూ పొందగలరు
రాజ్యాశీర్వాదాలను మీరూ పొందగలరు
క్రైస్తవ అపొస్తలుడైన పౌలు తన కాలం నాటి కొన్ని ప్రముఖ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల్గేవాడు. నేటి విశ్వవిద్యాలయ విద్యకు సమానమైన విద్యను ఆయన పొందాడు. ఆయన రోమా పౌరుడికుండే సమస్త లాభాలను హక్కులను కూడా పొందాడు. (అపొస్తలుల కార్యములు 21:37-40; 22:3, 28) ఈ యోగ్యతలు ధనవంతుడయ్యేందుకు ఖ్యాతిని గడించేందుకు ఆయనకు సహాయపడేవే. అయినప్పటికీ, “ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. క్రీస్తును సంపాదించుకొ[నుటకు] . . . వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను” అని ఆయన అన్నాడు. (ఫిలిప్పీయులు 3:7-10) పౌలు ఎందుకు అలా అన్నాడు?
మునుపు తార్సువాడైన సౌలుగా, “యీ మార్గమందున్న” వారిని హింసించేవాడిగా పేరుపొందిన పౌలు, పునరుత్థానం చేయబడి మహిమపరచబడిన యేసు తనకు దర్శనమిచ్చిన తర్వాత విశ్వాసి అయ్యాడు. (అపొస్తలుల కార్యములు 9:1-19) దమస్కుకు వెళ్ళే దారిలో పౌలుకు కలిగిన ఈ అనుభవం, యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయా లేదా క్రీస్తు, వాగ్దత్త రాజ్యానికి భావి పాలకుడు అనే విషయాన్ని ఏ మాత్రం సందేహానికి తావు లేకుండా రుజువు చేసింది. పౌలు పైన చెప్పిన శక్తివంతమైన మాటలు సూచిస్తున్నట్లు, అది ఆయన జీవిత విధానంలో గమనార్హమైన మార్పును తీసుకువచ్చింది. మరొక మాటలో చెప్పాలంటే, యథార్థతా నిజాయితీ గలవాడైన పౌలు మారుమనస్సు పొందాడు.—గలతీయులు 1:13-16.
అపొస్తలుల కార్యములు 3:20; ప్రకటన 2:5) పౌలు విషయానికి వస్తే, ఆయన దమస్కుకు వెళ్ళే మార్గంలో కలిగిన ప్రాముఖ్యమైన సంఘటన కేవలం ఆయన భావాలనూ దేవుని సేవను గురించిన ఆయన దృక్కోణాన్నీ ప్రభావితం చేయడం కంటే ఇంకా ఎక్కువే చేసింది. క్రీస్తును ఎరుగని మునుపటి జీవన శైలి నిరర్థకమైనదన్న వాస్తవం విషయమై ఆయనకదొక మేలుకొల్పులాంటిది. క్రీస్తును గురించి తాను క్రొత్తగా కనుగొన్న జ్ఞానం నుండి ప్రయోజనం పొందాలంటే, తన జీవిత విధానాన్ని సరిదిద్దుకునేందుకు తాను తప్పనిసరిగా ఏదో చేయవలసి ఉందని ఆయన గ్రహించాడు.—రోమీయులు 2:4; ఎఫెసీయులు 4:24.
బైబిలులో ‘మారుమనస్సు పొందు’ అనే క్రియా పదం “తర్వాత తెలుసుకోవడం” అనే అక్షరార్థం గల గ్రీకు మాట నుండే తరచూ అనువదించబడింది, అది “ముందే తెలుసుకోవడం” అనే మాటకు వ్యతిరేకమైనది. అంటే, ఒకరి మనస్సులో దృక్పథంలో లేదా ఉద్దేశంలో మార్పు, మునుపటి శైలి అసంతృప్తికరమైనదిగా ఎంచి దాన్ని నిరాకరించడం అనేవి మారుమనస్సు పొందడంలో ఇమిడివున్నాయి. (ఆశీర్వాదాలను తీసుకువచ్చిన మార్పు
దేవుని గురించి మునుపు పౌలుకున్న జ్ఞానము ముఖ్యంగా, తాను సభ్యుడిగా ఉన్న పరిసయ్యుల తెగ నుండే లభించింది. వాళ్ళ నమ్మకాల్లో ఎక్కువశాతం మానవ తత్త్వశాస్త్రమూ, పారంపర్యాచారాలూ ఉన్నాయి. మతపరంగా అకారణమైన ద్వేషాలు ఉండడం వల్లే, పౌలు ఆసక్తీ, ప్రయత్నాలూ తప్పుదోవ పట్టాయి. తాను దేవుడ్ని సేవిస్తున్నానని తలంచినప్పటికీ, తాను నిజానికి ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చాడు.—ఫిలిప్పీయులు 3:5, 6.
క్రీస్తును గురించీ, దేవుని సంకల్పంలో ఆయన పాత్రను గురించీ సరైన జ్ఞానాన్ని పొందిన తర్వాత, తాను ఒక ఎంపిక చేసుకోవలసిన అవసరం ఉందని పౌలు గ్రహించగల్గాడు. తాను పరిసయ్యునిగానే కొనసాగుతూ గొప్ప హోదానూ పదవినీ అనుభవించాలా, లేక తన జీవిత విధానాన్నే మార్చుకుని, దేవుని అంగీకారాన్ని పొందేందుకు అవసరమైనది ఏదైనా సరే దాన్ని చేయడం మొదలుపెట్టాలా? సంతోషకరంగా, పౌలు సరైన ఎంపికను చేశాడు. ఎందుకంటే, “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది” అని ఆయన వ్రాశాడు. (రోమీయులు 1:16) క్రీస్తును గురించిన రాజ్యాన్ని గురించిన సువార్తను ఆసక్తిగా ప్రకటించేవాడిగా ఆయన తయారయ్యాడు.
అనేక సంవత్సరాల తర్వాత, “నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను” అని పౌలు తన తోటి క్రైస్తవులకు చెప్పాడు. (ఫిలిప్పీయులు 3:13, 14) ఆయన తనను దేవుని నుండి వైదొలగిస్తున్న దాన్ని ఇష్టపూర్వకంగా ఉపేక్షించి, దేవుని సంకల్పానికి అనుగుణ్యంగా ఉన్న లక్ష్యాలను చేపట్టాడు గనుక, సువార్త నుండి ప్రయోజనాన్ని పొందాడు.
మీరేమి చేస్తారు?
బహుశా, మీరు రాజ్య సువార్తను గురించి ఇటీవలే విని ఉంటారు. పరిపూర్ణమైన పరదైసులో సదాకాలం జీవించే నిరీక్షణ మీకు ఆకర్షణీయంగా అనిపించిందా? అలా అనిపించడం సహజమే. ఎందుకంటే, శాంతిభద్రతలుగల పరిస్థితిలో జీవించాలి, జీవితాన్ని ఆనందించాలి అన్న కోరిక మనకందరికీ సహజంగానే ఉంటుంది. దేవుడు, “శాశ్వతకాల జ్ఞానమును [“అనంత కాలాన్ని,” NW] నరుల హృదయమందుంచి యున్నాడు” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 3:11) శాంతి సంతోషాలతో సదాకాలం ప్రజలు జీవించగల కాలం కోసం మనం నిరీక్షించడం సహజమే. రాజ్య సువార్త వాగ్దానం చేస్తున్నది కూడా అదే.
అయితే, ఆ నిరీక్షణ మీకు వాస్తవమయ్యేందుకు, సువార్త అంటే ఏమిటో మీరు అన్వేషించి కనుగొనాలి. “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొను”మని అపొస్తలుడైన పౌలు ఉద్బోధిస్తున్నాడు. (రోమీయులు 12:2) కనుక, పౌలువలె, జ్ఞానాన్ని అవగాహనను సంపాదించుకున్న తర్వాత, మీరు తప్పనిసరిగా ఒక ఎంపిక చేసుకోవాలి.
మరొకవైపు, మీ భవిష్యత్తును గురించి మీకు ఇప్పటికే కొన్ని నమ్మకాలు ఉండవచ్చు. సౌలు, అపొస్తలుడైన పౌలుగా మారక ముందు, దేవుని చిత్తాన్ని గురించి ఆయనకు ఆయన తలంపులు ఉండేవన్న విషయాన్ని గుర్తుచేసుకోండి. దేవుడు తన చిత్తాన్ని గురించి మనకు అద్భుతరీతిలో వెల్లడి చేయాలని చూసే బదులు, విషయాన్ని యథాతథంగా ఎందుకు పరిశీలించకూడదు? ‘మానవజాతిని గురించీ, భూమిని గురించీ దేవుని చిత్తమేమిటన్నది నాకు నిజంగా తెలుసా? నా నమ్మకాలను నిరూపించేందుకు నేను ఏ రుజువులను ఇవ్వగలను? దేవుని వాక్యమైన బైబిలు వెలుగులో చేసే పరీక్షలో నా రుజువులు నిలవగలవా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ విధంగా మీరు మీ మతపరమైన నమ్మకాలను పరిశీలించుకోవడం 1 థెస్సలొనీకయులు 5:21) ఎంతకాదన్నా, దేవుని అంగీకారమే కదా ప్రాముఖ్యం?—యోహాను 17:3; 1 తిమోతి 2:3, 4.
మూలంగా మీకు నష్టమేమీ జరుగదు. “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అని బైబిలు చెబుతుంది కనుక, వాస్తవానికి మీరలా చేయాలని కోరుకోవాలి. (మత నాయకులు మనకు అనంతకాల భవిష్యత్తును వాగ్దానం చేయవచ్చు. అయితే, ఆ వాగ్దానానికి బైబిలు బోధలు ఆధారం కాకపోతే, దేవుని రాజ్య ఆశీర్వాదాలను పొందేందుకు ఆ వాగ్దానం మనకు సహాయం చేయదు. కొండ మీద తానిచ్చిన ప్రఖ్యాతి గాంచిన ప్రసంగంలో యేసు, “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును” అని గట్టిగా హెచ్చరించాడు.—మత్తయి 7:21.
దేవుని రాజ్య ఆశీర్వాదాలను పొందేందుకు తన తండ్రి చిత్తప్రకారము చేయడం ఆవశ్యకమన్న విషయాన్ని యేసు నొక్కిచెప్పడాన్ని గమనించండి. మరో మాటలో చెప్పాలంటే, దైవికమైనదిగా కనిపించే ప్రతిదానికీ దేవుని అంగీకారముంటుందనేమీ లేదు. వాస్తవానికి, “ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును” అని కూడా యేసు అన్నాడు. (మత్తయి 7:22, 23) నిజానికి దేవుని రాజ్య సువార్త అంటే ఏమిటో సరైన విధంగా అర్థం చేసుకుని, దానికి అనుగుణ్యంగా ప్రవర్తించడమే ప్రాముఖ్యమైన విషయమని స్పష్టమౌతుంది.—మత్తయి 7:24, 25.
సహాయం లభ్యమే
వందకన్నా ఎక్కువ సంవత్సరాలుగా, యెహోవాసాక్షులు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని రాజ్యమంటే ఏమిటి, అది ఏయే ఆశీర్వాదాలను తీసుకువస్తుంది, అలాంటి ఆశీర్వాదాలను పొందేందుకు ఒకరు ఏమి చేయాలి వంటి వాటిని గురించిన సరైన జ్ఞానాన్ని పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వారు ముద్రిత పుటల ద్వారా నోటి మాట ద్వారా సహాయం చేస్తున్నారు.
యెహోవాసాక్షులు ప్రకటిస్తున్న సందేశానికి ప్రతిస్పందించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. సువార్తను అంగీకరించి, దానికి అనుగుణ్యంగా ప్రవర్తించడం ద్వారా, మీరు ఇప్పుడూ, దేవుని రాజ్యం భూమ్యంతటినీ పరిపాలించే భవిష్యత్తులోనూ గొప్ప ఆశీర్వాదాలను పొందగలరు.—1 తిమోతి 4:8.
దేవుని రాజ్య ఆశీర్వాదాలు సమీపంలో ఉన్నాయి కనుక ఇప్పుడే ప్రతిస్పందించండి!
[7వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షులు ప్రచురణల ద్వారా, నోటి మాట ద్వారా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు