కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘పైకి కనిపించని ప్రజా ఆరోగ్య ప్రమాదకారిణి’

‘పైకి కనిపించని ప్రజా ఆరోగ్య ప్రమాదకారిణి’

‘పైకి కనిపించని ప్రజా ఆరోగ్య ప్రమాదకారిణి’

అమెరికాలో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న వయోజనుల్లో మూడు వంతుల మంది సెక్సుకి సంబంధించిన వెబ్‌సైట్లలో ఏదో ఒక దాన్ని సందర్శించిన వారేనని ఆన్‌-లైన్‌ సెక్స్‌పై ఇటీవల జరిపిన ఒక సర్వే ఆశ్చర్యకరమైన రీతిలో వెల్లడిచేసింది. ప్రజల్లో అధిక సంఖ్యాకులు, ఇంటర్నెట్‌ ద్వారా ప్రకోపించబడిన తమ లైంగిక కోరికలకు ఇప్పుడు లొంగిపోతున్నారు. “అది విస్ఫోటనం చెందబోతున్న పైకి కన్పించని ప్రజా ఆరోగ్య ప్రమాదం, ఎందుకంటే ఆ విధంగా దాన్ని చాలా కొద్దిమంది మాత్రమే గుర్తిస్తున్నారు లేదా గంభీరంగా తీసుకుంటున్నారు” అని ఆ సర్వేను నిర్వహించిన మనస్తత్వశాస్త్రజ్ఞుడు అయిన డాక్టర్‌ అల్‌ కూపర్‌ అంటున్నాడు.

అలాంటి సైబర్‌సెక్స్‌కి ఎవరు ముఖ్యంగా లొంగిపోతారు? “బహుశా తమ జీవితాల్లో ఎవరి లైంగికతైతే అణచివేయబడి, పరిమితిచేయబడిందో” అలాగే ఇంటర్నెట్‌పై ఎవరైతే “కుప్పలు తెప్పలుగా ఉన్న లైంగిక అవకాశాలను అకస్మికంగా కనుగొన్నారో ఆ యూజర్లే”నని డాక్టర్‌ కూపర్‌ అంటున్నాడు.

తరచూ సెక్సువల్‌ సైట్లకు వెళ్ళే వారిలో అనేకులు అలా వెళ్ళడాన్ని హానిరహితమైనదానిగా పరిగణిస్తారు. అది నిజమేనా? మాదకద్రవ్యాల బారిన పడిన వ్యక్తి వాటికి ఎలాగైతే అలవాటు పడిపోతాడో అలాగే సైబర్‌సెక్సుకు అలవాటు పడినవాళ్లలో చాలామంది తమ కోరికల్ని తీర్చుకునేందుకు ఇంటర్నెట్‌పై సెక్సువాలిటీ “మోతాదు”ను పెంచుకోవడానికి కృషిచేస్తారు. అంతెందుకు, వాళ్ళు తమ ఉద్యోగాల్ని కూడా కోల్పోవచ్చు, తమ వివాహజతతో సంబంధాల్ని క్షీణింపజేసుకోవచ్చు కూడా!

అయితే, దేవుణ్ణి ప్రేమించాలని అనుకునేవాళ్ళు ఇంటర్నెట్‌పై సెక్సువల్‌ సైట్‌ను సందర్శించడాన్ని విడనాడేందుకు అంతకు మించిన కారణం ఒకటుంది. దేవుని వాక్యం ఇలా ఉద్బోధిస్తోంది: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.” (కొలొస్సయులు 3:​5, 6) అపవిత్రమైన లైంగిక కోరికలకు సంబంధించినంత వరకూ ‘తన అవయవాలను చంపివేయడానికి’ ఒక వ్యక్తి యెహోవా దేవుని పట్ల బలమైన ప్రేమను అలవర్చుకోవాల్సిన అవసరముంది. (కీర్తన 97:​10) ఒకడు తాను ప్రజా ఆరోగ్య ప్రమాదకారిణి అయిన సైబర్‌సెక్సు చేత మరులుకొల్పబడ్డానని తెలుసుకున్నట్లైతే, దేవుని వాక్యమైన బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా యెహోవా పట్ల తనకున్న ప్రేమను బలపర్చుకోవాల్సిందే. స్థానిక రాజ్యమందిరంలో యెహోవాసాక్షులతో చేసే క్షేమాభివృద్ధికరమైన సహవాసం, దేవుణ్ణి ప్రీతిపర్చాలన్న తన నిశ్చయాన్ని ఒక వ్యక్తి బలపర్చుకునేలా అతనికి ఎంతో సహాయపడుతుంది.