కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచవ్యాప్త సహవాసులు ఒకరిపట్ల మరొకరు శ్రద్ధ వహిస్తారు

ప్రపంచవ్యాప్త సహవాసులు ఒకరిపట్ల మరొకరు శ్రద్ధ వహిస్తారు

ప్రపంచవ్యాప్త సహవాసులు ఒకరిపట్ల మరొకరు శ్రద్ధ వహిస్తారు

కనుచూపు మేర వరకూ ప్రజలు ఉన్నారు. అనేకమంది వృద్ధులు, వారిలో కొందరికి నడవడం కష్టంగా ఉంది. గర్భిణీ స్త్రీలు ఉన్నారు; పసి పిల్లలున్న యౌవన దంపతులు కూడా ఉన్నారు. వాళ్లంతా శరణార్థులు అంటే అంతర్యుద్ధాల మూలంగానో, ప్రకృతి వైపరీత్యాల మూలంగానో, మరితర పరిస్థితుల మూలంగానో గృహాల్ని విడిచిపెట్టి పొరుగు దేశంలో తలదాచుకోవడానికి వచ్చిన స్త్రీలు, పురుషులు, పిల్లలు. వారిలో కొందరైతే తమ ఇళ్ళను విడిచి మరో ఆశ్రయస్థానం కోసం ఎన్నోసార్లు వెళ్లాల్సి వచ్చింది. అంతర్యుద్ధాల్ని గురించిన లేక ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యాన్ని గురించిన మొదటి సూచన కన్పించినప్పుడు, వాళ్ళు తమకు కావాల్సిన వాటిని తీసుకొని, తమ పిల్లలతోపాటు సురక్షిత స్థలానికి ప్రయాణిస్తారు. ఆ తర్వాత, పరిస్థితులు మెరుగుపడినప్పుడు శరణార్థుల్లో చాలామంది తిరిగొచ్చి తమ ఇళ్ళను పునర్నిర్మించుకొని మరలా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

అనేక దేశాల నుంచి వచ్చే శరణార్థుల కోసం సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ సంవత్సరాలుగా తన ద్వారాల్ని తెరచి ఉంచింది. ఇటీవల యెహోవాసాక్షులతోపాటుగా వేలాదిమంది ప్రజలు, యుద్ధ పీడిత డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో నుంచి సాపేక్షంగా చూస్తే కొంత సురక్షితమైన సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌కు ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని పారిపోయి వచ్చారు.

సహాయపడేందుకు సహోదరులు వస్తారు

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో ఉన్న సాక్షులు మానవతా సహాయ కార్యక్రమాన్ని వ్యవస్థీకరించడాన్ని ఒక ఆధిక్యతగా పరిగణించారు. వస్తున్న క్రైస్తవ సహోదరుల కోసం వసతి సౌకర్యాల్ని ఏర్పాటు చేశారు. మొదట్లో సహోదరుల ఇళ్ళల్లో వసతిని కల్పించారుగానీ శరణార్థుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మరిన్ని ఎక్కువ ఏర్పాట్లు అవసరమని స్పష్టమైంది. కొన్ని రాజ్యమందిరాలను డార్మిటరీలుగా మార్చడం జరిగింది. స్థానిక సాక్షులు, వాటిలో వసతి కల్పించబడిన సహోదరుల సౌకర్యార్థం అదనపు లైట్లను ఏర్పాటుచేసేందుకూ, నీటి సరఫరా కోసం పైపుల్ని పెట్టేందుకూ, నేలను సిమెంటుతో చదును చేసేందుకూ ముందుకు వచ్చారు. రాజ్యమందిరాలను తాత్కాలిక డార్మిటరీలుగా మార్చే పనిలో స్థానిక సహోదరులతోపాటు శరణార్థులు కూడా పనిచేశారు. శరణార్థులై వచ్చిన వారు జీవాన్ని పోషించే ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా పొందేలా లింగాల భాషలో క్రైస్తవ కూటాల పూర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సాక్షుల మధ్యా, వారి అతిథుల మధ్యా ఉన్న సన్నిహిత సహకారం, అంతర్జాతీయ సహోదరత్వమనేది ఒక వాస్తవం అన్న విషయాన్ని చూపించింది.

శరణార్థులుగా వచ్చిన వారందరూ తమ తమ కుటుంబాల సమేతంగా రావడం అరుదు. కొన్నిసార్లు, చెల్లాచెదురైపోయిన కుటుంబ సభ్యులు తాము చేరుకోవాల్సిన స్థలం దగ్గర కలుసుకోవడం జరిగింది. సురక్షితంగా చేరుకున్న వారి పేర్ల జాబితాను ప్రతీ రాజ్యమందిరం దగ్గర ఉంచడం జరిగింది. తప్పిపోయిన వారిని కనుక్కోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ దేశంలోని యెహోవాసాక్షుల పనిని నిర్దేశిస్తున్న బ్రాంచి కార్యాలయం, ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్న శరణార్థ సాక్షులకు సహాయపడేందుకూ, తప్పిపోయినవారిని కనుక్కొనేందుకూ ప్రతీరోజు మూడు వాహనాల్ని పంపించేది. ఆ వాహనాలను గుర్తించడానికి వీలుగా వాటిపై “వాచ్‌ టవర్‌​—⁠యెహోవాసాక్షులు” అని వ్రాసి ఉన్న ఒక పెద్ద బోర్డు ఉండేది.

తమ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఏడుగురు శరణార్థులైన పిల్లల గుంపు యెహోవాసాక్షుల వాహనాన్ని చూసినప్పుడు వారిలో పెల్లుబికిన ఆనందాన్ని ఊహించండి. వాళ్ళు వెంటనే ఆ వాహనం దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి తమనుతాము యెహోవాసాక్షులుగా పరిచయం చేసుకున్నారు. సహోదరులు వారికి సహాయపడి వారిని ఒక రాజ్యమందిరానికి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు తమ కుటుంబ సభ్యులను చివరకు మరలా కలుసుకున్నారు.

యథార్థపరులైన ఆ క్రైస్తవులు అలాంటి పరిస్థితుల్ని ఏదో ఒక్కసారిగా కాక పదే పదే తట్టుకొని నిలబడగల్గేలా వారిని చేసిందేమిటి? పరిశుద్ధ లేఖనాల్లో ముందుగా చెప్పినట్టుగానే మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామన్న విషయమై వాళ్ళు పూర్తిగా ఒప్పించబడ్డారు.​—⁠2 తిమోతి 3:1-5; ప్రకటన 6:3-8.

కాబట్టి, యుద్ధాలనూ, ద్వేషాన్నీ, హింసనూ, పోరాటాలనూ యెహోవా దేవుడు త్వరలోనే తీసివేస్తాడని వాళ్ళకు తెలుసు. శరణార్థులవ్వడమనే సమస్య గతించిన విషయమౌతుంది. అదే సమయంలో, 1 కొరింథీయులు 12:14-26 వచనాల్లో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా యెహోవాసాక్షులు ఒకరిపట్ల మరొకరు శ్రద్ధ వహించేందుకు కృషిచేస్తారు. వారిని నదులూ, దేశ సరిహద్దులూ, భాషలూ, దూరాలూ వేరు చేసినప్పటికీ, వారు ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ కల్గివున్నారు గనుకనే ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు ముందుకొచ్చి సహాయపడతారు.​—⁠యాకోబు 1:22-27.

[30వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆఫ్రికా

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[30వ పేజీలోని చిత్రాలు]

మూడు రాజ్యమందిరాలు శరణార్థుల్ని ఆహ్వానించే కేంద్రాలుగా మార్చబడ్డాయి

[31వ పేజీలోని చిత్రం]

వంట సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయబడ్డాయి

[31వ పేజీలోని చిత్రం]

మరింత ఎక్కువ మంది శరణార్థులు వచ్చారు

[31వ పేజీలోని చిత్రాలు]

పుట్టగానే శరణార్థులయ్యారు