కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి అభినందించారా? మరి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• అపొస్తలుడైన పౌలు రోమీయులు 5:3-5 వచనాల్లో ప్రస్తావించిన వాటి పరంపరలో “నిరీక్షణ”ను చివర ఎందుకు చేర్చాడు?

క్రైస్తవులు అనుభవించే వాటిని అంటే శ్రమ, ఓర్పు, అంగీకృత స్థితి, నిరీక్షణలను గురించి పౌలు ప్రస్తావించాడు. ఆ “నిరీక్షణ” బైబిలు నుంచి ఒకరు తెలుసుకొనిన తొలి నిరీక్షణకాదుగానీ అది బలపర్చబడి, లోతుగా వేళ్లూనుకొనబడిన, అణువణువూ వ్యాపిస్తున్న నిరీక్షణ. దాన్ని కాలం గడిచేకొద్దీ ఒక క్రైస్తవుడు సంపాదించగలడు.​—⁠12/15, 22-3 పేజీలు.

ప్రాచీన గ్రీసులో జరిగిన అథ్లెటిక్‌ ఆటల్లో నేడు ఒక క్రైస్తవుడు ఎందుకు ఆసక్తిని చూపించాలి?

ఆ ఆటల స్వభావాన్నీ పద్ధతుల్నీ అర్థం చేసుకోవడం, అనేక బైబిలు లేఖనాలపై వెలుగును ప్రసరించగలదు. ‘నియమాల ప్రకారం పోరాడడం,’ ‘ప్రతిభారమును విడిచిపెట్టి, యేసు మాదిరివైపు చూడడం,’ ‘పరుగు పందాన్ని కడ ముట్టించేంత వరకు పరుగెత్తి’ కిరీటాన్ని అంటే బహుమానాన్ని పొందడం వంటివి వాటిలో కొన్ని. (2 తిమోతి 2:5; 4:7, 8; హెబ్రీయులు 12:1, 2; 1 కొరింథీయులు 9:24, 25; 1 పేతురు 5:⁠4)​—⁠1/1, 28-30 పేజీలు.

సువార్తను ప్రచారం చేసేందుకు జనవరి 1914 లో ఏ క్రొత్తవిధానం పరిచయం చేయబడింది?

అప్పుడు “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” విడుదల చేయబడింది. అది చలన చిత్ర భాగాలు, వందలాది ఫోటోగ్రాఫిక్‌ కలర్‌ గ్లాస్‌ స్లైడులు ఉన్న నాలుగు భాగాల ప్రదర్శన. అనేక ప్రదర్శనలు విస్తృత ప్రసంగాల ఫోనోగ్రాఫు రికార్డులతో సంఘటితం చేయబ్డడాయి లేక అనుసంధానం చేయబడ్డాయి. నాలుగు భాగాల 20 సెట్ల ఫోటో డ్రామాలు తయారుచేయబడ్డాయి. బైబిలు సందేశాన్ని ప్రజలకు బోధించేందుకు విరివిగా ఉపయోగించబడ్డాయి.​—⁠1/15, 8-9 పేజీలు.

పరిపాలక సభ ఒక చట్టపరమైన కార్పొరేషన్‌కు ఎలా భిన్నంగా ఉంది?

ఏదైనా చట్టపరమైన కార్పొరేషన్‌లోని డైరెక్టర్లు ఓటు ద్వారా అధికారంలోనికి వస్తారు, కానీ పరిపాలక సభ మనుష్యులచే కాక యేసుక్రీస్తుచే నియమించబడుతుంది. యెహోవాసాక్షులు ఉపయోగించుకునే వేర్వేరు కార్పొరేషన్‌లకు పరిపాలక సభ సభ్యులే డైరెక్టర్లుగా ఉండనవసరం లేదు. ఇటీవల జరిగిన వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా యొక్క వార్షిక కూటమిలో దాని డైరెక్టర్లుగాను ఆఫీసర్లుగాను పనిచేస్తున్న పరిపాలక సభ్యులు తమ తమ స్థానాల నుండి స్వచ్ఛందంగా ప్రక్కకు తప్పుకున్నారు. ఆయా స్థానాలను “వేరే గొఱ్ఱెల”లోని పరిణతి చెందిన సహోదరులు భర్తీచేశారు. (యోహాను 10:​16) ఈ విధంగా పరిపాలక సభ సభ్యులు ఆధ్యాత్మిక ఆహారాన్ని తయారు చేయడానికి, ప్రపంచవ్యాప్త సహోదరుల ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడానికి మరింత సమయాన్ని వెచ్చించడం సాధ్యమౌతుంది.​—⁠1/15, 29, 31 పేజీలు.

నిరుత్సాహాన్ని తట్టుకొని నిలబడవచ్చన్న విషయాన్ని నేర్చుకోవడానికి ఏ రెండు బైబిలు మాదిరులను మనం పరిశీలించవచ్చు?

ఒక మాదిరి సమూయేలు తల్లి అయిన హన్నా. ఇశ్రాయేలు ప్రధానయాజకుడైన ఏలీ ఆమెను తప్పుగా అర్థంచేసుకొని నిందించినప్పుడు ఆమె నిరుత్సాహానికి గురయ్యేదే. దానికి బదులు, ఆమె నిర్మొహమాటంగానే అయినా గౌరవపూర్వకంగా వాస్తవాల్ని ఆయన ముందుంచింది. అంతేగాక, ఏలీపై ఆమె కోపాన్ని పెంచుకోలేదు. రెండవ మాదిరి మార్కు. అపొస్తలుడైన పౌలు ఒక మిషనరీ ప్రయాణంలో తనను చేర్చుకోనందుకు ఆయన నిరుత్సాహానికి గురైవుండేవాడే. ఆ ఆధిక్యతను కోల్పోయినందుకు లోలోన కృంగిపోవడానికి బదులు, బర్నబాతో ప్రయాణిస్తూ తన చురుకైన సేవను కొనసాగించాడు.​—⁠2/1, 20-2 పేజీలు.

కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ల కాపీలను ఇతరులకు ఇచ్చే విషయంలోగానీ, ఇతరుల దగ్గర నుంచి తీసుకునే విషయంలోగానీ క్రైస్తవులు ఎందుకు జాగ్రత్తవహించాలి?

అనేక కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లకు (గేమ్‌లతో సహా) లైసెన్సులు ఉంటాయి. అవి ఆ యజమాని/ఉపయోగించేవ్యక్తి ఒక్క కంప్యూటర్లో మాత్రమే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి పరిమితం చేస్తాయి. ఇతరుల కోసం కాపీలను చేయడం, మనం వాటిని ఉచితంగా ఇచ్చినా సరే కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. క్రైస్తవులు “కైసరువి కైసరునకు” చెల్లిస్తూ చట్టానికి విధేయత చూపించాలనుకుంటారు. (మార్కు 12:​17)​—⁠2/15, 28-9 పేజీలు.

• సిరిల్‌, మెథోడీయస్‌లు ఎవరు, బైబిలు అధ్యయనానికి వాళ్ళు ఏ విధంగా సహాయాన్ని అందించారు?

వాళ్లు గ్రీసులోని థెస్సలొనీక నగరమందు తొమ్మిదవ శతాబ్దంలో జన్మించిన ఇద్దరు సోదరులు. వాళ్లు స్లావిక్‌ భాషల కోసం లిఖిత వర్ణమాలను రూపొందించి, బైబిల్లో ఎక్కువ భాగాన్ని స్లవానిక్‌ భాషలోకి అనువదించారు.​—⁠3/1, 28-9 పేజీలు.

‘ఆత్మను అనుసరించడం’ అంటే అర్థం ఏమిటి?​—రోమీయులు 8:⁠6.

యెహోవా చురుకైన శక్తి చేత నియంత్రించబడడం, శాసించబడడం, ప్రేరేపించబడడం అని దానర్థం. బైబిల్ని చదవడం, దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, దేవుని చట్టానికి హృదయపూర్వకంగా విధేయత చూపించడం ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడం ద్వారా దేవుని ఆత్మ మనపై పనిచేసేలా మనం అనుమతించగలం.​—⁠3/15, పేజీ 15.

• మనల్ని ఇతరులు అపార్థం చేసుకున్నట్టు మనం భావించినప్పుడు మనం ఏం చేయగలం?

ప్రేమపూర్వకమైన స్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం ప్రాముఖ్యం. అది విఫలమైనట్టు కన్పిస్తే, నిరాశ పడకూడదు. అవగాహనా సహాయాల కోసం ‘హృదయ పరిశీలకుడైన’ యెహోవాను అడగండి. (సామెతలు 21:2; 1 సమూయేలు 16:⁠7)​—⁠4/1, 21-3 పేజీలు.