కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇద్దరు స్త్రీలపై వైధవ్యం చూపిన ప్రభావం

ఇద్దరు స్త్రీలపై వైధవ్యం చూపిన ప్రభావం

ఇద్దరు స్త్రీలపై వైధవ్యం చూపిన ప్రభావం

సాండ్ర అనే విధవరాలు ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయినప్పుడు ఆమె నిశ్చేష్టురాలైంది. “నా జీవిత భాగస్వామైన నా ఆప్త మిత్రుడ్ని అకస్మాత్తుగా కోల్పోవడం నన్ను దుఃఖంలో ముంచెత్తింది. అప్పుడు ఆసుపత్రి నుండి ఇంటికి ఎలా చేరుకున్నానో, ఆ రోజు నేనెలా గడిపానో నాకు బొత్తిగా గుర్తు లేదు. తర్వాతి కొన్ని వారాల్లో నాకు కలిగిన భయాల వల్ల నాకు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు కలిగాయి” అని ఆమె అంటోంది.

సాండ్రకు పెద్ద వయస్కురాలైన ఇలేన్‌ అనే స్నేహితురాలు ఉంది. ఆమె భర్త డేవిడ్‌ చనిపోయి ఆరు సంవత్సరాలయ్యింది. ఆయన క్యాన్సర్‌ మూలంగా చనిపోవడానికి ముందు ఆరు నెలల పాటు ఆమె ఆయనకు సపర్యలు చేసింది. ఆమెకు ఎంత తీవ్రమైన దుఃఖం కలిగిందంటే, భర్త చనిపోయి కొన్ని రోజులయ్యాక ఆమె తాత్కాలికంగా అంధురాలు కూడా అయ్యింది. రెండు సంవత్సరాల తర్వాత, ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, అప్పుడు చుట్టూ ప్రజలున్నారు. ఆమెను పరీక్షించిన డాక్టరుకు శారీరక రోగ లక్షణాలేమీ కనబడలేదు. అయితే, ఆమె తన దుఃఖాన్ని బయటికి వెళ్ళగ్రక్కకుండా దిగమ్రింగుతుందని ఆయన కనుగొన్నాడు. కనుక ఇంటికి తిరిగివెళ్ళి గట్టిగా ఏడ్వడానికి ప్రయత్నం చేయమని ఆయన ఆమెకు చెప్పాడు. “నేను నా దుఃఖాన్ని సంభాళించుకునేందుకు నాకు చాలా సమయమే పట్టింది” అని ఇలేన్‌ ఒప్పుకుంటోంది. ఒంటరిగా ఉన్నప్పుడు “పడకగదికి వెళ్ళి డేవిడ్‌ బట్టల్లో తలదూర్చి పడుకునేదాన్ని” అని కూడా ఆమె ఒప్పుకుంటోంది.

అవును, ప్రియమైన వివాహ జత మరణం అనేక విధాలైన ప్రతిస్పందనలకు కారణమవుతుంది. విధవరాలు కావడమంటే, భర్త లేకుండా జీవించడం మాత్రమే కాదు. ఉదాహరణకు, సాండ్ర తన గుర్తింపును కోల్పోయినట్లు కొంత కాలం భావించింది. ఇటీవల విధవరాండ్రైన అనేకుల్లాగే, తాను కూడా చాల బలహీనురాలిననీ, తనకు భద్రత లేదనీ భావించింది. “తుది నిర్ణయాలను నా భర్త తీసుకునేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఒంటరిగా నిర్ణయాలను తీసుకోవాలంటే భయమనిపించింది. నాకు సరిగా నిద్ర పట్టేది కాదు. నేను బాగా అలసి పోయేదాన్ని, నిస్సత్తువగా ఉండేది. ఏం చేయాలో తోచక చాలా కష్టంగా ఉండేది” అని సాండ్ర గుర్తు చేసుకుంటుంది.

సాండ్ర, ఇలేన్‌వంటి వారి కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ పునరావృత్తం అవుతున్నాయి. రోగాలూ, ప్రమాదాలూ, యుద్ధాలు, జాతి ప్రక్షాళన, హింసాకాండ మొదలైనవి అనేకుల వైధవ్యానికి కారణమవుతున్నాయి. * ఈ విధవరాండ్రలో అనేకులు ఏం చెయ్యాలో తెలియక మౌనంగా బాధను అనుభవిస్తున్నారు. విధవరాలిగా తన జీవితంలో వచ్చే మార్పులకు సర్దుబాట్లు చేసుకునేందుకు ఒక స్త్రీకి ఆమె స్నేహితులూ బంధువులూ ఎలా సహాయం చేయగలరు? తర్వాతి ఆర్టికల్‌లో కొన్ని సూచనలు ఉన్నాయి, అవి సహాయకరంగా ఉండవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 5 భర్తలు విడిచి పెట్టిన స్త్రీలు కూడా విధవరాండ్రున్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. విడిపోయిన వాళ్ళకూ, విడాకులు తీసుకున్నవాళ్ళకూ ఉండే సమస్యలు భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ, తర్వాతి ఆర్టికల్‌లో చర్చించనున్న అనేక సూత్రాలు, అలాంటి స్త్రీలకు కూడా సహాయకరంగా ఉండవచ్చు.