కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని నామంపై పడిన నింద తొలగించబడింది

దేవుని నామంపై పడిన నింద తొలగించబడింది

రాజ్య ప్రచారకుల నివేదిక

దేవుని నామంపై పడిన నింద తొలగించబడింది

“అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని” దేవుని వాక్యమైన బైబిలు చెబుతోంది. (1 పేతురు 2:​12) కనుక, నిజక్రైస్తవులు, యెహోవా నామం నిందించబడకుండా ఎల్లప్పుడూ మంచిగా ప్రవర్తించేందుకు శ్రమిస్తారు.

జాంబియాలో సెనంగా అనే ఒక మారుమూల ప్రాంతంలో, ఒక పాఠశాల ఉపాధ్యాయుడి ఇంట్లో నుండి ఒక రేడియో దొంగిలించబడింది. యెహోవాసాక్షులు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నారు కనుక, వాళ్ళే దొంగిలించారని ఆ ఉపాధ్యాయుడు వారిపై నిందారోపణ చేశాడు. తన రేడియో దొంగిలించబడిందనీ, యెహోవాసాక్షులు దొంగిలించారనీ పోలీసులకు రిపోర్టు చేశాడు. సాక్షులు తన ఇంటికీ వచ్చారన్నదానికి రుజువుగా, వాళ్ళ ఇంట్లో నేల మీద పడి ఉన్న ఒక కరపత్రాన్ని పోలీసులకు చూపించాడు. అయితే, పోలీసులు ఆయన చెప్పిన మాటలు నమ్మలేదు. తిరిగివెళ్ళి మరొకసారి బాగా విచారించి తెలుసుకోమని పోలీసులు ఆయనకు సలహా ఇచ్చారు.

వెళ్ళి, ఆ ఉపాధ్యాయునితో విషయాన్ని వివరంగా చర్చించాలని ఆ ప్రాంతంలో ప్రకటించిన సాక్షులను సంఘ పెద్దలు ప్రోత్సహించారు. కొందరు సహోదరులు వెళ్ళి ఆయనతో మాట్లాడారు. యెహోవా నామంపై పడిన నిందను తొలగించాలని తాము కోరుకుంటున్నామని వాళ్ళు వివరించారు. ఉపాధ్యాయుడి ఇంట్లో ఒక యువకుడ్ని కలిశామనీ, ఆయనకు ఒక కరపత్రాన్ని ఇచ్చామనీ వాళ్ళు ఆయనకు చెప్పారు. సాక్షులు చెప్పిన పోలికలను బట్టి, ఆయన ఆ యువకుడ్ని గుర్తించాడు. వాస్తవానికి ఆ యువకుడు వాళ్ళ చర్చీకి చెందినవాడే. ఆయన ఆ యువకుడితో ఆ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు అతడు ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన ఆ యువకుని తల్లిదండ్రులతో మాట్లాడి, ఇంటికి తిరిగివెళ్ళాడు. ఆ యువకుని తల్లి దొంగిలించబడిన రేడియోతో ఒక్క గంటలో తిరిగి వచ్చింది.

ఆ ఉపాధ్యాయుడు ఎంతో అపరాధ భావంతో, సంఘపెద్దలను సమీపించి, తప్పుగా ఆరోపించినందుకు తనను క్షమించమని కోరాడు. పెద్దలు ఆయనను క్షమించారు, అయితే, జరిగిన విషయాన్ని అందరికీ తెలపాలనీ, ఆ విధంగా, సాక్షులు నిర్దోషులని ప్రతి ఒక్కరికీ తెలియాలనీ వాళ్ళు ఆయనను కోరారు. వాళ్ళు కోరిన విధంగానే, ఆయన ఆ విషయాన్ని వాళ్ళ పాఠశాలలో ప్రకటించాడు, అలా యెహోవా నామంపై పడిన నింద తొలగించబడింది. ఆ విధంగా, యెహోవాసాక్షులు ఆ ప్రాంతంలో ప్రకటనా పనిని నిరాటంకంగా కొనసాగించగలుగుతున్నారు.

[19వ పేజీలోని మ్యాపులు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆఫ్రికా

జాంబియా

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.