‘మత స్వాతంత్ర్యం నిమిత్తం యెహోవాసాక్షులకు కృతజ్ఞతలు చెప్పండి’
‘మత స్వాతంత్ర్యం నిమిత్తం యెహోవాసాక్షులకు కృతజ్ఞతలు చెప్పండి’
“యెహోవాసాక్షుల ముఖమ్మీదే తలుపు వేయడానికి ముందు, కేవలం కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళనుభవించిన అవమానకరమైన హింసల గురించీ, ప్రస్తుతం మనమందరం అనుభవిస్తున్న, అమెరికా రాజ్యాంగపు మొట్టమొదటి సవరణలోని స్వాతంత్ర్యాలకు వారు చేసిన అసాధారణమైన తోడ్పాటును గురించీ ఆలోచించడానికి కాస్సేపాగండి” అని యుఎస్‌ఎ టుడే అనే వార్తాపత్రికలోని ఒక వ్యాసం చెబుతోంది. ఇతర విషయాలతోపాటు జెండా వందనం చేయనందుకు అమెరికాలో 1940లలో యెహోవాసాక్షులు హింసించబడ్డారు.—నిర్గమకాండము 20:4, 5.
1938 నుంచి 1943 వరకు గల ఐదు సంవత్సరాల మధ్యకాలంలో, యెహోవాసాక్షులకు సంబంధించిన దాదాపు 30 కేసులు అమెరికా సుప్రీం కోర్టుకు వచ్చాయి. ఆ వ్యాసం ఇంకా ఇలా చెబుతోంది: “అమెరికా రాజ్యాంగానికి చేయబడిన మొట్టమొదటి సవరణకు సంబంధించిన అత్యంత ప్రధానమైన వివాదాంశాలను యెహోవాసాక్షులు చాలా తరచుగా లేవదీయడం వల్ల, సుప్రీం కోర్టు జడ్జి హార్లన్ ఫిస్క్ స్టోన్ ‘యెహోవాసాక్షులు, పౌర స్వేచ్ఛలకు సంబంధించి చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి చేసిన సహాయం దృష్ట్యా వాళ్ళు ఒక బహుమతి పొందడానికి అర్హులు’ అని వ్రాశాడు.”
అందుకే, ఆ వ్యాసం ముగింపులో ఇలా చెబుతోంది: “[మత] స్వాతంత్ర్యం విస్తృతమైనందుకు అన్ని మతాలు యెహోవాసాక్షులకు కృతజ్ఞతలు చెప్పాలి.”
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
బ్యాక్‌గ్రౌండ్, బిల్డింగ్: Photo by Josh Mathes, Collection of the Supreme Court of the United States; దిగువ ఎడమ పక్కన, జడ్జీలు: Collection of the Supreme Court of the United States