కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘స్నేహితుడు చేసే గాయాలు’

‘స్నేహితుడు చేసే గాయాలు’

‘స్నేహితుడు చేసే గాయాలు’

గలతీయలోని మొదటి శతాబ్దపు క్రైస్తవులను కాస్త సరిదిద్దాల్సిన అవసరముందని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు. బహుశా వారిలో ఉక్రోష భావాలేమైనా ఉంటే వాటిని పోగొట్టాలని కావచ్చు, ఆయన ఇలా అన్నాడు: “నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?”​—⁠గలతీయులు 4:​16.

‘నిజం చెప్పడం’వల్ల పౌలు వారి శత్రువు కాలేదు. వాస్తవానికి ఆయన ఈ బైబిలు సూత్రానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడు: “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును.” (సామెతలు 27:⁠6) తప్పు చేసేవారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని పౌలుకు తెలుసు. కానీ, తప్పుచేసిన వ్యక్తికి కావల్సిన క్రమశిక్షణను ఇవ్వకుండా ఉంటే అతనిపై యెహోవా దేవుని ప్రేమ వ్యక్తం కాకుండా అడ్డుకున్నట్లేనని కూడా ఆయనకు తెలుసు. (హెబ్రీయులు 12:5-7) అందుకే, మేలు కోరే ఒక స్నేహితుడిగా ముఖ్యంగా సంఘ చిరకాల సంక్షేమాన్ని కోరి, సరిదిద్దే హితబోధ చేయడానికి పౌలు వెనుకాడలేదు.

“మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని యేసు తమకిచ్చిన ఆదేశాన్ని నేడు యెహోవా సాక్షులు నెరవేరుస్తున్నారు. అలా చేయడంలో, ఈ యథార్థ క్రైస్తవులు సిద్ధాంతపరమైన తప్పులను, క్రైస్తవ విరుద్ధ ప్రవర్తనను, బహిర్గతం చేస్తూ వాటిని ఖండించే బైబిలు సత్యాల విషయంలో రాజీపడరు. (ఇటాలిక్కులు మావి) (మత్తయి 15:⁠9; 23:⁠9; 28:​19, 20; 1 కొరింథీయులు 6:​9, 10) ఇతరులు వారిని తిరస్కరించాల్సిన శత్రువుల్లా దృష్టించేలా కాకుండా, వారు నిజమైన స్నేహితుల్లా యథార్థమైన శ్రద్ధను చూపిస్తున్నారు.

దైవ ప్రేరేపిత అంతర్దృష్టితో కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.”​—⁠కీర్తన 141:⁠5.