ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించండి!
ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించండి!
“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
1. ఇవ్వడంలోని ఆనందాన్ని యెహోవా ఎలా చూపిస్తున్నాడు?
సత్యాన్ని తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందం, తత్ఫలితంగా వచ్చే ఆశీర్వాదాలు దేవుడిచ్చే అమూల్యమైన బహుమానాలు. యెహోవాను తెలుసుకొన్న వారు ఆనందించడానికి అనేక కారణాలున్నాయి. కానీ, ఒక బహుమానాన్ని పొందడంలో ఆనందం ఉన్నప్పటికీ, బహుమానాన్ని ఇవ్వడంలోనూ ఆనందం ఉంది. యెహోవా “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చేవాడు, ఆయన “సంతోషంగల దేవుడు.” (యాకోబు 1:17; 1 తిమోతి 1:11, NW) ఆయన వినేవారందరికి ఆరోగ్యదాయకమైన బోధలను అనుగ్రహిస్తాడు, ప్రేమతో ఇచ్చిన ఉపదేశానికి పిల్లలు ప్రతిస్పందించినప్పుడు తల్లిదండ్రులు ఆనందించినట్లుగానే ఆయన తాను ఎవరికైతే బోధిస్తాడో వారు విధేయత చూపించినప్పుడు ఎంతో ఆనందిస్తాడు.—సామెతలు 27:11.
2. (ఎ) ఇవ్వడం గురించి యేసు ఏమి చెప్పాడు? (బి)మనం ఇతరులకు బైబిలు సత్యాన్ని బోధించినప్పుడు ఏసంతోషాన్ని పొందుతాము?
2 అలాగే, యేసు భూమిపైనున్నప్పుడు ప్రజలు తన బోధకు అనుకూలమైన విధంగా ప్రతిస్పందించడం చూసి ఆనందించాడు. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పినట్లు అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (అపొస్తలుల కార్యములు 20:35) మనం ఇతరులకు బైబిలు సత్యాన్ని బోధించినప్పుడు మనకు కలిగే ఆనందం, కేవలం మరొకరు మన మత విశ్వాసాలతో ఏకీభవించారనే సంతృప్తి మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువగా, నిజమైనది నిరంతరం నిలిచే అమూల్యమైనది వారికి ఇస్తున్నామని తెలుసుకోవడం వల్ల మనం ఆనందిస్తాము. ఆధ్యాత్మిక విలువగలదాన్ని ఇవ్వడం ద్వారా, ప్రజలు ఇప్పుడూ నిరంతరమూ తమకు తాము ప్రయోజనం చేకూర్చుకునే విధంగా మనం వారికి సహాయం చేయవచ్చు.—1 తిమోతి 4:8.
ఇవ్వడం ఆనందాన్ని తెస్తుంది
3. (ఎ) ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడంలోని తమ ఆనందాన్ని అపొస్తలులైన పౌలు, యోహానులు ఎలా వ్యక్తం చేశారు? (బి)బైబిలు సత్యాన్ని మన పిల్లలకు నేర్పించడం ఎందుకు ప్రేమ వ్యక్తపర్చడానికి నిదర్శనమై ఉంది?
3 యెహోవా మరియు యేసు ఆధ్యాత్మిక ఈవులను ఇవ్వడం ద్వారా ఆనందించినట్లే క్రైస్తవులు కూడా ఆనందిస్తారు. ఇతరులు దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకోవడానికి తాను సహాయం చేయగలిగానని తెలుసుకుని అపొస్తలుడైన పౌలు ఆనందాన్ని పొందాడు. థెస్సలోనీకలోని సంఘానికి 1 థెస్సలొనీకయులు 2:19,20) అదేవిధంగా అపొస్తలుడైన యోహాను తన అధ్యాత్మిక పిల్లలను ఉద్దేశించి ఇలా వ్రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3యోహాను4) మన స్వంత పిల్లలు మన ఆధ్యాత్మిక పిల్లలుగా తయారయ్యేందుకు సహాయం చేయడంలోగల ఆనందాన్ని గురించి కూడా ఆలోచించండి! పిల్లలను, ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను పెంచడం’ తల్లిదండ్రులు వ్యక్తపర్చే ప్రేమకు నిదర్శనం. (ఎఫెసీయులు 6:4) తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల నిరంతర యోగక్షేమాలపట్ల శ్రద్ధ కలిగివున్నామని చూపిస్తారు. పిల్లలు తగినరీతిగా ప్రతిస్పందించినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు.
ఆయనిలా వ్రాశాడు: “మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు.” (4. ఆధ్యాత్మికంగా ఇవ్వడం వల్ల కలిగే ఆనందాన్ని ఏఅనుభవం ప్రదర్శిస్తుంది?
4 ఐదుగురు పిల్లల తల్లియైన డెల్ పూర్తికాల పయినీరు సేవకురాలు. ఆమె ఇలా చెబుతోంది: “అపొస్తలుడైన యోహాను మాటల భావాన్ని నేను చక్కగా అర్థం చేసుకోగలను, ఎందుకంటే నా పిల్లల్లో నలుగురు ‘సత్యమును అనుసరించి నడుచుకుంటున్నందుకు’ నేను కృతజ్ఞురాలిని. కుటుంబాలు సత్యారాధనలో ఐక్యమైనప్పుడు అది యెహోవాకు ఘనతను, మహిమను తెస్తుందని నాకు తెలుసు, కాబట్టి నా పిల్లల్లో సత్యాన్ని నాటడానికి నేను చేస్తున్న కృషిపై ఆయన ఆశీర్వాదాన్ని చూసి నేనెంతో సంతృప్తిని పొందుతాను. నా కుటుంబంతో కలిసి పరదైసులో అంతంలేని జీవితాన్ని గడిపే అందమైన ఉత్తరాపేక్ష నాలో నిరీక్షణను నింపి, కష్టాలు అవాంతరాలు ఉన్నప్పటికీ సహించడానికి నన్ను పురికొల్పుతుంది.” విచారకరంగా, డెల్ కుమార్తెలలో ఒకరు క్రైస్తవ వ్యతిరేక చర్యను చేపట్టినందుకు సంఘం నుండి బహిష్కరించబడింది. అయినా, అనుకూలమైన దృక్కోణాన్ని కాపాడుకోవడానికి డెల్ ఎంతో కృషి చేస్తుంది. ఆమె ఇంకా ఇలా చెబుతోంది: “ఒక రోజు నా కుమార్తె వినయంగా, యథార్థంగా యెహోవా వద్దకు తిరిగి వస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే, నా పిల్లల్లో చాలామంది నమ్మకంగా ఆయన సేవ చేయడంలో కొనసాగుతున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేననుభవిస్తున్న ఆనందం నా బలానికి నిజమైన మూలంగా ఉంది.”—నెహెమ్యా 8:10.
నిరంతరం నిలిచే స్నేహాలను పెంచుకోవడం
5. శిష్యులను చేసేపనిలో మనల్ని మనం వ్యయపరచుకుంటుండగా, ఏ విషయాన్ని తెలుసుకోవడం మనకు సంతృప్తినిస్తుంది?
5 క్రైస్తవ శిష్యులను చేసి, వారికి యెహోవా గురించి ఆయన కోరేవాటి గురించి బోధించమని యేసు తన అనుచరులకు నిర్దేశించాడు. (మత్తయి 28:19,20) సత్యమార్గాన్ని తెలుసుకోవడానికి యెహోవా, యేసు ప్రజలకు నిస్వార్థంగా సహాయం చేశారు. కాబట్టి శిష్యుల్ని చేసే పనిలో మనల్ని మనం వ్యయపరచుకుంటుండగా, తొలి క్రైస్తవుల్లాగే మనకూ యెహోవా, యేసుల మాదిరిని అనుకరిస్తున్నామని తెలుసుకోవడం వల్ల కలిగే సంతృప్తి లభిస్తుంది. (1 కొరింథీయులు 11:1) మనమలా సర్వశక్తిమంతుడైన దేవునితోనూ, ఆయన ప్రియ కుమారునితోనూ సహకరించినప్పుడు, మన జీవితాలకు నిజమైన అర్థం చేకూరుతుంది. ‘దేవుని జతపనివారిలో’ ఒకరిగా లెక్కించబడడం ఎంతటి ఆశీర్వాదం! (1 కొరింథీయులు 3:9) సువార్త ప్రకటించే ఈపనిలో దేవదూతలు కూడా భాగం వహిస్తున్నారంటే అది ఉత్తేజకరమైన విషయం కాదా?—ప్రకటన 14:6,7.
6. మనం ఆధ్యాత్మికంగా ఇవ్వడంలో భాగం వహిస్తుండగా, మనకు ఎవరు స్నేహితులవుతారు?
6 నిజానికి, అధ్యాత్మికంగా ఇవ్వడమనే ఈపనిలో భాగం వహించడం ద్వారా, మనం దేవుని జతపనివారికంటే ఎక్కువే కాగలం, అంటే మనం ఆయనతో నిరంతరం నిలిచే స్నేహాన్ని పొందగలం. విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము యెహోవా స్నేహితుడని పిలువబడ్డాడు. (యాకోబు 2:23) మనం దేవుని చిత్తాన్ని చేయడానికి కృషి చేస్తుండగా, మనం కూడా దేవుని స్నేహితులం కావచ్చు. మనమలా చేస్తే, యేసు స్నేహితులం కూడా అవుతాం. ఆయన తన శిష్యులకిలా చెప్పాడు: “మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.” (యోహాను 15:15) అధికారంలో ఉన్నవారి లేక ఉన్నతాధికారుల స్నేహితులుగా పరిగణించబడడానికి ఎంతోమంది ఆనందిస్తారు, అయితే మనం విశ్వమంతటిలోనే అతిగొప్ప వారైన ఇద్దరి స్నేహితులముగా లెక్కించబడగలము!
7. (ఎ) ఒక స్త్రీ నిజమైన స్నేహితురాలిని ఎలా సంపాదించుకొంది? (బి)మీకు అలాంటి అనుభవమేదైనా ఉందా?
7 అంతేగాక, దేవుని గురించి తెలుసుకోవడానికి మనం ప్రజలకు సహాయం చేసినప్పుడు, వాళ్లు మనకు కూడా స్నేహితులై, మనకు ప్రత్యేకమైన సంతోషాన్ని తెస్తారు. అమెరికాలో నివసించే జోన్, తెల్మా అనే స్త్రీతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. అధ్యయనం చేయడానికి తెల్మాకు తన కుటుంబం నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ, ఆమె పట్టుదలతో అధ్యయనం కొనసాగించి, ఒక సంవత్సరం తర్వాత బాప్తిస్మం తీసుకుంది. జోన్ ఇలా వ్రాస్తోంది: “మా సహవాసం అంతటితో ముగియలేదు; గానీ అది ఇప్పటికి 35 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహబంధంగా వృద్ధి చెందింది. మేము తరచుగా పరిచర్యకు, సమావేశాలకు కలిసి వెళ్లేవాళ్లం. చివరికి, నేను 800 కిలోమీటర్ల దూరంలో ఒక క్రొత్త ఇంట్లోకి మారాను. అయినా, తెల్మా నాకు ఎంతో ప్రేమపూర్వకమైన, హృదయాన్ని స్పృశించే ఉత్తరాలు వ్రాస్తూ ఉంటుంది, తాను నా గురించి మక్కువగా గుర్తు చేసుకుంటుంటాననీ, తనకు స్నేహితురాలిగా, మాదిరిగా ఉన్నందుకు అలాగే తనకు బైబిలు నుండి సత్యాన్ని బోధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ వాటిలో వ్రాస్తుంటుంది. అలాంటి సన్నిహితమైన, ప్రియమైన స్నేహితురాలు లభించడం, యెహోవా గురించి తెలుసుకునేందుకు ఆమెకు సహాయం చేయడంలో నేను చేసిన కృషికి అద్భుతమైన ప్రతిఫలం.”
8. పరిచర్యలో ఏఅనుకూలమైన దృక్పథం మనకు సహాయం చేస్తుంది?
8 మనం కలిసే చాలామంది యెహోవా వాక్యంలో అంత ఆసక్తిని చూపించకపోయినా లేక అసలే ఆసక్తిని చూపించకపోయినా, సత్యం తెలుసుకోవాలని కోరుకునే ఒక్కరిని కనుగొనగలిగే అవకాశం కూడా సహనంతో ఉండటానికి మనకు సహాయం చేస్తుంది. అలాంటి ఉదాసీనత మన విశ్వాసానికి, సహనానికి ఒక సవాలుగా ఉండగలదు. అయినా, అనుకూలమైన దృక్పథం మనకు సహాయం చేస్తుంది. గ్వాటిమాలకు చెందిన ఫాస్టో ఇలా చెప్పాడు: “నేను ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు, నేను ఎవరితోనైతే మాట్లాడుతున్నానో ఆవ్యక్తి ఆధ్యాత్మిక సహోదరుడు గానీ సహోదరి గానీ అయితే ఎంత గొప్పగా ఉంటుందో కదాని ఆలోచిస్తాను. నేను కలిసే వారిలో కనీసం ఒక్క వ్యక్తి అయినా చివరికి దేవుని వాక్య సత్యాన్ని హత్తుకుంటాడని నేను భావిస్తాను. ఆతలంపు నేను కొనసాగడానికి తోడ్పడి, నాకు నిజమైన ఆనందాన్నిస్తుంది.”
పరలోకంలో ధనం సమకూర్చుకోవడం
9. పరలోకంలోని ధనాన్ని గురించి యేసు ఏమి చెప్పాడు, దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
9 మన పిల్లలనే గానీ మరితర వ్యక్తులనే గానీ శిష్యుల్ని చేయడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. దానికి సమయం, సహనం, పట్టుదల అవసరం. అయితే గుర్తుంచుకోండి, వస్తుపరమైన సంపదలను సమకూర్చుకోవడానికి చాలామంది ఎంతో కష్టపడడానికి ఇష్టపడుతున్నారు, నిజానికి వస్తుపరమైన సంపదలు వారికి ఆనందాన్ని ఇవ్వలేవు, అవి నిరంతరం నిలిచి ఉండవు. ఆధ్యాత్మిక విలువగలవాటి కోసం కృషి చేయడం మంచిదని యేసు తన శ్రోతలకు చెప్పాడు. ఆయనిలా మత్తయి 6:19,20) శిష్యులను చేసే ప్రాముఖ్యమైన పనిలో భాగంవహించడం లాంటి ఆధ్యాత్మిక గమ్యాలను చేరుకోవడానికి కృషి చేయడం ద్వారా, మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నామనీ, దానికి ఆయన మనకు ప్రతిఫలాన్నిస్తాడనీ తెలుసుకోవడంలోని సంతృప్తిని మనం పొందవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, ... తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.
చెప్పాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.” (10. (ఎ) యేసుకు ఎందుకు ఆధ్యాత్మిక ధనం ఉంది? (బి)యేసు తనను తాను ఎలా అప్పగించుకున్నాడు, ఇతరులకు ఏగొప్ప ప్రయోజనం చేకూరుతుంది?
10 శిష్యులను చేయడానికి మనం పట్టుదలగా పనిచేస్తే, యేసు చెప్పినదానికి అనుగుణంగా మనం మనకోసం “పరలోకమందు ... ధనమును” సమకూర్చుకొంటాము. ఇది మనకు పుచ్చుకోవడంలోని ఆనందాన్ని తీసుకువస్తుంది. మనం నిస్వార్థంగా ఇస్తే, మనల్ని మనమే సుసంపన్నం చేసుకొంటాం. యేసు కూడా కోటానుకోట్ల సంవత్సరాలు నమ్మకంగా యెహోవా సేవ చేశాడు. ఆయన పరలోకంలో సమకూర్చుకొన్న ధనాన్ని గురించి ఆలోచించండి! అయినా, యేసు తన స్వంత అభీష్టాన్ని వెదకలేదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.” (ఇటాలిక్కులు మావి.) (గలతీయులు 1:4) యేసు తన పరిచర్యకు నిస్వార్థంగా తనను తాను అప్పగించుకోవడమే గాక, పరలోకంలో సంపదలు సమకూర్చుకునే అవకాశం ఇతరులకు కలిగేలా తన జీవితాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడు.
11. వస్తుదాయకమైన బహుమానాల కన్నా ఆధ్యాత్మిక బహుమానాలు ఎందుకు మేలు?
11 ప్రజలకు దేవుని గురించి బోధించడం ద్వారా, వారు కూడా అనశ్వరమైన ఆధ్యాత్మిక ధనాన్ని ఎలా సమకూర్చుకోవచ్చో తెలుసుకోవడానికి వారికి సహాయం చేస్తాము. మీరు ఏ గొప్ప బహుమానాన్ని ఇవ్వవచ్చు? మీరు మీస్నేహితులకు ఒక ఖరీదైన గడియారాన్నో, కారునో, ఇంటినో బహుమానంగా ఇచ్చారనుకోండి, ఆస్నేహితులు సంతోషిస్తారు, కృతజ్ఞత కలిగివుంటుండవచ్చు, మీకు కూడా ఇవ్వడం ద్వారా వచ్చే ఆనందం లభిస్తుంది. కానీ మరో 20 ఏళ్ళకు లేదా 200 ఏళ్ళకు, లేదా 2000 ఏళ్ళకు ఆబహుమానం ఏస్థితిలో ఉంటుంది? బదులుగా, ఒక వ్యక్తి యెహోవా సేవ చేయడానికి సహాయం చేసేందుకు మిమ్మల్ని మీరు వ్యయపరచుకుంటే, ఆవ్యక్తి మీరిచ్చే బహుమానం నుండి నిరంతరం ప్రయోజనం పొందగలరు.
సత్యం కావాలనుకునే వారిని కనుగొనడం
12. ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేందుకు చాలామంది తమను తాము ఎలా వెచ్చించుకున్నారు?
12 ఆధ్యాత్మికంగా ఇవ్వడంలోగల ఆనందాన్ని పొందడానికి, యెహోవా ప్రజలు భూదిగంతాల వరకూ వెళ్లారు. మిషనరీ సేవను చేపట్టడానికి వేలాదిమంది తమ ఇంటిని, కుటుంబాన్ని విడిచివెళ్లారు, వాళ్లు వెళ్లిన ప్రాంతాల్లో క్రొత్త భాషలను నేర్చుకొని, క్రొత్త సంస్కృతులకు అనుగుణంగా మారవలసి వచ్చింది. మరితరులు తమ దేశంలోనే రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరితరులు విదేశీ భాషను నేర్చుకొని, తమ ప్రాంతానికి వలస వచ్చిన వారికి ప్రకటించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, ఇప్పుడు యెహోవా సాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్న ఇద్దరు కుమారులను పెంచి పెద్దచేసిన తర్వాత, అమెరికాలోని న్యూజెర్సీలో ఒక జంట పయినీరు సేవ ప్రారంభించి, చైనా భాషను నేర్చుకొన్నారు. మూడు సంవత్సరాల కాలంలో వారు, దగ్గరలో ఉన్న కాలేజీలో చదువుకొంటున్న చైనా భాష మాట్లాడే 74మందితో బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. శిష్యులను చేసేపనిలో మరింత ఆనందాన్ని పొందటానికి మీరు మీపరిచర్యను ఏవిధంగానైనా విస్తృతం చేసుకోగలుగుతున్నారా?
13. మీ పరిచర్య మరింత ఫలవంతంగా ఉండాలని మీరు కోరుకొంటే మీరేమి చేయవచ్చు?
ప్రసంగి 11:6) అదే సమయంలో, నోవహు యిర్మీయా వంటి నమ్మకమైన వారిని గుర్తు తెచ్చుకోండి. ప్రకటనా పనికి చాలా తక్కువమంది అనుకూలంగా ప్రతిస్పందించినప్పటికీ, కనీసం కొందరైనా ప్రతిస్పందించారు గనుక వారి పరిచర్య విజయవంతమైనట్లే. అన్నిటికంటే మిన్నగా అది యెహోవాకు సంతోషం కలిగించింది.
13 బహుశా మీరు ఒక బైబిలు అధ్యయనం నిర్వహించాలని కోరుకుంటూ అలా చేయలేకపోతుండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆసక్తి గలవారిని కనుగొనడం కష్టం. మీరు కలిసే ప్రజలు బైబిలునందు ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగైతే, యెహోవా, యేసుక్రీస్తులు ఈపనిలో ఆసక్తి కలిగివున్నారనీ, మిమ్మల్ని గొఱ్ఱెవంటి వ్యక్తి దగ్గరికి నడిపించగలరనీ తెలుసుకుని మీరు మీకోరికను బహుశా ప్రార్థనలో తెలియజేయవచ్చు. మీసంఘంలో ఉన్న ఎక్కువ అనుభవం గలవారిని లేక తమ పరిచర్య మరింత ఫలవంతంగా ఉన్నవారిని సలహాలు అడగండి. క్రైస్తవ కూటాల్లో ఇవ్వబడే తర్ఫీదు నుండి, సలహాల నుండి ప్రయోజనం పొందండి. ప్రయాణ పైవిచారణకర్తలు వారి భార్యలు ఇచ్చే సలహాల నుండి ప్రయోజనం పొందండి. అన్నిటికంటే ముఖ్యంగా, ఆపనిని ఎన్నడూ విడిచిపెట్టకండి. జ్ఞానియైన వ్యక్తి ఇలా వ్రాశాడు: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” (మీరు చేయగల సర్వశ్రేష్ఠమైనది
14. తన సేవచేస్తూ వృద్ధులైన వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
14 పరిచర్యలో మీరు చేయాలనుకుంటున్నంతగా చేయడానికి మీ పరిస్థితులు అనుమతించకపోవచ్చు. ఉదాహరణకు, యెహోవా సేవలో మీరు చేయగలదానికి వృద్ధాప్యం పరిమితులు ఏర్పరస్తుండవచ్చు. అయినా, జ్ఞానియైన వ్యక్తి ఏమి వ్రాశాడో గుర్తు తెచ్చుకోండి: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.” (సామెతలు 16:31) యెహోవా సేవలో గడిపిన జీవితం ఆయన దృష్టికి ప్రీతికరమైనది. అంతేగాక, లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే [యెహోవా]. తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.” (యెషయా 46:4) మన ప్రేమగల పరలోక తండ్రి యథార్థవంతులైన తనవారిని బలపరచి వారికి మద్దతునిస్తాడు.
15. యెహోవా మీ పరిస్థితులను అర్థం చేసుకొంటాడని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?
15 బహుశా మీరు అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు, అవిశ్వాసియైన వివాహజత నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటుండవచ్చు, బరువైన కుటుంబ బాధ్యతలను మోస్తుండవచ్చు, లేక మరింత కష్టమైన సమస్యేదైనా మీకు ఉండవచ్చు. యెహోవాకు మన పరిమితులు, పరిస్థితులు తెలుసు, ఆయన సేవ చేయాలని మనం చేసే యథార్థ కృషిని బట్టి ఆయన మనలను ప్రేమిస్తాడు. మనం చేసేది ఇతరులు చేసే దానికన్నా తక్కువైనా ఆయన అలాగే భావిస్తాడు. (గలతీయులు 6:4) మనం అపరిపూర్ణులమని యెహోవాకు తెలుసు, ఆయన మన నుండి కోరేవాటి విషయంలో ఆయన చాలా వాస్తవికంగా ఉంటాడు. (కీర్తన 147:11) మనకు సాధ్యమైనంతలో సర్వశ్రేష్ఠమైనది మనం చేస్తే, మనం దేవుని దృష్టిలో అమూల్యమైనవారమనీ, మన విశ్వాస క్రియలను ఆయన మరిచిపోడనీ మనం నిశ్చయత కలిగివుండవచ్చు.—లూకా 21:1-4.
16. ఒక శిష్యుడ్ని తయారు చేయడంలో మొత్తం సంఘమంతా ఏవిధంగా భాగం వహిస్తుంది?
16 శిష్యులను చేసేపని సమష్టి కృషి అని గుర్తుంచుకోండి. ఒక్క వర్షపు చుక్క మొక్క ఎదగడానికి సహాయపడలేనట్లే ఏఒక్క వ్యక్తీ ఒంటరిగా ఒక శిష్యుడ్ని తయారుచేయలేరు. నిజమే, ఒక సాక్షి ఆసక్తిగల ఒక వ్యక్తిని కనుగొని, బైబిలు అధ్యయనం నిర్వహిస్తుండవచ్చు. కానీ ఒకసారి ఆక్రొత్త వ్యక్తి రాజ్యమందిరానికి రావడం మొదలుపెట్టిన తర్వాత, సత్యాన్ని గుర్తించడానికి మొత్తం సంఘమంతా అతనికి గానీ ఆమెకు గానీ సహాయం చేస్తుంది. సహోదరత్వంలోని వాత్సల్యం దేవుని ఆత్మ ప్రభావాన్ని చూపిస్తుంది. (1 కొరింథీయులు 14:24,25) మన యౌవనస్థులు లోకంలోని యౌవనస్థుల నుండి భిన్నమైనవారని చూపిస్తూ పిల్లలూ యౌవనులూ ఉత్తేజకరమైన వ్యాఖ్యానాలు చేస్తారు. సహనంలో ఏమి ఇమిడి ఉందో సంఘంలో అనారోగ్యంగా ఉన్నవారు, శారీరకంగా బలహీనులైనవారు, వృద్ధులు క్రొత్తవారికి బోధిస్తారు. మన వయస్సులు లేక పరిమితులు ఏవైనప్పటికీ మనమందరం, క్రొత్తవారు బైబిలు సత్యంపట్ల తమకున్న ప్రేమ ప్రగాఢమవుతుండగా బాప్తిస్మం వైపుకు పురోగమించటానికి వారికి సహాయం చేయడంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తాము. మనం పరిచర్యలో గడిపే ప్రతి గంటా, చేసే ప్రతి పునర్దర్శనమూ, ఆసక్తిగల వ్యక్తితో రాజ్యమందిరంలో జరిపే ప్రతి సంభాషణా, కేవలం అల్పమైనవిగానే కనిపించవచ్చు, కానీ అవి యెహోవా నెరవేరుస్తున్న శక్తివంతమైన కార్యాల్లో ఒక భాగమే.
17, 18. (ఎ) శిష్యులను చేసేపనిలో పాల్గొనడమే గాక మనం ఇవ్వడంలోని ఆనందంలో ఇంకా ఎలా భాగం వహించవచ్చు? (బి)ఇవ్వడంలోని ఆనందంలో భాగం వహించడం ద్వారా మనం ఎవరిని అనుకరిస్తాము?
17 క్రైస్తవులముగా మనం శిష్యులను చేసే ప్రాముఖ్యమైన పనిలో భాగం వహించడమే గాక మరితర విధాల్లో ఇవ్వడం ద్వారా కలిగే ఆనందాన్ని కూడా పొందుతాము. స్వచ్ఛారాధనకు మద్దతునిచ్చేందుకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేందుకు విరాళాలివ్వడానికి మనం కొంత డబ్బు ప్రక్కన పెట్టవచ్చు. (లూకా 16:9; 1 కొరింథీయులు 16:1,2) ఇతరులకు ఆతిధ్యమిచ్చేందుకు అవకాశాల కోసం మనం చూడవచ్చు. (రోమీయులు 12:13) “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయ”డానికి మనం కృషి చేయవచ్చు. (గలతీయులు 6:10) ఉత్తరం వ్రాయడం ద్వారానో, ఫోను చేయడం ద్వారానో, బహుమానం ఇవ్వడం ద్వారానో, ఆచరణాత్మకంగా సహాయాన్ని అందించడం ద్వారానో, ప్రోత్సాహకరమైన మాట పలకడం ద్వారానో మనం ఇతరులకు సులభంగానైనా, ప్రాముఖ్యమైన విధాల్లో ఇవ్వవచ్చు.
18 ఇవ్వడం ద్వారా మనం మన పరలోక తండ్రిని అనుకరిస్తున్నామని చూపిస్తాము. నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నమైన సహోదర ప్రేమను కూడా ప్రదర్శిస్తాము. (యోహాను 13:35) ఈవిషయాలను గుర్తుంచుకోవడం, ఇవ్వడంలోని ఆనందంలో భాగం వహించడానికి మనకు సహాయం చేస్తుంది.
మీరు వివరించగలరా?
• ఆధ్యాత్మికంగా ఇవ్వడంలో యెహోవా, యేసు ఎలాంటి మాదిరినుంచారు?
• మనం నిరంతర స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?
• మన పరిచర్య మరింత విజయవంతమయ్యేందుకు మనం ఏచర్యలు తీసుకోవచ్చు?
• సంఘంలోని అందరూ ఇవ్వడంలోని ఆనందంలో ఎలా భాగం వహించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రాలు]
తామిచ్చిన శిక్షణకు పిల్లలకు స్పందించినప్పుడు తల్లిదండ్రులు గొప్ప ఆనందాన్ని సంతృప్తిని అనుభవిస్తారు
[15వ పేజీలోని చిత్రం]
శిష్యులను చేయడంలో మనం నిజమైన స్నేహితులను సంపాదించుకోవచ్చు
[16వ పేజీలోని చిత్రం]
వృద్ధాప్యంలో యెహోవా మనలను ఆదుకుంటాడు
[17వ పేజీలోని చిత్రాలు]
సులభమైన అయితే ప్రాముఖ్యమైన విధాల్లో ఇవ్వడంలో మనం ఆనందాన్ని కనుగొంటాము