కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనసులపై చెరగని ముద్రలు

మనసులపై చెరగని ముద్రలు

మనసులపై చెరగని ముద్రలు

ప్రతి సంవత్సరం, యెహోవా సాక్షులు తమ తమ దేశాల్లో జరిగే క్రైస్తవ అసెంబ్లీల్లో సమావేశాల్లో కలుసుకుంటారు. ఆధ్యాత్మికంగా వృద్ధిపరిచే బోధనలనూ సహవాసాన్నీ పొందడం కోసం వాళ్ళలా కలుసుకుంటారు. కానీ వారి సమావేశాల ఇతర అంశాలు సందర్శకులపై శాశ్వత ముద్రలను కూడా వేస్తాయి.

ఉదాహరణకు, 1999 జూలైలో మొజాంబిక్‌లో సుసుంపన్నవంతమైన మూడు రోజుల “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలకు, వేలాదిమంది యెహోవా సాక్షులు సమకూడారు. వారిలో చాలామంది అలాంటి సమావేశానికి మొదటిసారి హాజరయ్యారు. వారు అక్కడ వేదికపైనుండి విన్నవాటినిబట్టి మాత్రమే కాకుండా పరిసరాలనుబట్టి కూడా ప్రభావితులయ్యారు.

మాపూటో అసెంబ్లీ హాలు దగ్గర ఒక స్త్రీ ఇలా వ్యాఖ్యానించింది: “నా జీవితంలో నేను అలాంటి మనోరంజకమైన స్థలాన్ని ఎప్పుడూ చూడలేదు! బాత్‌రూముల్లో సబ్బులూ అద్దాలూ ఉండడమే కాకుండా అవి శుభ్రమైన సువాసనలతో నిండి ఉన్నాయి. పిల్లలు పోట్లాడుకునే గోలల్లాంటివేమీ లేకుండా పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. అంతేకాదు, ఎటువంటి తొక్కిసలాటలూ లేవు! ఒకర్నొకరు ప్రోత్సహించుకుంటూ మాట్లాడుకుంటున్న సంతోషభరితులైన యువతీ యువకులను నేను చూశాను. వాళ్ళందరూ చక్కగా దుస్తులు ధరించిన విధానాన్నిబట్టి కూడా నేను ప్రభావితురాలినయ్యాను. ఈసారి నేను నా పిల్లలను తీసుకువస్తాను, ఇలాంటి సమావేశానికి కుటుంబమంతా తప్పకుండా హాజరుకావాలని నా భర్తను కూడా ఒప్పిస్తాను.”

అవును యెహోవా సాక్షుల నిజాయితీ, చిత్తశుద్ధీ, భౌతిక శుభ్రతలూ గమనించబడ్డాయి. సాక్షులు ఎందుకంత విభిన్నంగా ఉంటారు? ఎందుకంటే వాళ్ళు బైబిలు నుండి నేర్చుకుంటున్నదాన్ని పాటించడానికి నిజంగా ప్రయత్నిస్తారు. ఈసంవత్సరంలో జరిగే జాతీయ సమావేశంలో లేక స్థానిక రాజ్యమందిరాల్లో వారం వారం జరిగే వారి కూటాల్లో వాళ్ళతో సమకూడి మీరే స్వయంగా ఎందుకు చూడకూడదూ?

[32వ పేజీలోని చిత్రం]

జాంబియా

[32వ పేజీలోని చిత్రం]

కెన్యా

[32వ పేజీలోని చిత్రం]

మొజాంబిక్‌