కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

1 పేతురు 4:3లో కొందరు క్రైస్తవులు, గతంలో “చేయదగని విగ్రహపూజలు” చేశారు అని మనం చదువుతాం. అంటే అన్ని రకాల విగ్రహపూజలు చేయతగనివీ, దేవుడు ఖండించినవీ, నిషేధించినవీ కావా?

దేవుని దృష్టిలో అన్ని రకాల విగ్రహపూజలు చేయతగనివే. ఆయన అనుగ్రహాన్ని కోరుకునేవారు విగ్రహపూజలు చేయకూడదు.​—⁠1 కొరింథీయులు 5:​11; ప్రకటన 21:⁠8.

అయితే, అపొస్తలుడైన పేతురు విగ్రహపూజను మరో దృక్కోణంతో సూచిస్తున్నాడనిపిస్తోంది. అందుకు ఒక కారణం, అనేక ప్రాచీన దేశాల్లో విగ్రహపూజ సర్వసాధారణమైనదిగా, చట్టపరంగా ఎటువంటి ఆంక్షలు లేనిదిగా ఉండేది. అటువంటి దేశాల్లోని చట్టం విగ్రహపూజను నిషేధించలేదు. కొన్ని విగ్రహపూజలైతే జాతీయ లేక ప్రభుత్వ రాజనీతిలో భాగంగా ఉండేవి. ఆవిధంగా కొందరు క్రైస్తవులుగా మారకముందు ‘చట్టపరంగా ఆంక్షలు లేని విగ్రహపూజలు’ చేశారు. (న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌, 1950 ఎడిషన్‌) ఉదాహరణకు, బబులోను రాజు నెబుకద్నెజరు విగ్రహపూజ కోసం ఒక బంగారు ప్రతిమను చేయించాడు, కానీ యెహోవా సేవకులు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు దాన్ని ఆరాధించడానికి నిరాకరించారని గమనించవచ్చు.​—⁠దానియేలు 3:​1-12.

మరొక కోణంనుండి చూస్తే, అనేక విగ్రహపూజల్లోని ఆచారాలు ప్రకృతి సూత్రాలకు లేక స్వాభావికమైన నైతిక విలువలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. (రోమీయులు 2:​14,15) అపొస్తలుడైన పౌలు నైతికంగా దిగజారిన “స్వాభావిక విరుద్ధమైన,” “అవాచ్యమైన” అలవాట్ల గురించి వ్రాశాడు, వాటిలో అధికం మతాచారాల్లో స్థిరంగా చోటుచేసుకొన్నాయి. (రోమీయులు 1:​26,27) చేయతగని విగ్రహపూజల్లో పాల్గొంటున్న స్త్రీ, పురుషులు మంచీ చెడులను గ్రహించే తమ మనస్సాక్షిని లెక్కచేయడం లేదు. క్రైస్తవులుగా మారేవారు అలాంటి కలుషితమైన అలవాట్లను వదిలిపెట్టడం నిజంగా యుక్తమైనదే.

ముందు ప్రస్తావించినదానికి తోడుగా, యూదామతేతరుల మధ్య సాధారణంగా ఉండే అలాంటి విగ్రహపూజలను యెహోవా ఖండించాడు. అందుకే అవి చేయతగనివి. *​—⁠కొలొస్సయులు 3:​5-7.

[అధస్సూచి]

^ పేరా 6 1 పేతురు 4:3వ వచనపు గ్రీకు మూలం యొక్క అసలైన అర్థం “ధర్మవిరుద్ధమైన విగ్రహపూజలు.” వివిధ ఇంగ్లీషు బైబిళ్ళలో ఆపదబంధం “శాస్త్ర విరుద్ధమైన విగ్రహారాధన,” “నిషిద్ధమైన విగ్రహాల పూజ,” “ధర్మరహితమైన విగ్రహపూజలు” అని విభిన్నంగా అనువదించబడింది.