కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరణం తర్వాత జీవితం ఉందా?

మరణం తర్వాత జీవితం ఉందా?

మరణం తర్వాత జీవితం ఉందా?

“మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” అని పితరుడైన యోబు దాదాపు 3,500 సంవత్సరాల క్రితం అడిగాడు. (యోబు 14:​14) వేలాది సంవత్సరాలుగా ఈప్రశ్న మానవులను కలవరపరచింది. అన్ని యుగాల్లోను అన్ని సమాజాల్లోను ప్రజలు ఈవిషయాన్ని గురించి లోతుగా ఆలోచించారు, వేర్వేరు సిద్ధాంతాలు రూపొందించారు.

నామకార్థ క్రైస్తవులు చాలామంది పరలోకం, నరకం అనేవి ఉన్నాయని నమ్ముతారు. మరోవైపు హిందువులు పునర్జన్మ ఉందని నమ్ముతారు. ముస్లిముల అభిప్రాయాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, ఒక ఇస్లామ్‌ మత కేంద్రంలోని ప్రొఫెసర్‌ అయిన ఏమీర్‌ ముయావియాహ్‌ ఇలా అంటున్నాడు: “మరణం తర్వాత ఒక తీర్పు దినం ఉంటుందని మేం నమ్ముతాము, ఆరోజు దేవుడైన అల్లాహ్‌ ముందుకి వెళ్ళినప్పుడు, అదొక కోర్టుగదిలోకి వెళ్తున్నట్లే ఉంటుంది.” ముస్లిముల నమ్మకాల ప్రకారం అప్పుడు అల్లాహ్‌, ఒక్కొక్క వ్యక్తి జీవిత విధానాన్ని పరిశీలించి అటు పరదైసుకు గాని ఇటు నరకాగ్నికి గాని పంపిస్తాడు.

శ్రీలంకలో అటు బౌద్ధులు ఇటు క్యాథలిక్కులు తమ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు తమ ఇంటి తలుపులను కిటికీలను తెరచి ఉంచుతారు. తర్వాత నూనె దీపం వెలిగించి, చనిపోయిన వ్యక్తి కాళ్ళు ఇంటి ముఖద్వారం వైపు ఉండేలా శవపేటికను ఉంచుతారు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ సులభంగా బయటికి వెళ్ళిపోయేందుకు వీలుగా ఉంటుందని నమ్ముతారు.

యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియాకు చెందిన రోనాల్డ్‌ ఎమ్‌. బెర్నట్‌ ప్రకారం, ఆస్ట్రేలియాలోని ఆదివాసులు “మానవులు ఆత్మ సంబంధంగా అవినాశులు” అని నమ్ముతారు. ఆఫ్రికాలోని కొన్ని కొండజాతుల వారు, మరణం తర్వాత సాధారణ ప్రజలు దయ్యాలవుతారని, ప్రముఖులు ఆయా సమాజపు అదృశ్య నాయకులుగా ఘనతను పొందుతూ విజ్ఞాపనలను వింటూ పూర్వుల ఆత్మలుగా తయారవుతారని నమ్ముతారు.

కొన్ని దేశాల్లో మృతుల స్థితికి సంబంధించిన నమ్మకాలు స్థానిక సంప్రదాయం, నామకార్థ క్రైస్తవత్వంల సమ్మేళనాలై ఉంటాయి. ఉదాహరణకు, పశ్చిమ ఆఫ్రికాలో అనేకమంది క్యాథలిక్కులు ప్రొటెస్టెంటులు తమవారెవరైనా చనిపోయినప్పుడు ఇంట్లోని అద్దాల్ని కప్పేయడం సర్వసాధారణం; చనిపోయిన వ్యక్తి ఆత్మను ఎవరూ చూడకూడదని వారి ప్రయత్నం.

‘మనం చనిపోయినప్పుడు ఏమౌతుంది?’ అన్న ప్రశ్నకు వచ్చే జవాబులు నిజానికి వైవిధ్యభరితంగా ఉంటాయి. అయితే ఒక సామాన్యాంశం ఏమిటంటే: మనిషిలో ఏదో అమర్త్యమైనది చనిపోయిన తర్వాత కూడా బ్రతికివుంటుంది. ఆ“ఏదో” అనేది ఆత్మేనని కొందరు ప్రజలు నమ్ముతారు. ఉదాహరణకు, ఆఫ్రికా ఆసియాల్లోని కొన్ని ప్రాంతాల్లోను, పసిఫిక్‌ ప్రాంతాలైన పొలినేషియా, మెలనేషియా, మైక్రొనేషియాల్లోను చాలామంది ఆత్మ అమర్త్యమైనదని నమ్ముతారు.

సజీవుడైన వ్యక్తిలో ఒక ఆత్మ ఉంటుందా? ఆఆత్మ మనిషి మరణించినప్పుడు నిజంగానే శరీరాన్ని విడిచిపెడుతుందా? అదే నిజమైతే, ఆఆత్మకు ఏం సంభవిస్తుంది? మరణించినవారికి ఎటువంటి నిరీక్షణ ఉంది? ఈప్రశ్నలు ఉపేక్షనీయమైనవి కావు. మీసాంస్కృతిక మత నేపథ్యం ఏదైనప్పటికీ మరణం అనేది మీరు ఎదుర్కోవలసిన ఒక వాస్తవమే. అలా ఈవివాదాంశంలో మీరూ చేరివున్నారు. ఈవిషయాన్ని లోతుగా పరిశీలించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.