కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్మకం మీజన్మ హక్కు

నమ్మకం మీజన్మ హక్కు

నమ్మకం మీజన్మ హక్కు

మీరు నమ్మాలనుకున్న విషయాలను నమ్మడం మీహక్కు, ఆజన్మ హక్కును మీరు చాలా అమూల్యంగా ఎంచుతుండవచ్చు. నిజానికి ప్రజలందరూ అంతే. భూమ్మీది ఆరు వందల కోట్ల ప్రజలు ఈహక్కును వినియోగించుకోవడం మూలంగానే వైవిధ్యభరితమైన నమ్మకాలు ఉత్పన్నమయ్యాయి. సృష్టిలోని రంగులు, రూపాలు, నిర్మాణాలు, రుచులు, వాసనలు, శబ్దాలు వంటివాటిలోని వైవిధ్యంలానే విభిన్నమైన నమ్మకాలు తరచు జీవితంలో ఆసక్తిని, ఉత్తేజాన్ని, ఆనందాన్ని రేకెత్తిస్తుంటాయి. కూరలో మసాలా ఎలాంటిదో జీవితంలో వైవిధ్యం అలాంటిది కాగలదు.​—⁠కీర్తన 104:⁠24.

కానీ జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. కొన్ని నమ్మకాలు వైవిధ్యమైనవి మాత్రమే కాదు అవి ప్రమాదకరమైనవి కూడా. ఉదాహరణకు, 20వ శతాబ్దం ప్రారంభంలో కొందరు ప్రజలు యూదులు, ఫ్రీమేసన్‌లు “క్రైస్తవ నాగరికతను భంగపరచి తమ సంయుక్త పరిపాలనతో ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించాలని” పథకాలు వేస్తున్నారని నమ్మడం ప్రారంభించారు. ఈనమ్మకానికి ఒక మూలం ప్రోటోకాల్స్‌ ఆఫ్‌ ద లెర్నడ్‌ ఎల్డర్స్‌ ఆఫ్‌ జాయన్‌ అనే యూదువ్యతిరేక కరపత్రం. అధిక పన్నులు విధించడం, ఆయుధాల ఉత్పత్తిని పెంచడం, ‘అన్యుల ధనాన్ని ఒక్క దెబ్బతో నాశనం చేసేలా’ భారీస్థాయిలో గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించడం’ వంటివి వారి పథకాల్లో కొన్ని అని ఆకరపత్రం ఆరోపించింది. ‘అన్యులను బుద్ధిగ్రాహ్యతలేని పశువుల్లా మార్చేందుకు’ విద్యా వ్యవస్థను నియంత్రించడం, చివరికి యూదా పెద్దలు తమ ‘వ్యతిరేకులను ఒక్క పెట్టున నాశనం చేయగలిగేలా’ దేశ రాజధానులను కలిపే భూగర్భ రైల్వేలను నిర్మించడం వంటివి వారి పథకాల్లో ఉన్నాయని కూడా ఆరోపణలున్నాయి.

కానీ ఇవన్నీ అబద్ధాలు, యూదువ్యతిరేక భావాలను రేకెత్తించడానికి కల్పించబడ్డాయి. ‘ఈ ఘోరమైన కల్పిత మాటలు రష్యా నుండి విదేశాలకు వ్యాపించాయి’ అని బ్రిటీష్‌ మ్యూజియమ్‌కి చెందిన మార్క్‌ జోన్స్‌ అంటున్నాడు. ఆకరపత్రం మొట్టమొదటి సారిగా 1903 లో రష్యాలోని ఒక వార్తాపత్రిక ఆర్టికల్‌లో ప్రచురితమైంది. 1920, మే 8న అది లండన్‌లోని ద టైమ్స్‌కు చేరుకుంది. ఆతర్వాత ఒక సంవత్సరానికి అదంతా కల్పితమని ద టైమ్స్‌ బట్టబయలు చేసింది. ఈలోగా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ‘ఇలాంటి అబద్ధాలను అణచిపెట్టి ఉంచడం చాలా కష్టం’ అని జోన్స్‌ అంటున్నాడు. ఒక్కసారి ప్రజలు వాటిని స్వీకరించారంటే అవి ఇక విషతుల్యమైన, ప్రమాదకరమైన నమ్మకాలుగా మారిపోతాయి. 20వ శతాబ్దపు చరిత్ర రుజువు చేసినట్లుగా అవి తరచు వినాశకరమైన పరిణామాలకు దారితీస్తాయి. —సామెతలు 6:16-19.

నమ్మకం వెర్సస్‌ సత్యం

నిజమే, ఉద్దేశపూరితంగా వ్యాప్తిచేయబడిన అబద్ధాలు లేకుండానే తప్పుడు నమ్మకాలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మనం అపార్థాలకు లోనవుతాము. తాము సరైనవని నమ్మిన పనులు చేసి ఎంతమంది అకాల మరణానికి గురికాలేదు? ఇంకా చూస్తే, మనం కొన్ని విషయాలను కేవలం వాటిని నమ్మాలన్న ఇష్టం ఏర్పడుతుంది కాబట్టే వాటిని నమ్ముతాము. చివరికి శాస్త్రజ్ఞులు కూడా “తరచు తమ స్వంత సిద్ధాంతాలపై ప్రేమలో పడిపోతారు” అని ఒక ప్రొఫెసర్‌ అంటున్నాడు. వారి నమ్మకాలు విషయాలను కూలంకషంగా విశ్లేషించకుండా వారిని అడ్డుకుంటాయి. ఆతర్వాత ఆతప్పుడు నమ్మకాలను సమర్థించుకోవడానికే జీవితకాలమంతా వెచ్చిస్తారు.​—⁠యిర్మీయా 17:⁠9.

విపరీతమైన పరస్పర విభేదాలున్న మత నమ్మకాల విషయంలో కూడా అలానే జరిగింది. (1 తిమోతి 4:⁠1; 2 తిమోతి 4:​3,4) ఒక వ్యక్తి తనకు దేవుని మీద విశ్వాసం ఉందంటాడు. దేవుని మీద నమ్మకం ఉంచడానికి ఆయన దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవని కొందరు ప్రజలంటారు. మరొక వ్యక్తి, మరణం తర్వాత అమర్త్యమైన ఆత్మ సజీవంగా ఉంటుందని అంటాడు. ఇంకొకాయన, మరణించిన తర్వాత ఒక వ్యక్తి పూర్తిగా, సంపూర్ణంగా ఉనికిలో ఉండకుండా పోతాడని నమ్ముతాడు. పరస్పర విరుద్ధమైన ఇలాంటి నమ్మకాలన్నీ సత్యాలు కానేరవన్నది స్పష్టం. కాబట్టి, మీరు నమ్మేది సత్యమేనని, కేవలం మీరు నమ్మాలనుకున్న విషయాలను మాత్రమే మీరు నమ్మడం లేదని నిశ్చయపరచుకోవడం జ్ఞానయుక్తమైన పని కాదా? (సామెతలు 1:⁠5) ఆపని మీరెలా చేయగలరు? తర్వాతి ఆర్టికల్‌ ఈవిషయాన్ని పరిశీలిస్తుంది.

[3వ పేజీలోని చిత్రం]

“ప్రోటోకాల్స్‌ ఆఫ్‌ ద లెర్నడ్‌ ఎల్డర్స్‌ ఆఫ్‌ జాయన్‌” అనే కరపత్రాన్ని బట్టబయలు చేస్తున్న 1921 లోని ఆర్టికల్‌