కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

దూరా మైదానములో నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ముందు ముగ్గురు యూదులు పరీక్షకు గురైనప్పుడు దానియేలు ఎక్కడున్నాడు?

బైబిలు దాని గురించి ఏమి చెప్పడం లేదు, కాబట్టి ఆపరీక్షా సమయంలో దానియేలు ఎక్కడున్నాడన్నది నేడు ఏ మానవుడూ ఇదమిత్థంగా చెప్పలేడు.

దానియేలుకున్న ఆధికారిక స్థానంగానీ లేక నెబుకద్నెజరు ఆయనకిచ్చిన అనుగ్రహ స్థానంగానీ షద్రకు, మేషాకు, అబేద్నెగోల స్థానాల కన్నా ఉన్నతమైనది కాబట్టి దానియేలు దూరా మైదానానికి వెళ్ళవలసిన అవసరం లేకపోవచ్చునని కొందరు సూచించారు. ఆయన కొంతకాలంపాటు తన ముగ్గురు సహచరులకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని దానియేలు 2:⁠49 సూచిస్తుంది. అయితే దీన్ని బట్టి ఆయన ఇతరులతోపాటు ప్రతిమ ఎదుట సమావేశం కావడం నుండి మినహాయించబడి ఉంటాడని మనం నిరూపించలేము.

దానియేలు గైరుహాజరు గురించి వివరించడానికి ప్రయత్నిస్తూ, ఆయన ఆధికారిక కార్యంపై వేరే స్థలానికి వెళ్లివుంటాడని లేక అనారోగ్యం మూలంగా హాజరు కాలేకపోయి ఉంటాడని ఇతరులు అన్నారు. అయితే బైబిలు అలాగేమీ చెప్పడం లేదు. విషయం ఏదైనప్పటికీ దానియేలు అనుసరించిన విధానం విమర్శకు తావిచ్చి ఉండకపోయుండవచ్చు, ఎందుకంటే, ఒకవేళ అలా జరిగివుంటే, అసూయాపరులైన బబులోను అధికారులు ఆయనపై నిందారోపణలు వేయడానికి దాన్ని ఉపయోగించుకొని ఉండేవారు. (దానియేలు 3:⁠8) ఈసంఘటనకు ముందు, ఆతర్వాతా కూడా దానియేలు తన యథార్థతను కాపాడుకొని, ఏపరీక్ష ఎదురైనా దేవునిపట్ల నమ్మకంగా ఉన్నాడు. (దానియేలు 1:⁠8; 5:​17; 6:​4, 10,11) దానియేలు దూరా మైదానానికి ఎందుకు వెళ్ళలేదో బైబిలు చెప్పకపోయినా, ఆయన ఎంతమాత్రం రాజీపడకుండా యెహోవా దేవునిపట్ల నమ్మకంగా ఉండివుంటాడని మాత్రం మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు.​—⁠యెహెజ్కేలు 14:14; హెబ్రీయులు 11:⁠33.