కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టులో గెలుపు

ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టులో గెలుపు

ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టులో గెలుపు

జర్మనీలోని యెహోవాసాక్షులు కార్ల్‌జ్రూవలోని ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టులో సాధించిన గెలుపు ఒక మైలురాయిగా ఉంది. ఆవిధంగా వారు తమ చట్టబద్ధమైన గుర్తింపుకు ప్రాముఖ్యమైన చర్యను పూర్తి చేశారు.

జర్మనీలోని యెహోవాసాక్షులు 100 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం నుండి చురుగ్గా ప్రకటిస్తున్నారు. వారు 20వ శతాబ్దపు రెండు నిరంకుశాధికారాల వేధింపులను అంటే, నాజీల, కమ్యూనిస్టుల తీవ్రమైన వేధింపులను భరించారు. శాసన ప్రకారమైన సంస్థగా చట్టబద్ధమైన గుర్తింపును పొందాలని 1990 నుండి ప్రయత్నించారు. రెండు కోర్టులు ఇచ్చిన అనుకూలమైన తీర్పులను మరో కోర్టు రద్దుచేయడంతో సాక్షులు, ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టుకు అప్పీల్‌ చేసుకున్నారు. 2000, డిసెంబరు 19న ఆకోర్టు తన తీర్పును ప్రకటించింది.

యెహోవాసాక్షుల పక్షాన ఏకగ్రీవ నిర్ణయం

ఆ కోర్టు యొక్క ఏడుగురు జడ్జీలూ, యెహోవాసాక్షుల పక్షంగానే తీర్పు చెప్పారు. ఆజడ్డీలు, ఫెడరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కోర్ట్‌ 1997 లో చేసిన నిర్ణయాన్ని కొట్టివేసి, యెహోవాసాక్షుల దరఖాస్తును మళ్ళీ పరిగణనలోకి తీసుకోవాలని వారికి ఆదేశించారు.

ప్రభుత్వానికీ, మత గుంపులకూ మధ్యనున్న ప్రాథమిక సంబంధంపై వ్యాఖ్యానించేందుకు ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టు ఆసందర్భాన్ని ఉపయోగించుకొంది. ప్రాథమికంగా, ఒక మతం యొక్క హోదా అనేది, “దాని నమ్మకాల ఆధారంగా కాక, దాని ప్రవర్తన ఆధారంగా నిర్ణయించబడుతుంది.”

సాక్షులు “క్రైస్తవ తటస్థతను” ఆచరించినప్పుడు, వారు “ప్రజాస్వామ్య సూత్రంపై దాడిచేయడం లేదు,” “ప్రజాస్వామ్యం స్థానంలో మరొక రకమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకోవడమూ లేదు.” కనుక, తమకు చట్టబద్ధమైన గుర్తింపు కావాలని యెహోవాసాక్షులు కోరినప్పుడు, వాళ్ళకు దాన్నివ్వకుండా ఉండేందుకు వాళ్ళు రాజకీయ ఎన్నికల్లో పాల్గొనరన్న విషయాన్ని ఒక కారణంగా తీసుకోకూడదని కూడా ఆకోర్టు అభిప్రాయపడింది.​—⁠యోహాను 18:36; రోమీయులు 13:⁠1.

ఒక విశ్వాసి, సాక్షైనా, మరొక విశ్వాసానికి చెందినవారైనా సరే, కొన్నిసార్లు ప్రభుత్వం కోరే విషయాలు తన విశ్వాసం కోరే విషయాలూ పరస్పరం విరుద్ధంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కోవచ్చని కూడా ఆకోర్టు పేర్కొంది. ఆవ్యక్తి తన మనస్సాక్షిననుసరించి, “చట్టానికన్నా, ఎక్కువగా తన విశ్వాస సిద్ధాంతాలకు లోబడినప్పుడు” ప్రభుత్వం దాన్ని సమర్థనీయమైనదిగాను, మతస్వాతంత్ర్య పరిమితుల్లో ఉన్నట్లుగాను దృష్టించాలి అని కూడా ఆకోర్టు పేర్కొంది.​—⁠అపొస్తలుల కార్యములు 5:⁠29.

కోర్టు నిర్ణయం అన్ని పత్రికల్లోను పతాకశీర్షికలకెక్కింది. జర్మనీలో దాదాపు అన్ని వార్తాపత్రికలూ ఆకేసుపై నివేదికను సమర్పించాయి. ప్రముఖ టీవీ రేడియో స్టేషన్‌లన్నీ కూడా దానికి సంబంధించిన నివేదికలను ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. జర్మనీలో యెహోవా నామము మునుపెన్నడూ ఇంత విస్తృతంగా ప్రచురం కాలేదు.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

AP Photo/Daniel Maurer