కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి గ్రహించారా? అయితే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• యోబు 38వ అధ్యాయంలో వేయబడిన ప్రశ్నలను గురించి ఆలోచించడం ఇప్పటికీ తగినదేనని ఎందుకు చెప్పవచ్చు?

దేవుడు యోబు దృష్టికి తీసుకువచ్చిన అనేక అద్భుత కార్యాలను నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. అందులో, గురుత్వాకర్షణ శక్తి భూమిని ఎలా దాని కక్ష్యలో ఉంచుతుంది, కాంతి అంటే అసలు ఏమిటి, మంచు రేణువులు అంతులేని వైవిధ్యంగా ఎందుకుంటాయి, వర్షపు చినుకులు ఎలా తయారవుతాయి, శక్తి ఎలా ఉరుములు మెరుపులుగా మారుతుంది అన్నవి ఇమిడి ఉన్నాయి.​—⁠4/15, 4-11 పేజీలు.

ప్రతికూల భావాలతో పోరాడేందుకు బైబిలులోని ఎవరి మాదిరులు మనకు సహాయం చేయగలవు?

ఆసాపు, బారూకు, నయోమి కొన్ని సమయాల్లో నిరుత్సాహాన్నీ లేదా మరితర ప్రతికూల భావాలను ఎదుర్కొన్నారు, అలాంటి పరిస్థితులను వారు విజయవంతంగా ఎదుర్కొన్నారని చూపించే లేఖన వృత్తాంతాలు మనకు సహాయపడతాయి.​—⁠4/15, 22-4 పేజీలు.

క్రైస్తవ విధవరాండ్రకు సహాయపడగల కొన్ని ఆచరణాత్మక మార్గాలేమిటి?

స్నేహితులు, తాము చేయగల సహాయమేమిటో దయాపూర్వకంగా స్పష్టంగా చెప్పవచ్చు. ఆర్థిక లేదా వస్తుపరమైన సహాయాన్ని ఇవ్వగల కుటుంబ సభ్యులు లేదా మరితరులు నిజంగా సహాయం అవసరమైనప్పుడు సహాయపడవచ్చు. తోటిక్రైస్తవులు కూడా స్నేహమనే ప్రేమపూర్వక చేయూతనిస్తూ ఆధ్యాత్మిక మద్దతును ఓదార్పును ఇస్తూ సహాయపడగలరు.​—⁠5/1, 5-7 పేజీలు.

1 కొరింథీయులు 7:⁠39 సలహా ఇస్తున్నట్లు “ప్రభువునందు మాత్రమే” పెళ్ళి చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

అవిశ్వాసులను పెళ్ళి చేసుకోవడం వినాశకరమని తరచూ నిరూపించబడింది. అంతేకాక, ఈదైవిక సలహాను పాటించడమన్నది యెహోవా దేవునికి నమ్మకంగా ఉండడానికి సంబంధించిన విషయం. మనం దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, మన హృదయాలు మనలను ఖండించవు. (1 యోహాను 3:21, 22)​—⁠5/15, 20-21 పేజీలు.

యెహోవా మన పాపాలను క్షమించగలవాడుగా ఉండగా, క్రైస్తవులు సంఘంలోని పెద్దల ఎదుట తమ గంభీరమైన పాపాలను ఎందుకు ఒప్పుకుంటారు?

అవును, ఒక క్రైస్తవుడు తాను చేసిన గంభీరమైన పాపాలకు యెహోవా క్షమాభిక్షనే కోరుకోవాలి. (2 సమూయేలు 12:​13) ప్రవక్తయైన నాతాను దావీదుకు సహాయపడినట్లే, సంఘంలో పరిణతిగల పెద్దలు పశ్చాత్తాపంతో కృంగిపోతున్న పాపులకు సహాయం చేయగలరు. పెద్దల దగ్గరికి వెళ్ళడం యాకోబు 5:14, 15 లో ఇవ్వబడిన నిర్దేశానికి పొందికగా ఉంటుంది.​—⁠6/1,31వ పేజీ.

అవసరాల్లో ఉన్న అనాథలపైనా విధవరాండ్రపైనా మనం శ్రద్ధ చూపాలన్నదానికి ఏమి రుజువుంది?

ఆ విధంగా శ్రద్ధ చూపడం ప్రాచీన హెబ్రీయుల, తొలి క్రైస్తవుల సత్యారాధనకు చిహ్నంగా ఉండేదని చరిత్ర వృత్తాంతాలు చూపిస్తున్నాయి. (నిర్గమకాండము 22:22, 23; గలతీయులు 2:9, 10; యాకోబు 1:​27) అపొస్తలుడైన పౌలు, అవసరాల్లో ఉన్న విధవరాండ్రను సంరక్షించాలన్న స్పష్టమైన నిర్దేశాలను లేఖనాల్లో చేర్చాడు. (1 తిమోతి 5:3-16)​—⁠6/15, 9-11 పేజీలు.

సంతోషకరమైన, అర్థవంతమైన జీవితానికి కీలకమేమిటి?

మనం మన పరలోక తండ్రియైన యెహోవాతో తప్పనిసరిగా సరైన సంబంధాన్ని పెంచుకొని కాపాడుకోవాలి. మనమలా చేసేందుకు బైబిలును అధ్యయనం చేయడం ప్రాముఖ్యమైన సహాయకం.​—⁠7/1, 4-5 పేజీలు.

ప్రతి వ్యక్తికి మరణం తర్వాత కూడ మనుగడ సాగించే అమర్త్య ఆత్మ ఉందా?

ఆత్మ అమర్త్యమైనదని కొందరు నమ్ముతున్నప్పటికీ, ఆతలంపును బైబిలు సమర్థించడం లేదు. మానవుడు మరణించినప్పుడు, ఆయన మట్టికి తిరిగి చేరుతాడనీ ఉనికిలో లేకుండా పోతాడనీ అది చూపిస్తుంది. కానీ ఆయనకు తిరిగి జీవాన్నిచ్చే శక్తి దేవునికే ఉంది, కనుక పునరుత్థానం ద్వారా ఆయనకు భవిష్యత్‌ జీవిత నిరీక్షణ ఏమైన ఉందా అన్నది దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. (ప్రసంగి 12:7)​—⁠7/15, 3-6 పేజీలు.

దురా మైదానంలో ముగ్గురు హెబ్రీయులు పరీక్షించబడినప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు?

దాని గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు. దానియేలు తనకున్న హోదాను బట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండకపోవచ్చు లేదా ఏదైనా ఆధికారిక నియామకంపై దూరప్రాంతానికి ఎక్కడికన్నా వెళ్ళి ఉండవచ్చు. అయితే, ఆయన యెహోవా పట్ల నమ్మకంగా ఉండే విషయంలో రాజీపడి ఉండడని మనం నమ్మకం కలిగివుండగలం.​—⁠8/1,31వ పేజీ.