కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒకప్పుడు తోడేళ్ళం—ఇప్పుడు గొఱ్ఱెలం!

ఒకప్పుడు తోడేళ్ళం—ఇప్పుడు గొఱ్ఱెలం!

ఒకప్పుడు తోడేళ్ళం​—⁠ఇప్పుడు గొఱ్ఱెలం!

సకీనా నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము ఇరుగుపొరుగున ఉండేవాళ్ళము. సకీనా బలంగా ఎత్తుగా ఉండేది, నేనేమో పొట్టిగా సన్నగా ఉండేదాన్ని. మేమెప్పుడూ కీచులాడుకుంటూ ఉండేవాళ్ళం, ఒకసారైతే పెద్ద యుద్ధమే జరిగింది. ఆరోజు నుండి మాఇద్దరి మధ్యా మాటల్లేవు, పలకరింపులూ లేవు. కొంతకాలానికి మేము ఇళ్ళు మారాము, ఆతరువాత ఎవరెక్కడ ఉన్నది ఇద్దరికీ తెలీదు.

1994 లో నేను యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాను, నెమ్మదిగా నా వ్యక్తిత్వం మారింది. అటు తర్వాత నాలుగు సంవత్సరాలకు నేను బురుండీలోని బుజుంబురాలో ప్రత్యేక సమావేశ దినానికి హాజరైనప్పుడు అక్కడ సకీనా కనబడే సరికి ఆశ్చర్యపోయాను. ఆమె అక్కడ హాజరైనందుకు నాకు ఆనందంగానే అనిపించింది, కానీ మామధ్య సంభాషణ పొడిపొడిగానే జరిగింది. అయితే ఆరోజు బాప్తిస్మం తీసుకునే అభ్యర్థుల్లో ఆమె కూడా ఉండడం చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను! ఆమె కూడా ఎంతో మారింది. నేను నిరంతరం పోట్లాడిన వ్యక్తి కాదామె. ఆమె ఇక కయ్యానికి కాలుదువ్వే వ్యక్తి కాదు. దేవునికి తాను చేసుకున్న సమర్పణను ఆమె నీటిలో బాప్తిస్మం పొందుతూ బహిరంగంగా తెలియజేస్తుంటే చూడడం ఎంత అద్భుతంగా ఉంది!

ఆమె నీటిలోనుండి బయటికి వచ్చిన తర్వాత కౌగిలించుకుందామని నేను గబ గబా వెళ్ళి ఆమె చెవిలో ఇలా అన్నాను: “మనమెలా దెబ్బలాడుకునేవాళ్లమో గుర్తుందా?” అందుకామె “అవును గుర్తుంది, కానీ అది గతంలో. నేనిప్పుడు పూర్తిగా మారాను” అంది.

ప్రజలను ఐక్యపరిచే బైబిలు సత్యాన్ని కనుగొన్నందుకూ, మహా కాపరియైన యెహోవా దేవుని గొఱ్ఱెల మందలో చేరడానికి తోడేళ్ళలాంటి మాపాత వ్యక్తిత్వాలను మార్చుకోగలిగినందుకూ మేమిద్దరం ఎంతో ఆనందించాము. నిజంగా, బైబిలు సత్యం జీవితాలను మారుస్తుందనడంలో సందేహం లేదు.