కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మధ్య ఆఫ్రికాలో దేవుని నామాన్ని ఉపయోగిస్తారు

మధ్య ఆఫ్రికాలో దేవుని నామాన్ని ఉపయోగిస్తారు

మధ్య ఆఫ్రికాలో దేవుని నామాన్ని ఉపయోగిస్తారు

మధ్య ఆఫ్రికాలోని ప్రజల్లో అధిక సంఖ్యాకులు దేవుణ్ణి నమ్ముతారు. ఆయనే అన్నింటికి సృష్టికర్త అనే విషయంలో వాళ్ళకు సందేహమేమీ లేదు. (ప్రకటన 4:​10,11) అయితే, మిగతా చోట్లలోని అనేక మంది ప్రజల్లాగే, వీళ్ళు కూడా దేవుని వ్యక్తిగత నామమైన యోహోవాను తరచూ నిర్లక్ష్యం చేస్తారు.

మధ్య ఆఫ్రికాతోపాటు, ప్రపంచంలోని ఇతర భాగాల్లోని ప్రజలు కూడా పరలోక ప్రార్థనలో, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అన్నప్పుడు ఆయన నామము గురించి పేర్కొంటారు. (మత్తయి 6:⁠9) కానీ చాలా కాలంగా చాలా మందికి ఆనామమేమిటో తెలియదు. అయితే, కొన్ని సంవత్సరాలుగా యెహోవాసాక్షులు ఎంతో ఆసక్తిగా చేస్తున్న ప్రకటనా పని వల్ల, దేవుని నామమును ఉపయోగించే విషయంలో ప్రజల మనోభావం మారింది. నేడు, జూలూ (ఉజెహోవా), యొరూబ (జెహోఫా), గ్జోసా (ఉయెహోవా), స్వాహిలి (యెహోవా) వంటి అనేక ఆఫ్రికా భాషల్లో చాలామందికి దైవిక నామం పరిచయమై వారిచేత అంగీకరించబడింది. అయితే, ఈభాషల్లోని చాలా బైబిలు అనువాదాలు దైవిక నామాన్ని ఇప్పటికీ ఉపయోగించడంలేదు.

జాండె భాషలోని బైబిలు, దేవుని నామమును ఉపయోగించే ఒక చక్కని అనువాదం. జాండె భాషను సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, సూడాన్‌, డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దేశాల్లోని వివిధ భాగాల్లోని ప్రజలు మాట్లాడుతారు. ఈభూభాగాల్లోని ప్రజలు దేవుని నామమును ఉపయోగిస్తారు, వాళ్ళు వాళ్ళ భాషలో యెకోవా అని ఉచ్చరిస్తారు. దేవుని నామమును ప్రాంతీయ భాషలో ఎలా ఉచ్చరించినా, దాన్ని ఉపయోగించడమే ప్రాముఖ్యం. ఎందుకని? ఎందుకంటే, “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.”​—⁠రోమీయులు 10:⁠13.

[32వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సుడాన్‌

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో

[చిత్రసౌజన్యం]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck