కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఖర్జూరచెట్టు నుండి ఒక పాఠం

ఖర్జూరచెట్టు నుండి ఒక పాఠం

ఖర్జూరచెట్టు నుండి ఒక పాఠం

“అసాధారణమైన అందానికి సుందరమైన స్థూలరూపం.” ఒక బైబిలు ఎన్‌సైక్లోపీడియా ఖర్జూరచెట్టును అలా వర్ణించింది. బైబిలు కాలాల్లోనూ నేడూ, ఖర్జూరచెట్లు ఈజిప్టులో నైలు నది ప్రవహిస్తున్న పల్లపు ప్రాంతాలకు వన్నె తేవడమేకాక, నెగెబు ఎడారుల ఒయాసిస్సు చుట్టుప్రక్కల సేదతీర్చే నీడను కూడా ఇస్తున్నాయి.

ఈచెట్టుకు చెందిన అనేక జాతుల చెట్లలాగే ఖర్జూరచెట్టు కూడా దృష్టిని ఆకట్టుకునే విధంగా చాలా నిటారుగా ఉంటుంది. కొన్ని 30 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి, 150 సంవత్సరాలవరకు కాపుకొస్తాయి. అవును, ఖర్జూరచెట్టు చాలా అందంగా కనిపిస్తుంది, ఆశ్చర్యకరమైన పంటను కూడా ఇస్తుంది. ఇది ప్రతి సంవత్సరం అనేకమైన ఖర్జూరపు గెలలు వేస్తుంది. కేవలం ఒక్క గెలలోనే వెయ్యికంటే ఎక్కువ ఖర్జూరపళ్ళు ఉంటాయి. ఖర్జూరాల గురించి ఒక అధికారి ఇలా వ్రాశాడు: “కేవలం దుకాణాల్లో లభ్యమయ్యే ఎండిన ఖర్జూరాలను మాత్రమే తిన్న వారికి తాజా ఖర్జూరాలు ఎంత రుచిగా ఉంటాయో ఊహించడం కష్టం.”

బైబిలు కొందరు మానవులను ఖర్జూరచెట్లతో పోలుస్తోంది, ఆపోలిక తగినదే. ఒక వ్యక్తి దేవునికి ఆనందం కలిగించేలా ఉండాలంటే, ఫలభరితమైన ఖర్జూరచెట్టులా నీతి మార్గంలో జీవిస్తూ నిరంతరం మంచి పనులు చేస్తుండాలి. (మత్తయి 7:​17-20) ఈకారణంగానే, సొలొమోను కట్టించిన మందిరంలోనూ యెహెజ్కేలు చూసిన దర్శనంలోని మందిరంలోనూ అలంకరణగా ఖర్జూరచెట్లు చెక్కబడ్డాయి. (1 రాజులు 6:29, 32, 35; యెహెజ్కేలు 40:​14-16,20,22) అందుకే, ఒకరి ఆరాధనను దేవుడు అంగీకరించాలంటే ఆవ్యక్తి ఖర్జూరచెట్టుకున్నట్లు ఆకర్షింపజేసే లక్షణాలను కలిగివుండాలి. దాని గురించి దేవుని వాక్యమిలా తెలియజేస్తోంది: “నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు.”​—⁠కీర్తన 92:12.