కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా మీపిల్లల అవసరాన్ని తీర్చండి!

తల్లిదండ్రులారా మీపిల్లల అవసరాన్ని తీర్చండి!

తల్లిదండ్రులారా మీపిల్లల అవసరాన్ని తీర్చండి!

పిల్లలకు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులనుండి ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ అవసరం. ఈవిషయంలో, టాన్యా జాగురీ అనే ఒక బ్రెజిలియన్‌ టీచర్‌ ఇలా అంటోంది: “ప్రతి పిల్లవాడు వినోదాన్ని వెతకడానికి మొగ్గు చూపుతాడు. కాబట్టి హద్దులను పెట్టాలి. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని. పిల్లలకు హద్దులు పెట్టకపోతే వాళ్ళు అదుపులో లేకుండా పోతారు.”

కానీ అనేక దేశాల్లో స్వయం స్వేచ్ఛ అధికంగా ఉన్న సమాజపు ప్రభావము కారణంగా పైన చెప్పిన సలహాను పాటించడం కష్టమవుతోంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎక్కడనుండి సహాయం పొందగలరు? దేవునిపై భయభక్తులుగల తల్లిదండ్రులు తమ పిల్లలు ‘యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము’ అని గుర్తిస్తారు. (కీర్తన 127:⁠3) అందుకే, వాళ్ళు పిల్లలను పెంచడానికి కావలసిన నడిపింపు కోసం దేవుని వాక్యమైన బైబిలును చూస్తారు. ఉదాహరణకు, సామెతలు 13:24 “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును” అని చెబుతోంది.

బైబిలు ఉపయోగించిన “బెత్తము” కేవలం శారీరకంగా శిక్షించడానికే అని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు; విధానం ఎటువంటిదైనా అది సరిదిద్దే మార్గాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక పిల్లవాడి మార్గాన్ని సరిదిద్దడానికి చాలా తరచుగామాటలే సరిపోతుండవచ్చు. “నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును” అని సామెతలు 29:⁠17 చెబుతోంది.

చెడు అలవాట్లను మానిపించడానికి పిల్లలకు ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ అవసరం. అలా ఇచ్చే దృఢమైన, ప్రేమపూర్వకమైన నడిపింపు ఆతల్లి లేక తండ్రి పిల్లవాడిపై శ్రద్ధ చూపిస్తున్నాడనడానికి నిదర్శనం. (సామెతలు 22:⁠6) కాబట్టి, తల్లిదండ్రులారా, చేతులెత్తేయకండి! బైబిల్లోవున్న చక్కని, ఆచరణాత్మకమైన సలహాలను పాటించడం ద్వారా, మీరుయెహోవా దేవుడ్ని సంతోషపరచగలరు, మీపిల్లల గౌరవాన్ని పొందగలరు.