కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ కన్నులకు కాటుక”

“నీ కన్నులకు కాటుక”

“నీ కన్నులకు కాటుక”

ఆమాటలను ఆసియా మైనరులోని లవొదికయలో ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘముతో యేసుక్రీస్తు అన్నాడు.

“నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను ... కొనుము” అని యేసు చెప్పాడు. అది భౌతికమైన కంటి వ్యాధి కాదు, కానీ చికిత్స అవసరమైన ఆధ్యాత్మిక అంధత్వం. లవొదికయలోని క్రైస్తవులు తాము నివసించిన భౌతికసంపదలతో వర్ధిల్లుతున్న నగర స్ఫూర్తిచే ప్రభావితులై వారి నిజమైన ఆధ్యాత్మిక అవసరాలను నిర్లక్ష్యం చేశారు.

అదే వారి దృష్టి మందగించడానికి కారణమైందని వ్యాఖ్యానిస్తూ యేసు ఇలా అన్నాడు: “నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక​—⁠నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.” ఆసంఘ సభ్యులు ఆవిషయాన్ని గమనించకపోయినా, వ్యాధిని నివారించే ఆ“కాటుక” వారికి అవసరం, అది యేసుక్రీస్తు బోధను, క్రమశిక్షణను అంగీకరించడం ద్వారా మాత్రమే పొందవచ్చు. అందుకే యేసు “నాయొద్ద కొనుము” అని అన్నాడు. (ఇటాలిక్కులు మావి.)​—⁠ప్రకటన 3:17, 18.

లవొదికయలోని క్రైస్తవుల్లాగే, నేటి నిజ క్రైస్తవులు వస్తుసంపదలు, వినోదాలే ధ్యేయంగా ఉన్న పరిసరాల్లో జీవిస్తున్నారు, బహుశా అది గ్రహించకుండా ఆపరిసరాలకు అధికంగా ప్రభావితం కాకుండా తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక దృష్టిని కాపాడుకోవాలనే మాటలు ఈమందలింపులో కనబడుతున్నాయి: ‘నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను [యేసు] యొద్ద కొనుము.’

ఈ “కాటుకను” కొనవలసి ఉంటుందన్నది గమనార్హమైన విషయం. దానికి ధర కూడా ఉంది. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి, ధ్యానించడానికి సమయం ఖర్చు చేయాలి. ఈవాక్యం ‘నిర్మలమైనది, అది [ఆధ్యాత్మిక] కన్నులకు వెలుగిచ్చును’ అని కీర్తనకర్త మనకు హామీ ఇస్తున్నాడు.​—⁠కీర్తన 19:⁠8.