కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంసిద్ధ స్ఫూర్తి ప్రజలను గిలియడ్‌కు తీసుకువస్తుంది

సంసిద్ధ స్ఫూర్తి ప్రజలను గిలియడ్‌కు తీసుకువస్తుంది

సంసిద్ధ స్ఫూర్తి ప్రజలను గిలియడ్‌కు తీసుకువస్తుంది

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌, విదేశాల్లో మిషనరీ సేవ చేయాలనుకునే సమర్పిత స్త్రీ పురుషులకు శిక్షణనిస్తుంది. గిలియడ్‌ స్కూల్లో చేరడానికి ఎవరు అర్హులు? ఇష్టపూర్వకంగా వచ్చేవారందరూ అర్హులే. (కీర్తన 110:⁠3) 2001, సెప్టెంబరు 8న 111వ తరగతి వారు పట్టభద్రులైనప్పుడు అది నిజమేనని రుజువైంది.

ఆ తరగతిలోని కొందరు విద్యార్థులు, అవసరం ఎక్కువ ఉన్నచోట సేవ చేయడం కోసం, అప్పటికే తమ కుటుంబాలను, స్నేహితులను, స్వదేశాలను ఇష్టపూర్వకంగా వదిలి వెళ్ళారు. అలా వదిలి వెళ్ళడం ద్వారా విభిన్నమైన పరిసరాల్లో జీవించడానికి తగిన సర్దుబాట్లు చేసుకోగలమా లేదా అని వాళ్ళు తమను తాము పరీక్షించుకున్నారు. ఉదాహరణకు, రీషే మరియు నటాలీలు బొలీవియాలో, టాడ్‌ మరియు మిషెల్‌లు డొమినికన్‌ రిపబ్లిక్‌లో, డేవిడ్‌ మరియు మోనీక్‌లు ఆసియాలోని ఒక దేశంలో దేవుని రాజ్య సువార్తను వ్యాపింపజేసేందుకు వెళ్ళడానికి అనుగుణంగా తమ కార్యకలాపాలను సర్దుబాటు చేసుకున్నారు. ఇతర విద్యార్థులు నికరాగ్వా, ఈక్వెడార్‌, అల్బేనియాల్లో అప్పటికే సేవ చేశారు.

క్రిస్టీ పెళ్ళి చేసుకోవడానికి ముందు రెండు సంవత్సరాలు ఈక్వెడార్‌లో సేవ చేయడానికి సహాయంగా ఉంటుందని, హైస్కూల్లో స్పానిష్‌ భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించబడింది. ఇతరులు తమ స్వదేశాల్లోని వేరే భాషల సంఘాల్లో చేరారు. సౌల్‌ మరియు ప్రిషీలాలు గిలియడ్‌ స్కూలుకు రావడానికి ముందే, తమ ఇంగ్లీషును మెరుగు పరచుకోవడానికి, బాగా కష్టపడడం ద్వారా ఒక భిన్నమైన సవాలును ఎదుర్కొనడానికి తమ సంసిద్ధ స్ఫూర్తిని వ్యక్తం చేశారు.

ఇరవై వారాల మిషనరీ శిక్షణ చాలా త్వరగా గడచిపోయింది. గ్రాడ్యుయేషన్‌ రోజు దగ్గరకు వచ్చింది, జ్ఞానవంతమైన ఉపదేశాన్ని, ప్రోత్సాహకరమైన వీడ్కోలు మాటలను వినడానికి, విద్యార్థులు తమ బంధుమిత్రులతో సిద్ధంగా ఉన్నారు.

కార్యక్రమ ఛైర్మన్‌ థియోడోర్‌ జారజ్‌, గిలియడ్‌ స్కూలు 7వ తరగతి పట్టభద్రుడు, ప్రస్తుతం యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడిగా సేవ చేస్తున్నాడు. ఆయన ప్రారంభ వ్యాఖ్యానాల్లో, ఒక సంస్థగా, సకల జనులకు రాజ్య సువార్తను ప్రకటించడానికి గిలియడ్‌లో విద్యార్థులకు శిక్షణనిచ్చే లక్ష్యాన్నుండి మనం వైదొలగలేదన్న వాస్తవాన్ని నొక్కి చెప్పాడు. (మార్కు 13:​10) శిక్షణ పొందిన మిషనరీల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, తాము గతంలో చేసినదానికంటే విస్తృత స్థాయిలో ఆప్రకటనా పరిచర్యను కొనసాగించడానికి, యోగ్యులైన విద్యార్థులను గిలియడ్‌ సిద్ధం చేస్తోంది. సహోదరుడు జారజ్‌, పట్టభద్రులైనవారు నియమించబడిన 19 దేశాల్లో ప్రస్తుతం సేవ చేస్తున్న మిషనరీల వలెనే, తమ గిలియడ్‌ శిక్షణను చక్కగా వినియోగించమని విద్యార్థులకు ప్రబోధించాడు.

పట్టభద్రులవుతున్నవారికి సమయోచితమైన సలహా

ప్రసంగాల పరంపర కొనసాగింది. అమెరికా బ్రాంచ్‌ కమిటీ సభ్యుడు విలియమ్‌ వాన్‌ డీ వాల్‌, “మిషనరీ ఆసక్తి​—⁠నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నం” అనే విషయంపై మాట్లాడాడు. ఆయన మత్తయి 28:19, 20 లో నమోదు చేయబడ్డ ‘శిష్యులను చేయండి,’ అనే ఆజ్ఞపై శ్రద్ధను కేంద్రీకరించి, “తన మిషనరీ నియామకాన్ని ఆసక్తితోను, ఉత్సాహముతోను పూర్తి చేసిన యేసును అనుకరించండి” అని విద్యార్థులకు ఉద్బోధించాడు. మిషనరీ సేవపై తమ ఆసక్తిని పెంచుకోవడంలో సహాయపడడానికి, భావి మిషనరీలను ఆయనిలా ప్రోత్సహించాడు: “ఆచరణాత్మకమైన ఒక కార్యకలాపాల పట్టికను అంటిపెట్టుకోండి; దైవపరిపాలక తాజా విషయాలతో ఎప్పుడూ సుపరిచితులై ఉంటూ, మంచి వ్యక్తిగత అధ్యయన అలవాట్లను కాపాడుకోండి; మీరు ఈనియామకంలో ఎందుకున్నారనే కారణాలను ఎల్లప్పుడూ మీదృష్టిలో పెట్టుకోండి.”

కార్యక్రమంలో తర్వాత మాట్లాడిన వ్యక్తి, పరిపాలక సభలోని మరో సభ్యుడు గయ్‌ పీయర్స్‌. “‘మీ తర్కించే శక్తిని’ వృద్ధి చేసుకోవడంలో కొనసాగండి” అనే అంశాన్ని ఆయన వివరించాడు. (రోమీయులు 12:⁠1, NW) దేవుడిచ్చిన ఆలోచనా శక్తిని, తర్కించే సామర్థ్యాన్ని వినియోగించమని ప్రోత్సహిస్తూ, ఆయన పట్టభద్రులవుతున్న తరగతికి ఆచరణాత్మకమైన సలహా ఇచ్చాడు. “యెహోవా తన వాక్యం ద్వారా మీకు చెబుతున్న దాని గురించి లోతుగా ఆలోచించడంలో కొనసాగండి, అది మిమ్మల్ని కాపాడుతుంది” అని ఆయన తెలియజేశాడు. (సామెతలు 2:​11) సహోదరుడు పీయర్స్‌ తమ “తర్కించే శక్తిని” అడ్డగించే విధంగా తమ దృక్కోణాల్లో పిడివాదం ఉండకూడదని తరగతికి ఉద్బోధించాడు. సమయోచితంగా జ్ఞాపకంచేసిన ఈవిషయాలు, మిషనరీలుగా సేవ చేయబోయే పట్టభద్రులకు నిజంగా సహాయకరమైనవే.

తర్వాత, గిలియడ్‌ స్కూల్‌లోని ఒక ఉపదేశకుడు లారెన్స్‌ బౌవెన్‌ను ఛైర్మన్‌ వేదికమీదికి ఆహ్వానించాడు. ఆయన “మరిదేనిని తెలుసుకోకుండా నిశ్చయించుకోండి” అనే అంశంపై మాట్లాడాడు. అపొస్తలుడైన పౌలు, కొరింథులోని తన మిషనరీ పనికి సంబంధించి, ‘సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని ... నెరుగకుందునని నిశ్చయించు[కొన్నాడు]’ అన్న విషయాన్ని నొక్కి చెప్పాడు. (1 కొరింథీయులు 2:⁠2) వాగ్దత్త సంతానం ద్వారా యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని (పరిపాలించేందుకు ఆయనకున్న హక్కును) నిరూపించాలని బైబిలు స్పష్టంగా చెబుతున్న సందేశానికి, విశ్వమంతటిలో అత్యంత శక్తివంతమైన పరిశుద్ధాత్మ మద్దతునిస్తోందని పౌలుకు తెలుసు. (ఆదికాండము 3:​15) పట్టభద్రులవుతున్న 48 మంది విద్యార్థులు కూడా పౌలు, తిమోతీలవలె ఉంటూ ‘హితవాక్యప్రమాణమును గైకొని’ విజయవంతమైన మిషనరీలుగా కావాలని ఉద్బోధించబడ్డారు.​—⁠2 తిమోతి 1:13.

ప్రసంగాల వరుసలో చివరి ప్రసంగం యొక్క అంశం, “దేవుడిచ్చిన విశిష్టమైన అవకాశంపట్ల కృతజ్ఞత కలిగివుండండి.” సేవచేసే ఆధిక్యతలు దేవుని కృపకు నిదర్శనాలని, అవి మన అర్హతలనుబట్టి పొందేవి కావని లేక సంపాదించుకునేవి కావని పట్టభద్రులు అర్థం చేసుకోవడానికి, గిలియడ్‌ స్కూల్‌ రిజిస్ట్రార్‌ వాలెస్‌ లివరెన్స్‌ సహాయం చేశాడు. అపొస్తలుడైన పౌలు మాదిరివైపు దృష్టిని మళ్ళిస్తూ, సహోదరుడు లివరెన్స్‌ ఇలా సూచించాడు: “అన్య జనాంగాలకు ప్రకటించడానికి అపొస్తలునిగా ఉండాలని యెహోవా పౌలును ఎంపిక చేసుకున్నది ఆయన కార్యములనుబట్టి కాదు, వాటిని బట్టే అయితే, పౌలు ఆనియామక హక్కును సంపాదించుకున్నట్లు లేక ఆయన దానికి అర్హుడు అన్నట్లు అవుతుంది. అది సేవలో ఉన్న కాలంమీద లేక అనుభవంమీద ఆధారపడింది కాదు. మానవ దృక్కోణం నుండి చూస్తే, అసలు ఆఅవకాశం బర్నబాకు చెందాల్సిందని అనిపిస్తుంది. అది వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడింది కూడా కాదు; అలాగైతే పౌలుకంటే అపొల్లో అనర్గళంగా మాట్లాడేవాడు. కాబట్టి అది స్పష్టంగా దేవుని కృపకు నిదర్శనమే.” (ఎఫెసీయులు 3:​7,8) ఇతరులు కూడా దేవుని స్నేహితులై, “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” పొందడానికి సహాయపడడంలో, పట్టభద్రులు తమ బహుమతిని అంటే తమ సేవాధిక్యతను వినియోగించమని సహోదరుడు లివరెన్స్‌ ప్రోత్సహించాడు.​—⁠రోమీయులు 6:23.

ఆ తర్వాత, గిలియడ్‌ స్కూల్లోని మరో ఉపదేశకుడు మార్క్‌ న్యూమర్‌, “సిద్ధపాటు మంచి ఫలితాలనిస్తుంది” అనే అంశంపై చాలామంది విద్యార్థులతో ఆహ్లాదకరమైన చర్చను నిర్వహించాడు. (సామెతలు 21:⁠5) ఒక ప్రచారకుడు పరిచర్యకు మంచిగా సిద్ధపడినప్పుడు, ప్రత్యేకంగా ఆయన హృదయాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు, ఆయనకు ప్రజలపై యథార్థమైన శ్రద్ధ ఉంటుంది. ఆయన ఏమి చెప్పాలా అని తడుముకోడు. బదులుగా, ఆధ్యాత్మికంగా సహాయపడే విషయాలను చెబుతూ తత్సంబంధ కార్యాలను చేస్తాడు, అని వారు చెప్పిన అనుభవాలు స్పష్టీకరించాయి. “విజయవంతమైన మిషనరీగా కొనసాగడానికి ఇది కీలకమైనది,” అని సహోదరుడు న్యూమర్‌ తను ఆఫ్రికాలో మిషనరీగా ఉన్నప్పటి సొంత అనుభవం నుండి సూచించాడు.

మిషనరీ సేవ​—⁠సంతృప్తినిచ్చే జీవితగమనం

రాల్ఫ్‌ వాల్స్‌ మరియు చార్లెస్‌ వూడీ, పాటర్‌సన్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ కోసం వచ్చిన కొందరు అనుభవజ్ఞులైన మిషనరీలను ఇంటర్వ్యూ చేశారు. ప్రజలపట్ల ఉండే ప్రేమే మిషనరీ సేవలో ఆనందాన్నిస్తుందని ఆఇంటర్వ్యూల్లో నొక్కి చెప్పబడింది. అనుభవజ్ఞులైన ఆమిషనరీలే స్వయంగా మిషనరీ సేవ సంతృప్తినిచ్చే కెరీర్‌ అని వివరించేసరికి అది విన్న విద్యార్థులకు, ప్రేక్షకుల్లో ఉన్న వారి కుటుంబాలకు, స్నేహితులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.

“యెహోవాకు క్రొత్త గీతము పాడుడి” అనే అంశంగల ఆదినపు ప్రధానమైన ప్రసంగాన్ని, పరిపాలక సభ సభ్యుడిగా సేవ చేస్తున్న జాన్‌ ఇ.బార్‌ ఇచ్చాడు. (యెషయా 42:​10) సహోదరుడు బార్‌ “క్రొత్త గీతము” అనే మాట చిన్న తేడాలతో బైబిల్లో తొమ్మిదిసార్లు కనిపిస్తుందని సూచించాడు. “ఈ క్రొత్త గీతము దేని గురించి?” అని ఆయన ప్రశ్నించాడు. తర్వాత ఆయనిలా సమాధానమిచ్చాడు: “యెహోవా సర్వోన్నతాధిపత్యంలోని క్రొత్త అభివృద్ధుల కారణంగా క్రొత్త గీతము పాడారని నేపథ్యం వ్యక్తం చేస్తోంది.” మెస్సీయా రాజు, క్రీస్తు యేసు చేతుల్లో విజయవంతమైన దేవుని రాజ్యం యొక్క స్తుతిగానాలను పాడడంలో తమ స్వరాలను కలపమని ఆయన విద్యార్థులను ఉద్బోధించాడు. ఆ“క్రొత్త గీతము” యొక్క భిన్నమైన ఆకృతులను ఇంతకుముందుకంటే స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, వారు గిలియడ్‌లో పొందిన శిక్షణ సహాయపడిందని సహోదరుడు బార్‌ తెలిపాడు. “మీరు వెళ్ళిన ప్రతిచోట మీసహోదర సహోదరీలతో యెహోవా స్తుతిగానాలను ‘పాడాల్సిన’ అవసరాన్ని స్కూలు నొక్కి చెప్పింది; మీనియామకాల్లోని ఇతరులతో ఐక్యత కోసం నిరంతరం కృషి చేయండి.”

విద్యార్థులకు డిప్లొమాలను ఇచ్చిన తర్వాత, తరగతి తరపున ఒక ప్రతినిధి గిలియడ్‌ స్కూల్లో తాము పొందిన శిక్షణకు తమ మనఃపూర్వక ప్రశంసలను తెలుపుతున్న ఉత్తరాన్ని చదివాడు.

దేవునికి మీరు చేసే సేవను విస్తీర్ణం చేసుకొని మరింత ఫలదాయకంగా ఉండేలా చేసుకోగలరా? అలాంటి అవకాశముంటే ఈవిద్యార్థుల్లాగే మీరు కూడా కష్టించి పనిచేయండి. మిషనరీ క్షేత్రానికి అర్హులవడానికి వారికి సహాయపడింది అలా కష్టించి పనిచేయడమే. దేవుని సేవ చేయడానికి సంతోషంగా, సంసిద్ధ స్ఫూర్తితో ముందుకు వచ్చేవారు గొప్ప ఆనందాన్ని పొందుతారు.​—⁠యెషయా 6:⁠8.

[25వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 10

పంపించబడిన దేశాల సంఖ్య: 19

విద్యార్థుల సంఖ్య: 48

సగటు వయస్సు: 33.2

సత్యంలో సగటు సంవత్సరాలు: 16.8

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 12.6

[26వ పేజీలోని చిత్రం]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 111వ తరగతి పట్టభద్రులు

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఉన్నాయి.

(1) యోమన్స్‌, సి.; టోకారీ, ఎ.; నూన్యెస్‌, ఎస్‌.; ఫిలిప్స్‌, జె.; డాకిన్‌, ఎమ్‌.; సిల్వస్ట్రి, పి.; (2) మోరిన్‌, ఎన్‌.; బైనీ, జె.; లోపెస్‌,ఎమ్‌.; వాన్‌ హాట్‌, ఎమ్‌.; కాంటూ, ఎ.; సిల్వాషీ, ఎఫ్‌.; (3) విలియమ్స్‌, ఎమ్‌.; ఈటో, ఎమ్‌.; వాన్‌ కోయిలీ,ఎస్‌.; లవెరింగ్‌,డి.; ఫూజెల్‌,ఎఫ్‌.; గైస్ల, ఎస్‌.; (4) యోమన్స్‌, జె.; మోస్‌, ఎమ్‌.; హాజిన్స్‌, ఎమ్‌.; డడింగ్‌,ఎస్‌.; బ్రీసెన్యో,జె.; ఫిలిప్స్‌,ఎమ్‌.; (5) లోపెస్‌,జె.; ఈటో,టి.; సోమరుడ్‌, ఎస్‌.; కోజా, సి.; ఫూజెల్‌, జి.; మోస్‌,డి.; (6) విలియమ్స్‌,డి.; డడింగ్‌,ఆర్‌.; గైస్ల,ఎమ్‌.; మోరిన్‌,ఆర్‌.; బైనీ,ఎస్‌.; కాంటూ,ఎల్‌.; (7) డాకిన్‌, ఎమ్‌.; హాజిన్స్‌,టి.; లవెరింగ్‌,ఎమ్‌.; సిల్వస్ట్రి,ఎస్‌.; వాన్‌ హాట్‌,డి.; బ్రీసెన్యో,ఎ.; (8) వాన్‌ కోయిలీ,ఎమ్‌.; నూన్యెస్‌, ఎ.; కోజా, బి.; సోమరుడ్‌, జె.; టోకారీ, ఎస్‌.; సిల్వాషీ, పి.