కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎనిమిదవ హెన్రీ మరియు బైబిలు

ఎనిమిదవ హెన్రీ మరియు బైబిలు

ఎనిమిదవ హెన్రీ మరియు బైబిలు

ఆంగ్లేయుల చరిత్ర (సంపుటి 2)లో విన్‌స్టన్‌ చర్చిల్‌ ఇలా వ్రాశాడు: “మత నమ్మకాల రంగంలో సంస్కరణోద్యమము గొప్ప మార్పును తీసుకువచ్చింది. అప్పటి నుండి బైబిలు విశేషమైన క్రొత్త ప్రభావాన్ని సంతరించుకుంది. సంస్కరణోద్యమం మునుపటి తరం ప్రజలు, ఆ పవిత్ర గ్రంథం పామరుల చేతుల్లో ఉంటే చాలా ప్రమాదకరమని కేవలం ప్రీస్టులు మాత్రమే దాన్ని చదవాలని భావించారు.”

ఆయన వ్రాసిన వృత్తాంతం ఇంకా ఇలా కొనసాగుతోంది: “టిండేల్‌, కవర్‌డేల్‌లు ఇంగ్లీషులోకి అనువదించిన పూర్తి బైబిళ్ళు, ముద్రిత రూపంలో మొట్టమొదట 1535 శరదృతువు ముగింపులో కనబడ్డాయి, ఇప్పుడు కూడా కొన్ని ఎడిషన్లు ఉత్పత్తి అవుతున్నాయి. బైబిలు చదవడానికి ప్రోత్సహించమని ప్రభుత్వం పాదిరీలను ఆదేశించింది.” దాంతో శతాబ్దాలుగా బైబిలు పరిజ్ఞానము గురించి గానీ దానిలో ఉన్నవాటి గురించి గానీ ఏమీ తెలియని ఇంగ్లాండు ఇప్పుడు కాస్త బైబిలు పరిజ్ఞానాన్ని సంపాదించుకోబోతోంది. అయితే పాదిరీల మూలంగా మాత్రం కాదు, కానీ ఎనిమిదవ హెన్రీయే అందుకు మూలకారణం. *

“గతంలోని అన్ని ఎడిషన్ల కన్నా అందంగా పెద్ద సంఖ్యలో ఇంగ్లీషు బైబిళ్ళను ముద్రించమని ప్రభుత్వం పారిస్‌ను ఆదేశించడంతో, బైబిలు విషయంలో పాత ఆచారాలను పట్టుకుని వేలాడుతున్న వారిపై మరో వేటు పడింది. అంతేగాక, ఆ దేశంలోని ప్రతి పేరిష్‌ సభ్యుడూ ఇంగ్లీషులో ఉన్న అతి పెద్ద బైబిలును కొనాలని, పేరిష్‌లలో ఉన్నవారు ఉపయోగించడానికి అందుబాటులో ఉండేలా ప్రతి చర్చిలోను ఒక బైబిలును ఉంచాలని 1538 సెప్టెంబరులో ప్రభుత్వం ఒక ఆజ్ఞను జారీచేసింది. లండన్‌ నగరంలోని సెయింట్‌ పాల్స్‌ చర్చిలో ఆరు కాపీలు ఉంచబడ్డాయి. వాటిని చదవడానికి ప్రజలు, గుంపులు గుంపులుగా రోజంతా ఆ కెథీడ్రల్‌కి వస్తూనే ఉండేవారు. ప్రత్యేకంగా ఎవరైనా గట్టిగా చదవగలిగేవారు ఉంటే వారిని పిలిచి చదివించుకునేవారని చెబుతారు.”

విచారకరమైన విషయం ఏమిటంటే, అనేక దేశాల్లో చాలామంది బైబిలును క్రమంగా చదివే సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇది చాలా గంభీరమైన విషయం, ఎందుకంటే, ‘దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగినది’ బైబిలు మాత్రమే; ‘అది ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.’​—⁠2 తిమోతి 3:⁠16.

[అధస్సూచి]

^ పేరా 3 ఎనిమిదవ హెన్రీ రాజు 1509 నుండి 1547 వరకు ఇంగ్లాండును పరిపాలించాడు.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఎనిమిదవ హెన్రీ Painting in the Royal Gallery at Kensington, from the book The History of Protestantism (Vol. I)