జిగురు కార్చే చెట్టు, వివిధ ఉపయోగాలుగల దాని జిగురు
జిగురు కార్చే చెట్టు, వివిధ ఉపయోగాలుగల దాని జిగురు
‘నొప్పికొరకు గుగ్గిలము తీసుకోండి’ అని యిర్మీయా 51:8 చెప్తుంది. ఎంతో ఉపశమనాన్ని కలుగజేయగల, స్వస్థత చేకూర్చగల ఈ పదార్థ మూలాన్ని గురించిన అన్వేషణ మనల్ని ఏజియన్ సముద్రములోనున్న కీయొస్ దీవికి తీసుకువెళ్తుంది.
వేసవి కాలపు ఆరంభంలో కీయొస్‌లోని రైతులు కోతకోసం అసాధారణమైన విధంగా సిద్ధపడతారు. గుబురుగా, నిత్యం పచ్చగా ఉండే రూమిమస్తకి అనే చెట్ల చుట్టూ ఉన్న నేలను ఊడ్చిన తరువాత, ఆ నేలమీద తెల్లని బంకమట్టితో చదునైన గచ్చు చేస్తారు. ఆ తర్వాత చెట్ల కాండాలకు గంట్లు పెడతారు. అప్పుడు పాలిపోయిన రంగులో ఉండే జిగురు కారడం మొదలవుతుంది. రెండు లేక మూడు వారాల తర్వాత ఆ జిగురు చుక్కలు గడ్డ కడతాయి. రైతులు వాటిని నేరుగా చెట్టునుంచిగానీ, క్రింద గచ్చుమీది నుంచిగానీ సేకరిస్తారు. రూమిమస్తకి జిగురు గుగ్గిలం తయారుచేయడానికి ఉపయోగించబడుతుంది.
అయితే కోతకు ముందు ఓపికతో కష్టించి పనిచేయడం అవసరం. బూడిదరంగులో మెలితిరిగినట్టుండే కాండాలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ఒక చెట్టు పూర్తిగా పెరగడానికి 40 నుంచి 50 సంవత్సరాల వరకు పడుతుంది. అవి సాధారణంగా ఆరు నుంచి పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
రూమిమస్తకిని ఉత్పత్తి చేయడానికి కాండాలకు గంట్లుపెట్టి, జిగురును సేకరించడమే కాకుండా ఇంకా ఎంతో పనిచేయాల్సి ఉంటుంది. రైతులు అలా సేకరించిన జిగురు గడ్డలలోనుండి పనికి రానివాటిని తీసివేసి, కడిగి పరిమాణాన్ని బట్టి నాణ్యతను బట్టి వాటిని వేరు చేస్తారు. ఆ తర్వాత వాటిని ఇంకా శుభ్రపర్చి అనేక విధాలుగా ఉపయోగిస్తారు.
విలువైన ఈ మొక్క చరిత్ర
రూమిమస్తకికి గ్రీకులో ఉన్న పదానికి “పళ్ళుకొరుకుట” అనే అర్థంగల మాటతో సంబంధం ఉంది. పూర్వ కాలము నుంచి రూమిమస్తకి జిగురు, నోటి దుర్వాసనను పోగొట్టడానికి బబుల్ గమ్‌లా ఉపయోగించబడుతుందని మాస్టిక్ అనే పేరు సూచిస్తుంది.
రూమిమస్తకిని గురించిన అతి పురాతన సమాచారం సా.శ.పూ. 5వ శతాబ్దానికి చెందిన గ్రీకు చరిత్రకారుడైన హెరొడోటస్ నుండి వచ్చింది. అపాలడారస్, డైయస్కోరడీస్, తీయాస్కారీతీస్, మరియు హిపోక్రటీస్‌తో సహా ఇతర పురాతన రచయితలు మరియు వైద్యులు వైద్యంలో రూమిమస్తకి ఉపయోగాల గురించి ప్రస్తావించారు. రూమిమస్తకి చెట్లు మధ్యధరా తీరం పొడుగునా పెరిగినప్పటికీ, సా.శ. 50వ సంవత్సరం నుంచి రూమిమస్తకి ఉత్పత్తి కేవలం కీయొస్‌కే పరిమితమయ్యింది. రోమన్లు, జినియోస్‌లు, ఒట్టొమాన్లు రూమిమస్తకి కొరకే కీయొస్‌ని ఆక్రమించారు.
ఎన్నో ఉపయోగాలున్న రూమిమస్తకి
పురాతన ఐగుప్తు వైద్యులు విరోచనాలు, కీళ్ళవాపు వంటి వివిధ రోగాలను నయంచేయడానికి రూమిమస్తకిని వాడేవారు. దాన్ని ధూపం వేయడానికి ఉపయోగించేవారు, అలాగే శవాలను భద్రపర్చడానికి కూడా ఉపయోగించేవారు. “గిలాదులో యిర్మీయా 8:22; 46:11) పరిశుద్ధ సేవకు మాత్రమే ఉపయోగించే పవిత్ర పరిమళ ద్రవ్యాల్లో ఒకటైన జటామాంసిని ఉత్పత్తి చేసే చెట్టు, రూమిమస్తకి చెట్ల కుటుంబానికి చెందినదై ఉంటుందని కూడా సూచించబడుతుంది.—నిర్గమకాండము 30:34, 35.
గుగ్గిలము” దానికున్న వైద్య గుణాలను బట్టి సౌందర్య వర్థక సాధనాల తయారీలోను, పరిమళ ద్రవ్యాల తయారీలోను దాని ఉపయోగాన్ని బట్టి బైబిలులో ప్రస్తావించబడింది. గిలాదు గుగ్గిలము అనేక చెట్ల జిగుర్లనుండి తయారుచేయబడుతుంది వాటిలో రూమిమస్తకి జిగురు ఒకటై ఉండవచ్చు. (నేడు ఫర్నీచర్‌ని, వర్ణచిత్రాలను, సంగీత వాయిద్యాలని కాపాడే వార్నిషులలో రూమిమస్తకి ఉంది. రూమిమస్తకి, విద్యుద్బంధన సాధనంగాను, వాటర్ ప్రూఫ్ సాధనంగాను ఉపయోగించబడుతుంది. బట్టల రంగు, కళాకారుని చిత్రాల రంగు పోకుండా చేసే అతి శ్రేష్ఠమైన కలర్ స్టెబిలైజర్లలో రూమిమస్తకి ఒకటని భావించబడుతుంది. గమ్ తయారీలోనూ పచ్చి తోళ్ళను ఉపయోగకరమైన చర్మంగా మార్చడంలోనూ రూమిమస్తకి ఉపయోగించబడుతుంది. రూమిమస్తకికి ఉన్న సువాసన వల్ల ఇతర గుణాలవల్ల అది సబ్బులు, సౌందర్య వర్థక సాధనాలు మరియు పరిమళద్రవ్యాల తయారీలో ఉపయోగించబడుతుంది.
ప్రపంచవ్యాప్త మందులను గురించిన 25 ఆధికారిక పట్టికల్లో రూమిమస్తకి పేర్కొనబడింది. అరబ్ దేశాలలో సాంప్రదాయిక మందుల్లో అది ఇప్పటికీ తరచుగా ఉపయోగించబడుతుంది. దంత సిమెంట్లలోనూ మందు క్యాప్‌స్యూల్‌ల లోపలి పూతలలోనూ రూమిమస్తకి ఉపయోగించబడుతుంది.
రూమిమస్తకి చెట్టు కార్చే వివిధ ఉపయోగాలుగల జిగురు, గుగ్గిలానికి ఒక మూలంగా, శతాబ్దాలుగా ఉపశమనాన్ని, స్వస్థతను ఇస్తోంది. అందుకే యిర్మీయా ప్రవచనం ‘నొప్పికొరకు గుగ్గిలము తీసుకోండి’ అని చెప్తుంది.
[31వ పేజీలోని చిత్రాలు]
కీయొస్
రూమిమస్తకికి గంట్లు పెట్టడం
రూమిమస్తకి జిగురు జాగ్రత్తగా సేకరించబడుతుంది
[చిత్రసౌజన్యం]
Chios and harvest line art: Courtesy of Korais Library; all others: Kostas Stamoulis